అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోతారని ఊహించినందున.. తమ టెస్లా, స్పేస్‌ఎక్స్ స్టాక్‌లను విక్రయించమని అమెజాన్ వ్యవస్థాపకుడు ప్రజలకు సలహా ఇచ్చారని 'ఇలాన్ మస్క్' (Elon Musk) చేసిన వాదనపై జెఫ్ బెజోస్ స్పందించారు. దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
మస్క్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని, అది వంద శాతం తప్పు అని జెఫ్ బెజోస్ పేర్కొన్నారు. దీనికి రిప్లై ఇస్తూ.. సరే, నేను సరిదిద్దుకున్నాను అంటూ.. మస్క్ స్మైల్ ఎమోజీని యాడ్ చేశారు.
అంతే కంటే ముందు నవంబర్ 6న జెఫ్ బెజోస్ తన ఎక్స్ ఖాతాలో డోనాల్డ్ ట్రంప్‌ను అభినందించారు. మా 47వ అధ్యక్షుడికి శుభాకాంక్షలు అంటూ.. మనమందరం ఇష్టపడే అమెరికాను నడిపించడంలో ట్రంప్ విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు. నిజానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో జెఫ్ బెజోస్ కమలా హారిస్‌కు సపోర్ట్ చేసినట్లు సమాచారం.
ఇదీ చదవండి: ఆధార్ అప్డేట్ చేయకుంటే ఏమవుతుంది?: తప్పకుండా తెలుసుకోవాల్సిందే..
రూ.28 లక్షల కోట్లకు చేరిన మస్క్ సంపద
ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో టెస్లా అధినేత ఇలాన్ మస్క్‌కు సిరుల పంట పండుతోంది. ట్రంప్ విజయం తర్వాత టెస్లా స్టాక్ ఏకంగా 40 శాతం పెరిగింది. దీంతో మస్క్ సంపద ఏకంగా 70 బిలియన్ డాలర్లు(రూ.5.8 లక్షల కోట్లు) పెరిగి నికరంగా సుమారు 340 బిలియన్ అమెరికన్ డాలర్ల(రూ.28 లక్షల కోట్లు) మార్కును దాటినట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది.
Nope. 100% not true.
— Jeff Bezos (@JeffBezos) November 21, 2024
Well, then, I stand corrected 😂
— Elon Musk (@elonmusk) November 21, 2024
Comments
Please login to add a commentAdd a comment