మూన్ లైటింగ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఒకే సమయంలో ఒకటికి మూడు ఉద్యోగాలు చేసి కోట్లు సంపాదించిన ఉద్యోగి భాగోతం వెలుగులోకి వచ్చింది. 2021 నుంచి మూన్‌లైటింగ్‌కు పాల్పడ్డ ఉద్యోగి ఏడాదికి రూ.2.5 కోట్లు సంపాదించాడు. పైగా మూడో ఉద్యోగం సైతం చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇంతకీ ఆ ఉద్యోగి ఎవరు? మూడు ఉద్యోగాలు ఎలా చేశాడు?
మూన్‌లైటింగ్! టెక్నాలజీ రంగానికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. కోవిడ్-19 విజృంభిస్తున్న సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలు ఉద్యోగులకు ఇంటి వద్ద నుంచి పనిచేసుకునే అవకాశాన్ని కల్పించాయి. దీన్ని ఆసరగా చేసుకున్న ఉద్యోగులు పగలు ఒక సంస్థలో రాత్రి మరో సంస్థలో పనిచేస్తూ రెండు చేతులా సంపాదించారు.
దీంతో ప్రొడక్టివిటీ తగ్గడం, ఉద్యోగుల పీఎఫ్ అకౌంట్లు లావాదేవీలు భారీ స్థాయిలో జరగడంతో కంపెనీలు ఉద్యోగులపై చర్యలకు ఉపక్రమించాయి. భారీ ఎత్తున లేఆఫ్స్ ప్రకటించాయి. నాటి నుంచి నియమాకాల విషయంలో హెచ్ ఆర్ విభాగం నిపుణులు కట్టుదిట్టం చేశారు.
ఈ నేపథ్యంలో అమెరికాలో కాలిఫోర్నియాకు చెందిన ఐటీ ఉద్యోగి నికోలస్ ఫ్లెమ్మింగ్ తాను మూన్‌లైటింగ్‌కు పాల్పడ్డట్లు బిజినెస్ ఇన్‌సైడర్‌తో తన అనుభవాల్ని పంచుకున్నాడు. 2021 నుండి వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న నికోలస్.. ఏకకాలంలో రెండు ఉద్యోగాలు చేసేవాడు. అది సరిపోదన్నట్లు మూడు ఉద్యోగంలో చేరాడు. కానీ మూడింటిని చేయడం కష్టమని భావించి అందులో ఒక జాబ్‌ను వదిలేశాడు. వారానికి 40 గంటలు పనిచేసిన నికోలస్ ఒక కంపెనీలో ఆఫీస్ వర్క్ చేస్తుంటే.. మరో వర్క్‌లో కేవలం జూమ్ మీటింగ్స్‌లో ఎక్కువగా పాల్గొనడం వల్ల రెండు ఉద్యోగాల్ని మేనేజ్ చేయడం పెద్దగా కష్టంగా అనిపించలేదు.
అయితే తాను మూన్ లైటింగ్ చేసేందుకు చేసేందుకు తన మాజీ బాస్ ప్రోత్సహించడాని, అతని ద్వారానే మరో సంస్థలో ఉద్యోగం సంపాదించుకున్న విషయాన్ని గుర్తు చేశాడు. అదే సమయంతో తాను మూన్‌లైటింగ్‌కు పాల్పడ్డుతునట్లు తన రెండో బాస్ గుర్తించాడు.
కానీ నేను సంస్థకు కావాల్సినట్లుగా పనిచేసినంత కాలం ఆ విషయం (మూన్‌లైటింగ్) గురించి పెద్దగా మాట్లాడడు. డెడ్‌లైన్‌లోపే పని పూర్తి చేస్తున్నా. నా వల్ల సంస్థకు లాభం.. నాకూ లాభం. అందులో తప్పేం లేదు కదా. పైగా మూన్ లైటింగ్ వల్ల వృత్తి నైపుణ్యాలలో కొత్త కొత్త మెళుకువలు నేర్చుకోవచ్చు. దాన్ని నేను తప్పపట్టను.
ఇక్కడ గమించాల్సిన మరో విషయం ఏంటంటే? రెండు మూడేసి ఉద్యోగాలు చేస్తున్నా మనజీవితాల్లో ఎలాంటి మార్పు ఉండదు. పని చేస్తాం. ఖర్చు చేస్తాం. డబ్బులు పెరిగే కొద్ది ఖర్చులు సైతం అదే స్థాయిలో పెడుతుంటాం. అలాంటప‍్పుడు దాని వల్ల లాభం ఉంటుందని నేను అనుకోవడం లేదు’ అని నికోలస్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment