ఇండియా & కెనడా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇండియన్ ఐటీ పరిశ్రమ మీద ప్రభావం చూపుతాయా అని చాలామంది కంగారుపడుతున్నారు. ఇది ఎంతవరకు నిజం?, నిజంగానే ప్రభావం ఉంటుందా? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
భారత్, కెనడా మధ్య వివాదం ఫలితంగా భారతీయ ఐటీ సంస్థలు ప్రస్తుతానికి ఎటువంటి ప్రభావానికి లోనయ్యే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. తక్షణం ఎలాంటి ఆందోళ చెందాల్సిన అవసరం లేదని వెల్లడిస్తున్నారు.
కెనడా ప్రాంతం నుంచి ఐటీ కంపెనీల ఆదాయం 5 - 6 శాతం వరకు ఉంది. టెక్నాలజీ కౌన్సిల్ ఆఫ్ నార్త్ అమెరికా & కెనడా టెక్ నెట్‌వర్క్ ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు 15,000 కంటే ఎక్కువ మంది కెనడాలో ఉద్యోగాల కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. కరోనా సమయంలో అమెరికాలో వీసా సమస్యల కారణంగా ఎక్కువమంది కెనడాకు పయనమయ్యారు.
ఈ ఏడాది జులైలో ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ కొత్త స్టెప్ డౌన్ సబ్సిడరీని ప్రారంభించింది. దీని ద్వారా 2024 నాటికి కెనడాలో ఉద్యోగుల సంఖ్యను 8,000కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. అంతే కాకుండా ఈ జనవరిలో, TCS తన డిజిటల్ పరివర్తనను వేగవంతం చేయడానికి.. అదే విధంగా ఆవిష్కరణను పెంచడానికి కెనడియన్ జెట్ తయారీదారు బొంబార్డియర్ ద్వారా వ్యూహాత్మక భాగస్వామిగా ఎంపికైంది.
ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ కొత్త కారు.. ధర తెలిస్తే షాకవుతారు!
ఇక విప్రో విషయానికి వస్తే.. జనవరిలో కెనడాలోని టొరంటోలో తన సరికొత్త Wipro-AWS లాంచ్ ప్యాడ్ సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కాగా ఇప్పటికే కెనడాలోని మహీంద్రా అండ్ మహీంద్రా అనుబంధ సంస్థ 'రెస్సన్ ఏరోస్పేస్ కార్పొరేషన్' స్వచ్ఛందంగా తమ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు పేర్కొంటూ కెనడా కార్పొరేషన్స్‌కు దరఖాస్తు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment