ప్రపంచ కుబేరుడు.. టెస్లా అధినేత 'ఇలాన్ మస్క్' (Elon Musk) తన పేరును మార్చుకున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్‌టాపిగ్‌గా మారింది. నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తున్నారు.
ఒకవైపు బిజినెస్, మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్న మస్క్.. తాజాగా తన ఎక్స్ (Twitter) అకౌంట్ పేరును 'కేకియస్ మాక్సిమస్' (Kekius Maximus)గా మార్చుకున్నారు. వినడానికి ఈ పేరు వింతగా ఉన్నప్పటికీ.. దీనికో అర్థం కూడా ఉంది. కేకియస్ అనేది ఓ క్రిప్టో కరెన్సీ టోకెన్. ఇది అనేక బ్లాక్‌చెయిన్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది.
ఇలాన్ మస్క్ క్రిప్టో కరెన్సీకి మద్దతు ఇస్తున్నారనే విషయం అందరికి తెలుసు. ఇందులో భాగంగానే తన ఎక్స్ ఖాతా పేరును.. క్రిప్టో కరెన్సీ అర్థం వచ్చేలా మార్చుకున్నాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. 2023లో కూడా తన ఎక్స్ అకౌంట్ పేరును 'మిస్టర్ ట్వీట్'గా మార్చుకున్నారు.
Changed my name to Mr. Tweet, now Twitter won’t let me change it back 🤣
— Kekius Maximus (@elonmusk) January 25, 2023
సంపదలో మస్క్ కొత్త రికార్డ్
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, మస్క్ సంపద 447 బిలియన్ డాలర్లు. యుఎస్ అధ్యక్ష ఎన్నికల తరువాత ఈయన సంపద గణనీయంగా పెరిగింది. స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ స్పేస్‌ఎక్స్ అంతర్గత వాటా విక్రయంతో సంపాదన సుమారు 50 బిలియన్ డాలర్లు పెరిగిందని సమాచారం.
ఇదీ చదవండి: ఇలాన్ మస్క్ బూతు ప్రయోగం
2022 వరకు మస్క్ నికర విలువ 200 డాలర్ల కంటే తక్కువ ఉండేది. అయితే అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందిన తరువాత.. ఈయన సంపాదన భారీగా పెరిగింది. తాజాగా 400 బిలియన్ డాలర్లు దాటేసింది. మొత్తం మీద 400 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 33.20 లక్షల కోట్లు) నికర విలువను అధిగమించిన మొదటి వ్యక్తిగా ఇలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు.
Comments
Please login to add a commentAdd a comment