'ఇలాంటివి చాలా భయానకం'.. మెగా హీరో మరో ట్వీట్‌! | Bhatti Vikramarka Responds On Hero Sai Dharam Tej Tweet Goes Viral | Sakshi
Sakshi News home page

Sai Dharam Tej: 'సోషల్ మీడియాలో ఇలాంటి రాక్షసులు'.. చర్యలు తీసుకోవాలన్న మెగా హీరో!

Published Sun, Jul 7 2024 5:07 PM | Last Updated on Sun, Jul 7 2024 6:08 PM

Bhatti Vikramarka Responds On Hero Sai Dharam Tej Tweet Goes Viral

సోషల్ మీడియాలో జరుగుతున్న దారుణాలపై మెగా హీరో సాయిధరమ్ తేజ్‌ మరో ట్వీట్‌ చేశారు. పేరేంట్స్‌ చాలా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాల్లో పిల్లల ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేయవద్దని ఆయన కోరారు. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు.

ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే మరో ట్వీట్ చేశారు సాయి ధరమ్ తేజ్. ఫన్నీ పేరుతో చిన్న పిల్లలను ట్రోల్‌ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. తాజాగా కొంతమంది యూట్యూబర్స్‌ ఓ తండ్రి, తన చిన్నారి కూతురి వీడియోను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేస్తూ తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు.

స్పందించిన భట్టి విక్రమార్క

తాజాగా ఈ సాయి ధరమ్ తేజ్‌ చేసిన ట్వీట్‌పై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి స్పందించారు. ఇలాంటి క్లిష్టమైన సమస్యను లేవనెత్తినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు.. తాము చిన్నపిల్లల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. సోషల్ మీడియా వేదికగా చిన్నపిల్లలను ఉద్దేశించి అసభ్యకరమైన పోస్టులు పెడితే సహించేది లేదన్నారు. చిన్నపిల్లల భద్రత కోసం తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని.. తప్పకుండా చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క ట్వీట్‌లో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement