
ప్రతీకాత్మక చిత్రం
ఆ గజరాజుకు ఆకలేసిందో ఏమో తెలియదు కానీ ..కేరళలోని ఇంటి తలుపు తట్టింది. అయితే ఏనుగును చూసిన ఆ కుటుంబం కూడా గజగజ వణికిపోకుండా సానుకూలంగా స్పందించింది. ఇంట్లో ఉన్న అమ్మమ్మ , మనవరాలు అరటి పళ్లను తీసుకొచ్చి..రాజావారికి ఆప్యాయంగా తినిపించారు. దీంతో ఇంటి గడపలోంచే వాటిని మర్యాదగా ఆరగించింది ఏనుగు. అంతేకాదు ఆత్మీయ అతిధిని సాగనంపినట్టూ..బై ..బై ఏనుగుకు అంటూ వీడ్కోలు పలికారు. ఏనుగు తొండంతో మూతి తుడుచుకుంటూ.. మెల్లగా తన దారిన తాను వెళ్లిపోయింది. సోషల్ మీడియాలో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది.