I-T notices
-
క్రెడిట్‌కార్డుతో పొరపాటున కూడా ఈ లావాదేవీలు చేయొద్దు..
ఆదాయపన్ను శాఖ (Income tax) ప్రతిఒక్కరినీ ఓ కంట కనిపెడుతూ ఉంటుంది. అన్ని లావాదేవీలపైనా నిఘా ఉంచుతుంది. ప్రస్తుతం క్రెడిట్‌కార్డుల వినియోగం పెరిగింది. అన్ని రకాల చెల్లింపులకూ క్రెడిట్ కార్డులే (Credit cards) వినియోగిస్తున్నారు. అయితే ఆదాయపు పన్ను నోటీసు రాకుండా నివారించాలనుకుంటే పొరపాటున కూడా చేయని లావాదేవీలు కొన్ని ఉన్నాయి.క్రెడిట్ కార్డులతో చేసే కొన్ని లావాదేవీలు నేరుగా ఆదాయపు పన్ను శాఖ దృష్టికి రావచ్చు. మీకు నోటీసు పంపవచ్చు. ఇవి అలాంటి లావాదేవీలైతే, సీఏలు కూడా మిమ్మల్ని రక్షించలేరు. అందుకే ఈ సమాచారం క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు చాలా ముఖ్యమైనది. ఎటాంటి లావాదేవీలు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయో ఇక్కడ తెలుసుకోండి.ఒక సంవత్సరంలో విదేశీ ప్రయాణాలకు రూ.2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేసినట్లయితే దాని డేటా ఆదాయపు పన్ను శాఖకు వెళుతుంది.క్రెడిట్ కార్డ్‌పై సంవత్సరానికి రూ.2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే, ఆదాయపు పన్ను శాఖ మీపై నిఘా ఉంచుతుంది. రూ. 1 లక్ష కంటే ఎక్కువ నగదు రూపంలో క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులు వంటి పెద్ద లావాదేవీలు శాఖ దృష్టిని ఆకర్షించవచ్చు.ఒక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్స్, షేర్లు లేదా బాండ్లలో రూ.10 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టినట్లయితే, ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపవచ్చు.రూ.30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తిని కొనుగోలు చేసినట్లయితే, దాని సమాచారం ఆటోమేటిక్‌గా ఆదాయపు పన్ను శాఖకు చేరుతుంది.బ్యాంకు ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు జమ చేయడం ఆదాయపు పన్ను శాఖ దృష్టిని ఆకర్షిస్తుంది. రూ.10 లక్షల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే నోటీసు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.నగదు రూపంలో జరిగే వ్యాపార లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ నిఘా ఉంచుతుంది. రూ.50,000 కంటే ఎక్కువ వ్యాపార లావాదేవీల సమాచారం కోసం డిపార్ట్మెంట్ మిమ్మల్ని అడగవచ్చు. -
టీసీఎస్ ఉద్యోగులకు ఐటీ నోటీసులు
ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు అందుకున్నారు. టీడీఎస్ క్లెయిమ్‌లలో వ్యత్యాసాలు ఉన్నాయంటూ ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 143(1) ప్రకారం ఐటీ శాఖ ఈ నోటీసులు జారీ చేసింది.2024 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఉద్యోగులకు కట్ చేసిన టీడీఎస్‌లలో కొంత భాగం ఆదాయపు పన్ను శాఖ రికార్డులలో నమోదు కాలేదని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసుల్లో డిమాండ్ చేసిన మొత్తాలు రూ.50,000 నుంచి రూ.1,45,000 వరకు ఉన్నాయి. టీడీఎస్ వ్యత్యాసాలపై వడ్డీ, ఛార్జీలను సైతం నోటీసుల్లో పేర్కొన్నారు.ట్యాక్స్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యల కారణంగా టీడీఎస్ క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా అప్డేట్ కాకపోయి ఉండవచ్చని టీసీఎస్ ఉద్యోగి ఒకరు తెలిపారు. తాము క్లెయిమ్స్‌ను మ్యాన్యువల్ సమర్పించాల్సి వచ్చిందని, సిస్టమ్‌లో నమోదు కాని టీడీఎస్ మొత్తానికి సంబంధించి ఐటీ శాఖ నోటీసులు పంపిందని ఆ ఉద్యోగి వివరించారు.ఇదీ చదవండి: కలవరపెడుతున్న డెల్ ప్రకటనటీడీఎస్ రికార్డుల్లోని వ్యత్యాసాల కారణంగా చాలా మంది ఉద్యోగులకు ఆదాయపు పన్ను రీఫండ్లు ఆలస్యం అయ్యాయి. ఆదాయపు పన్ను శాఖ నుండి ప్రాథమిక అంచనా ఆందోళన కలిగించింది. సమస్యలను సరిదిద్దే వరకు ట్యాక్స్ రీఫండ్‌లో మరింత జాప్యం జరుగుతుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. డిమాండ్ నోటీసులు ఉన్నప్పటికీ, పన్ను అధికారుల ద్వారా రీప్రాసెసింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదని టీసీఎస్ తమ ఉద్యోగులకు ఇంటర్నల్ ఈ-మెయిల్స్‌లో తెలియజేసింది. -
బీజేపీ రూ.4600 కోట్లు కట్టాలి: కాంగ్రెస్
ఢిల్లీ: ఆదాయ పన్ను శాఖ కాంగ్రెస్ పార్టీకి రూ.1700 కోట్ల బకాయి పన్ను కట్టాలని నోటీసులు జారీ చేసింది. తాజా నోటీసులు వెలువడిన తరువాత పార్టీ సీనియర్ నేత 'అజయ్ మాకెన్' పన్ను చట్టాలను బీజేపీ తీవ్రంగా ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ను ఆర్థికంగా కుంగదీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన.. జైరాం రమేష్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. మేము ఎలాంటి ఉల్లంఘనలకు పాలపడ్డామని అంచనా వేసారో.. అలాంటి అంచనాలతోనే బీజేపీ ఉల్లంఘనలను తాము స్టడీ చేసినట్లు అజయ్ మాకెన్ పేర్కొన్నారు. మా స్టడీలో బీజేపీ సుమారు రూ.4600 కోట్ల కంటే ఎక్కువ కట్టాల్సి ఉందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి నోటీసులు జారీ చేసిన సందర్భంగా ఈ వివాదం చెలరేగింది. తమకు వచ్చిన నోటీసు మీద సుప్రీంకోర్టును ఆశ్రయించామని, తదుపరి విచారణ ఏప్రిల్ 1న వెలువడుతుందని మాకెన్ అన్నారు. రాబోయే తీర్పు తప్పకుండా మాకు ఊరటనిస్తుందని ఆశిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. ఐటీ నోటీసులు వెలువడిన తరువాత కాంగ్రెస్ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ.. ఐటీ నోటీసులు మా స్ఫూర్తిని దెబ్బతీయలేవని స్పష్టం చేశారు. ఇలాంటి దాడులు తమ పార్టీకి భయపెట్టవని అన్నారు. నిజం కోసం మేము ఎప్పుడూ పోరాడుతూ ఉంటామని వెల్లడించారు. -
ఐటీ శాఖ పంపింది నోటీసా.. సమాచారమా?
Income tax department: మీరు ట్యాక్స్ పేయరా..? ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారా? అయితే ఆదాయపు పన్ను శాఖ నుంచి మీకేదైనా సమాచారం వచ్చిందా..? వస్తే అది నోటీసా లేక సమాచారమా? ఐటీ శాఖ ఏం చెప్పింది? పన్ను చెల్లింపుదారులు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR)లో వెల్లడించిన వివరాలు, రిపోర్టింగ్ ఎంటిటీల నుంచి అందిన సమాచారం మధ్య అసమతుల్యతపై ఆదాయపు పన్ను శాఖ కొంతమంది ట్యాక్స్ పేయర్స్‌కు సమాచారం పంపింది. రిపోర్టింగ్ ఎంటిటీలు అంటే ఐటీ శాఖ సమాచారం తీసుకునే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, స్టాక్ మార్కెట్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్లు, ప్రాపర్టీ రిజిస్ట్రార్లతో సహా పలు ఏజెన్సీలు. "ఇది పన్ను చెల్లింపుదారులందరికీ పంపిన నోటీసు కాదు. ఐటీఆర్‌లో వెల్లడించిన వివరాలు, రిపోర్టింగ్ ఎంటిటీ నుంచి అందిన సమాచారం మధ్య స్పష్టమైన అసమతుల్యత ఉన్న సందర్భాల్లో మాత్రమే పంపిన సలహా" అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ‘ఎక్స్’ (ట్విటర్)లో పేర్కొంది. ఇదీ చదవండి: ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్.. 2024-25 ఐటీఆర్ ఫారాలు విడుదల ఐటీ శాఖ కంప్లయన్స్ పోర్టల్‌లో తమ అభిప్రాయాన్ని అందించడానికి, అవసరమైతే ఇప్పటికే దాఖలు చేసిన రిటర్న్‌లను సవరించడం లేదా ఇప్పటివరకు దాఖలు చేయకపోతే రిటర్న్స్ దాఖలు చేయడానికి పన్ను చెల్లింపుదారులకు అవకాశం కల్పించడమే ఈ సమాచారం లక్ష్యమని ఆదాయపు పన్ను శాఖ వివరించింది. ఇది అందినవారు ప్రాధాన్యతగా తీసుకుని ప్రతిస్పందించాలని అభ్యర్థించింది. Some references have come to the notice of the Income Tax Department regarding recent communication sent to taxpayers pertaining to transaction(s) made by them. Taxpayers may pl note that such communication is to facilitate the taxpayers & make them aware of the information… — Income Tax India (@IncomeTaxIndia) December 26, 2023 -
జీతం.. గీతం.. అదనపు ఆదాయం ఉందా? ఐటీ నోటీసులు సిద్ధంగా ఉన్నాయి!
ఈ వారం ట్యాక్స్ కాలంలో పొరుగింటి మీనాక్షమ్మ మొగుడు పుల్లయ్యను చూడక తప్పదు. తగిన జాగ్రత్త తీసుకోక తప్పదు. వగలే కాని నగలెప్పుడైనా కొన్నారా అని నిలదీసి అడిగిన ఆండాళమ్మకు మొగుడు .. పక్కింటి పుల్లయ్య చేసే వ్యవహారం బైటపెడతాడు. వాడికి జీతం కన్నా గీతం ఎక్కువ.. తెలుసుకోవే.. అని. చంద్రయానం గురించి తర్వాత తెలుసుకుందాం. ‘‘చల్లని రాజా ఓ చందమా నీ కథలన్నీ తెలిసాయి’’ ఇది నాటి పాట. ప్రస్తుతం మన కథలన్నీ ఆదాయపు పన్ను వారికి తెలిసిపోతున్నాయి. మూన్‌లైటింగ్ కాదు.. మూన్ చేజింగ్. కరోనా కాలంలో ఇంటివద్దే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఎంతో ఆదాయం సంపాదించారు. ఒక యజమాని దగ్గర పని చేస్తూ సంపాదిస్తూ, అదే సమయంలో మరో యజమాని దగ్గర చేస్తూ ఎడాపెడా రెండు చేతులా సంపాదించారు. ఇలా సంపాదించడంలో తప్పు లేదు ‘‘కష్టే ఫలి’’ అన్నారు. అలాంటి రాబడిని ఆదాయపు పన్ను వారికి చూపెట్టక పోవడమే తప్పు. 2019, 2020, 2021 ఆర్థిక సంవత్సరాల్లో ఇలా సంపాదించి వారు రిటర్నుల్లో ఆదాయాన్ని డిక్లేర్ చేయని వారికి తాఖీదులు వెళ్లాయి. ఈ విషయం ఎలా తెలిసింది? ఆదాయం ఆన్లైన్లో వచ్చింది. బ్యాంకులో జమయ్యింది. డిజిటల్ ద్వారా చెల్లింపులు జరిగాయి. కొంత మంది ఆస్తులు కొన్నారు. కొంత మంది బ్యాంకు ఎఫ్డీలు, షేర్లు.. డిబెంచర్లలో ఇన్వెస్ట్మెంట్లు చేశారు. కొంత మంది విలాసవంతమైన వస్తువులు కొన్నారు. టూర్లు.. బార్లు.. కార్లూ.. కొంత మంది రుణాలను బుద్ధిగా తీర్చేశారు. విదేశాలకు పంపారు కొంతమంది. గూగుల్ పేమెంట్లు, పేటీఎంలు.. ఇలా ఎన్నో. మీకు పేమెంట్లు చేసిన యజమానులు ఎప్పటికప్పుడు వివరాలను డిపార్టుమెంటు వారికి తెలియజేస్తున్నారు. మీకు రాబడి .. వారికి ఖర్చు. ఆ ఖర్చులు క్లెయిమ్ చేయడం వల్ల ఆ కంపెనీలకు ఆదాయం తగ్గి, ఖర్చులు పెరిగి ఆదాయపు పన్ను భారం తగ్గుతుంది. కాబట్టి వాళ్లు అన్ని వివరాలు, ఖర్చులు, జమలు, లాభనష్టాలు, సమర్పిస్తారు. టీడీఎస్ పరిధిలోకి రాకపోయినా వివరాలు మాత్రం ఇచ్చి ఉంటారు. ఇది కాకుండా పుల్లయగారికి ‘‘గీతం’’.. అంటే లంచంగా భావించారు ‘‘సంబరాల రాంబాబు’’లో పాట రచయిత. లంచం తప్పు. చట్టరీత్యా నేరం. దాన్నీ ఆదాయంగా పరిగణిస్తారు. ఇదీ చదవండి: జీఎస్టీ రివార్డ్ స్కీమ్: బిల్లు ఉంటే చాలు.. రూ.కోటి వరకూ నగదు బహుమతులు ఎలా బైటపడాలి? లెక్కలన్నీ సక్రమంగా చూపించి, బుద్ధిగా పన్ను కట్టండి. మీ ఇంట్లో ఇతర కుటుంబ సభ్యుల పేరు మీద ఆ పని చేసి, వ్యవహారాలన్నీ కుటుంబ సభ్యుల అకౌంటులో వేస్తే పన్ను భారం తగ్గుతుందేమో చెక్ చేయాలి. అలాంటప్పుడు పన్ను పరిధిలో లేని వారిని ఎంచుకోవాలి. జాగ్రత్తగా ఆలోచించి అడుగేయండి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్‌కు పంపించగలరు. -
ఇన్కమ్ ట్యాక్స్ అలర్ట్: ‘లక్ష’లో మీరున్నారా? కోరి కొరివితో పెట్టుకోకండి
ఆదాయపు పన్ను శాఖ వారు లక్ష మందికి నోటీసులు పంపారు. సాక్షాత్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌గారే ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఎవరికి పంపించారంటే.. ప్రధానంగా మూడు రకాల వారికి.. 1. రిటర్నులు వేయని వారికి 2. ఆదాయం తక్కువ చూపించి రిటర్ను వేసిన వారికి 3.తప్పుడు సమాచారంతో రిటర్ను వేసిన వారికి పైన పేర్కొన్న వారందరికీ లక్ష నోటీసులు ఇచ్చారు. ఈ లక్షలో మీరున్నారా అనే ప్రశ్నకు జవాబుగా ‘మాయాబజార్’లో శర్మ–శాస్త్రిలాగా తాన–తందానలాగా ‘మేమా..మేమేం చేశాం’ ని కుదుటపడకండి. డిపార్ట్మెంట్ వారికున్న అధికారం ప్రకారం అవసరమైతే ఆరేళ్లు వెనక్కి వెళ్లి అసెస్మెంటుని ‘రీ–ఓపెన్’ చేయొచ్చు. ఇలా ఇప్పటికే 55,000 మంది విషయంలో అసెస్మెంట్ చేశారు. ఇప్పటికి 2023 మార్చి ఆఖరు నాటికి సంబంధించి అత్యధిక సంఖ్యలో రిటర్నులు వేసినప్పటికీ, వేసిన వాటిలో 70 శాతం రిటర్నులలో ట్యాక్సబుల్ ఇన్‌కం లేదు. ఏదో మొక్కుబడిగా వేసిన రిటర్నులు లేదా ‘ఈ సంవత్సరానికి అయిపోయింది’ అని చేతులు దులుపుకున్న బాపతు అన్నమాట. ముందుగా, వాళ్లు సేకరించిన సమాచారాన్ని బట్టి రూ. 50,00,000 ఆదాయం ఉన్న వారికి ... ఇలా ఉన్న వారిలో వేయని వారు, తక్కువ చూపించిన వారు, తప్పుగా చూపించిన వారిని ఎంచుకున్నారు. ఇవి ఏదో యధాలాపంగా, అనాలోచితంగా ఇవ్వలేదని, పస ఉన్న కేసులేనని ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ ఘంటాపథంగా చెప్పారు. ఒక స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్తున్నాం అని చెప్తున్నారు. ఇవి కాకుండా 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాని వేతన జీవులకు నోటీసులు పంపుతున్నారు. ఇవి ఎటువంటివి అంటే.. 1. ఇంటద్దె అలవెన్సు 2. లీవ్ ట్రావెల్ అలవెన్సు 3. ఇంటి రుణంపై వడ్డీ 4. మున్సిపల్ ట్యాక్స్ చెల్లింపులు 5. సెక్షన్ 80 కింద చెల్లింపులు 6. పెట్టుబడులు 7. సేవింగ్స్ 8. పిల్లల స్కూలు ఫీజులు చాలా మంది ‘‘ఏమీ అడగరులే’’ అని దొంగ క్లెయిమ్‌లు చేస్తున్నారు. కొంత మంది దొంగ రశీదులు, బిల్లులు పెడుతున్నారు. కుటుంబ సభ్యుల మీద ఇల్లు ఉంటే అద్దె చెల్లించకుండా అద్దె చెల్లించినట్లు క్లెయిమ్ చేస్తున్నారు. దయచేసి తప్పుగా/లేనిదాన్ని క్లెయిమ్ చేయకండి. అన్ని చెల్లింపులు బ్యాంకు ద్వారా చేయండి. ప్రతి దానికి కాగితం, డాక్యుమెంటు, రుజువులు, బిల్లులు, వోచర్లు, బ్యాంకు స్టేట్మెంట్లు, బ్యాంకు సర్టిఫికెట్లు, ధృవీకరణ పత్రాలు.. ఇవన్నీ మూడో వ్యక్తి నుంచి.. అంటే ఎక్స్టర్నల్ నుండి పొందండి. దీన్నే ‘‘ఎవిడెన్స్’’ అంటారు. జాగ్రత్తపడండి. కోరి కొరివితో పెట్టుకోకండి. -
అంత డబ్బు డిపాజిట్‌పై రిటర్న్‌లు వేయలేదేం!
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్యాంక్ అకౌంట్లలో భారీ డిపాజిట్లు, ఇందుకు సంబంధించి సకాలంలో ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయడంలో వైఫల్యం వంటి అంశాలపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి సారించింది. రూ.25 లక్షలు పైబడి డిపాజిట్ చేసిన ఈ తరహా 1.16 లక్షల వ్యక్తులు, సంస్థలకు నోటీసులు జారీ చేసింది. సీబీడీటీ (ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్) చైర్మన్ సుశీల్ చంద్ర ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ► పెద్ద నోట్ల తర్వాత భారీ ఎత్తున నగదు డిపాజిట్ చేసి, ఐటీ రిటర్స్లు దాఖలు చేసిన వారి అకౌంట్లను కూడా క్షుణ్ణంగా పరిశీలించి, తగిన సమాధానాలు రాబడుతున్నాం. ► తమ బ్యాంక్ ఖాతాల్లో రూ.2.5 లక్షల పైన రద్దయిన రూ.500, రూ. 1000 డిపాజిట్లు చేసిన దాదాపు 18 లక్షల వ్యక్తులు, కంపెనీలకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ► వీరిలో కూడా ఐటీ రిటర్స్లు దాఖలు చేయని వ్యక్తులు, కంపెనీలను రెండుగా విభజించింది. ఇందులో ఒక విభాగం రూ.25లక్షలకు పైగా డిపాజిట్ చేసిన వర్గం. మరో వర్గం రూ.10 నుంచి 25 లక్షల వరకూ డిపాజిట్ చేసిన వర్గం. ► రూ.25 లక్షల పైబడి డిపాజిట్‌చేసి, రిటర్న్‌లు దాఖలు చేయని వారు 1.16 లక్షలు. వీరందరినీ 30 రోజుల్లోపు రిటర్నులు వేయాలని ఆదేశించాం. -
కొత్త సర్పంచ్‌లకు ఐటీ నోటీసులు!
సాక్షి, హైదరాబాద్: ఐటీశాఖ కొత్త సర్పంచ్‌లపై దృష్టి పెట్టింది. నెల రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో నిధులకు సంబంధించిన లావాదేవీలపై కూపీలాగే ప్రయత్నంలో ఉంది. ఇందులో భాగంగా దాదాపు 250 మందికిపైగా సర్పంచ్‌లకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. వివిధ వ్యాపారాలతో సంబంధ మున్న సర్పంచ్‌లే ప్రధానంగా ఈ జాబితాలో ఉన్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖ నుంచి ఐటీ అధికారులు వివరాలు కోరినట్లు సమాచారం. మరోవైపు ఐటీ శాఖ సర్పంచ్ల బ్యాంక్ లావాదేవీలపై కూడా దృష్టి పెట్టింది. ఏయే మార్గాల్లో ఆదాయం సమకూరిందనే విషయాలను ఆరా తీస్తున్నారు. ఆదాయం పన్ను విభాగం జాబితాలో ఉన్న 180 మంది సర్పంచ్‌లు తమ ఎన్నిక కోసం కోట్ల రూపాయలు వెచ్చించినట్టు తెలుస్తోంది. ఈ సొమ్ముకు ఆదాయపుపన్ను చెల్లించారా? తదితర వివరాలు ఐటీ అధికారులు రాబడుతున్నారు.