madness
-
పిచ్చి మోదీ: అధీర్
కోల్‌కతా: రూ.2,000 నోట్ల ఉపసంహరణను ఆక్షేపిస్తూ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి బుధవారం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘మోదీ పట్ల దేశ ప్రజలకు విముఖత పెరిగిపోతోంది. మోదీని పిచ్చి (పగ్లా) మోదీగా ప్రజలు భావిస్తున్నారు’’ అన్నారు. వీటిపై బీజేపీ మండిపడింది. అధీర్ ఓ నేరగాడంటూ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ దుయ్యబట్టారు. తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో, ప్రజల మనోభావాలను తాను బయట పెట్టానని అధీర్ అన్నారు. -
మళ్లీ కులపిచ్చి బయటపెట్టుకున్న చంద్రబాబు
సాక్షి, తూర్పుగోదావరి: రాజకీయాల్లో కులపిచ్చికి బాబు బ్రాండ్ అంబాసిడర్.. ఆయన కులపిచ్చి ఏ రేంజ్లో ఉంటుందో మరోసారి గోదావరి జిల్లాల పర్యటనలో బయటపెట్టుకున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల పరామర్శ పేరుతో వెళ్లిన చంద్రబాబు.. సిల్లీ రాజకీయాలకు తెరతీశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కాట కోటేశ్వరంలో చంద్రబాబు కులపిచ్చి బయటపడింది. కష్టాన్ని చెప్పుకునేందుకు వచ్చిన రైతును కులం పేరుతో చంద్రబాబు అవమానించారు. కులం ఏంటని రైతును అడిగిన చంద్రబాబు.. మళ్లీ కులపిచ్చి తన బయటపెట్టుకున్నారు. చంద్రబాబు తీరుపై జనం మండిపడుతున్నారు. చదవండి: వీరి పొత్తుల ఎత్తులు చూడాల్సిందే! -
డేంజర్ గేమ్.. చంద్రబాబు ప్లాన్ అదే..? ఇదిగో రుజువులు..
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అకృత్యాలకు జనం బలి అవుతున్నారు. తమ ప్రచార యావ ముందు ఏదీ కనిపించదని వారు పదే, పదే రుజువు చేసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం కందుకూరు వద్ద జరిగిన ఘటనలో ఎనిమిది మంది మరణించిన ఘటనను మరవక ముందే గుంటూరులో మరో దారుణం జరిగింది. ఇక్కడ ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు. రెండు చోట్ల టీడీపీకి ఒకటే లక్ష్యం. జనాన్ని పోగు చేయడం, భారీగా తరలివచ్చారని తమ మీడియాలో డ్రోన్ షాట్ల ద్వారా భ్రమలు కల్పించడం. జనం రారేమో అనుకున్న చోట వారికి తాయిలాలు ఇస్తామని ఊరించడం, సభలకు జనాన్ని తరలించడం అన్నది కొత్తగా జరిగేది కాదు. కాని దానికి కొన్ని పద్దతులు ఉంటాయి. అవసరమైన రవాణా సదుపాయాలు కల్పించాలి. కాని ఇందులో కూడా ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుది విలక్షణ శైలి. ఆయనకు ఈ విద్య కొత్తగా వచ్చింది కాదు. ఆయన రాజకీయాలలోకి వచ్చింది మొదలు ఇలాంటివి ఎన్నో చేస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి అయ్యాక వాటిని కొత్త పుంతలు తొక్కించారు. జనానికి డబ్బులు ఇవ్వవచ్చని, డ్వాక్రా మహిళలను, ఇతర లబ్దిదారులను సభలకు తరలించవచ్చని కనిపెట్టింది ఆయనే. పార్టీ పరంగా ఏదైనా సభ జరిపితే హైదరాబాద్ నుంచి పార్టీ స్థానిక నేతలకు పెద్ద ఎత్తున డబ్బు పంపించడం ఆయనకు అలవాటే. వచ్చిన వారికి మందు పోయించడం మామూలే. కాని ఇటీవలికాలంలో తెలుగుదేశం కాని, చంద్రబాబు చేస్తున్న విన్యాసాలు చాలా అధమ స్థాయికి చేరుతున్నాయని అనడానికి కందుకూరు, గుంటూరు సభల విషాదాలే ఉదాహరణగా నిలుస్తాయి. గతంలో వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తూనో, ఇతరత్రానో సభలు పెట్టినప్పుడు లేదా రోడ్ షోలు నిర్వహించినప్పుడు విపరీతంగా జనం వచ్చేవారు. అయితే టీడీపీ మీడియా వారు ఏమనుకున్నారంటే పై నుంచి ఫోటోలు తీయడం వల్ల జనం బాగా వచ్చినట్లు కనిపిస్తున్నారని అనుకుని టీడీపీ వారికి కూడా ఇదే సలహా ఇచ్చారు. అందులోను చంద్రబాబు ఇలాంటి ప్రచారాలలో మరీ ముందంజలో ఉంటారు. వెంటనే ఆయన అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలని పార్టీ వారిని పురమాయిస్తుంటారు. 2019లో అధికారం కోల్పోయిన తర్వాత, స్థానిక ఎన్నికలలో ఓటమి తర్వాత ఈ ప్రచార పిచ్చి బాగా పెరిగింది. ఇటీవలి కాలంలో రకరకాల పేర్లతో చంద్రబాబు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కర్నూలు రోడ్డులో సభ పెట్టి, ఇంత జనం తన జీవితంలో చూడలేదని అన్నారు. ఆయన మాటలకు కర్నూలు వారు కాదు కాని, ఇతర ప్రాంతాలవారు అవునా నిజమా అని ఆశ్చర్యపోవలసిందే. ఎందుకంటే ఒక రోడ్డు మీద జనాన్ని పోగు చేసి, పైనుంచి ఫోటో తీసి అబ్బో అనుకుంటే ఏమి ఉపయోగం. నిజంగా జనం పెద్ద ఎత్తున స్వచ్చందంగా రావాలి.. వచ్చిన ప్రజలలో అభిమానం ఉండాలి కాని. అక్కడ నుంచి టీడీపీకి ఈ డ్రోన్ల పిచ్చి ముదిరింది. ఒక వైపు ముఖ్యమంత్రి జగన్ తన సభలను విశాలమైన మైదానాలలో పెడుతుంటే చుట్టు పక్కల కూడా జనం కిక్కిరిసి కనబడుతుంటారు. మరో వైపు చంద్రబాబు సభలేమో ఇరుకు రోడ్లలో పెట్టి డ్రోన్ ఫోటో తీసి వారికి వారే మురిసిపోతున్నారు. వారు మురిస్తే ఇబ్బంది లేదు. కాని జనాన్ని చావ కొడుతున్నారు. పైగా అలా మరణించిన వారు ఫలానా కులం అని, రాష్ట్రం కోసం త్యాగం చేశారని దిక్కుమాలిన ఫిలాసఫీ చెప్పి ప్రజలను మరింతగా అవమానిస్తున్నారు. కందుకూరులో నిర్దిష్ట చోట కాకుండా ఇరుకు రోడ్డులో సభ పెట్టారు. అక్కడ తొక్కిసలాట జరిగి, కొందరు చనిపోతే, అక్కడ ఉన్న సభికులను తాను వెళ్లి చూసి వస్తానని, తిరిగి వచ్చే వరకు అక్కడే ఉండండని చంద్రబాబు చెప్పడం పరాకాష్టగా భావించాలి. ఆ తర్వాత ఆ కార్యక్రమాలను వాయిదా వేసుకోకుండా కావలి, కోవూరు తదితర చోట్ల కూడా ఇవే షోలు నడిపారు. అక్కడితో ఆగలేదు. గుంటూరులో మరో అడుగు ముందుకు వేసి చంద్రబాబు వస్తున్నారు. సంక్రాంతి కిట్లు ఇస్తారు అంటూ పది రోజుల నుంచే ప్రచారం చేశారట. ఏదో గతంలో డబ్బిచ్చి జనాన్ని మళ్లించడం చూశాం. కాని ఇప్పుడు సంక్రాంతి సరుకులు ఇస్తాం సభకు రండి అని పేద ప్రజల జీవితాలతో ఆడుకోవడం చూస్తున్నాం. పాపం.. వారంతా సభకు నాలుగు గంటల ముందు వచ్చారట. చాలామంది నిలబడే ఉండాల్సి వచ్చిందట. చంద్రబాబు స్పీచ్ అయ్యేవరకు ఓపికగా ఉన్న జనానికి తమకు సంక్రాంతి కిట్లు అందడం లేదని తెలుసుకుని ఒక్కసారిగా తోసుకు రావడంతో ముగ్గురు మరణించడం, పలువురు గాయపడడం జరిగింది. ఈ రెండు ఘటనలకు కారణం తెలుగుదేశం నేతల నిర్వాకం. కాని టీడీపీ మీడియా, పార్టీ నేతలు దీనిని పోలీసులపై నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారు. ఈనాడు మీడియా అయితే ఈ వార్తల కవరేజీలో ఇంతగా దిగజారి పోతుందని అనుకోలేదు. గుంటూరు ఘటన లో స్థానికులదే తప్పన్నట్లుగా, వేలాది కిట్లు ఉన్నా సరిగా నిర్వహించలేకపోయినట్లు ప్రచారం చేశారు. అసలు ఈ ఘటన వార్తను ఏదో మొక్కుబడిగా ఇచ్చారు తప్ప, జర్నలిజం ప్రమాణాలకు తగినట్లుగా ఇవ్వలేదన్నది నిర్వివాదాంశం. ఏదో షాపుల వారు తమ ప్రచారం కోసం చీరలు ఇస్తామని చెప్పి ప్రజలను ఆకర్షించడం, అందరికి ఇవ్వలేక చేతులు ఎత్తివేయడం, దాంతో పోలీసులు జోక్యం చేసుకోవల్సి రావడం జరుగుతుంటాయి. సరిగ్గా అదే రీతిలో తెలుగుదేశం పార్టీ కూడా జనాన్ని తరలించడానికి ఇలాంటి దిక్కుమాలిన ప్లాన్స్ వేస్తుంటే, వాటి గురించి రాయవలసిన ఈనాడు మీడియా, మిగిలిన టీడీపీ మీడియా మాదిరే మరీ నగ్నంగా కనిపించడానికి సిగ్గుపడడం లేదు. కందుకూరులో బాధితులు తొక్కిసలాటకు గురై మరణిస్తే వారు రాష్ట్రం కోసం త్యాగం చేశారని చంద్రబాబు ఉవాచ. రాష్ట్రం కోసం ఆయన ఉద్యమం చేస్తున్నారట. ఆయన తంటాలన్నీ ముఖ్యమంత్రి పదవి కోసం కాదన్నమాట. చనిపోయిన వారు రాష్ట్రం కోసం సమిధలుగా మారారని ఆయన చెబుతున్నారు. చదవండి: కాటేసిన కానుక! ఇంత ఘోరంగా మాట్టాడవచ్చని చంద్రబాబు పదే, పదే రుజువు చేస్తున్నారు. గోదావరి పుష్కరాలలో తన సినిమా యావకోసం 29 మంది చనిపోతే, అప్పుడు ఆయన ఏమని చెప్పారో గుర్తుందా?. కుంభమేళాలలో మరణించడం లేదా? రోడ్డు ప్రమాదాలలో చనిపోవడం లేదా అని ప్రశ్నించి అవమానించారు. ఆ మధ్య మాచర్లలో ఒక టీడీపీ కార్యకర్త స్థానిక గొడవల్లో హత్యకు గురైతే దానికి రాజకీయం పులిమి, అతని పాడె కూడా మోసి చంద్రబాబు సానుభూతి కోసం ప్రయత్నించారు. మరి ఈ ఘటనలలో చనిపోవడానికి టీడీపీనే కారణం. అయినా మరి డబ్బు ఇచ్చి ఎందుకు ఊరుకున్నారో తెలియదు. ఇలాంటి ఘటనలకు బాధ్యులైనవారిపై కేసులు పెట్టవలసి ఉంటుంది. అలా చేసిన వెంటనే అక్రమ కేసులు అంటూ మళ్లీ వీరే ప్రచారం చేస్తుంటారు. ఏది ఏమైనా టీడీపీ ప్రచార పిచ్చి ఏపీ ప్రజలకు కర్మగా మారుతోంది. -హితైషి -
వెర్రి వేవేల విధాలు
‘వెర్రి వెయ్యి విధాలు’ అంటారు. ‘ఎవడి వెర్రి వాడికి ఆనందం’ అంటారు. ‘వెర్రి ముదిరిందంటే రోకలి తలకు చుట్టండి అన్నాట్ట’ అనే సామెత మనకు తెలియనిది కాదు. వెర్రికి తిక్క, పిచ్చి, రిమ్మ, మతిభ్రంశం, మతిభ్రమణం, చిత్తచాంచల్యం, ఉన్మాదం వంటి పర్యాయపదాలు చాలానే ఉన్నాయి. వెర్రి లేదా పిచ్చికి సంబంధించి తెలుగులోనే కాదు, ప్రపంచంలోని దాదాపు అన్ని భాషల్లోనూ నానుడులు, సామెతలు, జాతీయాలు, పదబంధాలు పుష్కలంగా ఉన్నాయి. కవిత్వంలోనూ, కాల్ప నిక సాహిత్యంలోనూ పిచ్చితనం లేదా వెర్రితనం ప్రస్తావన విరివిగానే కనిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా భాషా సాహిత్యాలకూ వెర్రితనానికీ ఉన్న అవినాభావ సంబంధం అలాంటిది మరి! అప్పుడెప్పుడో అమాయకపు సత్తెకాలంలో ‘వెర్రి వెయ్యి విధాలు’ అని జనాలు వాపోయేవారు గానీ, ఇప్పటి ప్రపంచంలోనైతే కొత్త కొత్త వెర్రితనాలు వెలుగులోకి వస్తూ, వార్తలకెక్కుతూనే ఉన్నాయి. వెర్రి వెయ్యి విధాలు అనే నమ్మకం ప్రబలంగా ఉన్న కాలంలో కొత్తపల్లి సూర్యారావు ‘ఉన్మాద సహస్రము– వెఱి -
ఉన్మాదం పెరిగితే దేశ ఉనికికే ముప్పు
- మతాన్ని, కులాన్ని ఆరాధించేవాళ్లు హిట్లర్ వంశీకులు - చండ్ర రాజేశ్వరరావు జయంతి సభలో జైపాల్‌రెడ్డి - రాజకీయాలను వ్యాపారమయం చేసిందే చంద్రబాబు: నారాయణ సాక్షి, హైదరాబాద్: దేశంలో ఉన్మాదం పెరిగితే ఉనికికే ముప్పు ఏర్పడుతుందని మాజీ కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి హెచ్చరించారు. మత సామరస్యతకు, సమగ్రతకు గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుత బీజేపీ పాలనలో ఆపద ముంచుకొచ్చిందని ధ్వజమెత్తారు. సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు కె.నారాయణ అధ్యక్షతన సోమవారమిక్కడ జరిగిన సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావు 102 జయంతి సభకు జైపాల్‌రెడ్డి ప్రధాన వక్తగా హాజరై ‘ప్రస్తుత రాజకీయాలు- ప్రధాన సవాళ్లు’ అంశంపై మాట్లాడారు. దేశం, జాతి, జాతీయ సమైక్యత అనేవి వాస్తవానికి రెండు మూడొందల ఏళ్ల కిందటి వరకు లేవని చెప్పారు. మతాన్ని, జాతిని కీర్తించేవాళ్లందరూ హిట్లర్ వంశీకులేనన్నారు. దేశ సమగ్రత, భావ సమైక్యతకు మతతత్వ శక్తుల నుంచి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి మనం ఇప్పుడు ఇరాన్‌గా పిలుస్తున్న దేశం ఆర్యులదని, ఆ మాటంటే బీజేపీకి కోపం రావొచ్చన్నారు. వాజ్‌పేయి హయాంలో ఉమ్మడి పౌర స్మృతి, అయోధ్య అంశం, 371 ఆర్టికల్ ఊసే లేవన్నారు. కానీ 2014 ఎన్నికల ప్రణాళికలో బీజేపీ వీటిని పెట్టి, రాద్ధాంతం తప్ప సిద్ధాంతం లేని ప్రాంతీయ పార్టీలతో కలసి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తోందన్నారు. గతంలో మత సామరస్యతకు ముప్పు ఏర్పడిన ప్రతిసారి కమ్యూనిస్టులు, ప్రత్యేకించి చండ్ర రాజేశ్వరరావు లాంటి వారు ముందుండి పోరాడారని గుర్తుచేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటే గిట్టని కమ్యూనిస్టులే మంచి పార్లమెంటేరియన్లుగా ఎదిగారని, ప్రజాస్వామ్య పునాదుల్ని, స్ఫూర్తిని దెబ్బతీసే ఏ చర్యనూ సహించవద్దన్నారు. తెలుగువారి చరిత్రపుటల్లో ప్రకాశం పంతులు, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ల సరసన నిలవగలిగిన గొప్ప వ్యక్తి చండ్ర అని కొనియాడారు. అంతకుముందు చండ్ర రాజేశ్వరరావు చిత్ర పటానికి జైపాల్‌రెడ్డితోపాటు, సీపీఐ నాయకులు నారాయణ, చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, పశ్య పద్మ, చెన్నకేశవ్, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, సీనియర్ జర్నలిస్టు సి.రాఘవాచారి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఆర్ ఆంధ్రుడని ఫౌండేషన్‌కు కేసీఆర్ స్థలం ఇవ్వనన్నారు: నారాయణ చండ్ర రాజేశ్వరరావు లాంటి అంతర్జాతీయ దిగ్గజానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రాంతీయ తత్వాన్ని అంటగట్టారని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. తన దేహం ముక్కలైనా దేశాన్ని ముక్కలు కానివ్వబోనని చెప్పడమే కాకుండా బాబ్రీ మసీదు ధ్వంసాన్ని అడ్డుకున్న చండ్ర త్యాగజీవని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపిన యోధుడని చెప్పారు. ప్రజల కోసం వందలాది ఎకరాలను తృణప్రాయంగా త్యజించిన చండ్ర పేరిట నిర్వహిస్తున్న సీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆస్పత్రి ఏర్పాటుకు రెండెకరాల స్థలం ఇమ్మని తమ పార్టీ అడిగితే కేసీఆర్ తిప్పికొట్టిన తీరు క్షోభకు గురిచేసిందన్నారు. సీఆర్ ఆంధ్రుడైనందున స్థలం ఇవ్వడానికి నిరాకరించారని తెలిసి ఇక ఆ ప్రయత్నం విరమించుకున్నట్లు చెప్పారు. రాజకీయ వ్యవస్థ వ్యాపారమయమైందని, అమ్ముడు పోయే బడుద్ధాయిలు, సంతలో గొర్రెల మాదిరి కొనే నాయకులు తయారయ్యారన్నారు. రాజకీయాలను వ్యాపారమయం చేసిందే చంద్రబాబు అని, పారిశ్రామిక వేత్తల్ని ఎంపీలు, ఎమ్మెల్యేలుగా చేసింది ఆయనేనన్నారు. సుజానా చౌదరిని ఎంపీగా చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. కేసీఆర్,బాబు ఇద్దరూ ఒకే తాను ముక్కలని, గొడవలు మాని కృష్ణా, గోదావరి జలాల సమస్యను పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చారు. -
తాగుడు మాన్పిస్తే జనం పిచ్చివాళ్లవుతారు
నవనిర్మాణ వారోత్సవాల్లో చంద్రబాబు సాక్షి, అమరావతి: మద్యపానం అలవాటును మాన్పిస్తే ప్రజలకు పిచ్చిపడుతుందని సీఎం చంద్రబాబుఅన్నారు. నవనిర్మాణ వారోత్సవాల్లో భాగంగా విజయవాడ ఏ కన్వెన్షన్‌లో మూడో రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. బెల్టు షాపుల వల్ల ఎక్కువ తాగుతున్నారని, తామంతా కలిసి వీటిని తొలగించినా మరో చోటికి వెళ్లి తాగొస్తున్నారని డ్వాక్రా సంఘ సభ్యురాలు చంద్రావతి సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన బాబు తాగుడు మాన్పిస్తే ప్రజలు పిచ్చివాళ్లవుతారన్నారు. అంతలోనే సర్దుకుని ఒక్కసారిగా కాకుండా క్రమేపీ మాన్పించాలన్నారు. ఈ భేటీలో బాబు విద్యాధికులపైనా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర జనాభా వృద్ధి తగ్గిపోయిందని, ఇదే విధంగా జరిగితే జపాన్ మాదిరిగా రోబోలతో పనులు చేయించుకోవాల్సి వస్తుందన్నారు. చదువుకున్న వాళ్లలో స్వార్థం పెరిగి పిల్లలు వద్దనుకోవడమే ఇందుకు కారణమన్నారు. నా స్ఫూర్తితోనే.. తాను ఉమ్మడి రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రోత్సహించడం వల్లే సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యారని సీఎం చెప్పారు. తన స్ఫూర్తితోనే ఆయన ఈ స్థాయికి ఎదిగారన్నారు. ‘రాజధాని’కి దేశీయ ఆర్కిటెక్ట్‌ల డిజైన్లు సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధానిలో ప్రభుత్వ భవన సముదాయాలకు సంబంధించి దేశీయ ఆర్కిటెక్ట్‌లు రూపొందించిన డిజైన్లను బాబు పరిశీలించారు.ఆర్కిటెక్ట్ సంస్థలతో సీఆర్డీఏ ఉన్నతాధికారులు ఓ హోటల్లో సమావేశమయ్యారు. హఫీజ్ కాంట్రాక్టర్, సిక్ అసోసియేట్స్ తదితర సంస్థలు డిజైన్లను సమర్పించాయి. వాటిలో ఉత్తమమైదాన్ని ఎంపిక చేయాలని బాబు సీఆర్డీఏకు సూచించారు. -
సెలబ్రిటీల్లో ఆ 'పిచ్చి' ముదిరితే ప్రమాదం!
లండన్: అమెరికా, బ్రిటన్ సెలబ్రిటీల్లో కొత్త ట్రెండ్ మొదలైంది. నగ్నంగా సెల్ఫీలు తీసుకోవడం వాటిని ఆన్లైన్లో పోస్ట్ చేయడం ఓ ఫ్యాషన్‌గా మారిపోయింది. అమెరికా రియాలిటీ టీవీ పర్సనాలిటీ కిమ్ కర్దాషియన్‌తో ఈ ట్రెండ్ మొదలైందని చెప్పవచ్చు. ఆ తర్వాత అమెరికా మోడల్, హాలివుడ్ సినీ తార ఎమిలీ రటాజ్కోస్కీ, మరో సినీ తార మార్నీ సింప్సన్, మోడల్, టీవీ పర్సనాలిటీ, కాలమిస్ట్, రైటర్ విక్కీ పట్టిసన్లు వరుసగా నగ్నంగా సెల్ఫీలు తీసుకొని ఆన్లైన్లో పోస్ట్ చేశారు. వీరికన్నా తానేమి తక్కువ తినలేదంటూ అమెరికా సింగర్, సినీ తార మిలీ సైరస్ ముప్పావు నగ్నంగా ఎంటీవీ అవార్డుల కార్యక్రమానికే హాజరై సంచలనం సష్టించారు. నిజానికి ఇది కొత్త ట్రెండ్గానీ, ఫ్యాషన్గానీ కాదని, ఇదోరకమైన ఫోబియా అని, దీన్ని జనిటల్ ఫోబియా అని పిలువచ్చని లండన్‌లోని క్వీన్స్ గైనకాలజి క్లినిక్‌లో పనిచేస్తున్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన గైనకాలజిస్ట్, ఫర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ అహ్మద్ ఇస్మాయిల్ తెలిపారు. ఈ పిచ్చి ముదిరితే ప్రమాదకరమని, ఈ ఫోబియాను ఎంత త్వరగా వదులుకుంటే అంత మంచిదని ఆయన సెలబ్రిటీలను హెచ్చరించారు. తోటివారి సెక్స్ గురించి, వారి ఎఫైర్ల గురించి బహిరంగంగా చర్చించే అవకాశం ఉన్న అమెరికా, బ్రిటన్ సెలబ్రిటీల్లోనే ఈ ఫోబియా ఎక్కువగా కనిపిస్తోందని ఇస్మాయిల్ చెప్పారు. పొత్తి కడుపు కింది భాగం ఆకర్షణీయంగా లేదనే పొరపాటు అభిప్రాయం కారణంగా ఈ ఫోబియా పుట్టుకొస్తుందని ఆయన అన్నారు. ఆ భాగం ఆకర్షణీయంగా లేకపోవడం వల్ల బాయ్ ఫ్రెండ్‌ను మెప్పించలేనని, అభిమానులను ఆకట్టుకోలేక పోతానేమోననే భయంతో వారు నగ్నంగ్ సెల్ఫీలు తీసి ఆన్లైన్ పోస్ట్ చేస్తున్నారని, తద్వారా వచ్చే హిట్స్ చూసి అమ్మయ్య! ఫర్వాలేదనుకొని ఆత్మ సంతప్తి పొందుతున్నారని ఆయన చెప్పారు. ఈ ట్రెండ్‌ను ఇలాగే కొనసాగిస్తూ పోతుంటే ఇందులోనూ పోటీ పెరిగి విపరీత పరిణామాలకు దారితీస్తుందని డాక్టర్ ఇస్మాయిల్ హెచ్చరించారు. ముఖం బాగోలేదనుకొని ముఖానికి ప్లాస్టిక్ సర్జరీలు చేసుకున్నట్లుగా మున్ముందు జనిటల్ సర్జరీలకు ఈ ట్రెండ్ దారితీస్తుందని ఆయన అన్నారు. పాప పుట్టిన తర్వాత కిమ్ కర్దాషియన్ నగ్న సెల్ఫీని పోస్ట్ చేయడం వెనక, తల్లైన తర్వాత కూడా తన శరీరాకృతి బాగా ఉందని అభిమానుల మన్ననలను పొందేందుకే ఆమె అలా చేశారని ఆయన భాష్యం చెప్పారు.