'అమ్మ తోడు.. నిన్ను వదిలిపెట్టను'.. మంచు మనోజ్ వార్నింగ్! | Tollywood Hero Post Goes Viral On Social Media Posts Against Childrens | Sakshi
Sakshi News home page

Manchu Manoj: 'ఇలాంటి వారు చాలా ప్రమాదకరం'.. మంచు మనోజ్ వార్నింగ్!

Published Sun, Jul 7 2024 7:07 PM | Last Updated on Sun, Jul 7 2024 7:07 PM

Tollywood Hero Post Goes Viral On Social Media Posts Against Childrens

సోషల్‌ మీడియాలో పిల్లల ఫొటోలు, వీడియోలు పోస్ట్‌ చేయడంలో అప్రమత్తంగా ఉండాలని మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ చేసిన ట్వీట్‌ చేశారు. ప్రస్తుత రోజుల్లో సామాజిక మాధ్యమాలు చాలా భయంకరంగా మారాయని తల్లిదండ్రులను హెచ్చరించారు. అయితే టాలీవుడ్ హీరో చేసిన పోస్ట్‌కు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, సీఎం రేవంత్‌ రెడ్డి సైతం స్పందించారు. చిన్నపిల్లలపై అసభ్యంగా ప్రవరిస్తూ వీడియోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తాజాగా చిన్న పిల్లల భద్రతపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ స్పందించారు. ఇలాంటి వ్యక్తుల ప్రవర్తన సహించరానిదని ఆయన అ‍న్నారు. ఫన్‌ ముసుగులో జరుగుతున్న ఈ దారుణాలు చాలా ప్రమాదకరమని తెలిపారు. ఏడాది క్రితం ఏపీ, తెలంగాణలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకునేందుకు ఇన్‌స్టా ద్వారా పి హనుమాన్ అనే వ్యక్తిని సంప్రదించాను.. కానీ అతని నుంచి ఎలాంటి స్పందన రాలేదని మనోజ్ వెల్లడించారు. 

ఈ రోజు చూస్తే అతను పసిపిల్లలపై నీచమైన కామెంట్స్ చేస్తున్నాడని మంచు మనోజ్‌ రాసుకొచ్చారు. మన పిల్లలు, మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని.. ఇలాంటి వారిని అసలు ఉపేక్షించవద్దని తెలుగు రాష్ట్రాల పోలీసులకు విజ్ఞప్తి చేశారు. వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల సీఎంలు, అమెరికాలోని ఇండియన్ ఎంబసీని కోరారు. పి హనుమంతు.. అమ్మ తోడు.. నిన్ను వదిలిపెట్టను అంటూ అతనికి మంచు మనోజ్ వార్నింగ్ ఇచ్చారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement