మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్ (ట్విట్టర్)కు ఆస్ట్రేలియన్ ఇ-సేఫ్టీ కమిషన్ భారీ జరిమానా విధించింది. మూడు లక్షల ఎనభై ఆరు వేల డాలర్ల ఈ జరిమానా మొత్తం భారతీయ కరెన్సీలో దాదాపు రూ.3.21 కోట్లకు సమానం. ఆస్ట్రేలియా ప్రభుత్వ నియంత్రణ సంస్థ ఎక్స్‌పై ఇంత భారీ జరిమానా వేయడానికి కారణమేమిటని అనుకుంటున్నారా? ఆ వివరాలు ఇవిగో....
సామాజిక మాధ్యమాల్లో చిన్నపిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌పై నిత్యం నిఘా ఉంటుంది. ఆయా సైట్లు ఈ రకమైన కంటెంట్‌ను ఎంత త్వరగా గుర్తించారు? పరిష్కరించారన్న విషయంపై కూడా నిత్యం నియంత్రణ సంస్థల నిఘా ఉంటుంది. అయితే ఎక్స్ (ట్విట్టర్) చైల్డ్ అబ్యూస్ (చిన్న పిల్లల లైంగిక వేధింపులు) కేసు సంబంధించిన దర్యాప్తునకు సహకరించేందుకు నిరాకరించింది. ఇది కాస్తా ఆస్ట్రేలియా ప్రభుత్వ నియంత్రణ సంస్థ ఆగ్రహానికి కారణమైంది. భారీ ఫైన్ విధించింది. కంటెంట్ నియంత్రణలో విఫలమవుతున్నారన్న ఆరోపణలు వస్తూండటం... తాజాగా ఈ భారీ జరిమానాల నేపథ్యంలో స్పాన్సరర్లను నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్న ఎక్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి.
ఇండియాలో ఇప్పటికే ఎక్స్, యూట్యూబ్ & టెలిగ్రామ్‌లకు నోటీస్
నిజానికి భారత దేశ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) కూడా 'చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్' (చిన్న పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించినవి) కంటెంట్‌ను సోషల్ మీడియా సంస్థలు తమ ప్లాట్‌ఫామ్స్ నుంచి వెంటనే తీసివేయాలని హెచ్చరిస్తూ ఇప్పటికే నోటీసులు జారీ చేసిన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం.
ఇదీ చదవండి: యూజ్‌లెస్ ఫెలో.. గెట్ లాస్ట్ అన్నారు! అక్కడే చైర్మన్ అయ్యాను..
భవిష్యత్తులో కంటెంట్ మోడరేషన్ అల్గారిథమ్‌లు, రిపోర్టింగ్ మెకానిజమ్స్ వంటి చురుకైన చర్యలను కూడా అమలు చేయాలని సూచించింది. ఈ నియమాన్ని పాటించకుంటే 2021 రూల్ 3(1)(బి) అండ్ రూల్ 4(4) ఉల్లంఘనగా పరిగణిస్తామని ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ ఉల్లంఘనకు పాల్పడితే సెక్షన్ 79 ప్రకారం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment