ప్రతికాత్మక చిత్రం
ఘజియాబాద్ : ఉత్తరప్రదేశ్‌లో జుగుప్సాకరమైన ఘటన చోటు చేసుకుంది. ఓ టీనేజర్‌పై ఐదుగురు యువకులు అసహజ శృంగారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా పైశాచిక చర్యలకు పాల్పడి వీడియోలు తీశారు. ఈ దారుణం గత గురువారం ఘజియాబాద్ సమీపంలోని మోదీనగర్‌లో చోటుచేసుకుంది. బాధితుడు తన మోటర్‌సైకిల్‌ను సర్వీసింగ్‌కు ఇచ్చి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని సీనియర్ ఎస్పీ వైభవ్‌కృష్ణ శనివారం మీడియాకు తెలిపారు.
మెకానిక్ షాప్‌లో ఉన్న ఐదుగురు యువకులు ఆ టీనేజర్‌ను లోపలికి లాక్కెళ్లి లైంగిక దాడికి యత్నించారు. టీనేజర్ తప్పించుకునే ప్రయత్నం చేయడంతో తీవ్రంగా కొట్టి వ్యక్తిగత అవయవాల్లో ఐరన్ రాడ్ జొప్పించి వేదింపులకు గురిచేశారని తెలిపారు. నిందితులు అంతటితో ఆగకుండా ఈ తతంగాన్ని మొబైల్‌లో చిత్రీకరించారని, ఆపై టీనేజర్ వద్ద రూ.1600 లాక్కున్నట్లు ఎస్సీ పేర్కొన్నారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తన కుమారుడిని నిందితులు కొంతకాలం నుంచి వేధిస్తున్నట్లు బాధితుడి తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుల్లో హెడ్ కానిస్టేబుల్ కుమారుడు కూడా ఉన్నట్లు ఆయన ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment