న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ కొత్త పథకాల (ఎన్‌ఎఫ్‌వో) రూపంలో ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల సమీకరణ గడిచిన ఆర్థిక సంవత్సరంలో 42 శాతం తగ్గిపోయింది. మొత్తం 253 ఎన్‌ఎఫ్‌వోల ద్వారా ఫండ్స్ సంస్థలు (ఏఎంసీలు) మొత్తం రూ.62,342 కోట్ల పెట్టుబడులను సమీకరించాయి. 2021–22లో మ్యూచువల్ ఫండ్స్ 176 ఎన్‌ఎఫ్‌వో ల రూపంలో సమీకరించిన మొత్తం రూ.1,07,896 కోట్లుగా ఉండడం గమనించొచ్చు.
2021–22తో పోలిస్తే గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ ఎన్‌ఎఫ్‌వోలు వచ్చినప్పటికీ, సమీకరించిన మొత్తం తగ్గడం కనిపిస్తోంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో ఇప్పటికి 12 ఎన్‌ఎఫ్‌వోలను ఫండ్స్ సంస్థలు తీసుకొచ్చాయి. గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఎన్‌ఎఫ్‌వోలలో ప్యాసివ్ ఫండ్స్, ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ఫండ్స్ ఎక్కువగా ఉన్నాయి. 182 ఓపెన్ ఎండె డ్ పథకాలు కాగా, 71 క్లోజ్ ఎండెడ్ పథకాలు న్నాయి. సాధారణంగా బుల్ మార్కెట్లలో ఎక్కువ ఎన్‌ఎఫ్‌వోలు వస్తుంటాయి.
ఆ సమయంలో మార్కెట్ల పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న సానుకూల సెంటిమెంట్ ఆధారంగా నిధులు సమీకరించడం ఏఎంసీ లకు సులభం అవుతుంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సెబీ కొత్త పథకాలను చేపట్టొద్దంటూ మూడు నెలల పాటు నిషేధం విధించడాన్ని గమనించాలి. ఇది కూడా ఎన్‌ఎఫ్‌వోల సంఖ్యపై ప్రభా వం చూపించింది. ఇక 2020–21లో 84 నూతన పథకాల ద్వారా మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు రూ.42,038 కోట్లను ఆకర్షించాయి.
‘‘ఇన్వెస్టర్లు ఏదైనా కొత్త పథకం వినూత్నంగా ఉన్నప్పుడు, తమ పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యం పరంగా అంతరా న్ని భర్తీ చేస్తుందని భావించినప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మంచి పనితీరుతో కూడిన పథకాల్లో పెట్టుబడులు కొనసాగించుకోవాలి’’అని మార్నింగ్‌స్టార్ రీసెర్చ్ మేనేజర్ కౌస్తభ్ బేలపుర్కార్ సూచించారు. అన్ని కొత్త పథకాలు ఒక్కటే కాదని, వాటి ల్లోని అనుకూల, ప్రతికూలతలను చూసి పెట్టుబడు ల నిర్ణయం తీసుకోవడం సుముచితమని ఫయర్స్ రీసెర్చ్ హెడ్ గోపాల్ కావలిరెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment