sodomy
-
సిగ్గుచేటు; నితీష్ సర్కార్‌పై సుప్రీం సీరియస్
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముజఫర్‌పూర్ షెల్టర్ హోం కేసులో బిహార్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మైనర్ బాలికలపై లైంగిక దాడి జరిగితే ఆ కేసులను కేవలం పోక్సో చట్టం కింద మాత్రమే నమోదు చేయడం దేనికి సంకేతం అని ప్రశ్నించింది. మత్తు మందు ఇచ్చి మరీ అత్యాచారం జరిపిన హేయమైన ఘటనపై భారత శిక్షా స్మృతి ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా అమానుషంగా ప్రవర్తిస్తున్నారంటూ నితీష్ సర్కార్‌కు మొట్టికాయలు వేసింది. మంగళవారం ఈ కేసును విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. ‘ఈ కేసుల్లో బిహార్ ప్రభుత్వం కేవలం ప్రాథమిక విచారణ చేపడితే సరిపోదు. సెక్షన్ 377 కింద కేసు నమోదు చేయనట్లయితే విచారణ ముందుకు ఎలా సాగుతుంది. పిల్లలకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం జరిపితే మీరేమో సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని చెప్తున్నారు. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. అమానుషం. ఆ పిల్లలకు మనం న్యాయం చేయలేమా. అంటే ఈ దేశంలో పిల్లల్ని పౌరులుగా పరిగణించడం లేదా’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ విషయంపై స్పందించిన బిహార్ ప్రభుత్వ లాయర్ మాట్లాడుతూ.. షెల్టర్ హోం అకృత్యాలపై నమోదు చేసిన కేసులను సవరించి, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని పేర్కొన్నారు. -
అసహజ శృంగారం.. పైశాచిక చర్య!
ఘజియాబాద్ : ఉత్తరప్రదేశ్‌లో జుగుప్సాకరమైన ఘటన చోటు చేసుకుంది. ఓ టీనేజర్‌పై ఐదుగురు యువకులు అసహజ శృంగారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా పైశాచిక చర్యలకు పాల్పడి వీడియోలు తీశారు. ఈ దారుణం గత గురువారం ఘజియాబాద్ సమీపంలోని మోదీనగర్‌లో చోటుచేసుకుంది. బాధితుడు తన మోటర్‌సైకిల్‌ను సర్వీసింగ్‌కు ఇచ్చి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని సీనియర్ ఎస్పీ వైభవ్‌కృష్ణ శనివారం మీడియాకు తెలిపారు. మెకానిక్ షాప్‌లో ఉన్న ఐదుగురు యువకులు ఆ టీనేజర్‌ను లోపలికి లాక్కెళ్లి లైంగిక దాడికి యత్నించారు. టీనేజర్ తప్పించుకునే ప్రయత్నం చేయడంతో తీవ్రంగా కొట్టి వ్యక్తిగత అవయవాల్లో ఐరన్ రాడ్ జొప్పించి వేదింపులకు గురిచేశారని తెలిపారు. నిందితులు అంతటితో ఆగకుండా ఈ తతంగాన్ని మొబైల్లో చిత్రీకరించారని, ఆపై టీనేజర్ వద్ద రూ.1600 లాక్కున్నట్లు ఎస్సీ పేర్కొన్నారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తన కుమారుడిని నిందితులు కొంతకాలం నుంచి వేధిస్తున్నట్లు బాధితుడి తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుల్లో హెడ్ కానిస్టేబుల్ కుమారుడు కూడా ఉన్నట్లు ఆయన ఆరోపించారు. -
యువకుడి కిడ్నాప్..అత్యాచారం!
నోయిడా: ఓ యువకున్ని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన సంఘటన నోయిడాలో కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతానికి సంబంధించి పోలీసులు వివరాలు వెల్లడించారు. సెక్టార్ 63లోని ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్న బాధితుడు గత శనివారం రాత్రి పని చేసుకొని ఇంటికి తిరిగి వెళ్తుండగా ముగ్గురు ఆగంతకులు అతన్ని కిడ్నాప్ చేశారు. అనంతరం అతనిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురు ఆగంతకులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడు స్పృహ కోల్పోవడంతో నిందితులను గుర్తుపట్టలేకపోయాడని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
హవ్వా... ఇదేం చోద్యం!
ముజాఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్ లోని ముజాఫర్‌నగర్ లో ఉన్న ప్రభుత్వ బాలచెరసాల(జువనైల్ హోమ్)లో విచిత్రమైన కేసు నమోదయింది. 16 ఏళ్ల బాలుడు తోటి ఖైదీ(18)పై సహజ విరుద్ధమైన లైంగిక చర్య(పుంమైథునం)కు పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరితోనైనా చెబితే చంపేస్తానని బెదించాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగుచూసింది. బాధితుడిని పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విషయం తెలిసిన వారందరూ ఇదేం చోద్యమంటూ నోటిపై వేలు వేసుకుంటున్నారు. -
బాలికపై అత్యాచారం.. జీవితఖైదు
తాను ప్రభుత్వాధికారినని చెప్పుకొని, బాలికలకు సంబంధించిన పథకం అమలు చేయడానికి వచ్చానంటూ ఓ బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి ఢిల్లీ కోర్టు యావజ్జీవ ఖైదు విధించింది. ఇది చాలా క్రూరమైన చర్య అని కోర్టు వ్యాఖ్యానించింది. అతడిపట్ల జాలి చూపించేందుకు నిరాకరించింది. గతంలో అతడు ఇలాంటి కేసులోనే అరెస్టయ్యి, బెయిల్ మీద విడుదలైన తర్వాత ఎనిమిదేళ్ల అమ్మాయిపై అత్యాచారం చేశాడని.. ఇది అత్యంత దారుణమని తెలిపింది. అన్వర్ ఉల్ హక్ అనే ఈ దోషి ఇద్దరు కుమార్తెల తండ్రి అయినా.. ఇలాంటి వ్యక్తిత్వం కలిగి ఉండటం ఏమాత్రం క్షమార్హం కాదని అదనపు సెషన్స్ జడ్జి ఇలా రావత్ అన్నారు. అతడికి జీవిత ఖైదుతో పాటు 11 వేల రూపాయల జరిమానా కూడా విధించింది. బాధితురాలికి 2 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని, ఆమెకు పునరావాసం కల్పించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2010 జూన్ నెలలో అన్వర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. తన పేరు ఇమ్రాన్ అని చెప్పుకొని, లాడ్లీ యోజన అనే పథకం కింద దుస్తులు, డబ్బులు ఇస్తారని, ఆ ఫారం తీసుకోడానికి వచ్చానని చిన్నారి తల్లికి చెప్పాడు. ఆమెకు ప్రభుత్వ ఫొటో స్టూడియోలో ఫొటో తీయించాలని చెప్పి అక్కడినుంచి తీసుకెళ్లిపోయాడు. ఓ పార్కుకు తీసుకెళ్లి, ఆమెపై అత్యాచారం చేసి, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. పాప తిరిగి రాకపోయేసరికి అతడు కిడ్నాప్ చేసి ఉంటాడని తల్లిదండ్రులు అనుమానించారు. మర్నాడు ఓ ఆలయం దగ్గర కనిపించిన చిన్నారి.. జరిగిన విషయాన్ని వారికి చెప్పింది.