ఐటీ శాఖ పంపింది నోటీసా.. సమాచారమా? | Income tax department sends advisory to taxpayers on mismatches in ITR | Sakshi
Sakshi News home page

ఐటీ శాఖ పంపింది నోటీసా.. సమాచారమా?

Published Wed, Dec 27 2023 7:25 PM | Last Updated on Wed, Dec 27 2023 7:50 PM

Income tax department sends advisory to taxpayers on mismatches in ITR - Sakshi

Income tax department: మీరు ట్యాక్స్‌ పేయరా..? ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేశారా? అయితే ఆదాయపు పన్ను శాఖ నుంచి మీకేదైనా సమాచారం వచ్చిందా..? వస్తే అది నోటీసా లేక సమాచారమా? ఐటీ శాఖ ఏం చెప్పింది?

పన్ను చెల్లింపుదారులు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్  (ITR)లో వెల్లడించిన వివరాలు, రిపోర్టింగ్ ఎంటిటీల నుంచి అందిన సమాచారం మధ్య అసమతుల్యతపై ఆదాయపు పన్ను శాఖ కొంతమంది ట్యాక్స్‌ పేయర్స్‌కు సమాచారం పంపింది. రిపోర్టింగ్ ఎంటిటీలు అంటే ఐటీ శాఖ సమాచారం తీసుకునే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, స్టాక్ మార్కెట్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్‌లు, ప్రాపర్టీ రిజిస్ట్రార్‌లతో సహా పలు ఏజెన్సీలు.

"ఇది పన్ను చెల్లింపుదారులందరికీ పంపిన నోటీసు కాదు. ఐటీఆర్‌లో వెల్లడించిన వివరాలు, రిపోర్టింగ్ ఎంటిటీ నుంచి అందిన సమాచారం మధ్య స్పష్టమైన అసమతుల్యత ఉన్న సందర్భాల్లో మాత్రమే పంపిన సలహా" అని ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో పేర్కొంది.

ఇదీ చదవండి: ట్యాక్స్‌ పేయర్స్‌కు అలర్ట్‌.. 2024-25 ఐటీఆర్‌ ఫారాలు విడుదల

ఐటీ శాఖ కంప్లయన్స్ పోర్టల్‌లో తమ అభిప్రాయాన్ని అందించడానికి, అవసరమైతే ఇప్పటికే దాఖలు చేసిన రిటర్న్‌లను సవరించడం లేదా ఇప్పటివరకు దాఖలు చేయకపోతే రిటర్న్స్‌ దాఖలు చేయడానికి పన్ను చెల్లింపుదారులకు అవకాశం కల్పించడమే ఈ సమాచారం లక్ష్యమని ఆదాయపు పన్ను శాఖ వివరించింది. ఇది అందినవారు ప్రాధాన్యతగా తీసుకుని ప్రతిస్పందించాలని అభ్యర్థించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement