Chandra Shekhar
-
PAC ఛైర్మన్ పదవికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్
-
భీమ్ ఆర్మీ చీఫ్ ప్రయాణిస్తున్న వందే భారత్‌పై రాళ్ల దాడి
లక్నో: భీమ్ ఆర్మీ పార్టీ చీఫ్ చంద్ర శేఖర్ ఆజాద్ ప్రయాణిస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై అల్లరి మూకలు రాళ్ల దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో రైలు కిటికీ ధ్వంసమైంది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లా కమల్పూర్లో ఆదివారం చోటుచేసుకున్న ఘటనలో ఆజాద్‌కు ఎటువంటి హాని జరగలేదు. ఢిల్లీ నుంచి కాన్పూర్ వస్తుండగా ఉదయం 7.12 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనతో షాక్‌కు గురయ్యాయనని అనంతరం ఆజాద్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘నా కంటే రెండు సీట్లు ముందు కూర్చున్న ప్రయాణికుడి దగ్గర ఉన్న అద్దాలు పగిలిపోయాయి. ఈ సంఘటనతో నేను షాక్‌కి గురయ్యాను. ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించడమే కాదు, ప్రయాణికుల భద్రతకు సైతం ముప్పు కలిగించే పరిణామమిది. ఇటువంటి ఘటనలకు పాల్పడే వారిని వదిలిపెట్టకూడదు’అని ఆయన పేర్కొన్నారు. ఘటన నేపథ్యంలో భద్రత కోసం సి–3 నుంచి సి–14 బోగీకి మారినట్లు చెప్పారు. దీనిపై రైల్వే భద్రతాధికారులకు సమాచారమివ్వగా వారు వచ్చి పరిశీలించారని, సి–3 బోగీపై మాత్రమే రాళ్ల దాడి జరిగినట్లు గుర్తించారని ఆజాద్ చెప్పారు. ‘ఒక్క 2022 లోనే రైళ్లపై రాళ్లు రువి్వన ఘటనలు 1,503 నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటితో రైల్వే శాఖకు కోట్లాది రూపాయల మేర నష్టం వాటిల్లింది. పదేపదే జరుగుతున్న ఈ ఘటనలు ప్రయాణికుల ప్రాణాలకు సైతం ప్రమాదకరంగా మారాయి’అని ఆజాద్ తెలిపారు. -
బీఎస్ఎన్ఎల్ తగ్గిన నష్టాలు.. పెరిగిన ఆదాయాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) వడ్డీ, పన్ను, తరుగుదల, రుణ బకాయిల ముందు ఆదాయాలు లేదా ఎబిటా (స్థూల ఆదాయం) 2023–24 ఆర్థిక సంవత్సరానికి 38.8 శాతం పురోగతితో రూ. 2,164 కోట్లకు చేరిందని కమ్యూనికేషన్స్ శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ బుధవారం పార్లమెంటుకు తెలియజేశారు. నష్టాలు రూ. 5,371 కోట్లకు తగ్గాయని వివరించారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో నష్టం రూ.8,161 కోట్లు కావడం గమనార్హం. ఆయా అంశాలపై పెమ్మసాని లిఖిత పూర్వకంగా ఇచి్చన సమాధానంలో కొన్ని ముఖ్యాంశాలు.. డేటా ఉల్లంఘనలు జరగలేదు... బీఎస్ఎన్ఎల్ డేటా ఉల్లంఘన విషయానికి వస్తే, బీఎస్ఎన్లో చొరబాటు డేటా ఉల్లంఘన జరగవచ్చని ఈ ఏడాది మే 20న ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ–ఇన్) నివేదించింది. దీనిని విశ్లేíÙంచడం జరిగింది. ఒక ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ (ఎఫ్టీపీ) సర్వర్‌లో సీఈఆర్టీ–ఇన్ షేర్ చేసిన నమూనా డేటాకు సమానమైన డేటా ఉందని కనగొనడం జరిగింది. టెలికం నెట్వర్క్ హోమ్ లొకేషన్ రిజిస్టర్ (హెచ్ఎల్ఆర్)లో ఎటువంటి ఉల్లంఘన జరగలేదని స్పష్టమైంది. బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లో సేవలో అంతరాయం కలుగలేదు. అయినప్పటికీ, ఎటువంటి డేటా ఉల్లంఘనలూ జరక్కుడా బీఎస్ఎన్ఎల్ చర్యలు నిరంతరం తీసుకుంటోంది. అన్ని ఎఫ్టీపీ సర్వర్లకు యాక్సెస్ పాస్‌వర్డ్‌ల మార్పులు జరిగాయి. టెలికం నెట్‌వర్క్‌ల ఆడిట్ నిర్వహించడానికి అలాగే టెలికం నెట్‌వర్క్‌లలో డేటా ఉల్లంఘనల నివారణకు పరిష్కార చర్యలను సూచించడానికి ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ (ఐఎంసీ)ని ఏర్పాటు చేయడం జరిగింది.→ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలు, చర్యల ఫలితంగా 2020–21 ఆర్థిక సంవత్సరం నుండి బీఎస్ఎన్ఎల్ అలాగే ఎంటీఎన్ఎల్ నిర్వహణ లాభాలను ఆర్జించడం ప్రారంభించాయి. → ఆత్మనిర్భర్ భారత్ చొరవకు అనుగుణంగా బీఎస్ఎన్ఎల్ దేశీయ 4జీ సాంకేతికత విస్తరణ కోసం లక్ష 4జీ సైట్ల కోసం కొనుగోలు ఆర్డర్ చేయడం జరిగింది. ఈ పరికరాలను 5జీకి అప్‌గ్రేడ్ కూడా చేయవచ్చు. → బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ పునరుద్ధరణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. 2019లో దాదాపు రూ. 69,000 కోట్ల మొదటి పునరుద్ధరణ ప్యాకేజీ... బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ నిర్వహణ ఖర్చులను తగ్గించింది. → 2022లో దాదాపు రూ. 1.64 లక్షల కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీ మంజూరు జరిగింది. తాజా మూలధనాన్ని చొప్పించడం, రుణాన్ని పునరి్నరి్మంచడం, గ్రామీణ టెలి ఫోనీకి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ దీని ఈ ప్యాకేజీ లక్ష్యం. → 2023లో మొత్తం రూ.89,000 కోట్లతో బీఎస్ఎన్ఎల్కు 4జీ అలాగే 5జీ స్పెక్ట్రమ్ కేటాయింపును ప్రభుత్వం ఆమోదించింది. -
‘ప్రమాణ స్వీకారం తర్వాత అందుకే నినాదాలు చేశా’
లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని నగీనా లోక్‌సభ స్థానం నుంచి ఆజాద్ సమాజ్ పార్టీ నేత చంద్ర శేఖర్ ఆజాద్ తొలిసారి ఎంపీగా గెలుపొందారు. ఇటీవల 18వ లోక్‌సభలో నగీనా ఎంపీగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఎంపీగా రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ప్రమాణం చేసిన తర్వాత ‘జై భీమ్, జై భారత్, జై సంవిధాన్, జై మండల్, జై జోహార్, జై జవాన్, జై కిసాన్’ అని నినాదాలు చేశారు. అయితే తాజాగా ఆయన ఓ జాతీయా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రమాణ స్వీకారం తర్వాత నినాదాలు చేయటానికి గల కారణాన్ని ఆయన వివరించారు. ‘‘ఆ నినాదాలు గొప్ప వ్యక్తులతో ముడిపడి ఉన్నాయి. 'జై భీమ్', 'జై భారత్' మా గుర్తింపును తెలియజేస్తాయి. మండల్ కమిషన్ అమలులోకి వచ్చాక వెనుకబడిన వర్గాలకు పలు అవకాశాలు లభించాయి. ఆయన వల్లే వెనకడిన వర్గాలు ముందుకు సాగుతున్నాయి. భారత ప్రజాస్వామ్యానికి, ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అయితే నేను లోక్‌సభలో ప్రమాణం చేసిన సమయంలో ఓ ఎంపీ అది నచ్చక ఈరోజే మొత్తం స్పీచ్ ఇస్తావా అంటూ వెక్కిరించారు. నేను ఇక్కడికి స్పీచ్ ఇవ్వడానికే వచ్చానని బదులు ఇచ్చా. నేను మాట్లాడటానికి వచ్చాను. మీరు వినాల్సి ఉంటుందన్నా’’ అని ఆజాద్ తెలిపారు. తమ హక్కులను లాగేసుకున్నవారు లోక్‌సభలో మత గళాన్ని వినడం అలవాటు చేసుకోవాలని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో నగీనా లోక్‌సభ స్థానం నుంచి ఆజాద్ 1,51,473 ఓట్ల మెజార్టీతో బీజేపీకి చెందిన ఓం కుమార్‌పై విజయం సాధించారు. -
వైరల్: 17 ఏళ్లుగా అడవిలోనే ఒంటరిగా జీవిస్తున్న వ్యక్తి.. కారణం?
బెంగళూరు: కొన్ని సందర్భాల్లో చాలామందికి మనుషులకు, సమాజానికి, టెక్నాలజీకి దూరంగా ఒంటరిగా బతకాలని అనిపిస్తుంది. కానీ అది ఆలోచన వరకే.. ఆచరణలో సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే దీర్ఘకాలంగా చుట్టూ ఎవరూ లేకుంటే జీవించలేం, పిచ్చిలేస్తుంది. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 17 ఏళ్లుగా ఇంటికి దూరంగా అడవిలో జీవిస్తున్నారు. మరి ఇన్నేళ్లుగా జనజీవనానికి దూరంగా అడవిలో బతికేందుకు కారణం ఏమయ్యుంటుందో ఇప్పుడు చుద్దాం. కర్ణాటకలోని మంగళూరు అడవుల్లో 56 ఏళ్ల చంద్రశేఖర్ అనే వ్యక్తి గత 17 ఏళ్లుగా ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. అరంతోడ్ గ్రామం నుంచి అద్దేల్ నెక్కారే అడవుల్లో ప్రయాణం చేస్తుంటే అడవిలో చిన్న మార్గం పక్కన ప్లాస్టిక్ కవర్ కప్పిన గుడిసే కనిపిస్తుంది. అందులో ఒకప్పటి అంబాసిడర్ కారు ఉంటుంది. ఆ గుడిసెలోని కారులోనే చంద్రశేఖర్ నివసిస్తున్నాడు. తలపై భారీగా పెరిగిన జుట్టు, రెండు జతల బట్టలు, ఒక జత రబ్బరు చెప్పులతోనే, చంద్రశేఖర్ జీవిస్తున్నాడు. ఓ చిన్న గుడిసెలో ఉంటున్న ఇతని వద్ద ఓ రెడియో, పాత సైకిల్ మాత్రమే ఉన్నాయి. అయితే చంద్రశేఖర్ ఇంతకముందు ఇలా జీవించేవాడు కాదు. ఇతనికి 17 ఏళ్ల క్రితం ఆయనకు నెక్రల్ కెమ్రాజీ అనే గ్రామంలో 1.5 ఎకరాల భూమి ఉండేది. 2003లో సాగు నిమిత్తం ఆయన స్థానిక సహకార బ్యాంకు నుంచి రూ.40 వేలు రుణం తీసుకున్నాడు. అయితే, కొన్ని కారణాల వలన ఆయన తన బాకీ తీర్చలేకపోయాడు. దీంతో అధికారులు ఆయన పొలాన్ని వేలం వేశారు. ఇది భరించలేని..చంద్రశేఖర్ తన కిష్టమైన కారు తీసుకుని సోదరి ఇంటికి వెళ్లారు. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత సోదరితో విబేధాలు వచ్చాయి. సొంత గ్రామానికి వెళ్లలే.. ఆత్మగౌరవం అడ్డొచ్చి, తీవ్ర అసంతృప్తితో సుల్యాకు 15 కిలోమీటర్ల దూరంలో అద్దెల్ – నెక్కారే అడవిలోకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అడవిలో దొరికే కాయలు తింటూ, జలపాతాల వద్ధ స్నానం చేస్తూ జీవిస్తున్నాడు. ఆహారం కోసం బుట్టలు చేసి వాటిని సమీపంలోని గ్రామాల్లో అమ్మి వచ్చి డబ్బుతో కావాల్సిన నిత్యవసర వస్తువులు కొనుగోలు చేసుకునేవాడు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఆయన్ను కలిసి ఇల్లు కట్టిస్తానని చెప్పినా దానికి చంద్రశేఖర్ ఒప్పుకోలేదు. తనకు అడవి చాలని, అక్కడున్న జంతువులు తనను ఏమీ చేయవని అన్నారు. అటవీశాఖ అధికారులు కూడా చంద్రశేఖర్ కారణంగా అడవికి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. -
విషాదం: ‘రామాయణ్’ ఫేమ్ చంద్రశేఖర్ కన్నుమూత
ప్రముఖ నటుడు, ‘రామాయణ్’ సీరియల్ ఫేమ్ చంద్ర శేఖర్ (98) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా వయోభారంతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ముంబైలోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ‘నాన్నగారు నిద్రలోనే కన్నుమూశారు. ఆయనికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. వయసు మీద పడటంతోనే చనిపోయారు’’ అని చంద్ర శేఖర్ కుమారుడు, నిర్మాత అశోక్ శేఖర్ ట్వీట్ చేశాడు. జుహులోని పవన్ హాన్స్లో ఈ రోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. చంద్రశేఖర్ స్వస్థలం హైదరాబాద్. నటనపై మక్కువతో 1950లో జూనియర్ ఆర్టిస్ట్‌గా మారారు. ఆ తర్వాత ‘సురంగ్’ అనే చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. ‘కవి’, ‘మస్తానా’, ‘బసంత్ బహార్’, ‘కాలీ టోపీ లాల్ రుమాల్’, ‘గేట్ ఆఫ్ ఇండియా’, ‘ఫ్యాషన్’, ‘ధర్మ’, ‘డ్యాన్స్ డ్యాన్స్’, ‘లవ్ లవ్ లవ్’ తదితర సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి మెప్పించారు. రామానంద్ సాగర్ దర్శకత్వంలో రూపొందిన ‘రామాయణ్ సీరియల్‌తో మరింత ఫేమస్ అయ్యారు. ఇందులో ఆర్య సుమంత్ అనే పాత్ర పోషించారు. रामायण में महामंत्री सुमंत्र का चरित्र निभाने वाले श्री चंद्रशेखर जी का आज देहांत हो गया है। उन्हें शांति और सद्गति मिले, राम जी से यही प्रार्थना है 🙏 सर, आपकी बहुत याद आएगी 🙏🙏 pic.twitter.com/1Wj1o6UaBC — Arun Govil (@arungovil12) June 16, 2021 -
సంగీత దర్శకుడు చంద్రశేఖర్ కన్నుమూత
కరోనా మహమ్మారి మరణాలు ఆగడం లేదు. తాజాగా ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, ఆల్ ఇండియా రేడియో సంగీత దర్శకుడు కేఎస్ చంద్రశేఖర్ కోవిడ్‌తో మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా రాయలం గ్రామానికి చెందిన చంద్రశేఖర్ 1990లో ఆల్ ఇండియా రేడియోలో గ్రేడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా చేరారు. అల్లు రామలింగయ్య నటించిన ‘బంట్రోతు భార్య’ సినిమాతో నేపథ్య గాయకునిగా సినీరంగ ప్రవేశం చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి వద్ద 70కి పైగా చిత్రాలకు చీఫ్ అసోసియేట్‌గా చేశారు. ఆ తర్వాత రమేష్ నాయుడు వద్ద 40 చిత్రాలకు, హిందీలో లక్ష్మీకాంత్ ప్యారేలాల్ వద్ద సహాయకునిగా చేశారు. చిరంజీవి హీరోగా నటించిన ‘యమకింకరుడు’ ద్వారా సంగీత దర్శకుడు అయ్యారు. ‘బ్రహ్మముడి, హంతకుడి వేట, ఆణిముత్యం, ఉదయం, అదిగో అల్లదిగో, భోళాశంకరుడు, ఆత్మ బంధువులు, కంచి కామాక్షి (తమిళ్–హిందీ )’ ఇలా దాదాపు 30కి పైగా చిత్రాలకు సంగీతం అందించారు చంద్రశేఖర్. ఆ తర్వాత విశాఖపట్నం ఆల్ ఇండియా రేడియో గ్రేడ్ 1 మ్యూజిక్ డైరెక్టర్‌గా సేవలందిస్తూ ఇటీవలే పదవీ విరమణ చేశారు. తిరుపతిలో చంద్రశేఖర్ ప్రదర్శన చూసి ముగ్దులైన ప్రముఖ సంగీత దర్శకులు ఘంటసాల తన హార్మోనియాన్ని ఆయనకు బహూకరించారట. కీరవాణి, కోటి, మణిశర్మ వంటి సంగీత దర్శకులు చంద్రశేఖర్ వద్ద శిష్యరికం చేశారు. చంద్రశేఖర్‌కి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. -
బీజేపీలో చేరిన మాజీ ప్రధాని కుమారుడు
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్ శేఖర్ బీజేపీలో చేరారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ సమక్షంలో మంగళవారం బీజేపీ కండువా కప్పుకున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఎస్పీకి దూరంగా ఉంటున్న నీరజ్ సోమవారమే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు ఆయన రెండు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో ఓటమి చెందారు. అనంతరం రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే నీరజ్‌ను ఉత్తర ప్రదేశ్ నుంచి బీజేపీ తరఫున రాజ్యసభకు పంపుతారని తెలుస్తోంది. దీనిపై ముందే ఒప్పందం కుదుర్చుకోని పార్టీలో చేరినట్లు సమాచారం. 2007లో చంద్రశేఖర్ మరణాంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన స్థానంలో తొలిసారి లోక్‌సభ ఎన్నికయ్యారు. -
తనిఖీల్లో పట్టుబడ్డ ఎమ్మెల్యే.. అరెస్ట్..!
సాక్షి, న్యూఢిల్లీ : విమాన ప్రయాణం సందర్భంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన తనిఖీల్లో బిహార్ ఎమ్మెల్యే పట్టుబడ్డారు. అక్రమంగా బుల్లెట్లు కలిగి ఉండడంతో ఆర్జేడీ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ను పోలీసు అరెస్టు చేశారు. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఢిల్లీ విమానాశ్రయం నుంచి పట్నాకు బయలుదేరారు. అక్కడ సీఐఎస్ఎఫ్ సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో.. ఎమ్మెల్యే లగేజీలో 3.15 బోర్ సైజుతో గల 10 బుల్లెట్లు బయటపడ్డాయి. ఎమ్మెల్యే వాటికి సంబంధించిన పత్రాలేవీ సమర్పించకపోవడంతో ఆయుధ, మందుగుండు సామాగ్రి చట్టం ప్రకారం పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. చంద్రశేఖర్ మధేపుర నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
కాంగ్రెస్‌కు మాజీమంత్రి గుడ్‌బై
సాక్షి, వికారాబాద్: తన అనుచరులు, అభిమా నుల ఆకాంక్షల మేరకే తాను స్వతంత్ర అభ్య ర్థిగా బరిలోకి దిగుతున్న ట్లు మాజీ మంత్రి డాక్టర్ ఎ.చంద్రశేఖర్ వెల్లడించారు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలం గాణ ఉద్యమంలో రంగారెడ్డి జిల్లాలో తానే మొట్టమొదటగా పాల్గొ న్నానని తెలిపారు. రాష్ట్ర సాధన కోసం మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశానన్నారు. తెలంగాణ ఇచ్చిన ఘనత ఏఐసీసీ అధి నేత్రి సోనియాగాంధీనేనని, ఆమెకు ఢిల్లీ వెళ్లి కృతజ్ఞతలు కూడా తెలిపాన న్నారు. వికారాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ రాకపోవడం తో నిరాశ చెంది ఇండిపెండెంట్‌గా పోటీకి దిగుతున్నానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా సమర్పించినట్లు తెలిపారు. -
లైంగిక వేధింపుల కేసులో ప్రొఫెసర్ అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): వైద్య విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ప్రొఫెసర్ చంద్రశేఖర్‌ను, ప్రొఫెసర్‌పై దాడి కేసులో ప్రజన్కుమార్ను ఆదివారం దర్గామిట్ట ఇన్స్పెక్టర్ వి.సుధాకర్‌రెడ్డి ఆదివారం అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన ఓ యువతి ఏసీఎస్సార్ ప్రభు త్వ వైద్యకళాశాలలో నాల్గో సంవత్సరం వైద్యవిద్యను అభ్యసిస్తోంది. ఈ నెల 14న ఆమె జీజీహెచ్‌లోని జనరల్ సర్జరీ విభాగంలోని డెమో గదికి వెళ్లింది. ఈ క్రమంలో ప్రొఫెసర్ చంద్రశేఖర్ ఆమెను లైంగికంగా వేధించా డం టూ ఆరోపిస్తూ బాధిత విద్యార్థిని తన కుటుం బ సభ్యులకు తెలిపింది. దీంతో వారు ప్రభు త్వ వైద్యకళాశాలకు చేరుకున్నారు. ఈ క్రమంలో బాధిత విద్యార్థిని బంధువు ప్రజన్కుమార్ ప్రొఫెసర్‌పై దాడిచేసి గాయపరిచారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న దర్గామిట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి ని అదుపులోకి తీసుకువచ్చారు. బాధిత విద్యార్థిని ఫిర్యాదు మేరకు ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్‌పై లైంగిక వేధింపుల కేసు, ప్రజన్కుమార్పై దాడికేసు నమోదుచేసిన విషయం విదితమే. -
ప్రియుడు కోసం ప్రియురాలి మౌన దీక్ష
రేగిడి : ప్రేమించిన ప్రియుడు సంబంధం లేదంటూ వదిలేయడంతో మోసపోయిన ప్రియురాలు ప్రియుడి ఇంటి ముందే బుధవారం మౌనదీక్షకు దిగింది. మండలంలో చిన్నపుర్లి గ్రామానికి చెందిన గ్రామస్తులతో పాటు బాధితురాలు అందించిన వివరాలు... గ్రామానికి చెందిన కొబగాన సాయికుమారి తన తల్లిదండ్రులు అంజమ్మ, గౌరునాయుడుతో కలిసి విజయవాడలో నివాసం ఉంటుంది. ఆరేళ్ల కిందట తన సోదరి వివాహ నిమిత్తం రేగిడి మండలంలోని స్వగ్రామమైన చిన్నపుర్లి వచ్చింది. ఇక్కడ నెల రోజులున్న సమయంలో ఇదే గ్రామానికి చెందిన ఎర్నేన చంద్రశేఖర్‌తో పరిచయం ఏర్పడింది. చదువుకున్న వాడు కావడంతో పాటు వివాహం చేసుకుంటానని చెప్పడంతో ఆమె ప్రేమలో పడింది. ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలియడంతో పాటు చంద్రశేఖర్ కూడా పలుమార్లు విజయవాడ వెళ్లివస్తుండేవాడు. ఈ తరుణంలో వీరి మధ్య సంబంధం మరింత పెరిగింది. అయితే గత ఏడాది నవంబరు నుంచి చంద్రశేఖర్ బాధితురాలికి ఫోన్ చేయకపోవడంతో పాటు వివాహం చేసుకోనని చెప్పేశాడు. దీంతో మోసపోయిన బాధితురాలు అప్పట్లోనే రేగిడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తనకు న్యాయం జరగలేదని దీంతో గత్యంతరం లేకే తన ప్రియుడి ఇంటి ముందు మౌనదీక్షకు దిగినట్టు పేర్కొంది. తన ప్రియుడు గ్రామంలోనే ఉన్నాడని, న్యాయం జరిగే వరకు పోరాడతానని తెలిపింది. చంద్రశేఖర్ విశాఖపట్నంలోని ఓ బ్యాంకులో ఉద్యోగం కూడా చేస్తున్నట్టు పేర్కొంది. విషయం తెలుసుకున్న రేగిడి స్టేషన్ ట్రైనీ ఎస్ఐ రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
ఇద్దరు బిడ్డలను బావిలో తోసి తల్లి ఆత్మహత్య
పెద్దతిప్పసముద్రం: మండలంలోని సంపతికోటకు చెందిన ఓ మహిళ శుక్రవారం సాయంత్రం ఇద్దరు చిన్న పిల్లలతో కలసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటక రాష్ట్రం రాయల్పాడ్ మండలం ఎరమారిపల్లి పంచాయతీ తవటంపల్లికి చెందిన రత్నమ్మ (30)కు పీటీఎం మండలంలోని సంపతికోటకు చెందిన తోటి చంద్రశేఖర్‌తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నందకిశోర్, నయనశ్రీ, గంగాధర్ అనే ముగ్గురు సంతానం. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ పొలంలో పత్తి పంటకు క్రాసింగ్ చేసే విషయంలో శుక్రవారం భార్యాభర్తలు గొడవ పడినట్లు సమాచారం. దీంతో జీవితంపై విరక్తి చెందిన రత్నమ్మ తన కుమార్తె నయనశ్రీ (4), కుమారుడు గంగాధర్ (3)ను వెంట బెట్టుకుని వెళ్లింది. మల్లెల సమీపంలోని గుమ్మోల్ల గంగులప్ప బావిలో బిడ్డలను పడేసి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. గ్రామంలో కూడా వీరి ఆచూకీ లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రీనివాసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులతో విచారణ చేపట్టారు. చీకటి కావడంతో శవాలను వెలికి తీయడం కష్టతరమైంది. దీంతో బావి వద్ద పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కాపలా ఉంచి శనివారం శవాలను వెలికితీసేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. -
పోలవరం నిర్వాసితులకూ ‘రాజధాని ప్యాకేజీ’
సీఎంను కోరిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పూర్తిగా నష్టపోతున్న 7 మండలాల ప్రజలకు కూడా రాజధాని ప్రాంతాల్లో భూములిచ్చే వారికి అమలు చేసే ప్యాకేజీని వర్తింపచేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖర్ తదితరులతో కలసి గురువారం ఆయన సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. అనంతరం రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. రాయలసీమ, కోస్తా, ఉత్తర కోస్తా ప్రాంతాలకు సాగు, తాగు నీరు అందించే పోలవరం ప్రాజెక్టుకు ఎక్కువగా నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరామన్నారు. పోలవరం నిర్వాసితులను తక్షణం ఆదుకోవాలని కోరామన్నారు. -
ఏసీబీ వలలో ఇద్దరు రెవెన్యూ అధికారులు
రూ. 20 వేలు తీసుకుంటూ పట్టుబడిన తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్ గండేడ్‌లో ఘటన గండేడ్: ఏసీబీ వలకు ఇద్దరు రెవెన్యూ అధికారులు చిక్కారు. వ్యవసాయ భూమి రికార్డుల మార్పు, పట్టా చేసేందుకు రూ. 20 వేలు లంచం తీసుకుంటూ గండేడ్ తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ శీనప్పలు గురువారం రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్ కథనం ప్రకారం.. గండేడ్ మండ లం గాధిర్యాల్ గ్రామానికి చెం దిన దాయాదులు హుస్నాబాద్ హన్మంత్‌రెడ్డి, రాంరెడ్డిలకు కొంతకాలంగా సర్వేనంబర్లు 188,189, 253లోని 12 ఎకరాల భూమి విషయమై గొడవలు ఉన్నాయి. మొత్తం భూమి హన్మంత్‌రెడ్డి పేరుమీద ఉండడంతో తనకు వాటా ఇవ్వాలని రాంరెడ్డి కోర్టులో కేసు వేయడంతో 1996లో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. వంశపారంపర్యంగా రాంరెడ్డికి దక్కాల్సిన రెండుభాగాలైన 8 ఎకరాలు ఇస్తానని హన్మంత్‌రెడ్డి అంగీకరించి అఫిడవిట్ రాసిచ్చాడు. దీంతో రాంరెడ్డి కుమారుడు వెంకట్రాంరెడ్డి సదరు పొలాన్ని తన తండ్రి పేరుమీదుగా మార్చి పట్టా చేయాలని 3 నెలల క్రితం తహసీల్దార్ వెంకటేశ్వర్లును ఆశ్రయించాడు. అప్పటి నుంచి తహసీల్దార్ కాలయాపన చేస్తూ వచ్చాడు. చివరకు తహసీల్దార్ రూ.40 వేలు డిమాండ్ చేయడంతో రూ. 20 వేలు ఇస్తానని వెంకట్రాంరెడ్డి అంగీకరించాడు. అయినా కూడా తహసీల్దార్ పనిచేసి పెట్టలేదు. దీంతో విసుగెత్తిన వెంకట్రాంరెడ్డి ఈనెల 10న నగరంలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారిచ్చిన రూ. 20 వేలు తీసుకొని గురువారం మధ్యాహ్నం గండేడ్ తహసీల్దార్ వద్దకు వచ్చాడు. ఈరోజే రికార్డుల్లో నమోదు చేయించి పట్టా పత్రం ఇస్తానని తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఆయనకు తెలిపాడు. డబ్బులు సీనియర్ అసిస్టెంట్ శీనప్పకు ఇవ్వాలని చెప్పడంతో.. ఏసీబీ అధికారుల సూచన మేరకు వెంకట్రాంరెడ్డి వాయిస్ రికార్డు చేశాడు. అనంతరం వెంకట్రాంరెడ్డి శీనప్పకు రూ. 20 వేలు ఇవ్వగా ఏసీబీ అధికారులు వెళ్లి శీనప్పను రెడ్‌హ్యాండడ్‌గా పట్టుకున్నారు. తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ శీనప్పలను అదుపులోకి తీసుకొని విచారించారు. స్వాధీనం చేసుకున్న నోట్ల మీదున్న వేలిముద్రలను సేకరించారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. కాగా తహసీల్దార్ ప్రతి కేసుకు లంచం మాట్లాడుకొని శీనప్ప ద్వారా డబ్బులు తీసుకునేవాడని స్థానికులు ఆరోపించారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్ తెలిపారు. దాడుల్లో ఎస్ఐలు శ్రీనివాస్, రాజేష్, కాశయ్య ఉన్నారు. -
శంకర్రావుపై సీబీఐ విచారణ జరిపించాలి
హైదరాబాద్: గ్రీన్ ఫీల్డ్ ప్లాట్స్ కబ్జాకు పాల్పడుతున్న మాజీ మంత్రి శంకర్రావుపై వెంటనే సీబీఐ విచారణ జరిపించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గ్రీన్ ఫీల్డ్ ప్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ఆయన బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. మాజీ మంత్రి శంకర్రావు సోదరుడు దయానంద ఇటీవల గూండాలతో వచ్చి ఎనిమిది ప్లాట్లను ఆక్రమించి ప్రహరీ నిర్మించాడని, ఈ విషయమై నేరెడ్మెట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. శంకర్రావును అరెస్టు చేయాలని మల్కాజ్గిరి పదో మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకుల ట్రస్టు భూముల విషయంలో చొరవ చూపిన విధంగానే గ్రీన్ ఫీల్డ్ కబ్జాల విషయమై చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ప్లాట్స్ ఓనర్స్ సత్యనారాయణ మూర్తి, ఎంవీ నరిసింహరావు, కేశవమ్మ, గోవిందరాజుశర్మ, సీహెచ్ అంజయ్యతోపాటు గ్రీన్ ఫీల్డ్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు రాంబాబు, నాగరాజన్, ఇనాయక్ హాసన్, విజయానంద తదితరులు పాల్గొన్నారు. -
ఆరేళ్లకే ఇంటిదీపం ఆరిపోయింది!
రెండో తరగతి విద్యార్థిని దుర్మరణం జీవీఎంసీ ట్రాక్టర్ ఢీకొని ప్రమాదం కడుపుకోతతో తల్లడిల్లుతున్న కుటుంబం అనకాపల్లి రూరల్: ‘సాటర్డే హాఫ్‌డే అమ్మా... ఈరోజు స్కూల్‌కు వెళ్లను...’ అంటూ చిట్టిపొట్టి మాటలతో ఆ చిన్నారి మారాం చేసింది. అయితే కన్నకూతురుకు బాగా చదివించుకోవాలనే ఆకాంక్ష ఉన్న ఆమె అమ్మ మనసు మాత్రం అందుకు అంగీకరించలేదు. ‘ఈ రోజు సాటర్డే స్కూల్‌కు వెళ్తే రేపు సండే సెలవే కదమ్మా... నీకు నచ్చింది కొంటా’నంటూ నచ్చచెప్పింది. చివరకు ఎలాగో ఆ చిన్నారి ఇంటి నుంచి స్కూల్‌కు బయల్దేరి వెళ్లిందో లేదో అంతలోనే ‘పాపను ట్రాక్టర్ గుద్దేసింది...’ అన్న వార్త ఆ తల్లి చెవిన పడింది. ఆమెకు గుండె ఆగినంత పనైంది. పరుగున వెళ్లి చూస్తే... తన కూతురే. విగతజీవిగా పడిఉంది. నున్నగా దువ్వి పంపిన తల ట్రాక్టర్ చక్రం కింద చిద్రమైంది. యూనిఫాం రక్తసిక్తమైంది. ‘అల్లారుముద్దుగా, ప్రాణానికి ప్రాణంగా పెంచుతున్న తమ బిడ్డను అప్పుడే ఎందుకు తీసుకుపోయావు దేవుడా...’ అంటూ ఆ తల్లి కన్నీరుమున్నీరవుతుంటే... చూసినవారి కంట నీరు ఆగలేదు. ఈ దుర్ఘటన శనివారం అనకాపల్లిలోని పార్కుసెంటర్ సమీపంలో చోటుచేసుకుంది. వెల్డర్‌గా పనిచేస్తున్న పాలవలస శ్రీనివాసరావు, లక్ష్మి దంపతుల కుమార్తె కల్యాణి (6) మున్సిపాలిటీ ట్రాక్టర్ కింద పడి ప్రాణాలు కోల్పోయింది. ట్రాక్టర్ తొట్టి కొక్కెం బ్యాగుకు తగలడంతో ఆ చిన్నారి తూలిపడింది. వెనుక చక్రం ఎక్కేయడంతో ఆమె తల చిద్రమైంది. తీవ్ర గాయమైన ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. గవరపాలెం సంతోషిమాత కోవెల సమీపంలో నివాసం ఉంటున్న శ్రీనివాసరావు దంపతులకు కల్యాణితో పాటు ఎనిమిదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కల్యాణి పార్కుసెంటర్ సమీపంలోని సత్యసాయి కాన్వెంట్లో రెండో తరగతి చదువుతోంది. రోజూలాగే నడిచివెళ్తున్న ఆ చిన్నారి కొద్ది నిమిషాల్లో స్కూల్‌కు చేరుకునేదే. వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ రూపంలో మృత్యువు ఆమెను బలితీసుకుంది. విషయం తెలిసిన వెంటనే జీవీఎంసీ జెడ్సీ చంద్రశేఖర్ సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు. తమ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. మృతదేహాన్ని వంద పడకల ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసును ట్రాఫిక్ ఎస్ఐ సత్యనారాయణ దర్యాప్తు చేస్తున్నారు. -
ఇరు ప్రభుత్వాలూ ఐటీకి అనుకూలమే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత రెండేళ్లుగా రాష్ట్ర విభజన సమస్య ఐటీ రంగ వృద్ధిని దెబ్బతీసిందని, ఇప్పుడు ఆ సమస్య లేకపోవడంతో ఇరు రాష్ట్రాల్లో ఐటీ రంగం వేగంగా వృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని నాస్కామ్ వ్యక్తం చేసింది. ఇరు రాష్ట్రాలు ఐటీ రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఇప్పటికే సంకేతాలను ఇవ్వడం సానుకూల పరిణామమని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ వ్యక్తం చేశారు. విభజన సమస్య తీరడంతో హైదరాబాద్‌లో ఐటీ రంగానికి పూర్వవైభవం వస్తుందని, కాని ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగ వృద్ధి అనేది అక్కడి ప్రభుత్వం తీసుకునే చర్యలు, కల్పించే మౌలిక వసతులపై ఆధారపడి ఉంటుదన్నారు. హైదరాబాద్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రాలో కొత్తగా ఒక సిటీని రూపొందించి దానికి బ్రాండ్ తీసుకురావడమే అత్యంత క్లిష్టమైన అంశమన్నారు. ఇలా బ్రాండ్ తీసుకొచ్చినా అక్కడ పట్టణ వాతావరణానికి సంబంధించిన మౌలిక వసతులు లేకపోతే పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ముందుకొచ్చినా, ఉద్యోగస్తులు రాని పరిస్థితి ఉంటుందని, ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర ప్రభుత్వం ఐటీ రంగం కోసం నగరాలను అభివృద్ధి చేయడమే కాకుండా ప్రోత్సాహకాలను ఇవ్వాల్సి ఉంటుందన్నారు. స్మాక్దే భవిష్యత్తు ఈ ఏడాది దేశంలో ఐటీ, ఐటీ ఆధారిత సేవల వ్యాపారంలో 13- 15 శాతం వృద్ధి అంచనా వేస్తున్నట్లు నాస్కామ్ పేర్కొంది. ప్రస్తుతం రూ.7,08,000 కోట్లుగా (118 బిలియన్ డాలర్లు) ఉన్న ఐటీ పరిశ్రమ ఈ ఏడాది రూ.8,20,000 కోట్లుదాటుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం పరిశ్రమ సగటు వృద్ధి రేటుకు రెట్టింపు స్థాయిలో సోషల్ మీడియా, మొబైల్, ఎనలటిక్స్, క్లౌడ్(స్మాక్- ఎస్ఎంఏసీ) రంగాల్లో వృద్ధి నమోదవుతున్నట్లు చంద్రశేఖర్ తెలిపారు. నాస్కామ్ నిర్వహిస్తున్న రెండవ బిగ్ డేటా సదస్సుకు హాజరైన చంద్ర శేఖర్ మాట్లాడుతూ స్టార్ట్అప్ కంపెనీలకు మౌలిక వసతులు కల్పించడానికి రూ.500 కోట్లతో మూలధన నిధిని ఏ ర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇండియాలో ఎనలటిక్స్ వ్యాపారం 100 కోట్ల డాలర్లుగా ఉందని, ఇది 2017-18 నాటికి 230 కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు బ్లూఓషన్ నివేదికలో వెల్లడించింది. -
ఏలూరు-జంక్షన్ మధ్య రాజధాని
సాక్షి ప్రతినిధి, ఏలూరు : సీమాంధ్ర రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు ఏలూరు-హనుమాన్ జంక్షన్ మధ్య ప్రాంతం అన్నివిధాలుగా అనువైనదని, ఈ ప్రతిపాదనకు అన్నివర్గాలు మద్దతు తెలపాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, వైఎస్సార్ సీపీ ఏలూరు లోక్‌సభా స్థానం అభ్యర్థి తోట చంద్రశేఖర్ కోరారు. శనివారం ఏలూరులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయూలనే విషయాన్ని నిర్ధారించేందుకు కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించిందని తెలిపారు. రాజధాని ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను ఈ కమిటీ పరిశీలిస్తుందని చెప్పారు. ఏలూరు-హనుమాన్‌జంక్షన్ మధ్య రాజధాని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ఆ కమిటీకి తాను పంపించానని తెలిపారు. ఈ ప్రాంతాన్ని రాజధాని చేయూలని కోరుతూ అన్నివర్గాలు ఈ కమిటీకి సలహాలు, సూచనలు పంపించాలని కోరారు. అభిప్రాయాలు పంపేందుకు మే 7వ తేదీ వరకూ సమయం ఉందని, యువకులు, విద్యావంతులు, మేధావులంతా స్పందించాలని కోరారు. తమ అభిప్రాయాలను హోం మంత్రిత్వ శాఖకు చెందిన జ్ఛ్ఛఛీఛ్చఛిజు.్ఛ్ఠఞఛిౌఝ్టః ఝజ్చి. జౌఠి.జీ వెబ్‌సైట్‌కు పంపాలని కోరారు. ఏలూరు-జంక్షన్ ప్రాంతం రాజధానికి ఏవిధంగా అనువుగా ఉందనే దానిపై తాను పలు సూచనలు చేసినట్లు తెలిపారు. భూమి లభ్యత ఎక్కువగా ఉందని, లక్ష ఎకరాల ప్రభుత్వ భూమితోపాటు రెండు లక్షల ఎకరాల అటవీ భూమి ఉందని వివరించారు. నూతన రాజధాని నిర్మాణానికి అవసరమైన భూములను ఇందులోంచి తీసుకోవచ్చని తెలిపారు. కృష్ణా-గోదావరి నదుల మధ్య ఉన్న ప్రాంతం కావడంతో నీటి లభ్యత ఎక్కువగా ఉందని, తాగునీటికి ఎటువంటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. మచిలీపట్నం, కాకినాడ పోర్టుల మధ్య ప్రాంతం కావడంవల్ల పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు, అభివృద్ధికి, జల రవాణాకు అనుకూలమని స్పష్టం చేశారు. గన్నవరం, రాజమండ్రి ఎయిర్‌పోర్టుల మధ్య ఉండటం, ఐదో నంబర్ జాతీయ రహదారి ఉండటం, దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు అతి సమీపంలో ఉండటంతోపాటు బ్రాడ్‌గేజ్ రైలు మార్గం ఉండటం వల్ల ఈ ప్రాంతం రవాణా వ్యవస్థకు ఆయువు పట్టుగా ఉందన్నారు. ఈ ప్రాంతంలో సహజవాయు నిక్షేపాలు అపారంగా ఉన్నాయని, పోలవరం ప్రాజెక్టు వల్ల అదనంగా విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కానుందని, దీనివల్ల విద్యుత్ సమస్య కూడా ఉండదని వివరించారు. అన్నిటికీ మించి భౌగోళికంగా ఏలూరు-జంక్షన్ ప్రాంతం సీమాంధ్రకు నడిబొడ్డుగా ఉందన్నారు. రాజధాని ఏర్పాైటైతే ఈ ప్రాంతంలో అనూహ్యమైన అభివృద్ధి జరుగుతుందని, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఇక్కడి వారంతా రాజధాని ప్రతిపాదనకు మద్దతు తెలిపి హోం మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌కు అభిప్రాయాలు, సూచనలు పంపాలని కోరారు.