వచ్చే ఏడాది ప్రారంభం నుంచి లక్షల ఉద్యోగాలకు నియామకాలు చేపట్టేందుకు ఆయా దిగ్గజ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. దీంతో ఈ నియామకాల్లో జాబ్ కొట్టేందుకు అభ్యర్ధులు ప్రయత్నిస్తున్నారు. ఇలా ఒక్క జాబ్‌కే 5 మంది పోటీ పడుతున్నట్లు టెక్ గిగ్ సంస్థ నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో తేలింది.
వచ్చే ఏడాది దిగ్గజ ఐటీ కంపెనీల్లో కొలువుల జాతర ప్రారంభం కానుంది. అందుకోసం ఆయా కంపెనీలు ఇప్పటి నుంచి ఉద్యోగుల ఎంపికపై కసరత్తు చేస్తున్నట్లు మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ అన్‌ఎర్త్ ఇన్‌సైట్ తెలిపింది. అంతేకాదు కోవిడ్ తగ్గి వచ్చే ఏడాది మార్చి నాటికి ఐటీ కంపెనీలు సుమారు 4.5 లక్షల నియామకాలు చేపట్టే అవకాశం ఉందని విడుదల చేసిన ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. అయినా సరే ఒక్క జాబ్ కోసం ఐదుగురు పోటీపడడం ఆసక్తికరంగా మారింది.
టెక్ గిగ్ సంస్థ అభ్యర్ధులు ఏఏ కంపెనీల్లో జాబ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు? ఒక‍్క జాబ్ కోసం ఎంతమంది పోటీ పడుతున్నారనే అంశంపై సర్వే నిర్వహించింది.ఈ సర్వేలో పాల్గొన్న 43శాతం మంది టీసీఎస్‌లో జాబ్ సంపాదించాలనే లక్ష్యంతో ఉండగా, ఇన్ఫోసిస్ 24%, విప్రో, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా 4% కంటే ఎక్కువ మంది అభ్యర్ధులు జాబ్ దక్కించుకునేందుకు పోటీ పుడుతునట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. 21% మంది ఇతర కంపెనీల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నట్లు తేలింది.
ఎక్స్ పర్ట్స్ ఏం చెబుతున్నారు
ప్రస్తుతం మార్కెట్‌లో జాబ్స్ డిమాండ్ ఎక్కువగా ఉందని, అదే సమయంలో అభ్యర్ధులు కూడా ఐటీ ఉద్యోగం దక్కించుకునేందుకు పోటీపడుతున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దేశీయ టెక్ కంపెనీలైన టీసీఎస్,ఇన్ఫోసిస్,విప్రో కంపెనీల్లో ఒక్క జాబ్ కోసం 5మంది పోటీపడుతున్నారని, వారిని షార్ట్ లిస్ట్ చేయడం కత్తిమీద సాములాగా మారిందని అంటున్నారు.
ఐటీ రంగంలో టాలెంట్ వార్
డిమాండ్‌కు అనుగుణంగా ఐటీ రంగంలో టాలెంట్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఐటీ కంపెనీల్లో అట్రిషన్ రేటు స్థిరంగా పెరుగుతుండగా.. సంస్థలు మాత్రం నైపుణ్యమైన అభ్యర్ధుల్ని ఎంపిక చేసేందుకు మొగ్గు చూపుతున్నాయి. దీంతో ఐటీ రంగంలో టాలెంట్ వార్ నడుస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
చదవండి: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..! ఐటీ కంపెనీల్లో కొలువుల జాతర..!
Comments
Please login to add a commentAdd a comment