asset allocation
-
అస్సెట్ అలొకేషన్ అంటే ఇదేనా..?
నా దగ్గరున్న మొత్తంలో 60 శాతాన్ని బ్యాంకు ఎఫ్డీలలో ఇన్వెస్ట్ చేశాను. మిగిలిన 40 శాతం మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టాను. ఇప్పుడు చూస్తే ఈక్విటీ పెట్టుబడుల విలువ గణనీయంగా పెరిగింది. దీంతో ఈక్విటీలకు 50 శాతం, ఎఫ్‌డీల్లో 50 శాతం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. అస్సెట్ అలొకేషన్ అంటే.. 50 శాతం మించి ఈక్విటీలలో ఉన్న మొత్తాన్ని వెనక్కి తీసుకుని ఫిక్స్డ్ డిపాజిట్లలోకి మళ్లించడమేనా? – ఎస్కే సిన్హా అస్సెట్ రీబ్యాలన్స్ అంటే ఒక లకి‡్ష్యత కేటాయింపుల విధానాన్ని అనుకుని.. ఆ మేరకు పెట్టుబడుల మొత్తాన్ని వివిధ పెట్టుబడి సాధనాల మధ్య వర్గీకరించడం. ఒకే కాల వ్యవధిలో కొన్ని సాధనాలు మంచి పనితీరు చూపించడం వల్ల వాటిల్లోని పెట్టుబడుల విలువ ఇతర సాధనాలతో పోలిస్తే గణనీయంగా పెరగొచ్చు. దీంతో అలా మంచి పనితీరు చూపించిన వాటి వెయిటేజీ పెరిగిపోతుంది. అప్పుడు ముందు అనుకున్న కేటాయింపులకు మించి, ఎంత అయితే పెరిగిందో ఆ మొత్తాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో పోర్ట్‌ఫోలియోలో వెయిటేజీ పడిపోయిన సాధనాలకు ఆ మేరకు కేటాయింపులు పెంచుకోవాలి. అస్సెట్ రీబ్యాలన్సింగ్ వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయి. మీ రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా పెట్టుబడుల మధ్య సమతూకాన్ని కొనసాగించుకునే వెసులుబాటు ఈ విధానంతో వస్తుంది. అంటే ఈక్విటీకి 60 శాతం, డెట్‌కు 40 శాతం కేటాయింపులతో అస్సెట్ అలొకేషన్ విధానాన్ని నిర్ణయించుకున్నారని అనుకుందాం. కొంత కాలం తర్వాత మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీ వాటా 80 శాతానికి చేరి డెట్ పెట్టుబడులు 20 శాతానికి తగ్గాయని అనుకుంటే.. అప్పుడు మీ పోర్ట్‌ఫోలియోలో రిస్క్ పెరిగినట్టు అవుతుంది. ఎందుకంటే ఎక్కువ మొత్తం ఈక్విటీల్లో ఉండడంతో మార్కెట్ల ఉద్దాన, పతనాల ప్రభావం పెట్టుబడుల విలువపై ప్రతిఫలిస్తుంటుంది. ఇది పెట్టుబడిదారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయవచ్చు. ఎక్కువ రిస్క్ తీసుకోవద్దని అనుకునే ఇన్వెస్టర్లు ఈక్విటీల పెట్టుబడులను 60 శాతానికి తగ్గించుకుని, డెట్ పెట్టుబడులు 40 శాతానికి అస్సెట్ రీఅలొకేషన్తో పెంచుకోవడం వల్ల తిరిగి వారి విధానానికి తగ్గట్టు పెట్టుబడుల స్వరూపం ఉంటుంది. అస్సెట్ రీబ్యాలన్సింగ్తో ఉన్న మరొక ప్రయోజనాన్ని చూస్తే.. అధిక స్థాయిల్లో విక్రయించి, తక్కువలో కొనుగోలు చేయడం సాధ్యపడుతుంది. అంటే విలువ గణనీయంగా పెరిగిన చోట విక్రయించి.. అదే సమయంలో పెద్దగా పెరగని చోట కొనుగోలు చేస్తాం. ఉదాహరణకు పెట్టుబడుల్లో ఈక్విటీల వాటా పెరిగిందంటే.. ఈక్విటీలు బాగా ర్యాలీ చేశాయని అర్థం. దాంతో అస్సెట్ రీఅలొకేషన్ విధానంలో భాగంగా అధిక వ్యాల్యూషన్ల వద్ద పెట్టుబడులను కొంత వెనక్కి తీసుకుని డెట్‌కు మళ్లిస్తాం. తరచుగా కాకుండా.. ఏడాదికోసారి లేదంటే.. ఒక పెట్టుబడి సాధనంలోని పెట్టుబడుల విలువ నిర్దేశిత పరిమితి కంటే 5 శాతానికి మించి పెరిగిపోయిన సందర్భాల్లోనే దీన్ని చేయడం సూచనీయం. నా వయసు 72 ఏళ్లు. నేను ఈక్విటీ ఆధారిత హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సురక్షితమేనా? లేదంటే సంప్రదాయ లేదా బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ ఎంపిక చేసుకోవాలా? – భాస్కర్ ఈక్విటీ మార్కెట్ల అస్థిరతలను ఎదుర్కోవడంలో మీకున్న అనుభవం ఏ మేరకు? అనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ఈక్విటీల్లో ముందు నుంచి ఇన్వెస్ట్ చేస్తూ మూడేళ్లకు పైగా అనుభవం ఉండి, మార్కెట్లలో ఎత్తు, పల్లాలను (ర్యాలీలు, దిద్దుబాట్లు) చూసి ఉన్నట్టయితే అప్పుడు అక్విటీ ఆధారిత ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే మొత్తం నుంచి ఆదాయం కోరుకోకుండా, పెట్టుబడి కోసమే అయితే అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీ పెట్టుబడుల్లో ఎటువంటి అనుభవం లేకుండా, చేసే పెట్టుబడిపై ఆదాయం కోరుకుంటుంటే అప్పుడు కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. -
వృద్ధాప్యంలో ఆదాయానికి ప్రణాళిక..
ప్రభుత్వరంగ ఉద్యోగులను మినహాయిస్తే మిగిలిన వారికి పదవీ విరమణ ప్రణాళిక తప్పనిసరి. ఉద్యోగం లేదా వృత్తి జీవితం ప్రారంభించినప్పుడే, దాన్ని విరమించే రోజు కోసం ప్రణాళిక రూపొందించుకోవాలి. విశ్రాంత జీవనాన్ని హాయిగా గడిపేందుకు తగినంత నిధిని సమకూర్చుకోవడమే కాదు, ఆ నిధిపై రాబడికీ అనుకూలమైన వ్యూహం ఉండాలి. మనలో చాలా మంది రిటైర్మెంట్ లక్ష్యానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. కానీ, ఆలస్యంగా దీని అవసరం తెలిసి వస్తుంది. అప్పుడు మేల్కొన్నా, సంపాదనకు ఎక్కువ కాలం మిగిలి ఉండకపోవచ్చు. కనుక ఆరంభంలోనే దృష్టి పెట్టాల్సిన దీన్ని.. అవగాహన లేమి, నిర్లక్ష్యంతో వాయిదా వేసుకోవద్దు. తగిన ప్రణాళికతోనే రిటైర్మెంట్ లక్ష్యాన్ని అధిగమించగలమని ఆర్థిక నిపుణులు తెలియజేస్తున్నారు. ఈక్విటీ పెట్టుబడులూ అవసరమే రిటైర్మెంట్ తర్వాత కూడా ఈక్విటీల్లో పెట్టుబడులు కలిగి ఉండాలి. ఎందుకంటే నేటి కంటే, రేపటి రోజు మరింత మొత్తం జీవనానికి ఖర్చు అవుతుంది. కనుక మన నిధి మరింత ఆదాయన్నిచ్చే విధంగా వృద్ధి చెందుతూ ఉండాలి. మీ వద్దనున్న నిధి నుంచి ఏటా 5% చొప్పున వెనక్కి తీసుకుంటున్నారనుకోండి. వచ్చే ఏడాది కూడా అదే 5% సరిపోవచ్చు. కానీ ఐదు, పదేళ్ల తర్వాత అంతే మొత్తం సరిపోకపోవచ్చు. ఎందుకంటే పదేళ్ల కాలంలో పెట్టుబడి దాని విలువను కోల్పోతుంది. కనుక ఇక్కడ నుంచి మరో ఐదు పదేళ్ల తర్వాత అవసరాలకు మరింత మొత్తం కావాలి. మీరు మీ ఫండ్ మొత్తాన్ని స్థిరాదాయ సాధనంలో ఇన్వెస్ట్ చేశారనుకోండి.. అది పెరిగే అవసరాలకు, కరిగిపోయే కరెన్సీ విలువకు తగినంత మద్దతుగా నిలవదు. ఎక్కువ మంది రిటైర్మెంట్ తర్వాత రిస్క్ వద్దని అనుకుంటుంటారు. కానీ, భవిష్యత్తులో వచ్చే భారీ ఖర్చులను భరించేంత ఆదాయానికి తగ్గ ప్రణాళిక ఉండాలి. కనుక మెరుగైన రాబడుల కోసం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం మినహా మరో మార్గం లేదు. రిటైర్మెంట్ తర్వాత ఈక్విటీ రిస్క్ తీసుకోవడం ఎందుకని కొందరు అనుకోవచ్చు. అస్థిరతలు/ఆటుపోట్లు అన్నవి రిస్క్ కాదు. ఈక్వి టీల్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు అది రిస్క్ అనుకుంటే.. మరి ఎలక్ట్రిసిటీ గురించి ఏమ ని అనుకోవాలి. ప్రమాదకరమైన విద్యుత్‌ను వాడుకుంటూ మనం జీవించడం లేదా..? అలాగే, ఈక్విటీలను మనకు అనుకూలంగా వినియోగించుకోవాలి. ఈక్విటీ పోర్ట్‌ఫోలియో ఏర్పాటులో జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలు. ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా, నిర్ణీతకాలం లోపు ఆ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాలి. పెట్టుబడులను వైవి ధ్యం చేసుకోవాలి. నిర్ణీత కాలానికి ఒకసారి చొప్పున రీబ్యాలన్స్ (మార్పులు చేర్పులు) చేసుకుంటూ వెళ్లాలి. ఎంత నిధి కావాలి? రిటైర్మెంట్కు కావాల్సినంత నిధి నా దగ్గర ఉందా..? ఎవరికివారు ఈ ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే అందరికీ ఒక్కటే నిధి ఇక్కడ పనిచేయకపోవచ్చు. మీ అవసరాలు, వ్యయాలపైనే ఇది ఆధారపడి ఉంటుంది. రిటైర్మెంట్ ఫండ్ కోసం మెరుగైన పెట్టుబడుల ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఇందుకు వాస్తవిక అంచనాలు వేసుకోవాలి. మీ నెలవారీ వ్యయాలు ఎంత? 12 నెలలకు ఎంత మొత్తం కావాలో లెక్కించాలి. అంత మేర ఏటా ఆదాయం తెచ్చి పెట్టేంత నిధి మీకు రిటైర్మెంట్ తర్వాత అవసరం అవుతుంది. ఇతరత్రా వేరే ఆదాయ వనరులు ఉంటే వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. రిటైర్మెంట్ కోసం సన్నద్ధం అయ్యేందుకు ఏఏ అంశాలపై దృష్టి పెట్టాలో తెలుసుకోవడం కీలకం అవుతుంది. తాము ఎంత కాలం పాటు జీవిస్తామనే విషయం ఎవరికీ తెలియదు. కనుక చిరాయువుగా జీవించేందుకు సన్నద్ధం కావాలి. ముఖ్యంగా రాబడులకు మించి జీవించకూడదు. అందుకే ప్రణాళిక అవసరం. మీ అవసరాలకు మించి పెట్టుబడి నిధి కరిగిపోకుండా ఇది మార్గం చూపుతుంది. ప్రస్తుత విలువల ప్రకారం వార్షిక ఖర్చులకు 20 నుంచి 25 రెట్ల సరిపడా నిధిని సమకూర్చుకుంటే అది మీ అవసరాలను తీరుస్తుంది. ఇది అంత సౌకర్యవంతమైన నిధి కాకపోయినా, మీ అవసరాలను తీరుస్తుంది. మీ అవసరాలకు సరిపడా ఆదాయాన్ని ఇవ్వడంతోపాటు, భవిష్యత్తులో పెరిగే ఖర్చులకు తగ్గట్టు ఆదాయాన్ని వృద్ధి చేసే ప్రణాళిక వేరు. మీ ఆదాయం, వెసులుబాటు ఆధారంగా చాలా శ్రద్ధగా ప్రణాళిక వేసుకోవాలి. మధ్యలో అత్యవసరం ఏర్పడినా గట్టెక్కే నిధి వేరుగా ఉండాలి. అస్సెట్ అలోకేషన్ అస్సెట్ అలోకేషన్ అనేది మీ సౌకర్యం కోసం అనుసరించే విధానం. మార్కెట్లు పడిపోయినప్పుడు దీనివల్ల సౌకర్యంగా ఉండొచ్చు. స్వభావ రీత్యా ఈక్విటీల పట్ల రక్షణాత్మకంగా లేదా దూకుడుగా ఉన్నా కానీ.. ఆరంభంలో రక్షణాత్మకంగానే కేటాయింపులు చేసుకోవాలి. ఎంత ధైర్యవంతులైనా సరే మార్కెట్లు పడిపోయినప్పుడు ఆందోళన చెందడం సహజం. కనుక మొదటిసారి ఇన్వెస్టర్ అయినా, రక్షణ ధోరణితో కూడిన ఇన్వెస్టర్ అయినా ఈక్విటీలకు కేటాయింపులు 25 శాతం లేదా 33 శాతంగానే ఉండాలి. దీన్ని పేపర్‌పై రాసుకోవాలి. మొదటి కొన్నేళ్లపాటు ఇదే విధానాన్ని అనుసరించాలి. ఏడాదికోసారి ఈ కేటాయింపులను సమీక్షించుకోవాలి. దీన్నే అస్సెట్ అలోకేషన్ అంటారు. ఉదాహరణకు ఈక్విటీలకు 33 శాతం కేటాయింపులు చేయాలన్నది మీ ప్రణాళిక. ఏడాది కాలంలో మార్కెట్ ర్యాలీతో మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీల వాటా 50 శాతానికి చేరిందని అనుకుందాం. అప్పుడు 33 శాతానికి దిగొచ్చే విధంగా ఈక్విటీ పెట్టుబడులను విక్రయించాలి. మిగిలిన మొత్తాన్ని డెట్‌కు మళ్లించుకోవాలి. ఇలా కొంత కాలం చేసిన తర్వాత ఈక్విటీల పట్ల అవగాహన, నమ్మకం పెరుగుతుంది. అప్పుడు అవసరానికి అనుగుణంగా అస్సెట్ అలోకేషన్‌ను సవరించుకోవచ్చు. రిటైర్మెంట్ ఫండ్‌పై 3.5–4 శాతం రాబడి వచ్చినా సరిపోతుందని అనుకుంటే అప్పుడు మీ దగ్గర మెరుగైన ఫండ్ ఉన్నట్టుగా భావించాలి. ఇలాంటి వెసులుబాటు ఉన్న వారు రిటైర్మెంట్ ఫండ్‌ను ఈక్విటీ, డెట్‌కు సమానంగా కేటాయించుకోవచ్చు. లేదా ఈక్విటీకి 40 శాతం, డెట్‌కు 60 శాతం కేటాయించుకోవచ్చు. 5–20 శాతాన్ని షార్ట్ టర్మ్ డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. పీపీఎఫ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్నకు కేటాయింపులు చేసుకోవాలి. ఇక తమపై ఆధారపడిన వారు లేకపోతే.. అప్పుడు 25 లేదా 33 శాతాన్ని డెట్‌కు కేటాయించి, మిగిలిన మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీన్ని ర్యీబ్యాలన్స్ చేసుకుంటూ ఉండాలి. కార్యాచరణ ప్రణాళిక.. రిటైర్మెంట్ నాటికి రుణ భారం నుంచి పూర్తిగా బయటకు రావాలి. అన్ని పెట్టుబడులకూ ఒక్కటే బ్యాంక్ ఖాతా వినియోగించాలి. పెట్టుబడుల కేటాయింపులు (అస్సెట్ అలోకేషన్) ఏ విభాగానికి ఎంత మేర ఉండాలో నిర్ణయించుకోవాలి. ఈక్విటీలకు 50 శాతమా లేక 40 లేదా 25 శాతమా.. అలాగే డెట్‌కు ఎంతన్నది తేల్చుకోవాలి. వీటి నుంచి అవసరాలకు సరిపడా ప్రతి నెలా రాబడి వచ్చేలా చూసుకోవాలి. ఇతర వనరుల ద్వారా ఆదాయం వస్తుందేమో చూసుకోవాలి. పింఛను సదుపాయం ఉందా? ఉంటే వచ్చే మొత్తం సరిపోతుందా? అద్దె రూపంలో ఆదాయం వచ్చే మార్గం ఉందా? డివిడెండ్ల రూపంలో ఆదాయం వస్తుందా? విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి రెమిటెన్స్ వస్తుందా? ఇలా అన్ని రూపాల్లోని ఆదాయ వనరులను లెక్కించుకోవాలి. అప్పుడు మీ నెలవారీ ఖర్చులకు సరిపడా ఆదాయం వస్తే నిశ్చింతగా ఉండొచ్చు. తరుగు ఉంటే ఆ మేరకు పెట్టుబడుల నుంచి ఆదాయం వచ్చే ఏర్పాటు చేసుకోవాలి. మీ ఖర్చులకు మించి ఆదాయం వస్తుంటే సంతోషంగా విశ్రాంతి జీవనాన్ని గడిపేయొచ్చు. మిగులు ఉంటే ఆ మొత్తాన్ని తిరిగి ఇన్వెస్ట్ చేసుకోవడమే సరైనది. మీ పెట్టుబడి నుంచి తీసుకునే మొత్తం రాబడి కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే, మీ పెట్టుబడి నుంచి తీసుకునే మొత్తం రాబడికి సమాన స్థాయిలోనూ ఉండకూడదు. ఎందుకంటే ఏటా ద్రవ్యోల్బణ ప్రభావంతో 5–6 శాతం మేర పెట్టుబడి విలువ క్షీణిస్తుంది. కనుక పెట్టుబడి నుంచి తీసుకునే మొత్తం రాబడి కంటే తక్కువే ఉండాలి. అప్పుడే మీ పెట్టుబడి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వృద్ధి చెందుతుంది. ఒకవేళ మీ పెట్టుబడిపై వచ్చే ఆదాయానికి సమాన స్థాయిలో ప్రతి నెలా ఉపసంహరించుకుంటున్నారని అనుకుందాం. అలాంటి సందర్భాల్లో భవిష్యత్తులో పెరిగే ఖర్చులకు సరిపడా ఆదాయం పెంచుకునేందుకు కొంత మొత్తాన్ని ప్రతి నెలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాలి. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, పీపీఎఫ్‌లో పెట్టుబడులు కొనసాగించండి. ఎందుకంటే ఇవి సురక్షితమైన, మెరుగైన రాబడులు కలిగిన డెట్ సాధనాలు. ఏటా ఏప్రిల్‌లో సమీక్ష నిర్వహించుకోవాలి. క్రితం ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీలపై రాబడులు ఏ మేరకు ఉన్నాయి? డెట్‌లో ఏ మేరకు రాబడి వచ్చింది? అన్ని పరిశీలించుకోవాలి. ఉదాహరణకు 2013లో రూ.50 లక్షలను ఈక్విటీ, డెట్‌లో సమానంగా ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. ఏటా మీ అవసరాలకు 6 శాతం ఉపసంహరించుకోవాలన్నది ప్రణాళిక. అప్పుడు ఒక ఏడాదికి రూ.3 లక్షలు అవసరం అవుతుంది. అదే 2014లో రూ.3,18,000 అవసరం అవుతుంది. ఇలా ఏటా ఉపసంహరించుకోవాల్సిన మొత్తం పెరుగుతూ వెళుతుంది. ఈ ప్రకారం 2023లో రూ.4,32,000 అవసరం అవుతుంది. 6 శాతం ఉపసంహరించుకోవాలన్నది ప్రణాళిక. కనుక ఇప్పుడు మీ వద్ద రూ.72,00,000 పెట్టుబడి ఉండాలి. అప్పుడే 6 శాతం చొప్పున రూ.4,32,000 తీసుకోగలరు. అందుకే మీ పెట్టుబడి నిధి కూడా వృద్ధి చెందాలి. -
మీ పోర్ట్‌ఫోలియోకు అస్సెట్ అలోకేషన్..!
దీర్ఘకాలంలో సంపదను సమకూర్చుకోవాలనుకుంటే అందుకు కీలకంగా తోడ్పడే వాటిల్లో అస్సెట్ అలోకేషన్ కూడా ఒకటి. అస్సెట్ అలోకేషన్ అన్నది ఒక ఇన్వెస్టర్ తన పెట్టుబడులను ఏ మేరకు భిన్న సాధనాల్లో ఇన్వెస్ట్ చేశారన్నది తెలియజేస్తుంది. ఇది రిస్క్‌ను పరిమితం చేయడంతోపాటు, రాబడుల్లో అనిశ్చితులను కూడా తగ్గిస్తుంది. సరైన విభాగానికి సరైన సమయంలో పెట్టుబడులను కేటాయించడం ప్రభావవంతమైన అస్సెట్ అలోకేషన్ అవుతుంది. ఎందుకంటే కాల క్రమంలో.. ఒక్కో సమయంలో ఒక్కో అస్సెట్ క్లాస్ (పెట్టుబడుల విభాగం) మంచి పనితీరు చూపించొచ్చు. తాము బాగా అర్థం చేసుకోతగిన ఒక అస్సెట్ క్లాస్‌లోనే ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇన్వెస్టర్లు సౌకర్యంగా భావించొచ్చు. అయితే, ఒకే సాధనంలో పూర్తిగా ఇన్వెస్ట్ చేయడం వల్ల కాలానుగుణంగా, ఆయా విభాగంలో అనిశ్చితుల రిస్క్‌లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే దీర్ఘకాలంలో సంపద సమకూర్చుకోవాలనుకునే వారికి వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియో ఎంతో సాయపడుతుంది. పోర్ట్‌ఫోలియోలో భిన్న పెట్టుబడుల సాధనాలను అస్సెట్ అలోకేషన్గా పేర్కొంటారు. అనుకూలమైన అస్సెట్ అలోకేషన్‌ను నిర్ణయించుకుని, దానికి కట్టుబడి ఉండడంతోపాటు, రిస్క్‌ను సర్దుబాటు చేసుకుంటూ దీర్ఘకాల లక్ష్యాలకు క్రమానుగత పెట్టుబడుల విధానాన్ని అనుసరించడం సాయపడుతుంది. భిన్న సాధనాల మధ్య.. అస్సెట్ అలోకేషన్ పరంగా ఈక్విటీల్లో తక్కువ విలువల వద్ద కొనుగోలు చేసి, అధిక విలువల వద్ద విక్రయించడం అన్నది అనుసరణీయమే. కానీ, ఆచరణలో అదంత సులభం కాదు. ఇన్వెస్టర్లు దీనికి విరుద్ధంగా చేస్తుంటారు. అదే డెట్ విభాగంలో ఇన్వెస్టర్లు వడ్డీ రేట్ల గమనం ఏ విధంగా ఉందన్న దానితో సంబంధం లేకుండా తమకు సౌకర్యమైన పెట్టుబడి సాధనాలను ఎంచుకుంటుంటారు. బంగారం అన్నది భావోద్వేగాలతో ముడిపడినది. ముఖ్యంగా ఆభరణాల రూపంలో కొనుగోలు చేస్తుంటారు. ఈ విధంగా చూసినప్పుడు పెట్టుబడుల కేటాయింపు ఒకే రంగా ఉండిపోతుంది. దీనివల్ల ఇన్వెస్టర్ ఒక పెట్టుబడి సాధనానికి సంబంధించి మారుతున్న ఆకర్షణను కోల్పోవచ్చు. దీనికి పరిష్కారంగా మ్యూచువల్ ఫండ్స్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్‌ను ఆరంభించాయి. మారుతున్న పవనాలకు అనుగుణంగా ఈ ఫండ్స్ పెట్టుబడుల మార్పుతో ఇన్వెస్టర్లు చెప్పుకోతగిన విధంగా లాభపడేందుకు తోడ్పడతాయి. ఈ విభాగంలో ఒకానొక ప్రముఖ పథకం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అస్సెట్ అలోకేషన్ ఫండ్. డెట్, ఈక్విటీ విభాగాలకు వాటి ఆకర్షణీయతకు అనుగుణంగా పెట్టుబడులను ఈ ఫండ్ కేటాయిస్తుంది. అలాగే పెట్టుబడి పెట్టే ముందు ఈక్విటీ, డెట్ మార్కెట్ల వ్యాల్యూషన్లను ఫండ్ మేనేజర్ పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. మార్కెట్లు అనిశ్చితుల్లో ఉన్న సమయాల్లోనూ ఇన్వెస్టర్లు అస్సెట్ అలోకేషన్‌ను కొనసాగించడం అన్నది దీర్ఘకాలంలో... భిన్న సాధనాల్లో జరిగే ర్యాలీల్లో పాలు పంచుకునేందుకు సాయపడుతుంది. జి.వనకృష్ణ వీకీ ఫిన్సర్వ్ ఎల్ఎల్పీ -
రూ.7,000 కోట్లు సమీకరించిన పేటీఎమ్
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల సంస్థ, పేటీఎమ్ తాజాగా వంద కోట్ల డాలర్లు(రూ.7,000 కోట్లు) సమీకరించింది. అమెరికాకు చెందిన అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ టీ రోవె ప్రైస్‌తో పాటు పేటీఎమ్‌లో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన సాఫ్ట్‌బ్యాంక్, ఆలీబాబా, డిస్కవరీ క్యాపిటల్ తదితర సంస్థల నుంచి ఈ నిధులను సమీకరించినట్లు పేటీఎమ్ మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్(ఓసీఎల్) పేర్కొంది. ఈ తాజా రౌండ్లో చైనా ఈ కామర్స్ దిగ్గజం ఆలీబాబాకు చెందిన యాంట్ ఫైనాన్షియల్ నుంచి 40 కోట్ల డాలర్లు వచ్చాయని పేటీఎమ్ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. అలాగే సాఫ్ట్‌బ్యాంక్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ 20 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టిందని పేర్కొన్నారు. ఈ తాజా పెట్టుబడులను పరిగణనలోకి తీసుకుంటే పేటీఎమ్ కంపెనీ విలువ 1,600 కోట్ల డాలర్ల (రూ.1,12,000 కోట్లు)మేర ఉంటుందని వివరించారు. మూడేళ్లలో ఆర్థిక సేవల విస్తరణ కోసం రూ.10,000 కోట్లు (140 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్ చేయనున్నామని తెలిపారు. 2021లో లిస్టింగ్ ! భారత్ డిజిటల్ చెల్లింపుల రంగంలో గూగుల్ పే, ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఫోన్‌పే, ఇతర సంస్థల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న నేపథ్యంలో పేటీఎమ్ ఈ స్థాయిలో పెట్టుబడులు సమీకరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2012లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావాలని ఈ కంపెనీ యోచిస్తోంది. రూ.3,960 కోట్ల నష్టాలు.... ఏస్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హతావే నుంచి గత ఏడాది సెప్టెంబర్‌లో 30 కోట్ల డాలర్లను పేటీఎమ్ సమీకరించింది. పేటీఎమ్‌కు చెందిన మాతృసంస్థ ఏసీఎల్‌కు 2017–18లో రూ.1,490 కోట్లు, గత ఆర్థిక సంవత్సరంలో రూ.3,960 కోట్ల మేర నష్టాలు వచ్చాయి. -
వైవిధ్యమే పెట్టుబడులకు ప్రాణం
• వివిధ సాధనాలకు కేటారుుంచడం కీలకం • రిస్కు సామర్థ్యం, లక్ష్యాలు, కాల వ్యవధి ముఖ్యం సాధనాలేవైనప్పటికీ.. ఇన్వెస్ట్మెంట్ ప్రణాళికలు వేసుకోవడానికి, వ్యూహాలు రచించుకోవడానికి గడువు దాటిపోవడంలాంటిదేమీ ఉండదు. పెట్టుబడులు పెట్టడమనేది ఒక నిరంతరమైన ప్రక్రియ అని గుర్తుంచుకోవాలి. అసెట్ అలొకేషన్కు కట్టుబడి ఉండటం వల్ల ఆర్థిక క్రమశిక్షణ అలవడటమే కాకుండా మార్కెట్లు అధిక స్థాయిల్లో ఉన్నప్పుడు కొనడం, పడిపోతున్నప్పుడు నష్టాలకు అమ్ముకోవడం వంటి సమస్యలు ఉండవు. దేశీయంగా అనేక దశాబ్దాలుగా రిటైల్ ఇన్వెస్టర్లు స్థిరమైన రాబడులనిచ్చే సురక్షితమైన ఫిక్సిడ్ ఇన్కమ్ సాధనాలవైపే ఎక్కువగా మొగ్గు చూపిస్తూ వచ్చారు. కానీ, వంటకం రుచికరంగా, ఘుమఘుమలాడాలంటే మసాలా దినుసులు వేసినట్లే.. పోర్ట్‌ఫోలియో కూడా కళకళ్లాడాలంటే ఒకే సాధనానికి పరిమితం కాకుండా వైవిధ్యం పాటించాలి. ఆర్థిక ప్రణాళికలు వేసుకునేటప్పుడు, పెట్టుబడులు పెట్టేటప్పుడు కేవలం ఒక సాధనానికి గిరిగీసుకుని కూర్చుంటే ప్రయోజనాలు అంతంతమాత్రంగానే ఉంటారుు. అదే బహుళ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తే... ఒకటి తగ్గినా.. రెండోది కాస్త మెరుగ్గా రాణిస్తే ఆ మేరకు ప్రయోజనాలు పొందవచ్చు. దీన్నే అసెట్ అలొకేషన్ వ్యూహంగా వ్యవహరిస్తారు. అరుుతే, ఇలా పెట్టుబడులకు వివిధ సాధనాలను ఎంపిక చేసుకోవాలన్న సంగతి తెలిసినా కూడా మనలో చాలా మంది దాన్ని ఆచరణలో పెట్టడంలో విఫలమవుతుంటారు. కానీ, ఇప్పుడిప్పుడే ఈ ధోరణి క్రమంగా మారుతోంది. మనవాళ్లు ఇతర పెట్టుబడి సాధనాల వైపు కూడా చూస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పెట్టుబడి సాధనాల సంగతి తీసుకుంటే షేర్లు, బాండ్లు, రియల్ ఎస్టేట్, బంగారం లేదా కమోడిటీలు మొదలైనవి అనేకం ఉన్నారుు. రిటైల్ ఇన్వెస్టర్ల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్న వాటిలో మ్యూచువల్ ఫండ్స ఉంటున్నారుు. బ్యాలెన్సడ్ ఫండ్స ప్రయోజనాలు.. ఇన్వెస్టరు క్రియాశీలకంగా ఉన్నా, లేకపోరుునా ప్రస్తుత పరిస్థితుల్లో తగు రీతిలో వివిధ పెట్టుబడి సాధనాలకు కేటారుుంపులు జరపడం కొంచెం కష్టమైన పనే. అందుకే రిటైల్ ఇన్వెస్టర్ల కోసం బ్యాలెన్సడ్ మ్యూచువల్ ఫండ్స మొదలైనవి అందుబాటులో ఉన్నారుు. ఇవి ఈక్విటీలు, డెట్ సాధనాల్లో తగు పాళ్లలో (సాధారణంగా 65 శాతం ఈక్విటీల్లో, 35 శాతం డెట్‌లో) ఇన్వెస్ట్ చేస్తుంటారుు. మరో విధంగా చెప్పాలంటే అటు ఈక్విటీల దూకుడుని, ఇటు డెట్ సాధనాల స్థిరత్వాన్ని మేళవించి ఇవి రాబడులు అందిస్తారుు. ఈ బ్యాలెన్సడ్ ఫండ్సలోనే అడ్వాంటే జి ఫండ్స కూడా ఉన్నారుు. ఈ తరహా ఫండ్స.. ప్రధానంగా మార్కెట్లు చవకగా ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసి, పెరుగుతున్నప్పుడు లాభాలకు అమ్మేసి రాబడులు ఇస్తుంటారుు. తద్వారా రిస్కును తగ్గించి, దీర్ఘకాలికంగా మెరుగైన రాబడులు అందించే అవకాశాలు ఉన్నారుు. కేటారుుంపులకు ప్రాముఖ్యత ఎందుకంటే.. సాధారణంగా వివిధ పెట్టుబడి సాధనాలన్నీ కలసికట్టుగా ఒకేసారి పెరగడం గానీ తగ్గడం గానీ జరగదు. ఒకటి తగ్గితే మరొకటి పెరుగుతుంది. కాబట్టి వేర్వేరు సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్కును కొంత తగ్గించుకోవచ్చు. ఓవరాల్‌గా పోర్ట్‌ఫోలియో రాబడిని మెరుగుపర్చుకోవచ్చు. రిస్కులు, రాబడులను సరిచూసుకుని ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోలో వివిధ సాధనాలకు తగు రీతిలో పెట్టుబడి మొత్తాలు కేటారుుంచాలి. ఇదంతా కూడా ఇన్వెస్టరు రిస్కు సామర్థ్యం, ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడి వ్యవధిని బట్టి ఆధారపడి ఉంటుంది. బేరీజు వేసుకోవాలి.. వైవిధ్యం పాటించాలి కదా అని సరైన ప్రణాళికేదీ లేకుండా కేటారుుంపులు జరిపినా మంచిది కాదు. పెట్టుబడి సాధనాలకు కేటారుుంపులు జరిపే ముందు రిస్కులు, రాబడులు బేరీజు వేసుకోవాలి. వీటితో పాటు రిస్కు సామర్థ్యం, ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడి వ్యవధిని బట్టి కేటారుుంపులు చేయాలి. వీటిని బట్టే దేనికి ఎంత కేటారుుంచవచ్చన్నది లెక్క వేసుకోవచ్చు. ఉదాహరణకు.. వ్యవధి మూడేళ్ల కన్నా తక్కువే ఉన్న పక్షంలో ఈక్విటీల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయకుండా ఉండటమే ఉత్తమం. అదే అరుుదేళ్ల పైగా కాల వ్యవధి ఉంటే .. కచ్చితంగా ఈక్విటీలను కూడా పోర్ట్‌ఫోలియోలో భాగం చేయొచ్చు. ఇది ఒక బండ గుర్తు అరుునప్పటికీ .. ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఇతరత్రా వ్యూహాలు కూడా ఉన్నారుు. ఉదాహరణకు ఒక విధానంలో దీర్ఘకాలికంగా 60 శాతం మొత్తాన్ని 15 శాతం రాబడి అంచనాలతో ఈక్విటీల్లోను, 40 శాతం మొత్తాన్ని 5 శాతం రాబడి అంచనాలతో డెట్ సాధనాల్లోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ విధానంలో .. పోర్ట్‌ఫోలియో సగటున సుమారు 11 శాతం దాకా రాబడులు ఇవ్వగలదు. ఇలా ఎప్పుడూ స్థిరంగా ఒకే రకమైన కేటారుుంపులకు కట్టుబడి పోకుండా .. మధ్య మధ్యలో స్వల్పకాలిక అవకాశాలను అందిపుచ్చుకునేలా అలొకేషన్‌ను సవరించుకుంటూ ముందుకెళ్లడం మరో విధానం. ఈ రెండూ ఒక తరహా ఇన్వెస్టర్లకు అనువైన విధానాలు. ఇవి కాకుండా యాక్టివ్ ఇన్వెస్టర్లు .. డైనమిక్ వ్యూహం పాటిస్తుంటారు. వీరు రోజువారీ తమ పెట్టుబడులను ట్రాక్ చేస్తూ .. అవసరమైతే తక్షణ మార్పులు చేస్తూ మార్కెట్లో ఇటు స్వల్పకాలిక, అటు దీర్ఘకాలిక అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉంటారు.