మాజీ మంత్రి డాక్టర్ ఎ.చంద్రశేఖర్
సాక్షి, వికారాబాద్: తన అనుచరులు, అభిమా నుల ఆకాంక్షల మేరకే తాను స్వతంత్ర అభ్య ర్థిగా బరిలోకి దిగుతున్న ట్లు మాజీ మంత్రి డాక్టర్ ఎ.చంద్రశేఖర్ వెల్లడించారు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలం గాణ ఉద్యమంలో రంగారెడ్డి జిల్లాలో తానే మొట్టమొదటగా పాల్గొ న్నానని తెలిపారు. రాష్ట్ర సాధన కోసం మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశానన్నారు. తెలంగాణ ఇచ్చిన ఘనత ఏఐసీసీ అధి నేత్రి సోనియాగాంధీనేనని, ఆమెకు ఢిల్లీ వెళ్లి కృతజ్ఞతలు కూడా తెలిపాన న్నారు. వికారాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ రాకపోవడం తో నిరాశ చెంది ఇండిపెండెంట్‌గా పోటీకి దిగుతున్నానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా సమర్పించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment