Barriers
-
బాబ్బాబు ఇక్కడే ఉండు..!
న్యూఢిల్లీ: బడా ప్రైవేటు బ్యాంక్‌లు అధిక ఉద్యోగ వలసలకు (అట్రిషన్) కొంత అడ్డుకట్ట వేయగలిగాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో అట్రిషన్ రేటు అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలి్చతే తగ్గినట్టు డేటా తెలియజేస్తోంది. ఉద్యోగులు సంస్థతోనే కొనసాగేందుకు వీలుగా బ్యాంక్‌ల యాజమాన్యాలు పలు చర్యలను ఆచరణలో పెట్టడం ఫలితాలనిస్తోంది. మేనేజర్లను జవాబుదారీ చేయడం, అధిక ప్రోత్సాహకాలు తదితర చర్యలు ఇందులో భాగంగా ఉన్నాయి. బీఎఫ్ఎస్ఐ రంగంలో ఇతర సంస్థల మాదిరే బ్యాంక్‌లు సైతం నైపుణ్య మానవ వనరుల పరంగా ఆటుపోట్లను చూస్తున్నట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ, సీఈవో శశిధర్ జగదీశన్ తెలిపారు. 2022–23లో ఉద్యోగుల వలసలు బ్యాంక్‌తోపాటు పరిశ్రమకు సైతం ఆందోళన కలిగించినట్టు చెప్పారు. 30 ఏళ్లలోపు వారే ఎక్కువ.. ‘‘2023–24లో వలసలను అడ్డుకునేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పలు చర్యలు తీసుకుంది. ఉద్యోగులు సంస్థను వీడేందుకు గల కారణాలను గుర్తించి, దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు వీలుగా ఉన్నత స్థాయిలో టాస్‌్కఫోర్స్‌ను సైతం ఏర్పాటు చేశాం’’అని జగదీశన్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో అట్రిషన్ రేటు 7 శాతం మేర తగ్గి, 27 శాతంగా ఉంది. అదే మహిళా ఉద్యోగుల వలసలు 28 శాతంగా ఉండడం గమనార్హం. ముఖ్యంగా ఇలా సంస్థను వీడి వెళ్లే వారిలో ఎక్కువ మంది 30 ఏళ్లలోపు వారుంటుంటే, ఆ తర్వాత 30–50 ఏళ్ల వయసులోని వారున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగుల అనుభవం మెరుగుపడేందుకు వీలుగా తాము ఇన్వెస్ట్ చేసినట్టు జగదీశన్ వెల్లడించారు. బ్యాంక్‌కు చెందిన లెరి్నంగ్ ప్లాట్‌ఫామ్ ‘ఎంపవర్’ ద్వారా వృత్తిపరమైన నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం కల్పించినట్టు చెప్పారు. ఉద్యోగుల మనోగతం, వారి అభిప్రాయాలను తెలుసుకునే కార్యాచరణను అమలు చేసినట్టు తెలిపారు. 2 లక్షలకు పైగా ఉన్న ఉద్యోగులకు నైపుణ్యాలు పెంచేందుకు పెట్టుబడులు కొనసాగిస్తున్నట్టు వివరించారు. 2023–24లో 6 లక్షల గంటల అభ్యసనను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నమోదు చేసింది. ఇతర బ్యాంకుల్లోనూ.. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లోనూ అట్రిషన్ రేటు గత ఆర్థిక సంవత్సరంలో 6 శాతం మేర తగ్గింది. ఐసీఐసీఐ బ్యాంక్‌లో 25 శాతం, యాక్సిస్ బ్యాంక్‌లో 29 శాతం, కోటక్ బ్యాంక్‌లో 40 శాతం చొప్పున నమోదైంది. ఇక ఇండస్ ఇండ్ బ్యాంక్‌లో ఉద్యోగ వలసల రేటు 14 శాతం తగ్గి 37 శాతానికి, యస్ బ్యాంక్‌లో 5 శాతం తగ్గి 38 శాతానికి పరిమితమైంది. పెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో కోటక్ మహీంద్రా బ్యాంక్‌లోనే ఉద్యోగుల వలసలు అధికంగా ఉన్నాయి. దీంతో ఈ సంస్థ ఉద్యోగులను కాపాడుకునేందుకు గత ఆర్థిక సంవత్సరంలో ఎన్నో చర్యలు చేపట్టింది. శాఖల వారీగా, రిలేషన్షిప్ మేనేజర్లు, అసిస్టెంట్ ఏరియా మేనేజర్లకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేసింది. కొన్ని విభాగాల్లో వేతనాలు, ప్రయోజనాల పరంగా ఆగు నెలల కాలానికి స్థిరమైన ప్రోత్సాహకాలను ప్రకటించింది. బ్రాంచ్ మేనేజర్లు, ఏరియా మేనేజర్లకు ప్రోత్సాహకాలు పెంచింది. పోటాపోటీగా వేతన, ప్రోత్సాహక ప్యాకేజీలతో ఉద్యోగులను కాపాడుకునేందుకు, ఆకర్షించేందుకు ప్రముఖ బ్యాంక్‌లు చర్యలు అమలు చేస్తున్నట్టు హంట్ పార్ట్నర్స్కు చెందిన వికమ్ర్ గుప్తా తెలిపారు. -
Uttarkashi tunnel collapse: సొరంగం పనులకు మళ్లీ ఆటంకం
ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌లోని సిల్ క్యారా సొరంగంలో 12 రోజులుగా చిక్కుకుపోయిన కార్మికులను రక్షించే పనులకు శుక్రవారం మళ్లీ అవరోధం ఏర్పడింది. గురువారం సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిపోయిన డ్రిల్లింగ్‌ను 25 టన్నుల భారీ ఆగర్ యంత్రంతో శుక్రవారం తిరిగి ప్రారంభించారు. అయితే, కొద్దిసేపటికే మరోసారి సమస్యలు రావడంతో నిలిపివేశారు. వాటిని సరిచేసి మళ్లీ పనులు ప్రారంభించినా గంటలోనే మళ్లీ అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. కూలిన శిథిలాల గుండా సొరంగంలోకి ఒకదానికొకటి వెల్డింగ్‌తో కలిపిన స్టీలు పైపులను పంపించి, వాటిగుండా కార్మికులను వెలుపలికి తీసుకు వచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. రెండు రోజులుగా ఏర్పడుతున్న అంతరాయాలు టన్నెల్ వద్ద ఆత్రుతగా ఎదురుచూస్తున్న కార్మికుల సంబంధీకుల్లో ఆందోళన రేపుతోంది. అయితే, మిగిలి ఉన్న 5.4 మీటర్ల మేర శిథిలాల్లో డ్రిల్లింగ్కు అవరోధాలు ఎదురుకాకపోవచ్చని ప్రత్యేక రాడార్ ద్వారా తెలిసిందని అధికారులు తెలిపారు. ఇలా ఉండగా, టన్నెల్ నుంచి వెలుపలికి వచ్చాక కార్మికులకు వైద్య పరీక్షలు చేసి, ఆ వెంటనే గ్రీన్ కారిడార్ ద్వారా ఆస్పత్రులకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు గఢ్వాల్ రేంజ్ ఐజీ కేఎస్ నంగ్యాల్ చెప్పారు. -
రీజినల్ రింగ్‌రోడ్డులో వెదురుతో బారియర్.. సౌండ్‌పై వారియర్!
సాక్షి, హైదరాబాద్: అత్యాధునిక ఎక్స్‌ప్రెస్ వేగా నిర్మించనున్న హైదరాబాద్ రీజినల్ రింగ్‌రోడ్డులో పర్యావరణ అనుకూల విధానాలను అవలంబించే దిశగా జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) కసరత్తు చేపట్టింది. ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనాల ధ్వనిని నియంత్రించే నాయిస్ బారియర్లుగా.. వాహనాలు అదుపుతప్పితే పక్కకు దొర్లిపోకుండా ఆపే క్రాష్ బారియర్లుగా వెదురును వినియోగించాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. వేగంగా దూసుకెళ్లే వాహనాల ధ్వని నుంచి.. ఎక్స్‌ప్రెస్ వేలలో వాహనాలు వేగంగా దూసుకుపోతుంటాయి. వాటి నుంచి విపరీతంగా ధ్వని వెలువడుతూ ఉంటుంది. దానికితోడు హారన్లు కూడా మోగిస్తుంటారు. నివాస ప్రాంతాలకు దగ్గరగా హైవేలు ఉన్న ప్పుడు ఈ ధ్వనితో జనం ఇబ్బంది పడతారు. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులు బెదిరిపోతుంటాయి. దీనికి పరిష్కారంగా రోడ్డుకు ఇరువైపులా ధ్వనిని అడ్డుకునే నాయిస్ బారియర్లను ఏర్పాటు చేస్తుంటారు. ధ్వనిని నియంత్రించే గుణమున్న పదార్థాలతో తయారైన మందంగా ఉన్న షీట్లను 3 మీటర్ల ఎత్తుతో ఏర్పాటు చేస్తుంటారు. ఇది ఖర్చుతో కూడుకున్నది. పర్యావరణానికీ మంచిదికాదు. దీనికి పరిష్కారంగా రోడ్లకు ఇరువైపులా కొన్ని రకాల గుబురు చెట్లను నాటి ధ్వనిని నియంత్రించే విధానం ప్రపంచవ్యాప్తంగా వినియోగంలోకి వచ్చింది. ఇలా ధ్వనిని నిరోధించే ప్రక్రియలో వెదురు బాగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ క్రమంలోనే రీజనల్ రింగురోడ్డుపై నిర్ధారిత ప్రాంతాల్లో రెండు వైపులా ఫర్గేసియా రూఫా, ఫర్గేసియా స్కోబ్రిడా, ఫర్గేసియా రొబస్టా జాతుల వెదురును పెంచాలని భావిస్తున్నారు. ఐదు మీటర్ల ఎత్తు, కనీసం ఐదారు మీటర్ల వెడల్పుతో ఈ చెట్లను పెంచితే.. మూడు మీటర్ల ఎత్తుతో ఏర్పాటు చేసే పటిష్ట క్రాష్ బారియర్‌తో సమానమని నిపుణులు చెప్తున్నారు. కొన్ని హైవేల పక్కన వీటిని ప్రయోగాత్మకంగా నాటేందుకు ఎన్హెచ్ఏఐ ఇటీవల ఏర్పాట్లు ప్రారంభించింది. అయితే ఈ వెదురుకు వేగంగా, మరీ ఎత్తుగా పెరిగే లక్షణంతో ఉన్నందున.. ఆయా ప్రాంతాల్లోని విద్యుత్ వైర్లకు ఆటంకంగా మారొచ్చన్న సందేహాలు ఉన్నాయి. దీనిపై అధికారులు త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. క్రాష్ బారియర్లుగా కూడా.. రోడ్డుపై అదుపు తప్పే వాహనాలు దిగువకు దూసుకుపోకుండా, మరో లేన్‌లోకి వెళ్లకుండా క్రాష్ బారియర్లు అడ్డుకుంటాయి. సాధారణంగా రోడ్లకు రెండు వైపులా స్టీల్ క్రాష్ బారియర్లను ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు వాటి స్థానంలో వెదురుతో చేసిన బారియర్ల ఏర్పాటుపై ప్రయోగాలు మొదలయ్యాయి. రీజనల్ రింగురోడ్డులో కూడా వీటిని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న కోణంలో పరిశీలన జరుగుతోంది. మహారాష్ట్రలోని చంద్రాపూర్–యావత్మాల్ జిల్లాలను జోడించే వణి–వరోరా హైవేలో ప్రపంచంలోనే తొలిసారిగా వెదురు క్రాష్ బారియర్లను 200 మీటర్ల మేర ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. బాంబూసా బాల్కోవా జాతి వెదురు దుంగలను క్రమపద్ధతిలో కోసి వాటిని క్రియేసాట్ నూనెతో శుద్ధి చేసి.. రీసైకిల్డ్ హైడెన్సిటీ పాలీ ఇథలీన్ పూతపూసి ఈ బారియర్లను రూపొందించారు. ఇండోర్‌లోని నేషనల్ ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు పరీక్షల అనంతరం వీటిని స్టీల్ క్రాష్ బారియర్లకు ప్రత్యామ్నాయంగా వినియోగించొచ్చని తేల్చారు. రీజినల్ రింగురోడ్డులో వీటి ఏర్పాటుపై త్వరలో స్పష్టత రానుంది. వేగంగా భూసేకరణ.. రీజినల్ రింగ్‌రోడ్డు ఉత్తరభాగానికి సంబంధించి 158.6 కిలోమీటర్ల మేర భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. పరిహారం జారీ కోసం అవార్డ్ పాస్ చేయటంలో కీలకమైన 3డీ గెజిట్ నోటిఫికేషన్లు కూడా విడుదలవుతున్నాయి. సంగారెడ్డి–తూప్రాన్ మధ్య 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున రెండు ప్యాకేజీలకు మరో నెల రోజుల్లో టెండర్లు జారీ కానున్నాయి. ఆ తర్వాత ఆరు నెలల్లో రోడ్డు నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశముంది. దీంతో రోడ్డు డిజైన్లను ఖరారు చేసే పనిని ఎన్హెచ్ఏఐ సమాంతరంగా ప్రారంభించింది. ఇందులోభాగంగా ప్రయోగాత్మకంగా వెదురును వినియోగించాలని భావిస్తోంది. చదవండి: లకారం ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్ విగ్రహం.. హైకోర్టు స్టే.. కీలక మార్పులు! -
కాలు జారితే అంతే.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..
అడ్డతీగల(అల్లూరి సీతారామరాజు జిల్లా): ప్రత్యామ్నాయం లేకపోవడంతో గత్యంతరం లేక అడ్డతీగల మండలంలోని పింజరికొండ గ్రామస్తులు అంత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఏలేరు వాగులో గల గోడపై నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. 400 మంది జనాభా ఉన్న ఈ గ్రామం వాగుకు అవతలి వైపు ఉంది. 2010 వరకూ వాగులో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకునే వారు. వాగుకు సమీపంలో చిన్నతరహా జలవిద్యుత్ కేంద్రం నిర్మించారు. అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేయడం కోసం నీటిని మళ్లించడానికి వాగుకు అడ్డంగా వియర్(అడ్డుగోడ) నిర్మించారు. ఇప్పుడా గోడమీద నుంచి పింజరికొండ గ్రామస్తులు రాకపోకలు సాగిస్తున్నారు. నిత్యం నీటి ప్రవాహం ఉండడంతో గోడ నాచుపట్టి ఉంటుంది. ప్రవాహ ఉధృతి అధికంగా ఉన్నప్పుడు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గోడపై నుంచి రాకపోకలు సాగించవలసి వస్తోంది. ఈ క్రమంలో ప్రమాదాలు చోటుచేసుకోవడం పరిపాటిగా మారింది. పలువురు మృత్యువాత పడ్డారు. వాగు దాటితే గాని బాహ్యప్రపంచానికి రాలేని పరిస్థితి వారిది. వాగు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో గల పాపంపేట చేరుకుంటేగాని వారికి వాహన సదుపాయం అందుబాటులోకి రాదు. ఏలేరు వాగుపై రోప్ బ్రిడ్జి అయినా నిర్మించాలని పింజిరికొండ వాసులు సంవత్సరాల తరబడి కోరుతూనే ఉన్నారు. (క్లిక్ చేయండి: పాపికొండలు.. షికారుకు సిద్ధం) -
ఆర్ఆర్ఆర్పై వాహనాల వేగం 120 కి.మీ. మలుపే లేకుండా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డుపై వాహనాలు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో జాతీయ రహదారులను 100 కిలోమీటర్ల గరిష్ట వేగానికి వీలుగా నిర్మిస్తున్నా ఆర్ఆర్ఆర్ను మాత్రం ఇంకో 20 కి.మీ. ఎక్కువ వేగంతో వెళ్లేలా నిర్మించనున్నారు. వాహనాలు ఒక్కసారిగా మలుపు తిరిగే పరిస్థితి లేకుండా 2,500 మీటర్ల దూరం నుంచే మలుపు తిరిగేలా ఏర్పాట్లు చేయనున్నారు. అదుపుతప్పిన వాహనాలు అవతలి లేన్‌లోకి దూసుకెళ్లకుండా సెంట్రల్ మీడియన్‌కు కూడా క్రాష్ బారియర్లు పెట్టనున్నారు. ఇలా సరికొత్త హంగులతో ఆర్ఆర్ఆర్ రూపుదిద్దుకోబోతోంది. మలుపుల ప్రభావం లేకుండా.. సాధారణంగా రోడ్డు మలుపులే ప్రమాదాలకు ప్రధాన కారణమవుతుంటాయి. ఇందుకే చాలా రోడ్లపై వెళ్లాల్సిన వేగం కన్నా తక్కువ వేగానికే పరిమితం చేస్తుంటారు. ప్రస్తుతం జాతీయ రహదారులపై 80 కి.మీ. వేగ పరిమితి బోర్డులు కనిపిస్తుండటం తెలిసిందే. ఆయా ప్రాంతాల్లో స్పీడ్ గన్స్ పెట్టి మరీ వాహనదారులను నియంత్రిస్తున్నారు. కానీ ఆ పరిస్థితి రాకుండా ఆర్ఆర్ఆర్ను డిజైన్ చేస్తున్నారు. జాతీయ రహదారులపై మలుపుల ప్రభావం లేకుండా 700 మీటర్ల ముందు నుంచే రోడ్డు మలుపునకు వీలుగా వాలు ఉండేలా చూడాలని ప్రమాణాలు నిర్ధారించారు. దీని వల్ల ఎక్కడా మలుపు ఉన్న భావన రాదు. ఎక్స్‌ప్రెస్ వేల విషయంలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. ఆర్ఆర్ఆర్కు 2,500 మీటర్ల దూరం నుంచే మలుపు ఉండేలా డిజైన్ చేస్తున్నారు. అంటే మలుపు ఉన్న ప్రాంతానికి 2.5 కి.మీ. ముందు నుంచే రోడ్డు డిజైన్ వాలుగా మారుతుంది. సాధారణంగా మలుపు వద్ద వాహనాలు అదుపు తప్పకుండా రోడ్లపై ఔటర్ లైన్ ఎత్తుగా ఉంటుంది. ఇదీ కొన్ని వాహనాలకు ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఆర్ఆర్ఆర్కు 2.5 కి.మీ. దూరం నుంచే మలుపు డిజైన్ చేస్తున్నందున ఔటర్ లైన్ సమతలంగానే ఉండేలా ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు పాత అలైన్మెంట్ సమయంలో కాళేశ్వరం కాలువలు నిర్మించలేదు. దీంతో కాలువలు, ఇతర జలాశయాలు, చానళ్లను తప్పిస్తూ రూపొందించిన కొత్త అలైన్‌మెంట్‌ను ఇటీవల ఖరారు చేశారు. వీటిని తప్పించాల్సి రావడంతో భారీ మలుపులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ సమస్య రాకుండా, మలుపుల ప్రభావం లేకుండా రెండున్నర కిలోమీటర్ల నుంచి వాహనాలు మలిగేలా రోడ్డు నిర్మిస్తున్నారు. 4 వరుసల క్రాష్ బారియర్లు కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారులకుచివర్లలో ఇనుప క్రాష్ బారియర్లను ఏర్పాటు చేస్తుండటం తెలిసిందే. నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై రెండు చివర్లలో వీటిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు తొలిసారిగా నాలుగు వరుసల్లో వీటిని ఆర్ఆర్ఆర్పై ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డుకు చివర్లలో రెండు వైపులా రెండు వరుసలతో పాటు సెంట్రల్ మీడియన్ వైపు మరో వరుస చొప్పున మూడు అడుగుల ఎత్తులో వీటిని పెట్టనున్నారు. సాధారణంగా సెంట్రల్ మీడియన్‌లో డివైడర్ తరహాలో ఒక అడుగు ఎత్తుతో రాతి వరుస నిర్మించి మధ్యలో మట్టి నింపి మొక్కలుపెడతారు. కానీ చాలా చోట్ల వాహనాలు అదుపు తప్పినప్పుడు అవతలి లేన్‌లోకి దూసుకెళ్లి ఎదురు వచ్చే వాహనాలను ఢీకొంటున్నాయి. దీన్ని నివారించేందుకు ఆర్ఆర్ఆర్లో సెంట్రల్ మీడియన్‌కు ఇనుప క్రాష్ బారియర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. క్రాష్ బారియర్ ఉన్నందున ఎత్తుగా రాతి నిర్మాణం ఉండదు. -
తల్లి ప్రేమకు అద్దం పట్టిన సంఘటన
-
తల్లి ప్రేమకు అద్దం పట్టిన సంఘటన
తిరువనంతపురం: రోడ్డు మీద ఉన్న బారియర్‌ను దాటడానికి ఇబ్బంది పడుతున్న పిల్ల ఏనుగుకు.. తల్లి సాయం చేసి.. క్షేమంగా రోడ్డు దాటేలా చూసింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో తెగ వైరలవుతోంది. కేరళలోని మలప్పురం జిల్లాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను అనీశ్ కటా అనే వ్యక్తి షేర్ చేశాడు. వివరాలు.. గురువారం ఉదయం 7.30గంటల ప్రాంతంలో మరో ముగ్గురితో కలిసి అనీశ్ కటా సైక్లింగ్‌కు వెళ్లారు. ఆ సమయంలో కేరళ-తమిళనాడు సరిహద్దు సమీపంలోని నాడుకని చురం వద్ద మూడు ఏనుగులు రోడ్డు దాటుతున్నాయి. వీటిలో రెండు సులభంగానే రోడ్డు మీద ఉన్న బారియర్‌ను దాటాయి.)కానీ మరో పిల్ల ఏనుగు మాత్రం దాటలేకపోయింది. పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యింది.(ఏనుగు పోస్టుమార్టం రిపోర్టు: షాకింగ్ నిజాలు) దాంతో తల్లి ఏనుగు తన తొండంతో పిల్ల ఏనుగును పైకి తోసి బారియర్‌ను దాటేలా చేసింది. అనీశ్ కటా ఈ సంఘటనను వీడియో తీశారు. ప్రస్తుతం ఇది ఓ ఆంగ్ల ఛానల్లో ప్రసారం అయ్యింది. ఈ సందర్భంగా అనీశ్ కటా మాట్లాడుతూ.. ‘ఈ సంఘటన నా హృదయాన్ని తాకింది. బిడ్డ పట్ల తల్లి చూపించే ప్రేమకు నిదర్శనంగా నిలిచింది’ అన్నారు. -
‘నో ఎంట్రీ’లో ప్రయాణం; 17 మంది దుర్మరణం
దుబాయ్ : తేదీ, జూన్ 7. సాయంత్రం ఐదు గంటలవుతోంది. లగ్జరీ బస్సు ఓ యాభైమంది ప్రయాణికులతో దూసుకెళ్తోంది. దాంట్లో భారత్, పాకిస్తాన్, దుబాయ్, ఇతర దేశాలకు చెందినవారున్నారు. కానీ, మరికొద్దిసేపట్లో వారి ప్రయాణం విషాదాంతమైంది. డ్రైవర్ నిర్లక్ష్యం పదిహేడుమంది ప్రాణాలను బలితీసుకుంది. భారీ వాహనాలు, బస్సులకు ఎంట్రీలేని దారిలో బస్సు తీసుకెళ్లడంతో.. రోడ్డుకు పైభాగంలో ఏర్పాటుచేసిన బారియర్‌ను ఆ వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో ఎడమవైపున కూర్చున్న వారిలో 17 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో 12 మంది భారతీయులు, ఇద్దరు పాకిస్తానీలు, మరో ముగ్గురు ఇతర దేశాలకు చెందినవారున్నారు. ఈ ఘటనపై దుబాయ్ ట్రాఫిక్ కోర్టులో వాదనలు జరిగాయి. ప్రమాదానికి కారణమైన బారియర్‌కు, సూచిక బోర్డుకు మధ్య దూరం కేవలం 12 మీటర్లు మాత్రమే ఉందని డ్రైవర్ తరపు న్యాయవాది మహమ్మద్ అల్ తమీమి వాదించారు. ట్రాఫిక్ నియమాల ప్రకారం గంటకు 60 కిలోమీటర్ల వేగం అనుమతించే రోడ్లపై బారియర్‌లాంటివి ఏర్పాటు చేసినప్పుడు.. బారియర్‌కు సూచిక బోర్డుకు మధ్య కనీసం 60 మీటర్ల దూరం ఉండాలని కోర్టుకు తెలిపారు. సూచిక బోర్డు బారియర్‌కు అతి సమీపంలో ఏర్పాటు చేయడంవల్లే డ్రైవర్ వాహనాన్ని అదుపుచేయలేకపోయాడని, అందువల్లే ప్రమాదం జరిగిందని వాదించారు. గంటకు 94 కి.మీ వేగంతో.. అయితే, ఆ దారిలో స్పీడ్ లిమిట్ 40 మాత్రమేనని, కానీ ప్రమాద సమయంలో బస్సు 94 కి.మీ స్పీడ్‌తో వెళ్తోందని ట్రాఫిక్ అధికారులు కోర్టుకు విన్నవించారు. డ్రైవర్ అజాగ్రత్తవల్లే ప్రమాదం జరిగిందని అన్నారు. డ్రైవర్ తరపున మరోన్యాయవాది మహమ్మద్ అల్ సబ్రి వాదనలు వినిపిస్తూ.. ఆర్టీఏ అధికారుల తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. బారియర్ ఉన్న ప్రదేశంలో సూచిక బోర్డును అశాస్త్రీయంగా ఏర్పాటు చేశారని కోర్టుకు తెలిపారు. దానికి సంబంధించి నిపుణుల రిపోర్టును కోర్టుకు అందించారు. ప్రమాద సమయంలో టైమ్ సాయంత్రం 5 గంటలవడంతో డ్రైవర్‌కు సూచికబోర్డు సరిగా కనిపించలేదని అన్నారు. తుదితీర్పు జూలై 11న వెలువడనుంది. డ్రైవర్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. -
ఇఫ్తార్ అతిథులకు పాక్ వేధింపులు
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ శనివారం ఇచ్చిన ఇఫ్తార్ విందుకు పాక్ రాజకీయ, వాణిజ్య, మీడియా ప్రముఖులు రాకుండా నానా అడ్డంకులు సృష్టించింది. ఈ విందుకు వెళ్లరాదని పలువురు ప్రముఖులకు గుర్తుతెలియని నంబర్ల నుంచి బెదిరింపు ఫోన్‌కాల్స్ వెళ్లాయి. అయినాసరే లెక్కచేయకుండా హాజరైన అతిథుల్ని పోలీసులు, భద్రతాధికారులు తనిఖీల పేరుతో తీవ్రంగా వేధించారు. పలువురు తమ ప్రభుత్వ వ్యవహారశైలిపై తీవ్రంగా మండిపడ్డారు. పాక్‌లోని భారత రాయబారి అజయ్ బిసారియా ఇస్లామాబాద్‌లోని సెరేనా హోటల్లో శనివారం ఇఫ్తార్ విందు ఏర్పాటుచేశారు. ఇందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్, అధ్యక్షుడు ఆరీఫ్ అల్వీ సహా పలువురిని ఆహ్వానించారు. కానీ ఈ విందుకు వీరిద్దరూ గైర్హాజరయ్యారు. ఆ హోటల్ వద్ద భారీగా బలగాలను మోహరించిన ప్రభుత్వం, అతిథుల్ని వేధింపులకు గురిచేసింది. ఫోన్‌చేసి బెదిరింపులు.. ఈ విషయమై ప్రముఖ పాక్ జర్నలిస్ట్ మెహ్రీన్ జెహ్రా మాలిక్ మాట్లాడుతూ..‘మొదటగా నా ఆహ్వానపత్రికను పోలీసులు తనిఖీ చేశారు. నా వృత్తి, నివాసం ఉండే చోటు అడిగారు. చివరికి లోపలకు అనుమతించారు. కానీ నా డ్రైవర్‌తో దురుసుగా ప్రవర్తించారు. సెరేనా హోటల్ వద్ద భారీగా బలగాలను మోహరించారు. వారంతా హోటల్‌కు వచ్చేవారిని వేధిస్తున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న పనే’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరాచీ ఫెడరేషన్ ఆఫ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్, ఫైసలాబాద్ చాంబర్స్ ఆఫ్ కామర్స్, లాహోర్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులకు పాక్ భద్రతాధికారులు గుర్తుతెలియని నంబర్ల నుంచి శుక్రవారం రాత్రి ఫోన్ చేశారు. భారత హైకమిషన్ ఇస్తున్న విందుకు వెళ్లరాదని హెచ్చరించారు. ఈ ఘటనను పాక్ మీడియా కవర్ చేయలేదు. పాక్ నేతకు చుక్కలు.. ఈ విందుకు హాజరైన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) నేత ఫర్హతుల్లాహ్ బాబర్‌కు పాక్ అధికారులు చుక్కలు చూపించారు. ‘‘నేను సెరేనా హోటల్‌కు రాగానే బారికేడ్లు దర్శనమిచ్చాయి. వాటిని దాటుకుని ముందుకెళ్లగా భద్రతాధికారులు ఇఫ్తార్ రద్దయిందని చెప్పారు. గట్టిగా అడిగేసరికి మరో గేటు నుంచి లోపలకు వెళ్లాలన్నారు. అటుగా వెళితే.. ఇటువైపు రావొద్దు. ముందువైపు గేటు నుంచే హోటల్లోకి వెళ్లండని ఇబ్బంది పెట్టారు’ అని బాబర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమాపణలు చెప్పిన బిసారియా.. ఇఫ్తార్ విందు సందర్భంగా వేధింపులకు గురైన ప్రముఖులకు భారత రాయబారి అజయ్ బిసారియా క్షమాపణలు చెప్పారు. ఇఫ్తార్ విందుకు కరాచీ, లాహోర్ వంటి దూరప్రాంతాల నుంచి హాజరైన ప్రతీఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు చాలామంది అతిథులపై పాక్ అధికారులు చేయి చేసుకున్నారనీ, మొబైల్ఫోన్లు లాక్కున్నారని భారత హైకమిషన్ తెలిపింది. ఇది దౌత్య చట్టాలను ఉల్లంఘించడమేననీ, ఈ వ్యవహారంపై పాక్ ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. కాగా, ఢిల్లీలో పాక్ హైకమిషన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు అతిథులు రాకుండా భారత్ ఇలాగే అడ్డుకుందనీ, అందుకే ఇలా ప్రతీకారానికి దిగిందని పాక్ దౌత్యవర్గాలు చెప్పాయి. -
వ్యాపారానికి అడ్డంకులు తొలగించండి
న్యూఢిల్లీ: భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికన్ కంపెనీల వ్యాపార వ్యయాలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్ రాస్ కోరారు. అమెరికన్ కంపెనీలు భారత్‌లో వ్యాపారాలు నిర్వహించుకోవడానికి గల అవరోధాలను తొలగించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. డేటా లోకలైజేషన్ వంటి ఆంక్షల వల్ల డేటా భద్రత బలహీనపడుతుందని, వ్యాపారాల నిర్వహణ వ్యయాలు పెరిగిపోతాయని.. ఇలాంటి వాటిని తొలగించాలని రాస్ చెప్పారు. భారత పర్యటనలో భాగంగా ట్రేడ్ విండ్స్ ఫోరం అండ్ ట్రేడ్ మిషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. భారత్‌తో వాణిజ్య చర్చలు జరపడం, అమెరికా–ఇండియా సీఈవో ఫోరం ద్వారా సమస్యాత్మక అంశాలను పరిష్కరించుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు. అధిక టారిఫ్‌ల భారం.. ‘ప్రస్తుతం భారత మార్కెట్లో అమెరికా వ్యాపార సంస్థలు అనేక అవరోధాలు ఎదుర్కొంటున్నాయి. టారిఫ్‌లు, టారిఫ్యేతర అంశాలూ ఇందుకు కారణంగా ఉంటున్నాయి. వివిధ నియంత్రణ చట్టాలు విదేశీ సంస్థలకు ప్రతికూలంగా ఉంటున్నాయి. భారత్‌లో సగటున టారిఫ్‌ల రేటు ప్రపంచంలో ఇతర దేశాలన్నింటి కన్నా చాలా ఎక్కువగా ఉంటోంది. ఉదాహరణకు ఆటోమొబైల్‌పై అమెరికాలో సుంకాలు 2.5 శాతం మాత్రమే కాగా.. భారత్‌లో 60 శాతం ఉంటున్నాయి. మోటార్‌సైకిళ్లపై 50 శాతం, ఆల్కహాలిక్ బేవరేజెస్‌పై ఏకంగా 150 శాతం ఉంటున్నాయి. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి అవరోధాలను తొలగించాల్సిన అవసరం ఉంది‘ అని రాస్ పేర్కొన్నారు. వైద్య పరికరాల ధరలపై నియంత్రణ, ఎలక్ట్రానిక్స్.. టెలికమ్యూనికేషన్స్ ఉత్పత్తుల రేట్లపై ఆంక్షలు మొదలైనవి అమెరికా కంపెనీలకు పెద్ద అడ్డంకులుగా ఉంటున్నాయన్నారు. భారత్ నుంచి దిగుమతయ్యే రూటర్లు, స్విచ్‌లు, సెల్‌ఫోన్స్ విడిభాగాలు మొదలైన వాటిపై అమెరికాలో సుంకాలు సున్నా స్థాయిలో ఉండగా.. భారత్‌లో మాత్రం అత్యధికంగా 20 శాతంగా ఉన్నాయని రాస్ చెప్పారు. త్వరలో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం ఇలాంటి అంశాల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. -
నల్లధనం అడ్డుకట్టకు ఈ చట్టాలు చాలవు
న్యూఢిల్లీ: ఎన్నికల్లో నల్లధన ప్రవాహాన్ని అరికట్టేందుకు ప్రస్తుతం దేశంలో ఉన్న చట్టాలు సరిపోవని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఓం ప్రకాశ్ రావత్ శనివారం వ్యాఖ్యానించారు. సమాచార తస్కరణ, నకిలీ వార్తల సృష్టి తదితర కార్యకలాపాలకు పాల్పడే కేంబ్రిడ్జ్ అనలిటికా వంటి సంస్థల వల్ల దేశంలో ఎన్నికల ప్రక్రియకు ఎంతో ప్రమాదం పొంచి ఉందని రావత్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘భారత ఎన్నికల ప్రజాస్వామ్య సవాళ్లు’ అనే అంశంపై ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారి ఏర్పాటు చేసిన సదస్సులో రావత్ మాట్లాడుతూ.. ప్రజలు ప్రలోభాలకు లోనుకాకుండా ఎన్నికలు నిర్వహించేందుకు మీడియాను సమర్థంగా ఉపయోగించుకోవడంతోపాటు సోషల్ మీడియాలో నకిలీ వార్తలు, చెల్లింపు వార్తలను అడ్డుకోవడం అత్యంత ముఖ్యమనీ, దీనిపై తాము ఇప్పటికే దృష్టిపెట్టామని చెప్పారు. -
3లోపు కావేరి ముసాయిదా
న్యూఢిల్లీ: కావేరి నదీ యాజమాన్య బోర్డుకు సంబంధించిన ముసాయిదాను మే 3వ తేదీలోపు తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటయ్యే వరకు హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్త వహించాలని కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలకు సూచించింది. ఆరు వారాల్లో బోర్డును ఏర్పాటు చేయాలని ఫిబ్రవరి 16నే సుప్రీంకోర్టు ఆదేశించినా ఇప్పటివరకు కేంద్రం చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా తప్పుబట్టారు. మరోవైపు కేంద్రం తీరుకు నిరసనగా చెన్నైలో ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహించకూడదన్న వాదనకు బలం పెరుగుతోంది. ఈ ఐపీఎల్ సీజన్‌కు సంబంధించి చెన్నైలో తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మంగళవారం జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తే చిదంబరం స్టేడియం బయట ఆందోళన చేసి అడ్డంకులు సృష్టిస్తామని తమిళగ వళ్వురిమై కచ్చి (టీవీకే) అనే సంస్థ తాజాగా హెచ్చరించింది. చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించకపోవడమే మంచిదని తమిళనాడు రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి జయకుమార్ కూడా అన్నారు. ఇక్కడి పరిస్థితి గురించి ఐపీఎల్ నిర్వాహకులకు తెలియజేశామనీ, అయితే మ్యాచ్‌లు నిర్వహిస్తే నిబంధనల ప్రకారం భద్రత సహా అన్ని రకాల సదుపాయాలూ కల్పిస్తామని స్పష్టం చేశారు. -
అటకెక్కిన ఉచిత వైఫై ప్రాజెక్టు
సాక్షి,సిటీబ్యూరో: మహానగరాన్ని వై–ఫై సిటీగా మార్చేందుకు సర్కారు గతంలో సిద్ధంచేసిన ప్రణాళికలు అటకెక్కాయి. బీఎస్ఎన్ఎల్ సంస్థ నగరంలో 45 చోట్ల ఏర్పాటు చేసిన వై–ఫై హాట్స్పాట్ల వద్ద కూడా ఉచిత సేవలు తొలి పదిహేను నిమిషాలకే పరిమితమయ్యాయి. ఆపై ప్రతి మెగాబైట్ డేటా వినియోగానికి 8 పైసల చొప్పున చార్జీ వసూలు చేస్తున్నారు. దీంతో గ్రేటర్ పరిధిలో మూడువేల ఉచిత వై–ఫై హాట్‌స్పాట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం దీనిని పట్టించుకోకపోవడంతో వై–ఫై ప్రాజెక్టు అలంకార ప్రాయంగా మారిందని ఆరోపణలు వినవస్తున్నాయి. నగరంలో హాట్‌స్పాట్స్ ఏర్పాటుకు బీఎస్ఎన్ఎల్కు 4500 కి.మీ మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ అందుబాటులో ఉన్నా..వీటి ఏర్పాటుకు అవసరమైన అనుమతులు, రాయితీలపై వారికి సహకారం అందించేందుకు సర్కారు ముందుకు రాకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. అటకెక్కిన వై–ఫై ప్రాజెక్టు..! హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా మూడువేల ఉచిత వై–ఫై హాట్‌స్పాట్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు బీఎస్ఎన్ఎల్ సహకారంతో నగరంలో జనసమ్మర్థం అధికంగా ఉండే ప్రాంతాల్లో 45 వై–ఫై హాట్‌స్పాట్స్‌ను ఏర్పాటు చేశారు. తొలుత 30 నిమిషాలు ఉచితంగా వై–ఫై సేవలను అందించినా..గిట్టుబాటు కావడం లేదన్న కారణంగా వాటిని ప్రస్తుతానికి 15 నిమిషాలకు కుదించారు. ఆ తరవాత డేటా రీఛార్జి కార్డులను కొనుగోలు చేసి వాడుకునే సౌకర్యాన్ని కల్పించారు. 625 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన గ్రేటర్ పరిధిలో మరో మూడువేల హాట్‌స్పాట్స్ ఏర్పాటుకు సుమారు రూ.12 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేస్తూ, సదరు సంస్థ ప్రభుత్వం నుంచి 50 శాతం రాయితీని ఆశిస్తున్నట్లు సమాచారం. మరోవైపు వీటిని బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ నుంచి ఉచిత అనుమతులు కోరుతోంది. ప్రతి హాట్‌స్పాట్ పరికరానికి ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని కోరుతుండగా, మీటర్ కనెక్షన్ తీసుకోవాల్సిందేనని సీపీడీసీఎల్ మెలిక పెట్టడంతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. ఐటీ జోన్‌లోనూ మూన్నాళ్ల ముచ్చటే.. తొలి అరగంట ఉచిత వై–ఫై సేవలు అందించేందుకు మాదాపూర్,సైబర్టవర్స్ ప్రాంతాల్లో ఎయిర్టెల్ సంస్థ ఏడాది క్రితం ఏర్పాటు చేసిన 17 హాట్‌స్పాట్స్ వద్ద ప్రస్తుతంSఉచిత సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వం నుంచి ఆశించిన మేరకు సహకారం,రాయితీలు అందకపోవడంతో ఉచిత వై–ఫై సేవలను నిలిపివేసినట్లు విశ్వసనీయ సమాచారం. నాగ్‌పూర్ జిల్లా ఆదర్శం.... నగరంలో వై–ఫై ప్రాజెక్టు అటకెక్కినా..మహారాష్ట్రలో బీఎస్ఎన్ఎల్ సంస్థ ఆధ్వర్యంలో నాగ్‌పూర్ జిల్లాలో 770 వై–ఫై హాట్‌స్పాట్స్ ఏర్పాటుకు పనులు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే 300కు పైగా హాట్‌స్పాట్స్ ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ వర్గాలు తెలిపాయి. ఆ జిల్లా వ్యాప్తంగా వై–ఫై సేవలు అందించేందుకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తోందని, హైదరాబాద్‌లో ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం కనిపించడంలేదని ఆ సంస్థ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉచిత సేవల వినియోగంలో ఎంజీబీఎస్ టాప్.. ఉచిత వై–ఫై వినియోగానికి సంబంధించి బీఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేసిన హాట్స్పాట్లలో మహాత్మగాంధీ బస్ స్టేషన్ అగ్రగామిగా నిలిచింది. స్టేషన్ ప్రాంగణంలో ప్రయాణీకులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా అత్యధికంగా ఉచిత వై ఫై సేవలు వినియోగించుకుంటున్నట్లు బీఎస్ఎన్ఎల్ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. మహా నగరం లోని సుమారు 45 రద్దీ ప్రాంతాల్లో హాట్స్పాట్లు ఏర్పాటు చేయగా, ఇందులో 15 హాట్ స్పాట్స్ వద్ద వినియోగం అధికంగా ఉన్నట్లు వారు పేర్కొన్నారు. మొత్తం హాట్ స్పాట్స్‌లో మే నుంచి సెప్టెంబర్ వరకు సుమారు లక్షకు పైగా మంది 6563.13 (జీబీ)నిడివిగల సమాచారాన్ని వినియోగించుకునట్లు తెలుస్తోంది. ఇందులో ఎంజీబీఎస్ వద్ద సుమారు 27,534 మొబైల్ ఫోన్లæ ద్వారా 792.64 జీబీ వినియోగించుకున్నారు. ప్రతి హాట్ స్పాట్స్ లో ఉచిత వై ఫై సేవల ద్వారా ప్రతి రోజు 80 నుంచి 100 జీబీ వరకు డేటా వరకు వినియోగమవుతోంది. ప్రతిరోజు సుమారు మూడు వేల మంది వరకు ఉచిత సేవలను వినియోగిస్తున్నట్లు అధికారుల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. -
‘పల్స్’ దొరకలేదా..?
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ర్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ సర్వేకు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. శుక్రవారం జిల్లాలో సర్వే ప్రారంభమైనా ఆశించిన స్పందన కాన రాలేదు. ముఖ్యంగా కొన్ని గ్రామాల్లో కాళింగ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు వివరాలు ఇచ్చేందుకు అంగీకరించడం లేదని సమాచారం. మరికొన్ని గ్రామాల్లో ట్యాబ్‌లు మొరాయించాయి. దీంతో తొలిరోజు సమస్యలతోనే సరిపోయింది. పల్స్ సర్వేలో కులాల జాబితా గందరగోళంగా ఉండడంతో కాళింగ వర్గం వారు ఈ సర్వేను మొదట నుంచీ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికీ ఆ సామాజిక వర్గ నేతలు స ర్వేను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు కూడా. దీంతో తొలిరోజు వారు వివరాలిచ్చేందుకు అంగీకరించలేదు. కుల వివరాల్లో స్పష్టమైన విధానాన్ని ప్రకటించిన తర్వాతే వివరాలు చెబుతామని వారు తేల్చి చెప్పారు. శుక్రవారం లావేరు మండలంలో ఉన్న బుడుమూరులో ఈ సామాజిక వర్గానికి చెందిన వారు నమోదు నిలిపివేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ట్యాబ్‌లతో కష్టాలు... ఇక సర్వేలో ట్యాబ్‌లు పెడుతున్న ఇబ్బందులు చెప్పనలవిగానివిగా ఉన్నాయి. జిల్లా కేంద్రం లో బాగానే పనిచేసిన ట్యాబ్‌లు గ్రామాల్లో మాత్రం పనిచేయడం లేదు. ఇప్పటి వరకు ట్యాబ్‌లకు రెండు వర్షన్లలో ప్రభుత్వం యాప్‌ను అందించింది. ఈ యాప్‌లో తొలుత 2.1 వెర్షన్ ఉంచగా అది పనిచేయలేదు. దీంతో ఈ నెల5న రాష్ట్ర ఉన్నతాధికారులు 2.2 వెర్షన్‌ను అందజేశారు. ఇది కూడా కొన్నిప్రాంతాల్లో పనిచేయడం లేదు. తొలిరోజున జిల్లాలో అన్ని మండలాల్లో, పురపాలక సంఘాల్లో 1342 మంది ఎన్యూమరేటర్లు వారి సహాయకులతో ట్యాబ్‌లతో క్షేత్ర స్థాయిలో సర్వేలు ప్రారంభించినా కేవలం 600లు మాత్రమే నమోదు జరిగాయి.శనివారం నుంచి కనీసం సగం గ్రామాల్లోనైనా 2.2 వెర్షన్ యాప్ ద్వారా సర్వే చేయించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.