మంచి ప్యాకేజీతోపాటు ప్రోత్సాహకాలు
ఉద్యోగులకు ప్రైవేటు బ్యాంకుల ఆఫర్లు
ఫలితంగా తగ్గిన అట్రిషన్ రేటు
న్యూఢిల్లీ: బడా ప్రైవేటు బ్యాంక్‌లు అధిక ఉద్యోగ వలసలకు (అట్రిషన్) కొంత అడ్డుకట్ట వేయగలిగాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో అట్రిషన్ రేటు అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలి్చతే తగ్గినట్టు డేటా తెలియజేస్తోంది. ఉద్యోగులు సంస్థతోనే కొనసాగేందుకు వీలుగా బ్యాంక్‌ల యాజమాన్యాలు పలు చర్యలను ఆచరణలో పెట్టడం ఫలితాలనిస్తోంది.
మేనేజర్లను జవాబుదారీ చేయడం, అధిక ప్రోత్సాహకాలు తదితర చర్యలు ఇందులో భాగంగా ఉన్నాయి. బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో ఇతర సంస్థల మాదిరే బ్యాంక్‌లు సైతం నైపుణ్య మానవ వనరుల పరంగా ఆటుపోట్లను చూస్తున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎండీ, సీఈవో శశిధర్ జగదీశన్ తెలిపారు. 2022–23లో ఉద్యోగుల వలసలు బ్యాంక్‌తోపాటు పరిశ్రమకు సైతం ఆందోళన కలిగించినట్టు చెప్పారు.
30 ఏళ్లలోపు వారే ఎక్కువ..
‘‘2023–24లో వలసలను అడ్డుకునేందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పలు చర్యలు తీసుకుంది. ఉద్యోగులు సంస్థను వీడేందుకు గల కారణాలను గుర్తించి, దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు వీలుగా ఉన్నత స్థాయిలో టాస్‌్కఫోర్స్‌ను సైతం ఏర్పాటు చేశాం’’అని జగదీశన్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో అట్రిషన్ రేటు 7 శాతం మేర తగ్గి, 27 శాతంగా ఉంది. అదే మహిళా ఉద్యోగుల వలసలు 28 శాతంగా ఉండడం గమనార్హం.
ముఖ్యంగా ఇలా సంస్థను వీడి వెళ్లే వారిలో ఎక్కువ మంది 30 ఏళ్లలోపు వారుంటుంటే, ఆ తర్వాత 30–50 ఏళ్ల వయసులోని వారున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగుల అనుభవం మెరుగుపడేందుకు వీలుగా తాము ఇన్వెస్ట్ చేసినట్టు జగదీశన్ వెల్లడించారు. బ్యాంక్‌కు చెందిన లెరి్నంగ్ ప్లాట్‌ఫామ్ ‘ఎంపవర్’ ద్వారా వృత్తిపరమైన నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం కల్పించినట్టు చెప్పారు. ఉద్యోగుల మనోగతం, వారి అభిప్రాయాలను తెలుసుకునే కార్యాచరణను అమలు చేసినట్టు తెలిపారు. 2 లక్షలకు పైగా ఉన్న ఉద్యోగులకు నైపుణ్యాలు పెంచేందుకు పెట్టుబడులు కొనసాగిస్తున్నట్టు వివరించారు. 2023–24లో 6 లక్షల గంటల అభ్యసనను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నమోదు చేసింది.
ఇతర బ్యాంకుల్లోనూ..
ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లోనూ అట్రిషన్ రేటు గత ఆర్థిక సంవత్సరంలో 6 శాతం మేర తగ్గింది. ఐసీఐసీఐ బ్యాంక్‌లో 25 శాతం, యాక్సిస్ బ్యాంక్‌లో 29 శాతం, కోటక్ బ్యాంక్‌లో 40 శాతం చొప్పున నమోదైంది. ఇక ఇండస్ ఇండ్ బ్యాంక్‌లో ఉద్యోగ వలసల రేటు 14 శాతం తగ్గి 37 శాతానికి, యస్ బ్యాంక్‌లో 5 శాతం తగ్గి 38 శాతానికి పరిమితమైంది. పెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో కోటక్ మహీంద్రా బ్యాంక్‌లోనే ఉద్యోగుల వలసలు అధికంగా ఉన్నాయి.
దీంతో ఈ సంస్థ ఉద్యోగులను కాపాడుకునేందుకు గత ఆర్థిక సంవత్సరంలో ఎన్నో చర్యలు చేపట్టింది. శాఖల వారీగా, రిలేషన్‌షిప్ మేనేజర్లు, అసిస్టెంట్ ఏరియా మేనేజర్లకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేసింది. కొన్ని విభాగాల్లో వేతనాలు, ప్రయోజనాల పరంగా ఆగు నెలల కాలానికి స్థిరమైన ప్రోత్సాహకాలను ప్రకటించింది. బ్రాంచ్ మేనేజర్లు, ఏరియా మేనేజర్లకు ప్రోత్సాహకాలు పెంచింది. పోటాపోటీగా వేతన, ప్రోత్సాహక ప్యాకేజీలతో ఉద్యోగులను కాపాడుకునేందుకు, ఆకర్షించేందుకు ప్రముఖ బ్యాంక్‌లు చర్యలు అమలు చేస్తున్నట్టు హంట్ పార్ట్‌నర్స్‌కు చెందిన వికమ్ర్ గుప్తా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment