మస్క్‌, బెజోస్‌ను మించిన ‘బ్లాక్‌పాంథర్‌’ సంపద | Black Panther MCU Superhero Richer Than Elon Musk and Jeff Bezos | Sakshi
Sakshi News home page

మస్క్‌, బెజోస్‌ను మించిన ‘బ్లాక్‌పాంథర్‌’ సంపద

Published Sat, Feb 22 2025 12:11 PM | Last Updated on Sat, Feb 22 2025 12:22 PM

Black Panther MCU Superhero Richer Than Elon Musk and Jeff Bezos

ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు.. టెస్లా సీఈఓ ఎలాన్‌మస్క్‌(Elon Musk), అమెజాన్‌ సీఈఓ జెఫ్‌బెజోస్‌(Jeff Bezos). కానీ వాళ్ల సందపను మించిన ఖజానా సుపర్‌ హీరోల ప్రపంచంలో ‘బ్లాక్‌పాంథర్‌’ వద్ద ఉంది. హాలివుడ్‌ సినిమాలకు నెలవైన మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసీయూ)లోని బ్లాక్ పాంథర్ అత్యంత సంపన్న సూపర్ హీరోగా నిలిచింది. అది రియల్‌లైఫ్‌లో కాదండోయ్‌.. రీల్‌ లైప్‌లో.. అదెలాగో చూసేద్దాం.

బ్లాక్ పాంథర్ అని పిలువబడే టి'చల్లా మార్వెల్ కామిక్స్ ప్రచురించిన అమెరికన్ కామిక్ పుస్తకాల్లో కనిపించే ఒక కాల్పనిక సూపర్ హీరో. స్టాన్ లీ, జాక్ కిర్బీ అనే రచయితలు ఈ పాత్రను సృష్టించారు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఈ కాల్పనిక కథను తెరకెక్కించింది. అందులోని అంశాల ప్రకారం.. ఆఫ్రికాలోని వకాండా, రమొండాకు టి'చల్లా రాజు సంరక్షకుడిగా ఉండేవాడు. తండ్రి మరణానంతరం సింహాసనాన్ని అధిష్టించి తన సామ్రాజ్యం బ్లాక్ పాంథర్ పగ్గాలు చేపడుతాడు. ఒక రాజకీయ నాయకుడిగా, సూపర్ హీరోగా ఉంటాడు. అంతర్గత, బాహ్య బెదిరింపుల నుంచి వకాండా రాజ్యాన్ని రక్షిస్తుంటాడు. దాంతో తనను బ్లాక్‌ పాంథర్‌గా పిలిచేవారు.

టి'చల్లా పాలిస్తున్న బ్లాక్ పాంథర్ 500 బిలియన్ డాలర్ల(సుమారు రూ.42 లక్షల కోట్లు) సంపదతో ప్రత్యేకతను కలిగి ఉంది. ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ వంటి రియల్ బిలియనీర్ల నికర విలువను సైతం అధిగమించింది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసీయూ)లో బ్లాక్ పాంథర్ సామ్రాజ్యం అత్యంత సంపన్న సూపర్ హీరోగా నిలిచింది. ప్రపంచంలోనే అరుదైన, నశించలేని లోహమైన విబ్రేనియం ఏకైక నిల్వలు బ్లాక్‌పాంథర్‌లోనే ఉన్నాయి. విబ్రేనియం శక్తిని గ్రహించి, దాన్ని నిల్వ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కాల్పనిక కథలో రాశారు. దాంతో వకాండా విబ్రేనియంపై గుత్తాధిపత్యం చలాయిస్తుంది. అందుకే అంత సంపదను మూటగట్టకుందనేలా కథలో తెలిపారు.

ఇదీ చదవండి: స్విగ్గీ ‘స్కూట్సీ’లో రూ.1,000 కోట్ల పెట్టుబడి

నిజ జీవితంలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు

ఎలాన్ మస్క్: 400 బిలియన్ డాలర్లు, కంపెనీలు టెస్లా, స్పేస్ఎక్స్

జెఫ్ బెజోస్: 239.4 బిలియన్ డాలర్లు, కంపెనీలు - అమెజాన్

మార్క్ జుకర్ బర్గ్: 211.8 బిలియన్ డాలర్లు, కంపెనీలు మెటా-ఫేస్‌బుక్‌

లారీ ఎల్లిసన్: 204.6 బిలియన్ డాలర్లు, కంపెనీలు-ఒరాకిల్‌

బెర్నార్డ్ అర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ: 181.3 బిలియన్ డాలర్లు, కంపెనీలు ఎల్‌వీఎంహెచ్‌-లూయిస్ విట్టన్ మోయెట్ హెన్నెస్సీ

లారీ పేజ్: 161.4 బిలియన్ డాలర్లు, కంపెనీలు గూగుల్ (ఆల్ఫాబెట్ ఇంక్.)

సెర్గీ బ్రిన్: 150 బిలియన్ డాలర్లు, కంపెనీలు గూగుల్ (ఆల్ఫాబెట్ ఇంక్.)

వారెన్ బఫెట్: 146.2 బిలియన్ డాలర్లు, కంపెనీలు బెర్క్‌షైర్‌ హాత్‌వే

స్టీవ్ బామర్‌: 126 బిలియన్ డాలర్లు, కంపెనీలు మైక్రోసాఫ్ట్

జెన్సెన్ హువాంగ్: 120.2 బిలియన్ డాలర్లు, కంపెనీలు ఎన్విడియా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement