'ఇబ్బందులు కొన్నాళ్లే.. భరించండి' | Demonetisation a short term pain: PM Modi | Sakshi
Sakshi News home page

'ఇబ్బందులు కొన్నాళ్లే.. భరించండి'

Published Sat, Dec 24 2016 3:34 PM | Last Updated on Fri, Aug 24 2018 2:20 PM

'ఇబ్బందులు కొన్నాళ్లే.. భరించండి' - Sakshi

'ఇబ్బందులు కొన్నాళ్లే.. భరించండి'

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు విషయంలో భారత ప్రధాని నరేంద్రమోదీ మరోసారి తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. సమస్య కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని, కానీ దాని అనంతరం వచ్చే ప్రయోజనాలు మాత్రం దీర్ఘకాలం ఉంటాయని చెప్పారు. దేశాన్ని ఆర్థిక పురోభివృద్ధిలోకి వేగంగా తీసుకెళ్లేందుకే తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందే తప్ప తాత్కాలికంగానే పనికొచ్చే రాజకీయ లబ్ధి కోసం కాదని అన్నారు. ఒకే తరంలోనే భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయడమే తన కల అని చెప్పారు.

గడిచిన మూడేళ్లలోనే భారత ఆర్థిక వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చినట్లు మోదీ చెప్పారు. 2012-13 సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పోల్చినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థలో ప్రమాద ఘంటికలు వినిపించాయని, కానీ, గడిచిన మూడేళ్లలో మాత్రం అన్ని దేశాలకంటే భారత్‌ ముందుందని చెప్పారు. ప్రపంచం మొత్తానికి భారత్‌ ఓ వేగు చుక్కలా కనిపిస్తుందని ఆయన అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement