యువకుడి కిడ్నాప్..అత్యాచారం!
నోయిడా:
ఓ యువకున్ని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన సంఘటన నోయిడాలో కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతానికి సంబంధించి పోలీసులు వివరాలు వెల్లడించారు. సెక్టార్ 63లోని ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్న బాధితుడు గత శనివారం రాత్రి పని చేసుకొని ఇంటికి తిరిగి వెళ్తుండగా ముగ్గురు ఆగంతకులు అతన్ని కిడ్నాప్ చేశారు.
అనంతరం అతనిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురు ఆగంతకులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడు స్పృహ కోల్పోవడంతో నిందితులను గుర్తుపట్టలేకపోయాడని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.