ఢిల్లీ: ఆదాయ పన్ను శాఖ కాంగ్రెస్ పార్టీకి రూ.1700 కోట్ల బకాయి పన్ను కట్టాలని నోటీసులు జారీ చేసింది. తాజా నోటీసులు వెలువడిన తరువాత పార్టీ సీనియర్ నేత 'అజయ్ మాకెన్' పన్ను చట్టాలను బీజేపీ తీవ్రంగా ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ను ఆర్థికంగా కుంగదీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన.. జైరాం రమేష్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.
మేము ఎలాంటి ఉల్లంఘనలకు పాలపడ్డామని అంచనా వేసారో.. అలాంటి అంచనాలతోనే బీజేపీ ఉల్లంఘనలను తాము స్టడీ చేసినట్లు అజయ్ మాకెన్ పేర్కొన్నారు. మా స్టడీలో బీజేపీ సుమారు రూ.4600 కోట్ల కంటే ఎక్కువ కట్టాల్సి ఉందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి నోటీసులు జారీ చేసిన సందర్భంగా ఈ వివాదం చెలరేగింది.
తమకు వచ్చిన నోటీసు మీద సుప్రీంకోర్టును ఆశ్రయించామని, తదుపరి విచారణ ఏప్రిల్ 1న వెలువడుతుందని మాకెన్ అన్నారు. రాబోయే తీర్పు తప్పకుండా మాకు ఊరటనిస్తుందని ఆశిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు.
ఐటీ నోటీసులు వెలువడిన తరువాత కాంగ్రెస్ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ.. ఐటీ నోటీసులు మా స్ఫూర్తిని దెబ్బతీయలేవని స్పష్టం చేశారు. ఇలాంటి దాడులు తమ పార్టీకి భయపెట్టవని అన్నారు. నిజం కోసం మేము ఎప్పుడూ పోరాడుతూ ఉంటామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment