సాక్షి, ఢిల్లీ: కుల గణన పక్కాగా చేశామని.. త్వరలో దీనిపై చట్టం కూడా తీసుకొస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పార్లమెంటులో మీడియాతో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. మా సర్వేలో బీసీలు 5 శాతం పెరిగారు. సూర్యాపేట, గజ్వేల్‌లో సభలు నిర్వహిస్తాం. మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరుగుతున్నాయి. నేను ఎవరి పేరు సిఫారసు చేయను. అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే వారు మంత్రులవుతారు’’ అని సీఎం రేవంత్ అన్నారు.
‘‘ఏదో ఒక హోటల్లో నలుగురు కూర్చుంటే దాన్ని అసంతృప్తి అని ఎలా అంటారు?. రాహుల్ గాంధీతో నాకు ఎలాంటి గ్యాప్ లేదు ఇదంతా బీఆర్ఎస్ ప్రచారం. అన్ని విషయాలు ఎప్పటికప్పుడు మేము ఫోన్‌లో చర్చించుకుంటున్నాం. మేము నిర్వహించిన కుల గణనపై పార్లమెంటులోని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ప్రచారంపై ఫోకస్ లేదు. ప్రస్తుతం మేము ఇచ్చిన హామీల అమలుపైనే దృష్టి పెట్టాం’’ అని రేవంత్ చెప్పారు.
ఇదీ చదవండి: గీత దాటితే వేటే..!
‘‘ఈ-ఫార్ములా రేసు స్కామ్‌లో ఆ కంపెనీకి నోటీసులు ఇచ్చాం. ఆ కంపెనీ స్పందించేందుకు సమయం అడిగింది. సమాధానం వచ్చిన తర్వాత తదుపరి కార్యచరణ ఉంటుంది. తొందరపడి ఎవరిని అరెస్ట్ చేయం. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో జరిగిన అక్రమాలపై జస్టిస్ లోకూర్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రస్తుతం అడ్వకేట్ జనరల్ పరిశీలనలో ఉంది. ఏజీ ఒపీనియన్ తర్వాత దానిపై ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకుంటాం’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment