Amazon Layoffs: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజంగా ప్రసిద్ధి చెందిన 'అమెజాన్' (Amazon) మరోసారి లేఆఫ్స్ కింద తమ ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. కంపెనీ ఎక్కడ, ఎంతమందిని తీసి వేసిందనే విషయాలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, అమెరికాలోని ఫ్రెష్ గ్రోసరీ స్టోర్లలో పనిచేసే ఉద్యోగులను తాజాగా తొలగించినట్లు కంపెనీ తెలిపింది. సంస్థ తన వర్క్‌ఫోర్స్ కోసం 'జోన్ లీడ్' పాత్రలను తొలగిస్తున్నట్లు గురువారం ధృవీకరించింది. జోన్ లీడ్ అనేది లోయర్ లెవెల్ మేనేజింగ్ పొజిషన్ అని తెలుస్తోంది. వీరందరూ అసోసియేటర్లతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ.. కస్టమర్ల సమస్యలపై ద్రుష్టి సారిస్తారు.
అమెజాన్ ఎంతమందిని తొలగించిందనే విషయం ఖచ్చితంగా వెల్లడి కాలేదు, కానీ వందకంటే ఎక్కువ మంది ఉండవచ్చని సమాచారం నివేదికలు చెబుతున్నాయి. తీసేసిన ఉద్యోగులకు పరిహారం కూడా అందించనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.
(ఇదీ చదవండి: జర్మన్ కారు కొనుగోలు చేసిన టైగర్ ష్రాఫ్ - ధర ఎంతో తెలుసా?)
గత కొన్ని రోజులుగా దేశంలోని చాలా దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి. ఇందులో మైక్రోసాఫ్ట్, గూగుల్, ట్విటర్ఎం మెటా కంపెనీలు ఉన్నాయి. అమెజాన్ సంస్థ ఉద్యోగులను తొలగించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా లెక్కకు మించిన ఉద్యోగులను తీసేసింది.
Comments
Please login to add a commentAdd a comment