ఇలాంటి సమయంలో చెప్పాల్సి వస్తుందని ఊహించలేదు: ప్రణీత్ బ్రదర్‌ | Praneeth Hanumanth Brother Aye Jude Responds On Latest Social Media Issue | Sakshi
Sakshi News home page

Praneeth Hanumanth Brother: 'రోడ్డుపైనే నా లైఫ్‌ స్టార్ట్ చేశా.. ఇప్పుడు చెప్పక తప్పడం లేదు'

Published Thu, Jul 11 2024 9:17 AM | Last Updated on Thu, Jul 11 2024 10:25 AM

Praneeth Hanumanth Brother Aye Jude Responds On Latest Social Media Issue

సోషల్ మీడియాలో చిన్నపిల్లలపై అసభ్యకరమైన వీడియోలు చేస్తోన్న ప్రముఖ యూట్యూబర్‌ ప్రణీత్‌ హనుమంతును పోలీసులు అరెస్ట్ చేశారు. హీరో సాయి ధరమ్ తేజ్‌ చేసిన ట్వీట్‌తో అతని పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. ప్రణీత్‌పై చర్యలు తీసుకోవాలంటూ పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. దీంతో అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు.

తాజాగా ప్రణీత్ అరెస్ట్‌పై ఆయన సోదరుడు అజయ్ హనుమంతు(అయే జుడే) స్పందించారు. తప్పు ఎవరు చేసినా తప్పేనని.. అది తమ్ముడైనా సరే శిక్ష పడాల్సిందే అన్నారు. తన పెళ్లి గురించి ఇలాంటి సమయంలో చెప్పాల్సి వస్తుందని ఊహించలేదన్నారు. కానీ తప్పడం లేదు.. నాకు పెళ్లై ఇప్పటికే ఆరేళ్లయిందని అయే జుడే తెలిపారు. ఇంజినీరింగ్ పూర్తయిన వెంటనే లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్నట్లు తెలిపారు.

అజయ్ మాట్లాడుతూ..' నా పెళ్లి విషయం సంతోషకరమైన సమయంలో చెబుదామని అనుకున్నా. కానీ చెప్పక తప్పడం లేదు. నా పెళ్లి జరిగి ఆరేళ్లైంది. కాలేజీ పూర్తవ్వగానే లవ్ మ్యారేజ్ చేసుకున్నా. అప్పటి పరిస్థితులు వేరు. లైఫ్‌లో చాలాసార్లు ఫెయిలయ్యా. జీవనోపాధి లేక కష్టాలు పడ్డా. ఐఏఎస్‌ ఆఫీసర్‌ కుమారుడినైనా రోడ్‌ మీద నుంచే నా లైఫ్‌ స్టార్ట్‌ చేశా. అడల్డ్‌ అండ్ కామెడీని పర్సనల్‌గా నేను ప్రోత్సహించను. అలాంటివి చూడను కూడా. అది ఎవరు చేసిన తప్పే. ఈ విషయంలో మీరు ఎంత దూరంగా ఉన్నారో.. నేను కూడా అంతే.' అని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement