కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత.. ఇతర కంపెనీల మాదిరిగానే ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా ఉద్యోగులను ఆఫీసుకు రప్పించాలనే ఉద్దేశ్యంతో రిటర్న్ టు ఆఫీస్ విధానం ప్రవేశపెట్టింది. ఆ సమయంలో ఆఫీసుకు రావడానికి ఉద్యోగులు సుముఖత చూపలేదు.
అమెజాన్ రిటర్న్ టు ఆఫీస్ నిబంధనలను.. సుమారు 30000 మంది ఉద్యోగులు వ్యతిరేకిస్తూ అంతర్గత పిటిషన్ పై సంతకం చేశారు. దీన్ని అమెజాన్ ఏ మాత్రం పట్టించుకోకుండా ఆఫీసుకు రావాల్సిందే అంటూ పట్టుబట్టింది. ఆఫీసుకు రాణి ఉద్యోగులపై చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడలేదు.
అనుకున్న విధంగానే అమెజాన్ ఉద్యోగులను ఆఫీసుకు రప్పించింది. అయితే ఉద్యోగులు ఆఫీసులో సమయాన్ని వృధా చేయడానికి ఆఫీసుకు వచ్చి, కొంతసేపు సమయాన్ని గడిపి, కాఫీ తాగి వెళ్ళిపోయేవారు. దీన్నే కాఫీ బ్యాడ్జింగ్ అని పిలిచేవారు. ఈ విషయాన్ని కంపెనీ కొంత ఆలస్యంగా గుర్తించింది.
ఉద్యోగులు ఉండాల్సిన సమయం ఆఫీసులో వుండకపోవడమే కాకుండా, సమయాన్ని వృధా చేస్తున్నారని కంపెనీ గుర్తించిన వెంటనే నిబంధనల్లో మార్పులు చేసింది. తరచుగా కాఫీ బ్యాడ్జింగ్‌కు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం, రిటైల్, క్లౌడ్ కంప్యూటింగ్ టీమ్ ఉద్యోగులు ఆఫీసులో కనీసం రెండు గంటలు, ఇతర ప్రాజెక్టులలోని ఉద్యోగులు ఆరు గంటలు ఉండాలని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment