'సాయి ధరమ్‌ తేజ్‌ పోస్ట్‌.. ఇలా జరిగినందుకు క్షమాపణలు': సుధీర్‌ బాబు | Tollywood Hero Sudheer Babu Reacts On Sai Dharam Tej Post On Social Media, Tweet Goes Viral | Sakshi
Sakshi News home page

Sudheer Babu: ఇలాంటి వ్యక్తి ఉన్నాడంటేనే అసహ్యమేస్తోంది: సుధీర్ బాబు

Published Mon, Jul 8 2024 4:28 PM | Last Updated on Mon, Jul 8 2024 4:51 PM

Tollywood Hero Sudheer Babu Reacts On Sai Dharam Tej post On Social Media

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ చేసిన ట్వీట్‌కు మద్దతుగా టాలీవుడ్ హీరోలు స్పందిస్తున్నారు. ఇప్పటికే మంచు మనోజ్ ఇలాంటి వాళ్లను వదిలిపెట్టను అంటూ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చిన్నపిల్లలు, మహిళలపై అసభ్యకరమైన వీడియోలు చేసేవారిని అస్సలు ఊపేక్షించవద్దని సోషల్ మీడియా వేదికగా కోరారు. దీనిపై ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. తాజాగా మరో టాలీవుడ్ హీరో రియాక్ట్‌ ‍అయ్యారు. ఇలా జరిగినందుకు క్షమించాలంటూ ట్వీట్‌ చేశారు.

ఇటీవల హరోం హర సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన హీరో సుధీర్ బాబు ఈ అంశంపై ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఇలాంటి దారుణానికి పాల్పడిన వ్యక్తి ప్రణీత్ హనుమంత్ నా చిత్రం హరోం హరలో నటించినందుకు క్షమాపణలు కోరుతున్నా ‍అని అన్నారు. ప్రణీత్ హనుమంతు నా సినిమాలో నటించడం చాలా అసహ్యంగా భావిస్తున్నట్లు తెలిపారు. అతను ఇలాంటి వ్యక్తి అని తనకు తెలియదన్నారు. 

సుధీర్ బాబు ట్వీట్‌లో రాస్తూ..'మంచో, చెడో నేను అయితే సోషల్ మీడియా వ్యక్తిని కాదు. ఇలాంటి విషయాలను అస్సలు క్షమించను. ప్రణీత్ హనుమంతు అనే వ్యక్తి హరోం హార చిత్రంలో నటించడం అసహ్యంగా భావిస్తున్నా. ఈ విషయంలో మా చిత్ర బృందం తరఫున హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నా. ఈ మనిషి ఇలాంటి వాడని నాకు తెలియదు. అతని గురించి సోషల్ మీడియాలో బహిర్గతం చేయడానికి నేను ధైర్యం చేయలేకపోయా. కానీ ఇలాంటి విషయాలపై మనం దృష్టి సారించాలి. ఇది ఏ విధంగానూ వాక్ స్వాతంత్ర్యం కాదు.'  అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement