వైవిధ్యమే పెట్టుబడులకు ప్రాణం | Investment risk capacity asset allocation | Sakshi
Sakshi News home page

వైవిధ్యమే పెట్టుబడులకు ప్రాణం

Published Mon, Nov 28 2016 12:31 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 PM

వైవిధ్యమే పెట్టుబడులకు ప్రాణం

వైవిధ్యమే పెట్టుబడులకు ప్రాణం

వివిధ సాధనాలకు కేటారుుంచడం కీలకం
రిస్కు సామర్థ్యం, లక్ష్యాలు, కాల వ్యవధి ముఖ్యం

సాధనాలేవైనప్పటికీ.. ఇన్వెస్ట్‌మెంట్ ప్రణాళికలు వేసుకోవడానికి, వ్యూహాలు రచించుకోవడానికి గడువు దాటిపోవడంలాంటిదేమీ ఉండదు. పెట్టుబడులు పెట్టడమనేది ఒక నిరంతరమైన ప్రక్రియ అని గుర్తుంచుకోవాలి. అసెట్ అలొకేషన్‌కు కట్టుబడి ఉండటం వల్ల ఆర్థిక క్రమశిక్షణ అలవడటమే కాకుండా మార్కెట్లు అధిక స్థాయిల్లో ఉన్నప్పుడు కొనడం, పడిపోతున్నప్పుడు నష్టాలకు అమ్ముకోవడం వంటి సమస్యలు ఉండవు.

దేశీయంగా అనేక దశాబ్దాలుగా రిటైల్ ఇన్వెస్టర్లు స్థిరమైన రాబడులనిచ్చే సురక్షితమైన ఫిక్సిడ్ ఇన్‌కమ్ సాధనాలవైపే ఎక్కువగా మొగ్గు చూపిస్తూ వచ్చారు. కానీ,  వంటకం రుచికరంగా, ఘుమఘుమలాడాలంటే మసాలా దినుసులు వేసినట్లే.. పోర్ట్‌ఫోలియో కూడా కళకళ్లాడాలంటే ఒకే సాధనానికి పరిమితం కాకుండా వైవిధ్యం పాటించాలి. ఆర్థిక ప్రణాళికలు వేసుకునేటప్పుడు, పెట్టుబడులు పెట్టేటప్పుడు కేవలం ఒక సాధనానికి గిరిగీసుకుని కూర్చుంటే ప్రయోజనాలు అంతంతమాత్రంగానే ఉంటారుు. అదే బహుళ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తే... ఒకటి తగ్గినా.. రెండోది కాస్త మెరుగ్గా రాణిస్తే ఆ మేరకు ప్రయోజనాలు పొందవచ్చు.

దీన్నే అసెట్ అలొకేషన్ వ్యూహంగా వ్యవహరిస్తారు. అరుుతే, ఇలా పెట్టుబడులకు వివిధ సాధనాలను ఎంపిక చేసుకోవాలన్న సంగతి తెలిసినా కూడా మనలో చాలా మంది దాన్ని ఆచరణలో పెట్టడంలో విఫలమవుతుంటారు.  కానీ, ఇప్పుడిప్పుడే ఈ ధోరణి క్రమంగా మారుతోంది. మనవాళ్లు ఇతర పెట్టుబడి సాధనాల వైపు కూడా చూస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పెట్టుబడి సాధనాల సంగతి తీసుకుంటే షేర్లు, బాండ్లు, రియల్ ఎస్టేట్, బంగారం లేదా కమోడిటీలు మొదలైనవి అనేకం ఉన్నారుు. రిటైల్ ఇన్వెస్టర్ల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్న వాటిలో మ్యూచువల్ ఫండ్‌‌స ఉంటున్నారుు.

బ్యాలెన్‌‌సడ్ ఫండ్‌‌స ప్రయోజనాలు..
ఇన్వెస్టరు క్రియాశీలకంగా ఉన్నా, లేకపోరుునా ప్రస్తుత పరిస్థితుల్లో తగు రీతిలో వివిధ పెట్టుబడి సాధనాలకు కేటారుుంపులు జరపడం కొంచెం కష్టమైన పనే. అందుకే రిటైల్ ఇన్వెస్టర్ల కోసం బ్యాలెన్‌‌సడ్ మ్యూచువల్ ఫండ్‌‌స మొదలైనవి అందుబాటులో ఉన్నారుు. ఇవి ఈక్విటీలు, డెట్ సాధనాల్లో తగు పాళ్లలో (సాధారణంగా 65 శాతం ఈక్విటీల్లో, 35 శాతం డెట్‌లో) ఇన్వెస్ట్ చేస్తుంటారుు. మరో విధంగా చెప్పాలంటే అటు ఈక్విటీల దూకుడుని, ఇటు డెట్ సాధనాల స్థిరత్వాన్ని మేళవించి ఇవి రాబడులు అందిస్తారుు. ఈ బ్యాలెన్‌‌సడ్ ఫండ్‌‌సలోనే అడ్వాంటే జి ఫండ్‌‌స కూడా ఉన్నారుు. ఈ తరహా ఫండ్‌‌స.. ప్రధానంగా మార్కెట్లు చవకగా ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసి, పెరుగుతున్నప్పుడు లాభాలకు అమ్మేసి రాబడులు ఇస్తుంటారుు. తద్వారా రిస్కును తగ్గించి, దీర్ఘకాలికంగా మెరుగైన రాబడులు అందించే అవకాశాలు ఉన్నారుు.

కేటారుుంపులకు ప్రాముఖ్యత ఎందుకంటే..
సాధారణంగా వివిధ పెట్టుబడి సాధనాలన్నీ కలసికట్టుగా ఒకేసారి పెరగడం గానీ తగ్గడం గానీ జరగదు. ఒకటి తగ్గితే మరొకటి పెరుగుతుంది. కాబట్టి వేర్వేరు సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్కును కొంత తగ్గించుకోవచ్చు. ఓవరాల్‌గా పోర్ట్‌ఫోలియో రాబడిని మెరుగుపర్చుకోవచ్చు. రిస్కులు, రాబడులను సరిచూసుకుని ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలో వివిధ సాధనాలకు తగు రీతిలో పెట్టుబడి మొత్తాలు కేటారుుంచాలి. ఇదంతా కూడా ఇన్వెస్టరు రిస్కు సామర్థ్యం, ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడి వ్యవధిని బట్టి ఆధారపడి ఉంటుంది.

బేరీజు వేసుకోవాలి..
వైవిధ్యం పాటించాలి కదా అని సరైన ప్రణాళికేదీ లేకుండా కేటారుుంపులు జరిపినా మంచిది కాదు. పెట్టుబడి సాధనాలకు కేటారుుంపులు జరిపే ముందు రిస్కులు, రాబడులు బేరీజు వేసుకోవాలి. వీటితో పాటు రిస్కు సామర్థ్యం, ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడి వ్యవధిని బట్టి కేటారుుంపులు చేయాలి. వీటిని బట్టే దేనికి ఎంత కేటారుుంచవచ్చన్నది లెక్క వేసుకోవచ్చు. ఉదాహరణకు.. వ్యవధి మూడేళ్ల కన్నా తక్కువే ఉన్న పక్షంలో ఈక్విటీల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయకుండా ఉండటమే ఉత్తమం. అదే అరుుదేళ్ల పైగా కాల వ్యవధి ఉంటే .. కచ్చితంగా ఈక్విటీలను కూడా పోర్ట్‌ఫోలియోలో భాగం చేయొచ్చు. ఇది ఒక బండ గుర్తు అరుునప్పటికీ .. ఇన్వెస్ట్‌మెంట్‌కి సంబంధించి ఇతరత్రా వ్యూహాలు కూడా ఉన్నారుు.

ఉదాహరణకు ఒక విధానంలో దీర్ఘకాలికంగా 60 శాతం మొత్తాన్ని 15 శాతం రాబడి అంచనాలతో ఈక్విటీల్లోను, 40 శాతం మొత్తాన్ని 5 శాతం రాబడి అంచనాలతో డెట్ సాధనాల్లోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ విధానంలో .. పోర్ట్‌ఫోలియో సగటున సుమారు 11 శాతం దాకా రాబడులు ఇవ్వగలదు. ఇలా ఎప్పుడూ స్థిరంగా ఒకే రకమైన కేటారుుంపులకు కట్టుబడి పోకుండా .. మధ్య మధ్యలో స్వల్పకాలిక అవకాశాలను అందిపుచ్చుకునేలా అలొకేషన్‌ను సవరించుకుంటూ ముందుకెళ్లడం మరో విధానం. ఈ రెండూ ఒక తరహా ఇన్వెస్టర్లకు అనువైన విధానాలు. ఇవి కాకుండా యాక్టివ్ ఇన్వెస్టర్లు .. డైనమిక్ వ్యూహం పాటిస్తుంటారు. వీరు  రోజువారీ తమ పెట్టుబడులను ట్రాక్ చేస్తూ .. అవసరమైతే తక్షణ మార్పులు చేస్తూ మార్కెట్లో ఇటు స్వల్పకాలిక, అటు దీర్ఘకాలిక అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement