న్యూఢిల్లీ: మూన్‌లైటింగ్ (ఒకే సారి రెండు చోట్ల ఉద్యోగాలు చేయడం) అనేది ఉద్యోగ కాంట్రాక్టును ఉల్లంఘించడమేనని, ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని ఐటీ సంస్థ హ్యాపీయెస్ట్ మైండ్స్ స్పష్టం చేసింది. మూన్‌లైటింగ్ చేస్తున్నారని తేలిన ‘కొందరు’ ఉద్యోగులను గత 6–12 నెలల్లో ఉద్యోగాల నుంచి తొలగించినట్లు పేర్కొంది. అయితే, ఎంత మందిపై చర్యలు తీసుకుందో వెల్లడించలేదు.
కంపెనీలో దాదాపు 4,581 మంది ఉద్యోగులున్నారు. ఈ విషయంలో మిగతా వారికి మరింత స్పష్టం ఇచ్చేందుకే.. మూన్‌లైటింగ్ చేస్తూ దొరికిన వారిని వెంటనే తొలగించినట్లు కంపెనీ ఎగ్జి క్యూటివ్ వైస్ చైర్మన్ జోసెఫ్ స్పష్టం చేశారు. కాగా గత మూన్‌లైటింగ్ వివాదం ఐటీ రంగాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. మొదటగా మూన్‌లైటింగ్‌కి పాల్పడుతున్నారని విప్రో 300 మందిని ఉద్యోగులను తొలగించడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది.
ఇక అప్పటి నుంచి దీనిపై భిన్నస్వరాలు వినపడుతోంది. కొన్ని కంపెనీలు దీనికి మద్దతు తెలుపుతుండగా , మరొకొన్ని సంస్థలు మాత్రం అంగీకరించే సమస్య తేదని తేల్చేస్తున్నాయి. చివరికి మూన్‌లైటింగ్ (ఒకటికి మించి కంపెనీలకు సేవలు అందించడం) చట్టబద్ధత, నైతికతపై ఇప్పుడు ఏకంగా పెద్ద చర్చే నడుస్తోంది. ప్రముఖ దిగ్జజ కంపెనీ విప్రో చైర్మన్ రిశద్ ప్రేమ్‌జీ మాట్లాడుతూ.. మూన్‌లైటింగ్ మోసం అంటూ దీనిపై ఘాటుగానే స్పందించారు.
‘చేరిన సమయంలో కంపెనీ కోసం మాత్రమే పని చేస్తామని ఒప్పందంపై సంతకం పెడతారు. అయినప్పటికీ అభ్యర్థులు తమ మిగిలిన సమయంలో ఏమి చేయాలో ఎంచుకోవచ్చు. అలా చేయడం నైతికంగా సరైనది కాదు’ అని ఐబీఎం ఇండియా ఎండీ సందీప్ పటేల్ అన్నారు. ప్రస్తుతం చాలా కంపెనీలు మూన్‌లైటింగ్‌కు పాల్పడిన ఉద్యోగులను ఏరివేసే పనిలో ఉన్నాయి. అయితే ఇవేవీ బయటకు పొక్కడం లేదు.
చదవండి: ‘ఐటీపై మూన్‌లైట్’
Comments
Please login to add a commentAdd a comment