తల్లి ప్రేమకు అద్దం పట్టిన సంఘటన | Elephant Seen Helping Calf Cross Roadside Barrier | Sakshi
Sakshi News home page

తల్లి ప్రేమకు అద్దం పట్టిన సంఘటన

Published Fri, Jul 3 2020 4:52 PM | Last Updated on Fri, Jul 3 2020 7:09 PM

Elephant Seen Helping Calf Cross Roadside Barrier - Sakshi

తిరువనంతపురం: రోడ్డు మీద ఉన్న బారియర్‌ను దాటడానికి ఇబ్బంది పడుతున్న పిల్ల ఏనుగుకు.. తల్లి సాయం చేసి.. క్షేమంగా రోడ్డు దాటేలా చూసింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్‌నెట్‌లో తెగ వైరలవుతోంది. కేరళలోని మలప్పురం జిల్లాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను అనీశ్‌ కటా అనే వ్యక్తి షేర్‌ చేశాడు. వివరాలు.. గురువారం ఉదయం 7.30గంటల ప్రాంతంలో మరో ముగ్గురితో కలిసి అనీశ్‌ కటా సైక్లింగ్‌కు వెళ్లారు. ఆ సమయంలో కేరళ-తమిళనాడు సరిహద్దు సమీపంలోని నాడుకని చురం వద్ద మూడు ఏనుగులు రోడ్డు దాటుతున్నాయి. వీటిలో రెండు సులభంగానే రోడ్డు మీద ఉన్న బారియర్‌ను దాటాయి.)కానీ మరో పిల్ల ఏనుగు మాత్రం దాటలేకపోయింది. పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యింది.(ఏనుగు పోస్టుమార్టం రిపోర్టు: షాకింగ్‌ నిజాలు)

దాంతో తల్లి ఏనుగు తన తొండంతో పిల్ల ఏనుగును పైకి తోసి బారియర్‌ను దాటేలా చేసింది. అనీశ్‌ కటా ఈ సంఘటనను వీడియో తీశారు. ప్రస్తుతం ఇది ఓ ఆంగ్ల ఛానల్‌లో ప్రసారం అయ్యింది. ఈ సందర్భంగా అనీశ్‌ కటా మాట్లాడుతూ.. ‘ఈ సంఘటన నా హృదయాన్ని తాకింది. బిడ్డ పట్ల తల్లి చూపించే ప్రేమకు నిదర్శనంగా నిలిచింది’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement