ప్రొఫెసర్ చంద్రశేఖర్ అసభ్యప్రవర్తనపై చర్చించుకుంటున్న వైద్య విద్యార్థులు
నెల్లూరు(క్రైమ్): వైద్య విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ప్రొఫెసర్ చంద్రశేఖర్‌ను, ప్రొఫెసర్‌పై దాడి కేసులో ప్రజన్‌కుమార్‌ను ఆదివారం దర్గామిట్ట ఇన్‌స్పెక్టర్ వి.సుధాకర్‌రెడ్డి ఆదివారం అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన ఓ యువతి ఏసీఎస్సార్ ప్రభు త్వ వైద్యకళాశాలలో నాల్గో సంవత్సరం వైద్యవిద్యను అభ్యసిస్తోంది. ఈ నెల 14న ఆమె జీజీహెచ్‌లోని జనరల్ సర్జరీ విభాగంలోని డెమో గదికి వెళ్లింది. ఈ క్రమంలో ప్రొఫెసర్ చంద్రశేఖర్ ఆమెను లైంగికంగా వేధించా డం టూ ఆరోపిస్తూ బాధిత విద్యార్థిని తన కుటుం బ సభ్యులకు తెలిపింది. దీంతో వారు ప్రభు త్వ వైద్యకళాశాలకు చేరుకున్నారు. ఈ క్రమంలో బాధిత విద్యార్థిని బంధువు ప్రజన్‌కుమార్ ప్రొఫెసర్‌పై దాడిచేసి గాయపరిచారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న దర్గామిట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి ని అదుపులోకి తీసుకువచ్చారు. బాధిత విద్యార్థిని ఫిర్యాదు మేరకు ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్‌పై లైంగిక వేధింపుల కేసు, ప్రజన్‌కుమార్‌పై దాడికేసు నమోదుచేసిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment