![Asian Elephant Eats Banana After Peels It Like Human Viral Video - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/12/Untitled-1_2.jpg.webp?itok=uQ8T-ysB)
ఏనుగులు శాంతంగా ఉంటే ఎంత సరదాగా ఉంటాయో కోపమొస్తే గజరాజులా మారి అదే స్థాయిలో విధ్వంసాన్ని సృష్టిస్తాయి. వీటికున్న ప్రత్యేకత ఏంటంటే మావాటి చెప్పేవి బుద్ధిగా వినడంతో పాటు వాటిని పాటిస్తాయి కూడా. వీటి ప్రవర్తన చూసి మనుషులు ముఖ్యంగా చిన్న పిల్లలు ఎక్కవగా ఇష్టపడుతుంటారు. మరీ పిల్ల ఏనుగుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవి చేసే అల్లరి అంతా ఇంతా కాదు.
తాజాగా ఓ ఏనుగు అరటి పండు తినే తీరును చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. బెర్లిన్ జూలో ఉన్న ఓ ఏనుగు అరటి పండును తినే విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. పంగ్ ఫా అనే ఆసియా ఏనుగు అరటి పండు ఇస్తుంటే.. ముందుగా అది అరటిపండు తొక్క తీసేసి ఆపై పండును మాత్రం తింటోంది.
ఇది తినే తీరు చూస్తే అచ్చం మనిషిలానే తిన్నట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉందండోయ్ పసుపు రంగులో బాగున్న అరటిపండ్లను మాత్రం తింటూ.. గోధుమ రంగు (సరిగా లేని) అరటి పండ్లను తినేందుకు ససేమిరా అంటోంది. దీన్ని చూసేందుకు సందర్శకులు ఎగబడుతున్నారు. సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వైరల్ క్లిప్‌ను ఇప్పటివరకూ 32,000 మంది వీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment