Child abuse
-
ట్వింకిల్... ట్వింకిల్... లిటిల్ స్టార్స్ జాగ్రత్త!
‘ఒంటరిగా వెళ్లవద్దు.. పార్కుకు, పాఠశాలకు, బీచ్‌కి, మరెక్కడికైనా... మేనమామ, బంధువు లేదా స్నేహితుడైనప్పటికీ.. ఏ వ్యక్తితోనూ ఒంటరిగా వెళ్లవద్దు. ఉదయం, సాయంత్రం మరీ ముఖ్యంగా రాత్రిపూట అస్సలు ఒంటరిగా వెళ్లవద్దు’ అంటూ... నలభై ఏళ్ల క్రితం తల్లి తన చిన్నతనంలో నేర్పించిన భద్రతా పాఠాలనే ఇన్నేళ్ల తర్వాత తన కూతురు నితారాకు కూడా బోధిస్తున్నట్లు గుర్తించానని ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా నాటి బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా చెప్పింది.కోల్‌కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో యువ ట్రైనీ డాక్టర్‌పై జరిగిన దారుణ ఘటన అనంతరం తన కుమార్తెతో తాను ఈ విధంగా సంభాషణ జరిపినట్టు తెలిపింది. అమ్మాయిల భద్రతకు సంబంధించి ఆఫ్‌లైన్‌లో ఇలాంటి ప్రమాదకర స్థితి ఉంటే ఆన్లైన్ ముప్పు మరో విధమైన సమస్యలకు లోను చేస్తుంది. డిజిటల్లో ఆడపిల్లల భద్రతకు సంబంధించి పెద్దలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులేం చెబుతున్నారో తెలుసుకుందాం.నేటి డిజిటల్ యుగంలో అమ్మాయిల భద్రత బయటి ప్రదేశాలకు మించి విస్తరించింది. గతంలో అపరిచితుల నుంచి ప్రమాదం, రహదారి భద్రత, ఆట స్థలం ప్రమాదాలు.. ఈ ఆందోళనలు ఉండేవి. ఇప్పుడు ఇవి ఇలాగే కొనసాగుతుండగా డిజిటల్ యుగం మరో క్లిష్టమైన లేయర్‌ని ప్రవేశపెట్టింది.ఆన్ లైన్ ముప్పు..ఈ రోజుల్లో పిల్లలు ఆన్ లైన్ ప్రపంచంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇక్కడ పిల్లలను కబళించేందుకు మోసగాళ్లు.. చాట్ రూమ్‌లు, సోషల్ మీడియా ల్యాట్ఫారమ్లు, గేమింగ్ కమ్యూనిటీలలో దాగి ఉంటున్నారు. ఆన్ లైన్ వస్త్రధారణ, దోపిడీ నుంచి వారిని రక్షించడానికి అప్రమత్తత, డిజిటల్ అక్షరాస్యత ప్రతి ఒక్కరికీ అవసరం.సైబర్ బెదిరింపులు..ఇంటర్నెట్ అనేది అపరిచితుల నుంచి బెదిరింపులను ్రపోత్సహిస్తుంది. సైబర్ బెదిరింపు పిల్లల మానసిక ఆరోగ్యానికి, ఆత్మగౌరవానికి ముప్పుగా మారుతుంది.అనుచితమైన కంటెంట్..కేవలం కొన్ని క్లిక్‌లతో, పిల్లలు వారి వయస్సుకు మించి అనుచితమైన కంటెంట్‌ను యాక్సెస్ చేయగలరు, ఇది వారి అభివృద్ధికి ఆటంకమే కాదు హాని కూడా కలిగించవచ్చు. రోడ్డు ప్రమాదాలు, గాయాలు, ప్రకృతి వైపరీత్యాలు పిల్లల భద్రతకు ముప్పును కలిగిస్తూనే ఉన్నాయి. అందువల్ల, ఆఫ్‌లైన్– ఆన్లైన్ నష్టాలను పరిష్కరించే భద్రతా విద్యకు సమతుల్య విధానం అవసరం.అవగాహన తప్పనిసరి..– భయాన్ని పెంచడం కంటే తెలివైన ఎంపికలు చేయడానికి వారిని శక్తిమంతం చేయడంపై దృష్టి పెట్టాలి.– తగిన పర్యవేక్షణ, మార్గదర్శకత్వాన్ని అందిస్తూనే పిల్లలు పరిపక్వం చెందుతున్నప్పుడు క్రమంగా మరింత స్వాతంత్య్రం పొందేందుకు అనుమతించాలి. – పిల్లలకు సమస్య పరిష్కార నైపుణ్యాలను నేర్పించాలి. నమ్మకం, పరస్పర గౌరవం ఉండే వాతావరణాన్ని సృష్టించాలి.– అధిక రక్షణ వారి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. ఆందోళనను సృష్టిస్తుంది. వారు వారి తప్పుల నుండి నేర్చుకునేలా వయసుకి తగిన స్వేచ్ఛను, అవకాశాలను ఇవ్వాలి.– ఆన్ లైన్ బెదిరింపులను విస్మరించవద్దు. ప్రస్తుత ఆన్ లైన్ ట్రెండ్స్, ప్రమాదాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఇంటర్నెట్ భద్రత గురించి మీ చుట్టూ ఉన్నవారితో మాట్లాడుతూ ఉండండి.– డిజిటల్ భద్రత అనేది కేవలం శారీరక శ్రేయస్సు కంటే ఎక్కువ. హద్దుల్లో ఉండటం, ఆరోగ్యకరమైన సంబంధాలు, అనుచితమైన ప్రవర్తనను ఎలా గుర్తించాలి, ప్రతిస్పందించాలనే దాని గురించి పిల్లలకు బోధించడం ద్వారా భావోద్వేగ భద్రతను పరిష్కరించాలి.డిజిటల్ పేరెంటింగ్ తప్పనిసరి..ఇంట్లో పిల్లలు సేఫ్‌గా ఉన్నారు అనుకుంటారు కానీ, నేటి రోజుల్లో బయట కన్నా డిజిటల్లోనే మరిన్ని ప్రమాదాల బారినపడుతున్నారు. నేరుగా కన్నా ఆన్లైన్లోనే చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ ఎక్కువ జరుగుతుంది. డిజిటల్ మోసగాళ్లు టీనేజ్ అమ్మాయిలను ఆకర్షించి సరోగసి, ఆర్గాన్ ట్రేడింగ్ చేస్తున్నారు. కొత్తదనాన్ని ఆస్వాదించాలి అంటూ పిల్లలను హిప్నోటైజ్ చేస్తుంటారు. వారిని తప్పుదారి పట్టించి, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు తీసుకోవడం.. ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడటం... ఫలితంగా పిల్లలు భయాందోళనకు లోనవడం, ఆత్మహత్యలు చేసుకోవడం వంటివి జరుగుతున్నాయి.ఫోన్ లేదా ట్యాబ్ లేదా ఇతర గ్యాడ్జెట్స్‌లో పేరెంటల్ కంట్రోల్ ఉండేలా చూసుకోవాలి. ఫ్యామిలీ ఇ–మెయిల్ తప్పనిసరి. ఏ వయసువారికి ఎలాంటి ఆన్లైన్ గేమ్స్ బెటర్ అనేవి తెలుసుకోవాలి. ప్రమాదాల వంక పెట్టి పిల్లలను డిజిటల్ నుంచి దూరం చేయకుండా అవగాహన కల్పించడం అవసరం. సమస్య తలెత్తితే చైల్డ్ హెల్ప్‌లైన్: 1098, నేషనల్ కమిషన్ ఫర్ ్ర΄÷టెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సిపిసిఆర్), ఓసిఎస్ఎఇ (ఆన్లైన్ చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ అండ్ ఎక్స్ల్యాయిటేషన్), పోక్సో, మినిస్ట్రీ ఆఫ్ ఉమన్ అండ్ చైల్డ్ రైట్స్ (ఎమ్డబ్ల్యూసీడీ),..లోనూ కేస్ ఫైల్ చేయచ్చు. – అనీల్ రాచమల్ల, సైబర్ సేఫ్టీ నిపుణులు, ఎండ్ నౌ ఫౌండేషన్ -
ఇలాంటి సమయంలో చెప్పాల్సి వస్తుందని ఊహించలేదు: ప్రణీత్ బ్రదర్
సోషల్ మీడియాలో చిన్నపిల్లలపై అసభ్యకరమైన వీడియోలు చేస్తోన్న ప్రముఖ యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును పోలీసులు అరెస్ట్ చేశారు. హీరో సాయి ధరమ్ తేజ్ చేసిన ట్వీట్‌తో అతని పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. ప్రణీత్‌పై చర్యలు తీసుకోవాలంటూ పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. దీంతో అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు.తాజాగా ప్రణీత్ అరెస్ట్‌పై ఆయన సోదరుడు అజయ్ హనుమంతు(అయే జుడే) స్పందించారు. తప్పు ఎవరు చేసినా తప్పేనని.. అది తమ్ముడైనా సరే శిక్ష పడాల్సిందే అన్నారు. తన పెళ్లి గురించి ఇలాంటి సమయంలో చెప్పాల్సి వస్తుందని ఊహించలేదన్నారు. కానీ తప్పడం లేదు.. నాకు పెళ్లై ఇప్పటికే ఆరేళ్లయిందని అయే జుడే తెలిపారు. ఇంజినీరింగ్ పూర్తయిన వెంటనే లవ్ మ్యారేజ్ చేసుకున్నట్లు తెలిపారు.అజయ్ మాట్లాడుతూ..' నా పెళ్లి విషయం సంతోషకరమైన సమయంలో చెబుదామని అనుకున్నా. కానీ చెప్పక తప్పడం లేదు. నా పెళ్లి జరిగి ఆరేళ్లైంది. కాలేజీ పూర్తవ్వగానే లవ్ మ్యారేజ్ చేసుకున్నా. అప్పటి పరిస్థితులు వేరు. లైఫ్‌లో చాలాసార్లు ఫెయిలయ్యా. జీవనోపాధి లేక కష్టాలు పడ్డా. ఐఏఎస్ ఆఫీసర్ కుమారుడినైనా రోడ్ మీద నుంచే నా లైఫ్ స్టార్ట్ చేశా. అడల్డ్ అండ్ కామెడీని పర్సనల్‌గా నేను ప్రోత్సహించను. అలాంటివి చూడను కూడా. అది ఎవరు చేసిన తప్పే. ఈ విషయంలో మీరు ఎంత దూరంగా ఉన్నారో.. నేను కూడా అంతే.' అని అన్నారు. Naaku 6 years back marriage ayyindhi... Ah taravatha nen intlo nundi bayataki vachesa..Social Media lo Vunna incident ki meeru entha dooranga unnaro, nenu anthe dooranga unnanu~#AyeJude (youtuber) #PhanHanumantu brother pic.twitter.com/szbX3xWfBF— Filmy Bowl (@FilmyBowl) July 10, 2024 -
'ఇలాంటివి చాలా భయానకం'.. మెగా హీరో మరో ట్వీట్!
సోషల్ మీడియాలో జరుగుతున్న దారుణాలపై మెగా హీరో సాయిధరమ్ తేజ్ మరో ట్వీట్ చేశారు. పేరేంట్స్ చాలా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాల్లో పిల్లల ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేయవద్దని ఆయన కోరారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు.ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే మరో ట్వీట్ చేశారు సాయి ధరమ్ తేజ్. ఫన్నీ పేరుతో చిన్న పిల్లలను ట్రోల్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. తాజాగా కొంతమంది యూట్యూబర్స్ ఓ తండ్రి, తన చిన్నారి కూతురి వీడియోను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు.స్పందించిన భట్టి విక్రమార్కతాజాగా ఈ సాయి ధరమ్ తేజ్ చేసిన ట్వీట్‌పై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి స్పందించారు. ఇలాంటి క్లిష్టమైన సమస్యను లేవనెత్తినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు.. తాము చిన్నపిల్లల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. సోషల్ మీడియా వేదికగా చిన్నపిల్లలను ఉద్దేశించి అసభ్యకరమైన పోస్టులు పెడితే సహించేది లేదన్నారు. చిన్నపిల్లల భద్రత కోసం తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని.. తప్పకుండా చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క ట్వీట్లో పేర్కొన్నారు.Thank you for raising this critical issue @IamSaiDharamTej garu, Child safety is indeed a top priority. we will ensure that our government takes necessary steps to prevent child abuse and exploitation on social media platforms. Let's work together to create a safer online… https://t.co/OGQ4NN4doh— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) July 7, 2024This is beyond gruesome, disgusting and scary.Monsters like these go unnoticed on the very much utilised social platform doing child abuse in the disguise of so-called Fun & Dank.Child Safety is the need of the hour 🙏🏼I sincerely request Hon'ble Chief Minister of Telangana… https://t.co/05GdKW1F0s— Sai Dharam Tej (@IamSaiDharamTej) July 7, 2024 -
ఎలాన్ మస్క్‌కు షాక్.. ఎక్స్ (ట్విటర్)కు రూ.3.21 కోట్లు ఫైన్ - కారణం ఇదే!
మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్ (ట్విట్టర్)కు ఆస్ట్రేలియన్ ఇ-సేఫ్టీ కమిషన్ భారీ జరిమానా విధించింది. మూడు లక్షల ఎనభై ఆరు వేల డాలర్ల ఈ జరిమానా మొత్తం భారతీయ కరెన్సీలో దాదాపు రూ.3.21 కోట్లకు సమానం. ఆస్ట్రేలియా ప్రభుత్వ నియంత్రణ సంస్థ ఎక్స్‌పై ఇంత భారీ జరిమానా వేయడానికి కారణమేమిటని అనుకుంటున్నారా? ఆ వివరాలు ఇవిగో.... సామాజిక మాధ్యమాల్లో చిన్నపిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌పై నిత్యం నిఘా ఉంటుంది. ఆయా సైట్లు ఈ రకమైన కంటెంట్‌ను ఎంత త్వరగా గుర్తించారు? పరిష్కరించారన్న విషయంపై కూడా నిత్యం నియంత్రణ సంస్థల నిఘా ఉంటుంది. అయితే ఎక్స్ (ట్విట్టర్) చైల్డ్ అబ్యూస్ (చిన్న పిల్లల లైంగిక వేధింపులు) కేసు సంబంధించిన దర్యాప్తునకు సహకరించేందుకు నిరాకరించింది. ఇది కాస్తా ఆస్ట్రేలియా ప్రభుత్వ నియంత్రణ సంస్థ ఆగ్రహానికి కారణమైంది. భారీ ఫైన్ విధించింది. కంటెంట్ నియంత్రణలో విఫలమవుతున్నారన్న ఆరోపణలు వస్తూండటం... తాజాగా ఈ భారీ జరిమానాల నేపథ్యంలో స్పాన్సరర్లను నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్న ఎక్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. ఇండియాలో ఇప్పటికే ఎక్స్, యూట్యూబ్ & టెలిగ్రామ్‌లకు నోటీస్ నిజానికి భారత దేశ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) కూడా 'చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్' (చిన్న పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించినవి) కంటెంట్‌ను సోషల్ మీడియా సంస్థలు తమ ప్లాట్‌ఫామ్స్ నుంచి వెంటనే తీసివేయాలని హెచ్చరిస్తూ ఇప్పటికే నోటీసులు జారీ చేసిన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఇదీ చదవండి: యూజ్లెస్ ఫెలో.. గెట్ లాస్ట్ అన్నారు! అక్కడే చైర్మన్ అయ్యాను.. భవిష్యత్తులో కంటెంట్ మోడరేషన్ అల్గారిథమ్‌లు, రిపోర్టింగ్ మెకానిజమ్స్ వంటి చురుకైన చర్యలను కూడా అమలు చేయాలని సూచించింది. ఈ నియమాన్ని పాటించకుంటే 2021 రూల్ 3(1)(బి) అండ్ రూల్ 4(4) ఉల్లంఘనగా పరిగణిస్తామని ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ ఉల్లంఘనకు పాల్పడితే సెక్షన్ 79 ప్రకారం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
ఆపరేషన్ మేఘ్‌చక్ర: సీబీ‘ఐ’ మెరుపు దాడులు
ఢిల్లీ: తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలో పలు చోట్ల ఇవాళ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మెరుపు దాడులకు దిగింది. పిల్లలపై లైంగిక వేధింపుల కంటెంట్‌ను గుర్తించేందుకు, ఆ కంటెంట్‌తో మైనర్లపై బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్న ముఠాల పని పట్టేందుకు ఆపరేషన్ ‘మేఘ్‌చక్ర’ను నిర్వహిస్తోంది. ఈ మేరకు శనివారం దేశవ్యాప్తంగా సోదాలు మొదలుపెట్టింది. మొత్తం పంతొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి దాదాపు 56 చోట్ల సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాడులు కొనసాగుతున్నాయి. మైనర్లపై లైంగిక వేధింపుల మెటీరియల్‌కు సంబంధించిన సమాచారం అందిన నేపథ్యంలోనే ఈ దాడులు కొనసాగినట్లు తెలుస్తోంది. అయితే ఎంతమందిని అదుపులోకి తీసుకుంది.. ఇతరత్ర పరిణామాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సింగపూర్ ఇంటర్‌పోల్ విభాగం నుంచి అందిన పక్కాసమాచారం మేరకే ఈ సెర్చ్ ఆపరేషన్‌ను మొదలుపెట్టింది సీబీఐ. పిల్లల లైంగిక వేధింపుల మెటీరియల్‌ను పంపిణీ చేయడం, వాటి ఆసరాగా మైనర్లను బ్లాక్మెయిల్ చేసే వ్యక్తులను, ముఠాలను గుర్తించడం.. చర్యలు తీసుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది సీబీ‘ఐ’. పిల్లల అశ్లీల విషయాలను ప్రసారం చేయడానికి ఉపయోగించే క్లౌడ్ స్టోరేజీ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని నిరుడు సీబీఐ చేపట్టిన ‘ఆపరేషన్ కార్బన్’కు మేఘ్‌చక్ర కొనసాగింపు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన కేసులను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన యంత్రాంగంపై వివరణాత్మక నివేదికను సమర్పించాలని గత వారం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది కూడా. ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. గోడ కూలి 10 మంది దుర్మరణం! -
పైశాచికం: బిడ్డ బాగోగులు చూస్తుందని అనుకుంటే..
వైరల్: ఉద్యోగాల బిజీలో ఉండే తల్లిదండ్రులు.. ఈ వీడియోపై ఓ లుక్కేయండి. తమ బిడ్డ బాగోగులు చూస్తుందని ఓ ఆయాను పెడితే.. ఆమె మాత్రం పైశాచికానికి పాల్పడింది. బిడ్డ ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లిదండ్రులు.. డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్తే అసలు విషయం తెలిసి షాక్ తిన్నారు. మధ్యప్రదేశ్ జబల్పూర్లో దారుణం జరిగింది. రెండేళ్ల బిడ్డను బాగోగులు చూసేందుకు ఓ ఆయాను నియమించుకున్నారు పేరెంట్స్. అయితే.. ఎప్పుడు సందడిగా ఉండే ఆ చిన్నారి డల్‌గా మారిపోయాడు. అంతేకాదు.. నీరసంగానూ తయారయ్యాడు. దీంతో బాబుకు ఏమయ్యిందో అని తల్లిదండ్రులు చిన్నారిని వైద్యుల వద్దకు తీసుకెళ్లగా.. చిన్నారి అంతర్గత అవయవాలు వాచిపోయి ఉన్నాయని డాక్టర్ తెలిపాడు. ఎవరో ఆ చిన్నారిని వేధించి ఉంటారని వైద్యుడు వెల్లడించాడు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టారు. ఆఫీసులనుంచి ఇంటికి వచ్చాక.. అందులో రికార్డైన దృశ్యం వారిని ఉలిక్కిపడేలా చేసింది. రజినీ చౌదరిగా గుర్తించబడిన నానీని నెలవారీ రూ. 5,000 ఇచ్చి.. బాబును చూసుకోవడానికి నియమించుకున్నారు. జీతంతో పాటు ఆమెకు భోజనం కూడా పెడుతున్నారు. కానీ, ఆమె మాత్రం చిన్నారిని జుట్టుపట్టి లాక్కెళ్లం, ఈడ్చి చెంపల మీద కొట్టడం, ఇష్టానుసారంగా బాదడం చేసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రజినీ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. Note: ఈ వీడియోలోని కంటెంట్ కొందరిని ఇబ్బందికి గురి చేయొవచ్చు In a shocking incident, police in Jabalpur, Madhya Pradesh, have arrested a domestic maid who used to beat up mercilessly a two-year-old kid when the parents of the kid went out to work. .#breakingnews #rahemanzildaily #madhyapradesh #Jabalpur #ViralVideo #maid #ChildAbuse #viral pic.twitter.com/E342UtPr7J — ViralVdoz (@viralvdoz) June 15, 2022 -
చిన్నారి చెంప, చేతులు, పెదవులపై వాతలు.. ఎందుకంటే..
సాక్షి, యాదగిరిగుట్ట(నల్లగొండ): చిన్నారులను ప్రేమతో బుజ్జగించాల్సిన అంగన్వాడీ టీచర్ దారుణానికి ఒడిగట్టారు. అభం శుభం తెలియని చిన్నారికి వాతలు పెట్టి గాయపరిచారు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని పెద్దకందుకూరు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుర్రం సుదర్శన్, అనూషల కుమార్తె అభిజ్ఞ (5) గ్రామంలోని అంగన్వాడీ సెంటర్–1కి వెళ్తోంది. రోజు మాదిరిగానే బుధవారం కూడా వెళ్లింది. ఆ చిన్నారి కేంద్రంలో ఏడ్చినందుకు సెంటర్ ఉపాధ్యాయురాలు సునీత చిన్నారి అభిజ్ఞ చెంప, రెండు చేతులు, పెదవులపై వాతలు పెట్టారు. దీంతో ఏడ్చుకుంటూ వచ్చిన చిన్నారి విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. వెంటనే కుటుంబ సభ్యులు టీచర్ తీరుపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పిల్లలపై ఇంత కిరాతకంగా వ్యవహరించిన అంగన్వాడీ టీచర్ సునీతపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, తానేమీ వాతలు పెట్టలేదని అంగన్వాడీ టీచర్ సునీత చెప్పారు. వారికి, తమకు మధ్య ఉన్న కుటుంబ గొడవలతో తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. -
చిట్టితల్లి భయపడకు.. అలా ఎవరైనా ముట్టుకుంటే చెప్పేయ్
International Day of the Girl Child 2021: చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు.. ఈ వార్తలు విన్నప్పుడల్లా రగిలిపోతుంటాం. ‘అయ్యో చిట్టితల్లి’ అని కొందరు బాధపడిపోతుంటే.. ‘ఆ మృగాన్ని కఠినంగా శిక్షించాల’ని డిమాండ్లు చేస్తుంటారు మరికొందరు. ఇంకొందరి వల్ల రకరకాల వాదనలు-చర్చలు తెర మీదకూ వస్తుంటాయి కూడా. సైదాబాద్ ఘటన అయితేనేం, లవ్‌స్టోరి సినిమాలో చూపించినట్లు అయితేనేం.. రియల్ నుంచి రీల్ లైఫ్ దాకా అంతటా ఈ ఇష్యూ తీవ్రతను తెలియజేశాయి. బయటికి వచ్చేవి కొన్నే. అసలేం జరుగుతుందో అర్థంకాక, ఎవరికి ఎలా చెప్పాలో తెలియక పిల్లలు కుంగిపోతున్నారు. ఈ తరుణంలో ‘గుడ్ టచ్-బ్యాడ్ టచ్’ గురించి పిల్లలకు అవగాహన కల్పించడం తప్పనిసరి అంటున్నారు మానసిక నిపుణులు. ► అక్టోబర్ 11.. అంటే ఇవాళ ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది గర్ల్ చైల్డ్’.. అమ్మాయిల హక్కులు, భద్రత, విద్యావకాశాలు.. పై దృష్టిసారించాలని చాటిచెప్పే రోజు . ► వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ వుమెన్.. ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది గర్ల్ చైల్డ్’ నిర్వహణకు నాంది వేసింది. బీజింగ్ కాన్ఫరెన్స్-1995లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ► 2012 అక్టోబర్ 11 నుంచి క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తున్నారు. ► లింగ వివక్షను దూరం చేస్తూ.. అమ్మాయిలకు భవిష్యత్ అవకాశాల్ని ఎలా అందిపుచ్చుకోవాలి? పోటీ ప్రపంచంలో ఎలా రాటుదేలాలో అవగాహన కల్పించాలని చెబుతుంది ఈ రోజు. శారీరక కోరికలు తీర్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు.. ఇతరుల శరీరాన్ని ముట్టుకోవడం ద్వారా వెకిలి చేష్టలకు పాల్పడుతుంటారు కొందరు. పిల్లలను చెడు ఆలోచనలతో తాకడం కూడా ఈ కోవకే చెందింది. చూసేవాళ్లకు ఇది మాములుగానే అనిపించొచ్చు. కాస్త ఎదిగిన పిల్లలకు తాకే వ్యక్తుల మనస్తతత్వం తేలికగానే అర్థమైపోతుంది. కానీ, చిన్న వయసులో అది అర్థం కాకపోవచ్చు. ఇంట్లో వాళ్ల లాగే ప్రేమతో వాళ్లు ముట్టుకుంటున్నారనుకుంటారు. అందుకే అనురాగంతో తాకటం, కోరికలతో తాకటం మధ్య తేడాల్ని పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉందంటున్నారు. ఖచ్ఛితంగా తెలుసుకోవాలి ‘తన తండ్రి భుజాల మీద చేయి వేసినప్పుడు కలిగే స్పర్శ తన రక్షణ కోరుతుంది. కానీ, ఎవరైనా దురుద్దేశంతో తాకినప్పుడు ఆ స్పర్శ ఎలాంటిదో తెలుసుకోవాలి. ఒక్కోసారి సొంతవాళ్ల నుంచే లైంగిక వేధింపులు ఎదురుకావొచ్చు!. బెదిరించో, భయపెట్టో పదేపదే అఘాయిత్యాలకి పాల్పడొచ్చు. అందుకే గుడ్‌టచ్, బ్యాడ్టచ్ల మధ్య తేడాల్ని పిల్లలకు చెప్పాలి. తమను తాము రక్షించుకోవడానికి పిల్లలకూ అవకాశం కల్పించాలి. అదే టైంలో పిల్లల ప్రవర్తనను గమనిస్తూ.. వాళ్లకు అలాంటి ఇబ్బందులు ఏవైనా ఎదురవుతున్నాయా? అని తెలుసుకోవడంతో పాటు వాళ్లలో ధైర్యమూ నింపాల్సిన బాధ్యత తల్లిదండ్రులకే ఉంది. ► పిల్లలకు గుడ్ టచ్-బ్యాడ్ టచ్‌ల మధ్య తేడాను తెలియజేయాలి ► అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం చేయాలి? తమను తాము ఎలా రక్షించుకోవాలో నేర్పించాలి ► మొహమాటం అనిపిస్తే తల్లిదండ్రులూ కౌన్సిలింగ్ తీసుకోవచ్చు ► తమ పిల్లలు లైంగిక వేధింపులకు గురైతే.. చట్టపరంగా ఉన్న హక్కుల గురించి తెలుసుకోవాల్సిన అవసరమూ ఉంది ► టీచర్లు సైతం పిల్లల మానసిక పరిస్థితి పరిశీలిస్తూ ఉండాలి.. అవసరమైతే ఇందుకోసం శిక్షణ తీసుకోవాలి International Girl Child Day.. ఈ ఇయర్ థీమ్ ‘డిజిటల్ జనరేషన్.. అవర్ జనరేషన్’. ♦ప్రపంచవ్యాప్తంగా 220 కోట్ల మంది.. అదీ 25 ఏళ్లలోపు ఇంటర్నెట్ సౌకర్యానికి దూరంగా ఉంటున్నారు. వీళ్లలో అమ్మాయిల శాతం ఎక్కువగా ఉంది. జెండర్-డిజిటల్ డివైడ్‌ను సూచించేదిగా ఉన్నాయి ఈ గణాంకాలు. అందుకే సాంకేతికంగా అమ్మాయిలు రాణించాలని, అందుకు అవసరమైన తోడ్పాడు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని చాటి చెప్పడం ఈ ఏడాది ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది గర్ల్ చైల్డ్ థీమ్. పేరెంట్స్ బ్రెయిన్‌వాష్ లైంగిక వేధింపులకు గురయ్యే బాలికను త్వరగా గుర్తించొచ్చు. మానసికంగా వాళ్లలో మార్పులొస్తాయి. ఇంట్లోవాళ్లతోనే కాదు.. సొసైటీతోనూ డిటాచ్మెంట్ కోసం ప్రయత్నిస్తారు. నిద్రలో కలవరపాటుకు గురవుతుంటారు. సరిగా తినకపోవడం, భయాందోళనలు పెరిగిపోవడం గమనించొచ్చు. అందుకే పిల్లలు తమను తాము రక్షించుకునే ధైర్యం తెచ్చుకోవాలి. ఆ సమయంలో ఎలా ప్రవర్తించాలనేది నేర్చుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లోనూ తమ శరీర భాగాల్ని ఎవరైనా తాకడం చేస్తే.. వారు భయాందోళనకు గురికాకుండా గట్టిగా తిరస్కరించాలి. తమకు నమ్మకస్తులైన పెద్దవారెవరైనా దగ్గరలో ఉంటే విషయాన్ని వివరించాలి. లేదా తల్లిదండ్రులకైనా ఆ విషయం చెప్పాలి. అలాగనుక జరిగితే నేరస్తుడు తప్పించుకోలేడు. మరిన్ని అకృత్యాలకు అడ్డుకట్ట పడుతుంది. మరి ఇదంతా పిల్లలకు చెప్పాల్సింది ఎవరు? ఇంకెవరు తల్లిదండ్రులు, ఇంట్లోవాళ్లు, టీచర్లే. వేధింపులకు గురైన పిల్లలకు మానసిక వైద్యుల ద్వారా ట్రీట్మెంట్ ఇప్పించాలి. గతాన్ని మరచిపోయి వారి జీవితంలో చీకట్లను పారదోలాలి. ఈరోజుల్లో పిల్లలపై అఘాయిత్యాలు జరిగిన ఘటనలు వెలుగులోకి రాగానే.. ‘న్యాయం’ పేరిట బాధితురాలి ఫొటోల్ని, వీడియోల్ని సోషల్ మీడియా ద్వారా వైరల్ చేసేస్తున్నారు కొందరు. అయితే పోక్సో చట్టం ప్రకారం.. పేర్లతో సహా వాళ్ల ఐడెంటిటీకి సంబంధించి ఎలాంటి వివరాల్ని ప్రదర్శించినా అది నేరమే అవుతుంది! దేశంలో ఫస్ట్ టైం.. స్కూల్ దశలోనే పిల్లలకు ‘గుడ్ టచ్- బ్యాడ్ టచ్’ పేరిట అవగాహన కల్పించేందుకు (బొమ్మల పాఠాల రూపంలో) గుజరాత్‌లోని వడోదర పోలీసులు నడుం బిగించారు. మూడేళ్ల క్రితం అప్పటి సిటీ డీసీపీ సరోజ్‌కుమారి, డిపార్ట్మెంట్లో పని చేసే 12 మంది మహిళా పోలీసులతో ‘సమాజ్ స్పర్శ్ కీ’ (ఎస్ఎస్కే)అనే గ్రూప్‌ని ఏర్పాటు చేశారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి దేశంలో ఈ తరహా పాఠాలు పిల్లలకు చెప్పే కార్యక్రమం ఇదే మొదటిది! అలా మూడేళ్లుగా వీళ్ల కృషి కొనసాగుతోంది. - సాక్షి, వెబ్ స్పెషల్ -
వాట్సాప్ స్కాన్.. ఫోన్లోని ఫొటోలన్నీ లీక్??
సోషల్ మీడియా యాప్‌లలో అభ్యంతకర కంటెంట్ వైరల్ కావడం ఈమధ్య కాలంలో పెరిగింది. ఈ తరుణంలో వాట్సాప్‌లోనూ అలాంటి వ్యవహారాలు నడుస్తుండగా.. ‘రిపోర్టింగ్’ ద్వారా సదరు యూజర్ అకౌంట్, గ్రూపుల మీద చర్యలు తీసుకుంటోంది వాట్సాప్. అయితే ఇలాంటి కంటెంట్ కట్టడి కోసం యాపిల్ తీసుకున్న ఓ నిర్ణయం.. యూజర్ ప్రైవసీకి భంగం కలిగించేదిగా ఉందన్న చర్చకు దారితీసింది. ఫొటో ఐడెంటిఫికేషన్ ఫీచర్ పేరిట ఐఫోన్లలో ప్రత్యేక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలని.. తద్వారా వాట్సాప్ ఫొటోలను స్కాన్ చేసి ఆటోమేటిక్‌గా అభ్యంతరకర ఫొటోలను తొలగించే దిశగా యాపిల్ చర్యలు చేపట్టింది. కానీ, ఈ నిర్ణయాన్ని గట్టిగానే వ్యతిరేకిస్తోంది వాట్సాప్. ఈమేరకు వాట్సాప్ హెడ్ విల్క్యాథ్కార్ట్.. యాపిల్ కంపెనీ మీద అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. అశ్లీలత కంటెంట్ గుర్తింపు-కట్టడి కోసం యాపిల్ ఎంతో కాలంగా కృషి చేస్తోంది. ఈ ప్రయత్నం అభినందనీయమే. కానీ, ఫొటో ఐడెంటిఫికేషన్ సాప్ట్వేర్ అనేది యూజర్ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించాలనే ప్రయత్నంగా భావించాల్సి వస్తుంది అని విల్ పేర్కొన్నాడు. యాపిల్ రూపొందించబోయే సాఫ్ట్వేర్ కేవలం వాట్సాప్ స్కానింగ్‌తోనే ఆగదు. ఫోన్లోని వ్యక్తిగత ఫొటోలను, డేటాను సైతం స్కాన్ చేసే అవకాశం లేకపోలేదు. అంటే.. ఇది భద్రతాపరంగా కాకుండా.. యూజర్‌పై నిఘా వ్యవస్థలా పని చేస్తుంది. కాబట్టి ఇలాంటి టూల్స్‌ను వాట్సాప్ ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోదు. అని స్పష్టం చేశాడు విల్. మరోవైపు సైబర్ నిపుణులు కూడా వాట్సాప్ వాదనతో ఏకీభవిస్తున్నారు. ఇదిలా అశ్లీల కంటెంట్, ముఖ్యంగా చైల్డ్ ఎబ్యూజ్ కంటెంట్ కట్టడి కోసం చేసే ప్రయత్నమని యాపిల్ బలంగా చెప్తోంది. అయినప్పటికీ ‘రిపోర్ట్’ చేసే ఆప్షన్ యూజర్‌కి ఉండగా, వాళ్ల అనుమతి లేకుండా సాఫ్ట్వేర్ ద్వారా ఫోన్‌ను, డివైజ్‌లను స్కానింగ్ చేయడం సరైందని కాదని సైబర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు యాపిల్ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. యూజర్ వ్యక్తిగత భద్రతపై ఎలాంటి హామీ ఇవ్వకుండానే.. ఆరోపణలను తోసిపుచ్చుతోంది. ఐవోస్, మాక్‌ఓస్, వాచ్ఓస్, ఐమెసేజ్ డివైజ్‌లలో వీలైనంత తొందరగా ఈ సాఫ్ట్‌వేర్‌ను యూజర్లకు అందించనున్నట్లు ప్రకటించింది. కొత్త వెర్షన్ అప్డేట్ ద్వారా ఈ సాఫ్ట్వేర్ యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని టెక్ కథనాల మ్యాగజీన్ ‘ది వర్జ్’ ఓ కథనం ప్రచురించింది. -
ప్రతిరోజూ 100కు పైగా లైంగిక వేధింపుల కేసులు
సాక్షి, లక్నో: 5 నుంచి 16 ఏళ్ల వయసున్న పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ఓ వ్యక్తిని బండ జిల్లాలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఈ నెలలో అరెస్ట్ చేసింది. గత 10 సంవత్సరాల కాలంలో 50 మంది పిల్లలను వేధించినట్లు ఆరోపణలున్నాయి. కాగా.. అతను ఉత్తరప్రదేశ్‌లోని నీటిపారుదల విభాగంలో జూనియర్ సిబ్బందిగా పనిచేస్తున్నాడు. పిల్లల ఫోటోలను, వీడియోలను డార్క్ నెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పెడోఫిలీస్‌కు విక్రయించాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. (కరోనా: ఒకే ఇంట్లో ఐదురోజుల్లో ముగ్గురి మరణం) అయితే దేశంలో ప్రతిరోజూ 100 మందికి పైగా పిల్లలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్సీఆర్బీ) లెక్కలు చెబుతున్నాయి. కానీ, వాస్తవంగా ఇంతకంటే ఎక్కువ మొత్తంలోనే పిల్లలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. చాలా వరకు ఘటనలు వెలుగులోకి రావడంలేదని, ఇది చాలా తీవ్రమైన సమస్యగా పరిగణించాలని ప్రచారకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించే చట్టం (పోక్సో) 2012 అమలుపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లైంగిక వేధింపులు, అశ్లీల చిత్రాల నుంచి పిల్లల రక్షణ కోసం రూపోందించిన సమగ్ర చట్టమిది. ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడం, ప్రత్యేక ప్రాసిక్యూటర్లను నియమించడం, లైంగిక వేధింపులకు గురైన బాధితులకు మద్దతు ఇవ్వడం ద్వారా కొంత వరకు తగ్గించవచ్చు. న్యాయవ్యవస్థ చిన్న చిన్న లోపాలను ఆసరాగా చేసుకొని నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ సమస్యను కేవలం పోలీసులో, న్యాయ వ్యవస్థనో మాత్రమే కాకుండా మొత్తం సమాజం పరిష్కరించాల్సిన అవసరం ఉంది. రీతూపర్ణా ఛటర్జీ స్థాపించిన ‘ద వాటర్ ఫోనెక్స్ సంస్థ’ ద్వారా బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని తెలిపేలా ఆమె కృషి చేస్తున్నారు. వేధింపులకు గురైనవారు పరువు కోసం జరిగిన విషయం బయటకి చెప్పలేకపోతున్నారు. అలాంటి పరిస్థితులు మారడానికి సమాజమంతా ఉద్యమించాలని నిపుణులు అంటున్నారు. -
పోర్నోగ్రఫీ చూసినా... కటకటాల్లోకే!
సాక్షి, సిటీబ్యూరో: అభం శుభం ఎగురని చిన్నారులపై లైంగిక దాడులు జరగడానికి, పెరగడానికి చైల్డ్ పోర్నోగ్రఫీ ఓ ప్రధాన కారణం. ఈ నేపథ్యంలోనే దీనిపై ప్రపంచ వ్యాప్తంగా నిషేధం కొనసాగుతోంది. ఇంటర్నెట్తో పాటు సోషల్ మీడియాలో సాగుతున్న చైల్డ్ పోగ్నోగ్రఫీపై కన్నేసి ఉంచడానికి నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ (ఎన్‌సీఎంఈసీ) పని చేస్తోంది. చైల్డ్ సెక్స్‌వల్ అబ్యూజ్డ్ మెటీరియల్‌ను (సీఎస్ఏఎం) కనిపెట్టడానికి ఈ సంస్థ అత్యాధునిక సాఫ్ట్వేర్స్ వినియోగిస్తోంది. వీరు గుర్తించిన వివరాల ఆధారంగానే గత వారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు నగరంలోని తార్నాక ప్రాంతానికి చెందిన మహ్మద్ ఫిరోజ్, కాచిగూడ వాసి ప్రశాంత్ కుమార్‌లను అరెస్టు చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న కఠిన చట్టాల ప్రకారం ఇంటర్నెట్తో పాటు సోషల్ మీడియాలో చైల్డ్ పోర్నోగ్రఫీని సెర్చ్ చేసినా, చూసినా, డౌన్లోడ్, అప్లోడ్ చేసినా... నేరమే అని సైబర్ క్రైమ్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అమెరికా కేంద్రంగా ఎన్సీఎంసీ... అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఎన్సీఎంఈసీని ఏర్పాటు చేసింది. ఈ స్వచ్ఛంద సంస్థ ప్రపంచ వ్యాప్తంగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. తప్పిపోతున్న చిన్నారులు, వారిపై జరుగుతున్న లైంగిక దాడులను నిరోధించడానికి ఈ సంస్థ పని చేస్తోంది. చిన్నారులకు సంబంధించి అశ్లీల చిత్రాలు, వీడియోలు, సాహిత్యం తదితరాలను చైల్డ్ పోర్నోగ్రఫీగా పరిగణిస్తారు. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా నిషేధించిన తర్వాత ఎన్‌సీఎంఈసీ కార్యకలాపాలు మరింత ముమ్మరం అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా 18 ఏళ్ల లోపు వయస్సున్న ప్రతి ముగ్గురు బాలికల్లో ఒకరు, ప్రతి ఐదుగురు బాలురులో ఒకరు లైంగిక దాడులకు గురవుతున్నారని ఐక్యరాజ్య సమితికి చెందిన యునిసెఫ్ అధ్యయనంలో తేలింది. ఆన్లైన్లో చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది అత్యంత వేగంగా పెరుగుతోందని ఎన్‌సీఎంఈసీ గుర్తించింది. ఒక్క భారతదేశంలోనే ప్రతి 40 సెకండ్లకు ఈ తరహా వీడియో ఒకటి క్యాప్చర్ అవుతోంది. వివిధ సెర్చ్ ఇంజన్లలో జరుగుతున్న సెర్చ్‌ల్లో 25 శాతం చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించినవే. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం ఈ ఏడాది మే 2 వరకు ఇంటర్నెట్లో 25 వేల చైల్డ్ పోర్నోగ్రఫీకి చెందిన వీడియోలు, చిత్రాలు అప్లోడ్ అయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్‌సీఎంఈసీ ఆన్లైన్, సోషల్‌మీడియాలో ఉన్న చైల్డ్ పోర్నోగ్రఫీపై సాంకేతిక నిఘా వేసి ఉంచుతోంది. అత్యంత పటిష్ట నిఘా... చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి ఇంటర్నెట్, సోషల్‌మీడియా వంటి సైబర్ స్పేస్‌లో ఉన్న అంశాలను సీఎంఏఎంగా పరిగణిస్తారు. దీన్ని గుర్తించడానికి ఎంసీఎంఈసీ ప్రత్యేక సాఫ్ట్వేర్లను రూపొందించింది. గూగుల్, యాహూ సహా ఇతర సెర్చ్ ఇంజన్లు, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ తదితర సోషల్‌మీడియాల్లో ఉన్న సీఎస్ఏఎంలను గుర్తించడానికి ఆయా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆయా సైబర్ స్పేస్, సోషల్‌మీడియాల్లో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన విషయాలను కనిపెట్టడానికి కొన్ని కీవర్డ్స్‌ను రూపొందించింది. ఫలితంగా ప్రపంచంలో ఎవరైనా ఆయా వేదికలపై సీఎస్ఏఎంకు సంబంధించి సెర్చ్ చేసినా, వీక్షించినా, డౌన్లోడ్ చేసినా, అప్లోడ్ చేసినా... అందులో ఉన్న ప్రత్యేక సాఫ్ట్వేర్ వెంటనే వారు వినియోగించిన ఐపీ అడ్రస్‌లను గుర్తిస్తుంది. ఈ వివరాలను తక్షణం ఎన్సీఎంఈకి చెందిన సర్వర్‌కు అందిస్తుంది. వీటిని క్రోడీకరించే అక్కడి సిబ్బంది చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వివరాలు సెర్చ్ చేసిన, చూసిన, అప్లోడ్ చేసిన, డౌన్లోడ్ చేసిన వారి వివరాలను ఆయా దేశాల నోడల్ ఏజెన్సీలకు అందిస్తారు. మన దేశానికి సంబంధించి జాతీయ స్థాయిలో హోమ్ మంత్రిత్వ శాఖ ఆధీనంలోని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. దీంతో ఈ వివరాలు ఎన్‌సీఎంఈసీ నుంచి ఎన్సీఆర్బీకి వస్తాయి. అరెస్టులు చేసే స్థానిక పోలీసులు... ఎన్‌సీఎంఈసీ నుంచి చైల్డ్ పోర్నోగ్రఫీ నిందితుల జాబితా అందుకున్న ఎన్సీఆర్బీ అధికారులు ఆ వివరాలను రాష్ట్రాల వారీగా విభజించి, ఆ సమాచారాన్ని ఆయా రాష్ట్ర స్థాయి దర్యాప్తు సంస్థలకు పంపిస్తారు. 2019లో చైల్డ్ పోర్నోగ్రఫీ అప్లోడ్ చేసిన తెలంగాణకు చెందిన 15 మంది వివరాలను ఇటీవల ఎన్సీఆర్బీ నుంచి రాష్ట్ర సీఐడీ అధికారులకు అందగా.. వీరు ఆ నిందితుల జాబితాలను ఆయా స్థానిక పోలీసులకు పంపించారు. ఇలా ఇద్దరి వివరాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అందగా.. ఐపీ అడ్రస్‌ల ఆధారంగా వారిని గుర్తించారు. గతేడాది ఏప్రిల్‌లో ఫేస్‌బుక్‌లోకి ఓ చైల్డ్ పోర్న్ వీడియోను అప్లోడ్ చేసిన తార్నాక వాసి మహ్మద్ ఫిరోజ్, చిన్నారుల అశ్లీల చిత్రాలను ఓ సైట్లోకి అప్లోడ్ చేసిన కాచిగూడ వాసి ప్రశాంత్ కుమార్‌ను ఇలానే పట్టుకున్నారు. వీరిద్దరిని గురువారం అరెస్టు చేసిన విషయం విదితమే. మిగిలిన 13 మంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉండటంతో ఆయా జిల్లాల పోలీసులకు ఆ సమాచారం సీఐడీ ద్వారా అందింది. వీరినీ అరెస్టు చేయడానికి సన్నాçహాలు జరుగుతున్నాయి. ఈ 15 మందీ తమ ఫోన్ల ద్వారానే ఇంటర్నెట్ను యాక్సస్ చేశారు. కఠిన చర్యలు తీసుకుంటాం ‘చైల్డ్ పోర్నోగ్రఫీని ఎవరు సెర్చ్ చేసినా చర్యలు తప్పవు. ఎన్సీఆర్బీ ద్వారా అందిన సమాచారంతో సుమోటో కేసుల్ని నమోదు చేస్తున్నాం. వీరిపై ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 67 (బి) ప్రకారం ఆరోపణలు రిజిస్టర్ అవుతున్నాయి. ఈ కేసులో నేరం నిరూపణ అయితే మొదటిసారి నేరం చేసిన వారికి గరిష్టంగా ఐదేళ్లు, రెండోసారి అయితే ఏడేళ్ల వరకు శిక్ష పడుతుంది. బాధితులు నేరుగా వచ్చి ఫిర్యాదు చేస్తే దీంతో పాటు పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదవుతాయి. వీటిలో కోర్టు దోషులుగా నిర్థారిస్తే జీవితఖైదు వరకు పడే ఆస్కారం ఉంది. – ఎన్.మోహన్‌రావు, ఇన్స్పెక్టర్, సిటీ సైబర్ క్రైమ్ ఠాణా -
లాక్డౌన్ టైమ్ : చిన్నారులనూ వేధిస్తున్నారు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గత నెల 24న మూడు వారాల లాక్డౌన్ ప్రకటించిన అనంతరం కేవలం 11 రోజుల్లోనే చైల్డ్‌లైన్ ఇండియా హెల్ప్‌లైన్‌కు 92,000 ఫోన్‌కాల్స్ వచ్చాయి. కుటుంబ సభ్యుల నుంచి వేధింపులు, హింసను ఎదుర్కొంటున్న చిన్నారులు హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. చైల్డ్‌లైన్ 1098కి మార్చి 20 నుంచి 21 వరకూ మూడు లక్షల కాల్స్ రాగా, అందులో 30 శాతం 92,105 కాల్స్ వేధింపులు, హింసకు సంబంధించినవని చైల్డ్‌లైన్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ హర్లీన్ వాలియా వెల్లడించారు. ప్రధాని మోదీ లాక్డౌన్ ప్రకటన చేసిన అనంతరం తమ హెల్ప్‌లైన్‌కు 50 శాతం మేర కాల్స్ పెరిగాయని తెలిపారు. లాక్డౌన్ అమలవుతున్న క్రమంలో చిన్నారులపై ఒత్తిడి తగ్గే మార్గాలపై మహిళా శిశుసంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షలో చర్చించామని అధికారులు తెలిపారు. లాక్డౌన్ సమయంలో వేధింపులతో పాటు ఆరోగ్యం బాగాలేదని 11 శాతం కాల్స్, బాలకార్మికులపై 8 శాతం, అదృశ్యమైన, పారిపోయిన చిన్నారులపై 8 శాతం, అనాధ చిన్నారుల గురించి 5 శాతం కాల్స్ వచ్చాయని అధికారులు తెలిపారు. కరోనావైరస్పై 1677 కాల్స్ వచ్చాయని, 237 మంది తమకు అస్వస్థతగా ఉందని సాయం చేయాలని హెల్ప్‌లైన్‌ను సంప్రదించారని పేర్కొన్నారు. కాగా లాక్డౌన్ సందర్భంగా ఇళ్లకు పరిమితమైన భర్తలు తమను వేధింపులకు గురిచేస్తున్నారని పలువురు మహిళలు హెల్ప్‌లైన్‌ను ఆశ్రయించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ ప్రకటించిన అనంతరం గృహహింస ఫిర్యాదులు పెరిగాయని, ఈమెయిల్ ద్వారానే 69 ఫిర్యాదులు అందాయని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ పేర్కొన్నారు. చదవండి : సీఎం సహాయనిధికి విరాళాలు -
పిల్లలపై అత్యాచారాలు 82 శాతం పెరిగాయా?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఇటీవల పిల్లలపై పెరుగుతున్న పలు అత్యాచార సంఘటనలపై స్పందించిన పలు ప్రాంతీయ, జాతీయ పత్రికలు 2015 నుంచి 2016 మధ్య ఏడాది కాలంలోనే పిల్లలపై అత్యాచార సంఘటనలు ఏకంగా 82 శాతం పెరిగాయంటూ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. జాతీయ నేరాల రికార్డు బ్యూరో లెక్కల ప్రకారం 2015లో పిల్లలపై అత్యాచార కేసులు 10,854 నమోదు కాగా, 2016లో 19,765 కేసులు నమోదయ్యాయని, అంటే 82 శాతం కేసులు పెరిగాయని కూడా ఆ పత్రికలు పేర్కొన్నాయి. భారత్‌లో రోజురోజుకు పిల్లలపై అత్యాచారాలు పెరిగి పోతున్నాయంటూ అంతర్జాతీయ పత్రికలైన ‘ది న్యూయార్క్ టైమ్స్, ది గార్డియన్, ది వాషింగ్టన్ పోస్ట్ పత్రికలు కూడా ఈ లెక్కలనే గతంలో పేర్కొన్నాయి. వాస్తవానికి ఆ ఏడాది కాలంలో పిల్లలపై అత్యాచార ఘటనలు ఒక్క శాతానికన్నా ఎక్కువ పెరగలేదు. మరి ఎందుకు లెక్కలు తప్పాయి ? జాతీయ నేరాల రికార్డు బ్యూరో లెక్కల్లోనే తేడా ఉందా ? పత్రికల్లో పేర్కొన్న లెక్కల్లోనే తేడా వచ్చిందా? దేశంలో నకిలీ వార్తలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన వాస్తవాలను కూడా గ్రహించాల్సి అవసరం ఉంది. 2012 సంవత్సరం వరకు రేప్ కేసులను బాధితుల వయస్సుతో నిమిత్తం లేకుండా భారతీయ శిక్షాస్మతి (ఐపీసీ–1860) కింద నమోదు చేసేవారు. 2012లో ‘లైంగిక నేరాల నుంచి పిల్లలను పరిరక్షించే చట్టం (పోస్కో)ను తీసుకొచ్చారు. అప్పటి నుంచి పిల్లలపై జరుగుతున్న రేప్ కేసులను రెండు సెక్షన్ల కింద నమోదు చేస్తూ వస్తున్నారు. ‘క్రైమ్ ఇన్ ఇండియా 2016–స్టాటటిక్స్’ పేరిట జాతీయ నేరాల రికార్డు బ్యూరో 2017, డిసెంబర్ నెలలో ఓ నివేదికను విడుదల చేసింది. అందులో ఐపీసీ, పోస్కో చట్టాల కింద నమోదైన రేప్ కేసులను రెండు కలిపి 19,765 కేసులుగా పేర్కొంది. 2015లో జరిగిన రేప్‌లకు సంబంధించి కేవలం ఐపీఎస్ కింద నమోదయిన 10,854 కేసులను పేర్కొంది. మరోచోట ఎక్కడో పోస్కో చట్టం కింద 8,800 కేసులు నమోదయినట్లు పేర్కొన్నది. ఈ రెండింటిని కలిపితే 19,654 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. 2016లో నమోదైనట్లు పేర్కొన్న రేప్ కేసుల సంఖ్య 19,765 నుంచి ఈ 19,654 కేసులను తీసినేస్తే తేలే సంఖ్య 111. అంటే ఒక్క శాతానికి మించి కూడా కేసులు పెరగలేదన్న మాట. ఒక ఏడాదికి ఐపీసీ కింద నమోదైన సంఖ్యను మాత్రమే తీసుకొని ఆ తర్వాత సంవత్సరానికి ఐపీసీతోపాటు పోస్కో చట్టం కింద నమోదైన కేసులను పరిగణలోకి తీసుకోవడం వల్ల పొరపాటు జరిగిందని తేలిపోతోంది. పిల్లలకు సంబంధించిన రేప్ కేసులను పరిగణలోకి తీసుకోవాలనుకున్నప్పుడు రెండు సెక్షన్ల కింద నమోదైనవి కాకుండా ‘పోస్కో’ చట్టం కింద నమోదయిన కేసులను మాత్రమే పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. -
మైఖేల్ జాక్సన్ పాప్ సాంగ్స్ బ్యాన్
పాప్ రారాజు మైఖేల్ జాక్సన్‌ను బాలలపై లైంగిక దాడులు చేసేవారనే ఆరోపణలు న్నప్పటికీ మరణానంతరం ఆయన వేధింపుల పర్వం వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ప్రపంచ దేశాల్లోని 12కుపైగా రేడియో స్టేషన్లు ఆయన పాప్ గీతాలను బ్యాన్ చేస్తూ నిర్ణయించాయి. మైఖేల్ జాక్సన్ పాప్ గీతాలను తొలగిస్తున్నట్టు ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, కెనడా తదితర దేశాలు వెల్లడించాయి. మరణించి ఇన్నేళ్ళయినా చిన్న పిల్లలపై అతను చేసిన దుర్మార్గాల పర్వం మైఖేల్ జాక్సన్‌ను మరింతగా వెంటాడుతోంది. పాప్ గీతాల తొలగింపునకు తోడు బ్రిటిష్ నేషనల్ ఫుట్‌బాల్ మ్యూజియం నుంచి మైఖేల్ జాన్సన్ మైనపు బొమ్మను తొలగింస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. మైఖేల్ జాక్సన్ పాప్సింగర్గా ఒకవెలుగు వెలుగుతున్న క్రమంలో పిల్లలను లైంగికంగా వేధించేవాడని, వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా జిమ్మీ సెఫ్ చక్ (41), వేడ్ రాబ్సన్ (36) లు తమ పదేళ్ళు, ఏడేళ్ళ వయస్సులో మైఖేల్ తమ పట్ల దారుణంగా, చెప్పలేని విధంగా ప్రవర్తించేవాడని, నెవర్లాండ్ ఎస్టేట్‌లో తాము ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నామని తాజాగా వెలుగులోకి తీసుకొచ్చారు. అంతేకాదు తమ లాంటి బాధితులు చాలా మంది ఉన్నారంటూ సంచలనం సృష్టించారు. ఈ కథనాన్ని బ్రిటన్‌లోని ఓ ఛానల్ బుధవారం రాత్రి ప్రసారం చేసింది. మైఖేల్ ఫ్యాన్స్ కూడా చాలామంది ఇది విని షాక్ తిన్నారు. ఆ మధ్య అతని ఎస్టేట్ లో పని చేసిన ఓ మహిళ కూడా అతని నిర్వాకాన్ని బహిరంగ పర్చిన సంగతి తెలిసిందే. తను చూసిన దృశ్యాలను ఎవరికైనా చెబితే తన గొంతు కోస్తామని, అక్కడి ఉద్యోగులు తనను బెదిరించిన విషయాన్ని ఆమె గుర్తు చేయడం గమనార్హం. -
400 ఛానెళ్లపై నిషేధం
చైల్డ్ అబ్యూజ్ (చిన్నారులను హింసించటం)పై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో యూట్యూబ్ 400 పైగా ఛానళ్లను నిషేధించింది. ముఖ్యంగా యూ ట్యూబ్‌లో పెడోఫిలియా స్కాంపై వినియోగదారుల్లో ఆందోళనలు పెరుగుతున్న క్రమంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే పిల్లల దోపిడీని ప్రోత్సహించే కంటెంట్‌ను, వ్యాఖ్యలను కూడా నిషేధిస్తున్నట్టు యూ ట్యూబ్ ప్రకటించింది. నెస్లే, డిస్నీ,ఎపిక్, మెక్‌డొనాల్డ్ లాంటి టాప్ బ్రాండ్ల ప్రకటనలను తన ప్లాట్‌ఫాంపై నిలిపివేసిన అనంతరం నాలుగువందలకు పైగా ఛానెళ్లపై నిషేధాన్ని ప్రకటించింది యూట్యూబ్. చిన్నపిల్లలను దారుణంగా ప్రభావితం చేస్తున్న అశ్లీల వీడియోలు, వాటిపై చెత్త కమెంట్లకు అనుమతినిస్తున్న యూట్యూబ్‌లోని అల్గోరిథంపై గతవారం రెడిటర్ మాట్విల్సన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇది పోర్నోగ్రఫీకి, చిన్నపిల్లల్లో తీవ్రమైన మానసిక వ్యాధులకు దారితీస్తుందని హెచ్చరించడంతో సంస్థ ఈ దిద్దుబాటు చర్యలకు దిగింది. -
పసిమొగ్గలపై పంజా!
సాక్షి, సిటీబ్యూరో: బుడిబుడినడకల బంగరు బాల్యాన్ని కామాంధులు చిదిమేస్తున్నారు. హైటెక్ బాటలో దూసుకెళుతున్న మన గ్రేటర్‌లోనూ చిన్నారులపై అకృత్యాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల గోల్కొండలోని అజాన్ పాఠశాలల్లో అభం శుభం తెలియని చిన్నారిపై జరిగిన అమానుష ఘటన సభ్య సమాజాన్ని కలచివేసింది. ఇలాంటి దారుణాల విషయంలో దేశంలోని మహానగరాల్లో మన గ్రేటర్ హైదరాబాద్ సిటీ ఐదోస్థానంలో నిలవడం సిటీజన్లను కలవరపెడుతోంది. ఈ విషయంలో బెంగళూరు ప్రథమస్థానంలో నిలవగా..ఆ తర్వాతి స్థానాల్లో ముంబయి, చెన్నై, ఢిల్లీ నగరాలున్నాయి. బాలల హక్కులపై పరిశోధన చేస్తున్న చైల్డ్‌రైట్స్ అనే ఓ స్వచ్ఛంద సంస్థ తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. చిన్నారులపై అమానుషం ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నతపాఠశాల స్థాయిలోవిద్యనభ్యసిస్తున్న మైనర్ బాల, బాలికలపై ఇటీవలికాలంలో బడిలో, ఆటోలు, స్కూల్ వ్యాన్లు, బస్సులు, ట్యూషన్ పాయింట్లు, ట్యుటోరియల్స్, బహిరంగ, నిర్మానుష్య ప్రదేశాల్లో జరుగుతున్న లైంగికదాడులు ఇటు తల్లిదండ్రులు, అటు ఉపాధ్యాయులను కలచివేస్తున్నాయి. ప్రధానంగా బాలికలే అత్యధికంగా ఈ విషయంలో సమిధలుగా మారుతున్నారు. అభం శుభం తెలియని చిన్నవయస్సులో వారిపై జరుగుతోన్న అకృత్యాలతో వారి బంగరు భవితపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి మన గ్రేటర్ సిటీలో ఇలాంటి ఆకృత్యాలు 74 చోటు చేసుకోవడం గమనార్హం. మెట్రోనగరాల్లో ఇలా...జాగ్రత్తలివే.. ♦ పాఠశాలకు, ట్యూషన్లకు తమ పిల్లలను పంపించే తల్లిదండ్రులు ఇలాంటి అంశాలపై అప్రమత్తంగా ఉండాలని చైల్డ్సైకాలజిస్టులు సూచిస్తున్నారు. ♦ బడికివెళ్లే బాలబాలికలకు పాఠశాల ఆటోలు, వ్యాన్లు, బడిలో డ్రైవర్లు, లేదా టీచర్లు, ఆయాలు, వాచ్మెన్లు, నాన్‌టీచింగ్ స్టాఫ్ ఎలా ప్రవర్తిస్తున్నారో తరచూ అడిగి తెలుసుకోవాలి. వీలైతే స్వయంగా వారి ప్రవర్తనను గమనించాలి. ♦ అధిక మార్కులు, ర్యాంకుల కోసం అంతగా సురక్షితం కాని ప్రదేశాల్లోని ట్యూషన్పాయింట్లు, ట్యుటోరియల్స్కి బలవంతంగా పంపించరాదు. ♦ అపరిచితులైన అధ్యాపకులపై కన్నేసి ఉంచాలి. ♦ ఇళ్లలో ట్యూషన్ పెట్టించే తల్లిదండ్రులు అధ్యాపకుల ప్రవర్తనను నిశితంగా పరిశీలించాలి. పిల్లలను ఇళ్లలో ఒంటరిగా వదిలివేయకూడదు. ♦ చిన్నారులు ఇలాంటి అంశాలపై చేసిన ఫిర్యాదులను తేలికగా తీసుకోరాదు. పరువుపోతుందని బాధపడకుండా..తప్పనిసరిగా పాఠశాల యాజమాన్యం, పోలీసుల దృష్టికి తీసుకురావాలి. ♦ చిన్నారులు అధికంగా వీడియోగేమ్స్, సోషల్‌మీడియా, స్మార్ట్ఫోన్లు, టీవీలతో గంటల తరబడి కుస్తీపట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ♦ చిన్నారుల్లో అభద్రతా భావాన్ని పోగొట్టాలి. వారిపై ర్యాంకులు, మార్కులంటూ వత్తిడి పెంచకుండా వారిని స్వేచ్ఛగా ఆడుకోనివ్వాలి. ♦ అపరిచితులు చిన్నారులకు ఆఫర్ చేసే చాక్లెట్స్, బహుమతులు వంటి వాటిని తిరస్కరించమని సూచించాలి. -
ట్వీటే చేటాయెనె?
ట్వీటర్‌ని మన అభిప్రాయాలను పంచుకోవడానికి ఉపయోగిస్తుంటాం. అలా అభిప్రాయాలు పంచుకోవడమే హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ గన్ కొంప ముంచింది. ఎప్పుడో పదేళ్ల క్రితం ఆయన వేసిన కొన్ని జోక్స్ వల్ల హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ సిరీస్ ‘గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ’ సినిమాకి డైరెక్టర్‌గా ఆయన సీట్‌కే ఎసరొచ్చింది. విషయంలోకి వెళ్తే.. దాదాపు పదేళ్ల క్రితం ‘రేప్, చైల్డ్ అబ్యూస్ (చిన్నపిల్లలపై లెంగిక వేధింపులు) వంటి అంశాల గురించి కొన్ని ట్వీట్స్ పోస్ట్ చేశారు దర్శకుడు జేమ్స్ గన్. ఆయన ట్వీట్లు పలువురి మనోభావాలను దెబ్బతీసేలా, రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ జేమ్స్ గన్ను దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాల్ట్ డిస్నీ చైర్మన్ అలన్ హార్న్ పేర్కొన్నారు. ఆయన చేసిన పాత ట్వీట్స్ గురించి జేమ్స్ మాట్లాడుతూ – ‘‘నా కెరీర్ స్టార్టింగ్‌లో చేసిన ట్వీట్లు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. దానికి క్షమాపణలు కోరుతున్నాను. అప్పటికీ ఇప్పటికీ కంప్లీట్‌గా డిఫరెంట్ పర్శన్‌ని అయ్యాను’’ అన్నారు. మరి.. జేమ్స్ ఇచ్చిన ఈ వివరణకు అలన్ హార్న్ కూల్ అవుతారా? ‘గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ 3’ బాధ్యతలను తిరిగి ఇచ్చేస్తారా? ముందు తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటారా? కాలమే చెప్పాలి. -
అమెరికాను కదిలిస్తున్న చిన్నారి సంభాషణ!
వాషింగ్టన్ : అక్రమ వలసదారులపై ఉక్కు పాదం మోపుతున్న ట్రంప్ సర్కార్.. తల్లిదండ్రులనుంచి పిల్లలను వేరు చేస్తుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. వలసదారుల పిల్లలను నిర్బంధ వసతి గృహానికి తరలిస్తుండటంతో.. తల్లిదండ్రులకు దూరమైన ఆ చిన్నారులు అల్లాడిపోతున్నారు. తల్లిదండ్రుల చెంతకు తమను పంపించాలని, లేదంటే కనీసం వారితో ఫోన్లో మాట్లాడే అవకాశమైనా కల్పించాలని వేడుకుంటున్నారు. ఈ క్రమంలో నిర్బంధ గృహంలో ఉన్న ఓ ఆరేళ్ల చిన్నారి తాజాగా ఫోన్లో తీవ్ర ఆవేదనతో మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి. తన ఆంటీతో ఆ పాప మాట్లాడిన ఫోన్ సంభాషణ తాజాగా వైరల్‌గా మారింది. ఎనిమిది నిమిషాల నిడివి గల ఈ సంభాషణలో ‘నేను ఇంటి వద్ద మంచిగా నడుచుకుంటాను. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లండి. ఇక్కడ చాలా ఒంటరిగా ఉన్నాను’ అంటూ చిన్నారి ఏడుస్తూ అన్న మాటలు.. ప్రతి హృదయాన్ని కదిలించి వేస్తున్నాయి. ‘పాపి (స్పానిష్‌లో తండ్రి), మామి (తల్లి).. కనీసం బంధువులైన కలవండి. ఇక్కడ మేం ఒంటరిగా ఉన్నామనే బాధ ఎక్కువగా ఉంది. దయచేసి మాకు విముక్తి కల్పించండి’ అంటూ ఆ చిన్నారి అర్థిస్తున్న.. ఈ సంభాషణ ఆడియోను ప్రోపబ్లికా అనే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విడుదల చేసింది. ఆ చిన్నారి మాటలు వింటుంటే చాలా బాధగా ఉందని, ట్రంప్ ప్రభుత్వం త్వరగా ఆ పిల్లలను వారి తల్లి దండ్రులకు అప్పగించాలని అమెరికా ప్రజలు కోరుతున్నారు. మరోవైపు ఈ ఆడియో టేప్‌ను విన్న హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం సెక్రటరీ నీల్సన్.. చాలా నిర్లక్ష్యంగా స్పందించారు. ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠినమైన వలస వ్యతిరేక విధానాన్ని ఆయన సమర్థించుకున్నారు. నిర్బంధ వసతి గృహంలోని పిల్లలను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయడం లేదని, వారికి కావాల్సిన అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశామని ఆయన చెప్పుకొచ్చారు. అమెరికా అక్రమ వలసదారులకు హాలిడే స్పాట్ కాదని, అక్రమవలస విధానాలపై చట్టాలు మార్చే ప్రసక్తేలేదని, యూరప్ దేశాల్లో చూస్తున్నారుగా అంటూ మరోవైపు ట్రంప్ పరుషంగా ట్వీట్ చేశారు. తల్లిదండ్రుల కోసం అలమటిస్తున్న పసి పిల్లల కోసమైన ఈ వలస చట్టాలు మారుస్తే బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
అసహజ శృంగారం.. పైశాచిక చర్య!
ఘజియాబాద్ : ఉత్తరప్రదేశ్‌లో జుగుప్సాకరమైన ఘటన చోటు చేసుకుంది. ఓ టీనేజర్‌పై ఐదుగురు యువకులు అసహజ శృంగారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా పైశాచిక చర్యలకు పాల్పడి వీడియోలు తీశారు. ఈ దారుణం గత గురువారం ఘజియాబాద్ సమీపంలోని మోదీనగర్‌లో చోటుచేసుకుంది. బాధితుడు తన మోటర్‌సైకిల్‌ను సర్వీసింగ్‌కు ఇచ్చి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని సీనియర్ ఎస్పీ వైభవ్‌కృష్ణ శనివారం మీడియాకు తెలిపారు. మెకానిక్ షాప్‌లో ఉన్న ఐదుగురు యువకులు ఆ టీనేజర్‌ను లోపలికి లాక్కెళ్లి లైంగిక దాడికి యత్నించారు. టీనేజర్ తప్పించుకునే ప్రయత్నం చేయడంతో తీవ్రంగా కొట్టి వ్యక్తిగత అవయవాల్లో ఐరన్ రాడ్ జొప్పించి వేదింపులకు గురిచేశారని తెలిపారు. నిందితులు అంతటితో ఆగకుండా ఈ తతంగాన్ని మొబైల్లో చిత్రీకరించారని, ఆపై టీనేజర్ వద్ద రూ.1600 లాక్కున్నట్లు ఎస్సీ పేర్కొన్నారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తన కుమారుడిని నిందితులు కొంతకాలం నుంచి వేధిస్తున్నట్లు బాధితుడి తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుల్లో హెడ్ కానిస్టేబుల్ కుమారుడు కూడా ఉన్నట్లు ఆయన ఆరోపించారు. -
బాలికపై మైనర్ లైంగిక దాడి
సాక్షి, కందుకూరు: బాలికపై మైనర్ బాలుడు లైంగికదాడికి పాల్పడిన సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. సీఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని చిప్పలపల్లిలో 8 ఏళ్ల వయస్సు గల బాలికను శుక్రవారం ఒంటరిగా ఇంటి వద్ద వదిలి తల్లి పొలం పనులకు, తండ్రి ఓ ఫంక్షన్‌కు వెళ్లారు. కాగా తిరిగి మధ్యాహ్నం 2 గంటల సమయంలో తల్లి ఇంటికి రాగా తలుపులు సగం తెరిచి ఉండడం గుర్తించి ఇంట్లోకి వెళ్లి చూడగా తన కుమారైపై వారి బంధువు, వరుసకు ఆ బాలికకు అన్న అయ్యే మైనర్ బాలుడు(16) లైంగిక దాడి చేస్తూ కనిపించాడు. ఆమెను చూడగానే వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయమై బాధితులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తెలంగాణలో చైల్డ్ ఫ్రెండ్లీ ప్రత్యేక కోర్టు!
సాక్షి, హైదరాబాద్ : లైంగిక వేధింపులకు గురయిన బాలల కోసం దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ప్రత్యేక కోర్టు ఏర్పాటుచేస్తున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలకు అండగా నిలిచేందుకు ఇప్పటికే ప్రత్యేకంగా భరోసా సెంటర్‌ను ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కిందని, ఈ భరోసా సెంటర్లో బాధితులకు కౌన్సెలింగ్‌తోపాటు పునరావాసం కల్పిస్తున్నామని ఆయన శనివారం విలేకరులకు తెలిపారు. గత రెండేళ్లలో పోక్సో (POCSO) చట్టం కింద బాలలపై నమోదైన వేధింపుల కేసులను భరోసా సెంటర్లో పరిష్కరించడం జరిగిందని తెలిపారు. కానీ వేధింపుల బారిన పడే బాలలకు అండగా ఉండేందుకు, వారికి సత్వర న్యాయం కల్పించడానికి ప్రత్యేకంగా చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు ఏర్పాటుచేస్తున్నామని, పోక్సో చట్టం కింద నమోదైన కేసులను ఈ కోర్టు విచారిస్తుందని ఆయన తెలిపారు. -
వాట్సప్ కిడ్స్‌పోర్న్ రాకెట్.. 66 మంది ఇండియన్స్
సాక్షి, న్యూఢిల్లీ : వాట్సప్ గ్రూప్ పేరు ’కిడ్స్ త్రీబుల్ఎక్స్’. ఈ గ్రూప్ లో అన్ని అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు మాత్రమే షేర్ చేసుకుంటారు. 40 దేశాలకు చెందిన వారు ఇందులో సభ్యులు. దురదృష్టకరం ఏమిటంటే ఎక్కువ మంది ఇండియా కు చెందిన వారే. 66 మంది ఇండియా వారు, 56 మంది పాకిస్తాన్‌కు చెందిన వారు, 29 మంది అమెరికాకు చెందిన వారు. ఈ గ్రూప్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వర్మ అనే యువకుడు నిర్వహిస్తూన్నట్టు, అతడ్ని అరెస్టు చేసినట్టు సీబీఐ వెల్లడించింది. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్, ఫోన్‌ను తిరువనంతపురం లోని ఫోరెన్సిక్ ఎగ్జామ్ ఆఫ్ ఎలక్ర్టానిక్ గ్యాట్జెట్స్ (సీ డీఏసీ)లో పరీక్షించి నిజాలను బట్ట బయలు చేశారు. ముంబాయికి చెందిన సత్యేంద్ర చౌహాన్, ఢిల్లీకు చెందిన నఫీస్ రాజా, జాహిద్, నోయిడాకు చెందిన ఆదర్శ్‌లను గ్రూప్ అడ్మిన్లుగా పోలీసులు గుర్తించారు. పిల్లలను ఈ గ్రూప్‌లో చేర్చుకొని పోర్న్ చిత్రాలు, వీడియోలు పంపడానికి వర్మ డబ్బును డిమాండ్ చేసి ఉంటాడని భావిస్తున్నారు పోలీసులు. అసభ్యకర చిత్రాలు, వీడియోలు ఇతరులకు పంపడం తీవ్ర నేరం అని, ఐటీ చట్టం ప్రకారం 7 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల వరకు జరిమాన పడే అవకాశం ఉన్నట్టు పోలీసులు తెలిపారు. -
‘స్వేచ్ఛా ప్రతిమ’...
అమెరికా నిర్వచనం చెప్పమంటే స్వేచ్ఛ ‘ప్రతిమ’ రూపంలో ఉన్న ఒక దేశం అన్నారట ఎవరో. షెర్రీ జాన్సన్ వంటి వారి గాథలు వింటే ఆ మాట నిజమే అనిపిస్తుంది. నాగరికతకు మారుపేరుగా నిలిచిన అగ్రదేశంలో బాల్యవివాహాలకు చట్టబద్ధత ఉందంటే ఆశ్చర్యం కలగకమానదు. తల్లిదండ్రులు, జడ్జి సమ్మతి ఉంటే చాలు అక్కడి చట్టాల ప్రకారం మైనర్లు కూడా పెళ్లి చేసుకోవచ్చు. అయితే ఇలాంటి చట్టాల వల్ల కొంతమంది అమ్మాయిలు తాము కలలోనైనా ఊహించలేని పెళ్లి చేసుకోవాల్సి వస్తోంది. ఆ కోవకు చెందిన వారే షెర్రీ జాన్సన్. ఎనిమిదేళ్ల ప్రాయం మొదలు పలుమార్లు అత్యాచారానికి గురై, తల్లిగా మారి, పదకొండేళ్ల వయస్సులో అత్యాచారం చేసినవాడినే పెళ్లిచేసుకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొన్నారు. తల్లి కోసం కన్నీళ్లను దిగమింగారు. కష్టాలను మౌనంగా భరించారు. కానీ ఇక అలా ఉండటం ఆమెకు నచ్చలేదు. తనకు జరిగిన అన్యాయం మరే ఆడపిల్లకు జరగకూడదని, బాల్య వివాహాలను నిషేధించాలని పోరాటం చేస్తున్నారు. ఈ న్యాయపోరాటంలో ఆమెకు ఎంతో మంది తోడ్పాటునందిస్తున్నారు. వారిలో దక్షిణ ఫ్లోరిడా సెనేటర్లు లారెన్ బుక్, లిజ్బెత్ బెనాక్విస్తో(సెనేట్‌లో బాల్య వివాహాలకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టారు) ముందున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన మీ టూ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ, లైంగిక హింసకు వ్యతిరేకంగా గళమెత్తారు. ఇక్కడ విశేషమేమిటంటే వారు కూడా షెర్రీ మాదిరిగానే బాల్యాన్ని కోల్పోయి, వేధింపులకు గురైనవారే. ఆమె బాల్యం... అంతులేని విషాదం షెర్రీ కథ వింటే కళ్లు చెమర్చకమానవు. ఫ్లోరిడాలోని టంపా సిటీలో తల్లితో పాటు చర్చ్ ఆవరణలోని గదిలో నివసించేది. వారిద్దరూ వారానికి ఆరు రోజులపాటు చర్చిలో సేవ చేసేవారు. చర్చి పెద్దలు చెప్పినట్లుగా నడుచుకువాలనే ఎన్నో నిబంధనల నడుమ ఆమె బాల్యం మొదలైంది. బాల్యానికి సంబంధించి తల్లి చేసే బిస్కెట్లు తింటూ, కలర్ పెన్సిళ్లతో డ్రాయింగ్ చేయడం వంటి అతికొన్ని ఙ్ఞాపకాలు మాత్రమే ఆమెకు మిగిలాయి. మిగతాదంతా అసలు ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో తెలుసుకోలేని పసిప్రాయంలో ఆమె గోడు వినేవారే కరువయ్యారు. వల వేసి.. వంచించి భోజనం చేయాలంటే చర్చ్ బిషప్ ఇంటిలో నివసించే తన ఆంటీ ఇంటికి ప్రతిరోజూ వెళ్లాల్సిందే. ఈ క్రమంలో షెర్రీపై కన్నేసిన బిషప్ ఆమె ఆంటీ లేని సమయం చూసి అత్యాచారం చేసాడు. అప్పుడు ఆమె వయస్సు ఎనిమిదేళ్లు. అసలు అతను ఎందుకు అలా ప్రవర్తించాడో అర్థం చేసుకోలేని పసిప్రాయం. క్రూర మృగాళ్లు.. బిషప్తో పాటు, అతని సహాయకుడు కూడా షెర్రీని బలాత్కారం చేయడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని తల్లికి చెప్పాలని షెర్రీ ఎన్నోసార్లు ప్రయత్నించినా అరణ్యరోదనగానే మిగిలింది. తన మాటలు తల్లి పట్టించుకోకపోవడంతో ఎదిగే క్రమంలో అత్యాచారానికి గురౌవడం కూడా ఒక భాగమనే నిర్ణయానికి వచ్చింది పాలబుగ్గల షెర్రీ. తోటి విద్యార్థులంతా నీ దగ్గర చేపల వాసన వస్తుందంటూ గేలి చేస్తుంటే కుమిలి కుమిలి ఏడ్వడం కూడా ఆమెకు అలవాటయింది. బడిలో బయటపడిన నిజం.. విద్యార్థుల సాధారణ చెకప్‌లో భాగంగా షెర్రీని కూడా పరీక్షించి బయటకు వెళ్లమని చెప్పింది నర్స్. కాసేపటి తర్వాత వస్తువులన్నీ తీసుకుని బయటకు రావాల్సిందిగా షెర్రీని ఆదేశించింది స్కూలు యాజమాన్యం. ఆమె తల్లికి ఫోన్ చేసి, ఇంటికి తీసుకువెళ్లాలని కోరారు. కూతురు ఏం తప్పు చేసిందోనని కంగారుగా స్కూలుకు చేరిన తల్లికి తాను చేసిన తప్పేమిటో అప్పుడు అర్థమయింది. పదేళ్ల షెర్రీ ఏడు నెలల గర్భవతి అని తెలుసుకుని నిర్ఘాంతపోయింది, కూతురిని నిందించింది. పేగు బంధం.. కనుమరుగైన వేళ కూతురు గర్భానికి కారణం బిషప్ అనుచరుడని చర్చిలో ఉన్నవారందరికీ తెలిసేలా చేసి, ప్రసవం కోసం మరో మృగాడు బిషప్తో షెర్రీని దూరంగా పంపివేసింది ఆమె తల్లి. అమ్మతనానికి మచ్చ తెచ్చేలా ప్రవర్తించింది. బాల్యానికి సంకెళ్లు.. ఆదరించి, ఆలనాపాలనా చూసుకునే తల్లి పక్కనలేక, శరీరంలో వస్తున్న మార్పులకు కారణం చెప్పేవారు లేక హాస్పిటల్ బెడ్‌పై నరకయాతన అనుభవించింది షెర్రీ. 1970లో పదేళ్ల పసిప్రాయంలో తన మొదటి బిడ్డకి జన్మనివ్వడంతో చదువుకోవాలనే ఆమె ఆశకు సంకెళ్లు పడ్డాయి. అక్కున చేర్చుకోవాల్సింది పోయి.. కూతురుకి ఈ గతి పట్టించిన మగాళ్లకు శిక్ష పడేలా చేయాల్సిన షెర్రీ తల్లి, ఆమె బాల్యాన్ని వివాహమనే బందీఖానాలో పడేసేందుకు ప్రయత్నాలు చేసింది. అత్యాచారం చేసిన వాడినే పెళ్లి చేసుకోవాలని బలవంతపెట్టింది. కోర్టు ఇందుకు నిరాకరించినా చట్టాన్ని అడ్డు పెట్టుకుని కూతురి బాల్యాన్ని, బతుకుని చిదిమేసింది. అలా పదకొండేళ్ల ప్రాయంలో 20 ఏళ్ల వ్యక్తికి భార్యగా మారింది షెర్రీ. ఆనాడు కోర్టులో తల్లికి, జడ్జికి జరిగిన సంభాషణ ఇప్పటికీ చెవుల్లో మారుమోగుతుందని 58 ఏళ్ల షెర్రీ చెప్తుందంటే ఆమె ఎంత క్షోభ అనుభవించిందో అర్థం చేసుకోవచ్చు. అంతటితో ఆగలేదు.. కూతురి పెంపకంలో షెర్రీకి, ఆమె తల్లి సాయం చేస్తుండటం వల్ల మళ్లీ స్కూలుకు వెళ్లే అవకాశం దక్కింది. కానీ ఆమె భర్త నుంచి విముక్తి మాత్రం లభించలేదు. ఒకరి తర్వాత ఒకరికి జన్మనివ్వడమే షెర్రీ నిరంతర కర్తవ్యంగా మారింది. ఏ ప్రేమకు నోచుకోలేదు.. పదేళ్ల ప్రాయం నుంచే పిల్లల డైపర్లు వాష్ చేస్తూ, వారి ఆలనా పాలనా చూస్తూ గొడ్డు చాకిరీ చేసేది. తన పిల్లలు బొమ్మలతో ఆడుకుంటూంటే తాను వారితో ఆడుకుంటూ కోల్పోయిన బాల్యాన్ని వెదుక్కునేది. భర్తకు మాత్రం ఆమె శరీరంతో తప్ప, మనసుతో సంబంధం ఉండేది కాదు. ప్రేమగా మాట్లాడేవాడు కూడా కాదు. కేవలం తన కోరికల్ని తీర్చే సాధనంగా భావించి చిత్ర హింసలకు గురిచేసేవాడు. ఆ విధంగా 17 ఏళ్లకే ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది షెర్రీ. అతనితో విసిగిపోయిన షెర్రీ విడాకులకు దరఖాస్తు చేసి 19 ఏళ్ల వయసులో ఆ నరకం నుంచి బయటపడింది. రెండో‘సారీ’... మోడువారిన జీవితం చిగురిస్తుందనే ఆశతో.. విడాకులు తీసుకున్న తర్వాత 37 ఏళ్ల వయసున్న మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. కానీ ఆమె ఆశ ఆవిరైంది. అతను కూడా మొదటి భర్త మాదిరిగానే శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. పిల్లల కోసం అదంతా మౌనంగా భరించింది. 27 ఏళ్ల వయసుకే ఐదుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిల బాధ్యత ఆమెకు అనేక కష్టాలను తెచ్చిపెట్టింది. మౌనం వీడి.. పోరాటానికి సిద్ధపడి తనకు అన్యాయం జరగటానికి ఒక విధంగా తన మౌనమే కారణమని భావించిన షెర్రీ.. ఇకనైనా పోరాట పంథా ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. గత ఐదేళ్లుగా అందుకోసం శ్రమిస్తూనే ఉంది. ఆమె ప్రయత్నాలు ఫలించినట్లయితే ఎంతో మంది చిన్నారులు వివాహమనే చెర నుంచి విముక్తులవుతారు. ఫ్లోరిడా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. మైనర్ వివాహాలను అరికట్టేందుకు చట్టం చేసే మొదటి రాష్ట్రంగా నిలవబోతోంది. ఆత్మకథతో ప్రయాణం... బిల్లు ఆమోదం పొందినట్లయితే తన ఆత్మకథ..‘ఫర్గివింగ్ ద అన్ఫర్గివబుల్ ’ను నాటక రూపంలో ప్రదర్శించాలనే యోచనలో ఉన్నారు. అలాగే బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బస్ టూర్ ప్లాన్ చేసి, బడ్జెట్‌ను కూడా నిర్ణయించేశారు. ఇందుకోసం తన స్నేహితురాలు లారెన్ బుక్ సహాయం తీసుకుంటున్నారు. - సుష్మారెడ్డి యాళ్ళ -
అమ్మాయిల కోసం 20వేల మంది ఆన్లైన్ వేట
లండన్ : బ్రిటన్‌లో ఆన్లైన్ వేదికగా మైనర్ బాలికల కోసం 20 వేల మంది పురుషులు వేట సాగించారని ఆ దేశ పోలీసులు తెలిపారు. మైనర్లపై లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. ఈ ఒక్క ఏడాదే వీటికి సంబంధించిన 70వేల ఫిర్యాదులు బ్రీటీష్ నేషనల్ క్రైమ్ ఏజన్సీకి అందాయన్నారు. 2006లో ఈ సంఖ్య 6వేలు ఉండగా ఇప్పుడిన్ని ఫిర్యాదులు రావడం కలవరపెడుతుందన్నారు. చిన్నారుల సంరక్షణ పోలీసు అధికారి మాట్లాడుతూ.. 2017లో యూకే వ్యాప్తంగా ఆన్లైన్ వేదికగా అమ్మాయిల కోసం వెతికిన సుమారు 4వేల మందిని గుర్తించామన్నారు. ఈ సంఖ్య 20వేల వరకు ఉండొచ్చాన్నారు. మైనర్లపై వేధింపులు గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 31 శాతం పెరిగాయని తమ దర్యాప్తులో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. యూకే వ్యాప్తంగా ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడే నేరస్థులను గుర్తించడానికి పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారని పేర్కొన్నారు. ఆన్లైన్లో గడిపే చిన్నారులు లైవ్‌స్ట్రీమింగ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఈ విషయంలో టెక్ కంపెనీలు ఫేస్బుక్, ట్విట్టర్లకు సూచనలు చేశామన్నారు. ఆన్లైన్ ఆసరా చేసుకొని కొంతమంది పురుషులు చిన్నారులను లైంగిక ప్రలోభాలకు గురిచేస్తున్నారని, ఇవి తెలియక అమాయక మైనర్లు మానసిక క్షోభకు గురవుతున్నారని తెలిపారు. చిన్నారుల విషయంలో తల్లితండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. -
అమ్మా.. నే చదువుకుంటా!
► భిక్షాటన చేయనన్న బాలిక ► చిత్రహింసలు పెట్టిన మారు తల్లి ► పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు అమ్మా... అందరి పిల్లల్లా నేనూ చదువుకుంటా.. ఆనక ఉద్యోగం చేసి నిన్నూ సాకుతా.. అన్నీ బానేవుండీ అడుక్కోవాలంటే సిగ్గుతో చచ్చిపోతున్నా.. రోడ్డున పోయేవారు ఇదేం బతుకని ముఖంమీదే తిడుతుంటే... సిగ్నళ్ల దగ్గర పోకిరోళ్లు అదోలా చూస్తుంటే తట్టుకోలేకపోతున్నా.. నేనీ బిచ్చమెత్తలేను.. నన్నొదిలెయ్... తల్లి గాని తల్లి వద్ద పదిహేనేళ్ల బాలిక ఆక్రందన ఇది. సాక్షి, హైదరాబాద్: ఆ తల్లి మనసు కరగలేదు. మాట విననందుకు... తన ఆదేశాలు ధిక్కరించినందుకు ఆ బాలికను చిత్రహింసలు పెట్టిందా మారు తల్లి. కర్రతో గొడ్డును బాదినట్టు బాది... చేతిపై వాతలు పెట్టి... ప్రత్యక్ష నరకం చూపింది. ఈ బాధలు తట్టుకోలేక బాలిక సోమవారం పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన నాగలక్ష్మి (15) మూడో తరగతి వరకు చదువుకుంది. తల్లిదండ్రులిద్దరూ చిన్నప్పుడే చనిపోవడంతో అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ తాను పెంచుకుం టానంటూ ఏడేళ్ల క్రితం బాలికను హైదరాబాద్‌కు తీసుకొచ్చింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో భిక్షాటనకు పెట్టింది. రోజూ రూ.250 తీసుకురాకపోతే వాతలు పెట్టేది. అర్ధరాత్రి అయినా.. వానొచ్చినా.. టార్గెట్ పూర్తి చేయనిదే ఇంటికి రావడానికి వీల్లేదని హెచ్చరించింది. జ్వరం వచ్చినా... ఆరోగ్యం బాగా లేకున్నా.. ఆ దీన స్థితి చూసి మరిన్ని డబ్బులు జోలెలో పడతాయంటూ చౌరస్తాలో కూర్చోబెట్టేది. అయితే వయసు పెరుగుతుండటంతో నాగలక్ష్మికి భిక్షాటన నామోషీగా అనిపించింది. రోజూ చౌరస్తాలో తాను పడుతున్న బాధలు, ఇబ్బందులను తల్లికి చెప్పింది. ఇకపై ఆ పని చేయలేనని, చదువుకుంటానని వేడుకుంది. ఇంట్లో కూర్చున్నందుకు తల్లి రోజూ ఒంటిపై వాతలు పెట్టి, చితకబాది హింసించడం మొదలుపెట్టింది. ఇవి భరించలేక బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తానా ఇంటికి పోనని, ఏదైనా ఆశ్రమంలో చేర్పించి, ఈ పాడు జీవితం నుంచి విముక్తి కల్పించాలని పోలీసులను ప్రాథేయపడింది. పునరావాస కేంద్రానికి తరలింపు: స్పందించిన పోలీసులు మారు తల్లిని స్టేషన్‌కు రప్పించారు. నాగలక్ష్మి తన బిడ్డేనని ఆమె వాదించింది. అందుకు ఆధారాలు చూపాలని పోలీసులు కోరగా... నీళ్లు నమిలింది. తనలాగే మరికొందరిని జూబ్లీహిల్స్, కేబీఆర్ పార్కు చౌరస్తాల్లో నియమించిందని, సాయంత్రం కాగానే డబ్బులు వసూలు చేసుకొని వెళ్తుందని నాగలక్ష్మి పోలీసులకు తెలిపింది. నాగలక్ష్మిని పోలీసులు నింబోలి అడ్డాలోని బాలికల పునరావాస కేంద్రానికి తరలించారు.