
కోల్‌కతా: రూ.2,000 నోట్ల ఉపసంహరణను ఆక్షేపిస్తూ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి బుధవారం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘మోదీ పట్ల దేశ ప్రజలకు విముఖత పెరిగిపోతోంది.
మోదీని పిచ్చి (పగ్లా) మోదీగా ప్రజలు భావిస్తున్నారు’’ అన్నారు. వీటిపై బీజేపీ మండిపడింది. అధీర్ ఓ నేరగాడంటూ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ దుయ్యబట్టారు. తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో, ప్రజల మనోభావాలను తాను బయట పెట్టానని అధీర్ అన్నారు.