మూన్‌లైటింగ్ అంశంపై ప్రముఖ టెక్ దిగ్గజం ఐబీఎం ఉద్యోగులకు తీవ్ర హెచ‍్చరికలు జారీ చేసింది. రెండేసి ఉద్యోగాలు చేస్తే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది.
మూన్‌లైటింగ్ అంశంపై ఐబీఎం ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పాటిల్ ఉద్యోగులకు ఇంటర్నల్‌గా ఓ మెయిల్ పంపారు. ఆ మెయిల్‌లో..సంస్థ విధానాల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించ కూడదు. సరళంగా చెప్పాలంటే మూన్‌లైటింగ్ అంటే రెండో ఉద్యోగంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
చదవండి👉 ఐటీలో అలజడి : మరో ఊహించని షాక్..తలలు పట్టుకుంటున్న ఫ్రెషర్లు!
తమ ఉద్యోగులు కాంపిటీటర్ లేదా ఉపాధి లేదా వ్యాపారాల్లో పాల్గొన్నకూడదు. 7.1,7.2 సంస్థ మార్గదర్శకాలు అవే చెబుతున్నాయి. సంస‍్థ పనివేళల తర్వాత ఉద్యోగులకు వ్యక్తిగత జీవితం అయినప్పటికీ.. ఐబీఎంకు అవాంతరం కలిగించేలా కార్యక్రమాల్లో పాలు పంచుకోకూడదు.
‘ఐబీఎంలో మా వైఖరి స్పష్టంగా ఉంటుంది. మేం ప్రతి ఉద్యోగి ప్రొడక్టివితో పనిచేసేలా ప్రోత్సహిస్తాం. కళలు, నృత్యం, సంగీతం వంటి కల్చరల్ యాక్టివిటీస్‌లో వారిని ప్రోత్సహిస్తాం. కానీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా, ఐబీఎం ప్రయోజనాల్ని పణంగా పెట్టి మూన్‌లైటింగ్‌కు పాల్పడితే సంస్థ నిబంధనల్ని ఉల్లంఘించినట్లే' అని మెయిల్‌లో పేర్కొన్నారు.
ఐబీఎంలో పనిచేస్తున్న ఉద్యోగి ఖాళీ సమయాల్లో వ్యాపారం చేసేందుకునేందుకు అనమతిస్తే..ఆఫీస్‌లో వర్క్ ప్రొడక్టివిటీ దెబ్బ తిని విధులకు ఆటంకం కలుగుతుంది. ప్రాజెక్టులు ఇచ్చే క్లయింట్లు వారి డేటా, ఇతర ముఖ్య సమాచారం భద్రతగా ఉంచడం సంస్థ విధి. అందుకే మూన్ లైటింగ్ వంటి అంశాల్లో ఐబీఎం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని ఐబీఎం ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పాటిల్ తన నోట్‌లో పునరుద్ఘాటించారు.
చదవండి👉 టెక్ కంపెనీల్లో.. మూన్‌లైటింగ్ పరాకాష్ఠకు ఈ సంఘటనే ఉదాహరణ..
Comments
Please login to add a commentAdd a comment