indipendent
-
నాటకీయ పరిణామాల మధ్య స్వతంత్ర అభ్యర్థి అరెస్ట్
జైపూర్: రాజస్థాన్‌లోని డియోలీ-యునియారా నియోజవర్గానికి బుధవారం ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది.అయితే.. ఈ నియోజక వర్గంలో సంరవత పోలింగ్ కేంద్రంలో సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం)గా అధికారి అమిత్ చౌదరీ ఎన్నికల పోలింగ్‌ను పర్యవేక్షించారు. ఈ క్రమంలో అమిత్ చౌదరీపై ఈనియోజకర్గంలోస్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేష్ మీనా చెంపదెబ్బ కొట్టడం కలకలం రేపింది. ఉప ఎన్నికలో ఎన్నికల అధికారిని చెంపదెబ్బ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా హై డ్రామా మధ్య గురువారం నరేష్ మీనా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు బృందం ‘వ్యూహాత్మక’ ఆపరేషన్ చేపట్టి అతన్ని అరెస్టు చేశారు. పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకోవడానికి ముందు నరేష్ మీనా మీడియాతో మాట్లాడారు. ‘‘ నేను లొంగిపోను. నా మద్దతుదారులంతా పోలీసులను చుట్టుముట్టండి. ట్రాఫిక్ జామ్ చేయండి’’అని అనుచరులకు పిలుపునిచ్చారు.‘‘ భారీగా పోలీసులు.. లాఠీలు, షీల్డ్‌లను ధరించి.. మేము వ్యూహాత్మకంగా అతను ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. మేం అతన్ని లొంగిపోవాలని అభ్యర్థించాం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు’’ అని చెప్పామని టోంక్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వికాస్ సంగ్వాన్ తెలిపారు.మరోవైపు.. పోలింగ్ బూత్‌లో మూడు అదనపు ఓట్లను చేర్చేందుకు చౌదరి కుట్ర పన్నారని మీనా ఆరోపించారు. అయితే పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘ కొందరు ఎన్నికలను బహిష్కరిస్తున్నారు. ఎస్డీఎం, తహసీల్ అధికారులు వారిని ఒప్పించేందుకు వెళ్లారు. చర్చల సమయంలో స్వతంత్ర అభ్యర్థి (నరేష్ మీనా) ఎస్డీఎంను చెప్పుతో కొట్టారు’’ అని ఎస్పీ సాంగ్వాన్ వెల్లడించారు. గుర్తుతెలియని వ్యక్తులు (మీనా మద్దతుదారులు), పోలీసుల మధ్య చెలరేగిన హింసాకాండలో పోలీసు వాహనాలతో సహా ఎనిమిది కార్లు, 10పైగా మోటార్‌సైకిళ్లకు నిప్పు పెట్టారు. శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. -
ఎన్నికల్లో పోటీకి.. పోటీపడిన పార్టీలు
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. జూన్ ఒకటిన జరిగే ఆఖరి విడత పోలింగ్‌తో ఎన్నికలు ముగియనున్నాయి. తాజాగా ఎన్నికల హక్కుల సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) తెలిపిన వివరాల ప్రకారం 2009తో పోలిస్తే 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీల సంఖ్య 104 శాతం పెరిగింది.ఏడీఆర్ విశ్లేషణ ప్రకారం 2024లో 751 రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలో నిలవగా, 2019లో 766, 2014లో 464, 2009లో 368 పార్టీలు ఎన్నికల బరిలో నిలిచాయి. 2009 నుంచి 2024 మధ్య ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీల సంఖ్య 104 శాతం పెరిగింది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దిగిన 8,337 మంది అభ్యర్థుల అఫిడవిట్లపై ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ సమగ్ర విశ్లేషణ చేశాయి.2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొత్తం 8,360 మంది అభ్యర్థుల్లో 1,333 మంది జాతీయ పార్టీల నుంచి, 532 మంది రాష్ట్ర స్థాయి పార్టీల నుంచి, 2,580 మంది రిజిస్టర్డ్ కాని పార్టీల నుంచి, 3,915 మంది స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బలిలోకి దిగారు. జాతీయ పార్టీలకు చెందిన 1,333 మంది అభ్యర్థుల్లో 443 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 295 మంది అభ్యర్థులు పలు క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. రాష్ట్ర స్థాయి పార్టీలకు చెందిన 532 మంది అభ్యర్థుల్లో 249 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. -
Lok Sabha Elections: స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి వరుణ్ గాంధీ!
లక్నో: దేశంలో ఎన్నికల హడావిడీ ఉంది. లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో జాతీయ పార్టీలతోపాటు ప్రాంతీయ పార్టీలన్నీ అభ్యర్ధుల ఎంపిక, ప్రచారాలపై దృష్టి సారించాయి. దీంతో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తమకు టికెట్ దక్కుతుందని గంపెడు ఆశలు పెట్టుకున్న వారికి సీటు రాకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వతంత్రంగా లేదా వేరే పార్టీ తీర్ధం పుచ్చుకొనైనా పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేత వరుణ్ గాంధీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లోని పిలిభిత్ నుంచి బీజేపీ లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. అయితే గత కొంత కాలంగా వరుణ్ కాషాయ పార్టీ విధానాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇచ్చేందుకు సుముఖంగా లేన్నట్లు ప్రచారం నడుస్తోంది. పిలిభిత్ స్థానం నుంచి బీజేపీ తనకు టిక్కెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని సంబందిత వర్గాలు తెలిపాయి. ఇక పిలిభిత్ స్థానానికి నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను ఆయన ప్రతినిధులు ఢిల్లీ నుంచి యూపీకి ఇప్పటికే తీసుకొచ్చారని పేర్కొన్నాయి. 2009, 2019 లోక్‌సభ ఎన్నికల్లో వరుణ్‌గాంధీ పిలిభిత్ నుంచి పోటీ చేసి రెండోసార్లు గెలుపొందారు. అయితే పిలిభిత్ స్థానానికి బీజేపీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ ఇప్పటికే పలువురు అభ్యర్థులను ప్రకటించింది. అంబేద్కర్ నగర్ నుంచి బీఎస్సీ మాజీ ఎంపీ రితేష్ పాండేని పోటీకి దించగా.. హేమ మాలిని, రవి కిషన్, అజయ్ మిశ్రా తేని, మహేష్ శర్మ, ఎస్పీఎస్ బాఘెల్, సాక్షి మహరాజ్‌లను తమ స్థానాల నుంచి మరోసారి అవకాశం ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసి నుంచి, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లక్నో నుంచి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అమేథీ నుంచి పోటీ చేయనున్నారు. కాగా, ఉత్తరప్రదేశ్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న వరుణ్ గాంధీ.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలపై పలు సందర్భాల్లో తన అసమ్మతి గళాన్ని వినిపిస్తూ వస్తున్నారు.. కీలక అంశాల్లో పార్టీ నిర్ణయాలపైనే బహిరంగ విమర్శలు చేస్తున్నారు. కొంతకాలంగా తన లోక్‌సభ నియోజకవర్గమైన పిలిభిత్‌లో క్రియాశీలకంగా ఉంటున్న ఆయన.. పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటూ వస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మాట్లాడుతున్నారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారంటూ ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. -
రెబల్స్, స్వతంత్రుల టచ్‌లో బీజేపీ, కాంగ్రెస్ నేతలు?
రాజస్థాన్ ఎగ్జిట్ పోల్స్ లో దాదాపు అన్ని మీడియా సంస్థలు భారతీయ జనతా పార్టీ- కాంగ్రెస్ మధ్య గట్టి పోటీని అంచనా వేశాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ వివిధ పార్టీల నేతలకు గుండె దడను పెంచాయి. ఫలితాలు వెలువడకముందే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ బలమైన స్వతంత్రులను, రెబల్స్‌గా ఎన్నికల్లో పోటీకి దిగిన అభ్యర్థులతో సంప్రదింపులు మొదలుపెట్టాయనే వార్తలు వినిపిస్తున్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం పార్టీ నుండి టిక్కెట్ రాకపోవడంతో రెబల్‌గా ఎన్నికలలో పోటీ చేసిన చిత్తోఢ్‌గఢ్ తిరుగుబాటు అభ్యర్థి చంద్రభన్ సింగ్ అక్యాతో బీజేపీ టచ్‌లో ఉందని అంటున్నారు. ఇలాంటి తిరుగుబాటు నేతలు తమ కుటుంబ సభ్యులేనని, వారు ఎక్కడికీ వెళ్లరని, వారితో టచ్‌లో ఉన్నామని బీజేపీ నేత ఒకరు మీడియాకు తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే తరహా ప్రయత్నాలను ప్రారంభించింది. తమ పార్టీ రెబల్స్, స్వతంత్రులు, ఇతర చిన్న పార్టీల అభ్యర్థులను కూడా సంప్రదించడం మొదలుపెట్టింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోటసార మాట్లాడుతూ ‘గత ఎన్నికల్లో స్వతంత్రులు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారని, తమ విజయవంతమైన పాలనకు మద్దతుగా నిలిచారని, ఇప్పుడు కూడా అదే జరగనుందని’ అన్నారు. డిసెంబర్ 3న వెలువడే ఎన్నికల ఫలితాల్లో తమ పార్టీకే మెజారిటీ వస్తుందని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: పసివాడిని బావిలో తోసేసిన బాలిక.. తరువాత? -
మహ్మద్ ఘోరి V/S ఫక్కర్ రామాయని@17..
సాక్షి, ఉత్తరప్రదేశ్: అతని పేరు.. ఫక్కర్ రామాయని. వయసు 73 సంవత్సరాలు. ఉత్తరప్రదేశ్ మధురలోని గాల్టేశ్వర్ ఆలయ ప్రధాన పూజారి అయిన ఈయన 17వ సారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇంతవరకు ఎనిమిది లోక్‌సభ, ఎనిమిది శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన ఈ స్వామీజీకి డిపాజిట్ కూడా దక్కలేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ఇప్పుడు మరోసారి మథుర లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. నామినేషన్ల దాఖలు ప్రారంభం రోజునే ఆయన భక్తులతో కలిసి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఇన్ని ఎన్నికల్లో ఓడిపోయినా తాను నిరాశ పడటం లేదని, ఓటర్లు ఎప్పటికైనా తనను గుర్తిస్తారన్న నమ్మకం ఉందని అంటున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన రామాయని రెండు అంశాల మ్యానిఫెస్టోను కూడా ప్రకటించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం ఒకటయితే, యమునా నదిని కాలుష్యరహితం చేయడం రెండోది. రామాయణాన్ని కంఠతా పట్టేసిన ఈయనకు పెద్దసంఖ్యలో భక్తులు ఉన్నారు. ప్రస్తుతం మోకాలి నొప్పితో బాధపడుతున్నానని, అందువల్ల ప్రచారానికి కారు ఉపయోగిస్తున్నానని ఆయన చెబుతున్నారు. కారు, ఎన్నికల ఖర్చు కూడా ఆయన భక్తులే భరిస్తున్నారట. ఇంతకు ముందులాగే ఇప్పుడు కూడా రామాయని ముందుగా యమునా నదికి హారతి పట్టి ఆ తర్వాత నామినేషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 18న మధురలో పోలింగు జరగనుంది. -
కరీంనగర్లో దూసుకుపోయిన కారు
సాక్షి, కరీంనగర్ : తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి ఆసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ 11 స్థానాలను గెల్చుకొని జిల్లాపై సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. గత ఎన్నికల్లో కరీంనగర్ జిల్లాలో 12 స్థానాల్లో టిఆర్ఎస్ విజయం సాధించగా, జగిత్యాలలో మాత్రమే ఓటమి చెందిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ చేతిలో ఈఎన్నికల్లో అనూహ్యంగా ఘోర పరాజయం పాలయ్యారు. ఈసారి 11 స్థానాలను సొంతం చేసుకుని ఉత్తర తెలంగాణలో తనకు ఎదురులేదని చాటింది. మంథనిలో మాజీ మంత్రి శ్రీధర్ బాబు విజయం సాధించారు. రామగుండంలో అనూహ్యంగా స్వతంత్ర అభ్యర్థి కోరుగంటి చందర్ విజయం సాధించారు. ఎవరూ ఉహించని విధంగా కేసీఆర్ 9 నెలల ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి ప్రతి పక్షాలను కొలుకొని దెబ్బ తీశారు. అసెంబ్లీ రద్దుతోనే కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించగా ప్రతిపక్షాలు దిక్కులు చుడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు కూటమిగా ఏర్పడి టీఆర్ఎస్ను ఓడించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినా అవేవీ ఫలించలేదు. టీఆర్ఎస్ అమలు చేసీన సంక్షేమ పథకాలు, ప్రజల్లో కేసీఆర్ పట్ల ఉన్న నమ్మకం ముందు కూటమి ఎత్తులు నిలువలేకపోయాయి. నియోజకవర్గం పేరు పార్టీ అభ్యర్థి పేరు కరీంనగర్ టీఆర్ఎస్ గంగుల కమలాకర్ ధర్మపురి టీఆర్ఎస్ కొప్పల ఈశ్వర్ జగిత్వాల టీఆర్ఎస్ డా సంజయ్ కుమార్ కోరుట్ల టీఆర్ఎస్ కల్వకుంట్ట విద్యాసాగర్ రావు రామగుండం ఇతరులు కే చందర్ మంథని కాంగ్రెస్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు పెద్దపల్లి టీఆర్ఎస్ దాసరి మనోహర్ రెడ్డి చొప్పదండి టీఆర్ఎస్ సుంకే రవిశంకర్ వేములవాడ టీఆర్ఎస్ చేన్నమనేని రమేష్ సరిసిల్ల టీఆర్ఎస్ కే తారకరామారవు మానకొండూరు టీఆర్ఎస్ రసమయి బాలకీషన్ హూజురాబాద్ టీఆర్ఎస్ ఈటల రాజేందర్ హుస్నాబాద్ టీఆర్ఎస్ వడితెల సతీష్‌బాబు -
జెట్ ఎయిర్వేస్ ఇండిపెండెంట్ డైరెక్టర్ బై..బై
రుణ సంక్షోభంలో కూరుకుపోయిన విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ (ఇండియా) లిమిటెడ్ నెత్తిన మరో పిడుగుపడింది. ఇండిపెండెంట్ డైరెక్టర్ రంజన్ మథాయి రాజీనామా చేశారు. బోర్డు స్వతంత్ర డైరక్టర్‌గా తన బాధ్యతలను నెరవేర్చడానికి అవసరమైన సమయాన్ని కేటాయించలేకపోతున్న కారణంగా బోర్డుకు రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఒక వైపు కొండలా పెరుగుతున్న రుణభారం, మరోవైపు చమురు ధరల పెరుగుదల జెట్ ఎయిర్వేస్ను బాగా ప్రభావితం చేసింది. లాభాలు పడిపోయాయి. తీవ్ర నష్టాల్లో కూరుకపోయింది. దీంతో తనను తాను నిలబెట్టుకునేందుకు అష్టకష్టాలు పడుతోంది. ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితికి నెట్టబడింది. ఈ క్రమంలో టాటా గ్రూపునకు చెందిన టాటా సన్స్ లిమిటెడ్ జెట్‌లో వాటా కొనుగోలుకు ముందుస్తు చర్చలు ప్రారంభించినట్టు గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఆ ఒక్కరు ఎవరు..?
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్:కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల రెండో జాబితాలో ఖానాపూర్ సీటు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్‌కు ద క్కింది. ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఏడింటికి తొలి జాబితాలోనే అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం ఖానాపూర్, బోథ్ సీట్లకు అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ రెండు సీట్లకు కూడా అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ వివిధ కారణాల వల్ల వారి పేర్లను తొలి జాబితాలో వెల్లడించలేదు. రెండో జాబితాలో ఖానాపూర్ సీటును రమేష్ రాథోడ్‌కు ప్రకటించి న ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీ బోథ్‌ను మాత్రం పెండింగ్‌లోనే ఉంచింది. మూడో జాబితాలో బోథ్‌కు కూడా అభ్యర్థిని ప్రకటిం చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరుపున లంబాడా వర్గానికి చెందిన బాపూరావు రాథోడ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆదివాసీ వర్గం నాయకుడు సోయం బాపూరావుకు సీటివ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అయితే గతంలో ఇక్కడ పోటీ చేసిన అనిల్ జాదవ్‌కు టికెట్టు ఇవ్వాలని డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పీసీసీ నేతల ద్వారా ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఆ సీటుపై రెండో జాబితాలోనూ ఎటూ తేల్చలేదు. బెల్లంపల్లిలో సీపీఐ అభ్యర్థి గుండా మల్లేష్ మహాకూటమి పొత్తులో భాగంగా బెల్లంపల్లి సీటును సీపీఐకి కేటాయించిన విషయం తెలిసిందే. అయితే అభ్యర్థి ఎవరనే విషయంలో తొలుత కొంత సందిగ్థత ఏర్పడింది. వృద్ధాప్యం కారణంగా సీపీఐ మాజీ ఫ్లోర్ లీడర్ గుండా మల్లేష్ పోటీ చేయరనే ప్రచారం జరిగింది. అదే సమయంలో సీపీఐ టికెట్టు కోసం మంథెన మల్లేష్, మిట్టపల్లి వెంకటస్వామి, దాగం మల్లేష్ పేర్లు తెరపైకి వచ్చాయి. మంగళవారం జరిగిన సీపీఐ పార్టీ కార్యదర్శివర్గ సమావేశంలో గుండా మల్లేష్ తానే పోటీ చేస్తానని చెప్పినట్లు తెలిసింది. కొత్త నాయకుడికి ఎవరికి సీటిచ్చినా తక్కువ సమయంలో జనంలోకి వెళ్లడం కష్టమని, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తనకే సీటివ్వాలని ఆయన కోరినట్లు తెలిసింది. దీంతో ఆయన పేరును ఖరారు చేశారు. గురువారం అధికారికంగా ప్రకటించనున్నారు. టీడీపీని వీడి... టీఆర్ఎస్ను వదిలి... కాంగ్రెస్ నుంచి రాథోడ్ టీడీపీ నుంచి ఏడాదిన్నర క్రితం టీఆర్ఎస్లో చేరిన రమేష్ రాథోడ్ ఆ పార్టీ నుంచి ఖానాపూర్ సీటు తనదేనని భావించి భంగపడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రేఖానాయక్‌కే పార్టీ టికెట్టు ఇవ్వడంతో టీఆర్ఎస్ తనను మోసం చేసిందని విమర్శలు గుప్పించి కాంగ్రెస్‌లో చేరారు. ఈ నేపథ్యం లో రాథోడ్‌కు మాజీ ఎంపీల కోటా నుంచి కాంగ్రెస్ టికెట్టు ఖరారు చేసినట్లు ప్రచారం జరిగింది. ఇటీవల కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదం తెలిపిన 74 మంది జాబితాలో కూడా ఖానాపూర్ సీటును రమేష్ రాథోడ్‌కే కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన హరినాయక్.. రమేష్‌కు సీటివ్వడాన్ని వ్యతిరేకిస్తూ గాంధీభవన్‌లో రెండు రోజుల పాటు ఆందోళన చేశారు. దీంతో సందిగ్ధంలో పడ్డ అధిష్టానం తొలి జాబితాలో ఆయన పేరును ప్రకటించలేదు. అయితే స్థానికంగా నెలకొన్న పరిస్థితులు, విజయావకాశాలు ఎవరికి ఉన్నాయన్న అంశంపై పలు సమీకరణాలను బేరీజు వేసుకున్న అధిష్టానం రమేష్ రాథోడ్‌కే టికెట్టు కేటాయించింది. దీంతో హరినాయక్ వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ప్యారాచూట్‌తో వచ్చిన వ్యక్తికి పార్టీ ఎలా టికెట్టు ఇస్తుందని ఆయన వర్గం నిరసన వ్యక్తం చేస్తోంది. ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచే ప్రయత్నాల్లో హరినాయక్ ఉన్నట్లు సమాచారం. అరవింద్‌రెడ్డి వర్గంపై పీఎస్సార్ నజర్ మంచిర్యాల నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్టు ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి వర్గంలోని ముఖ్య నాయకులను పార్టీ అభ్యర్థిగా ఖరారైన కె.ప్రేంసాగర్‌రావు ఆకర్షిస్తున్నారు. బుధవారం అరవింద్‌రెడ్డి గ్రూప్‌లోని పార్టీ జిల్లా కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ శ్రీపతి శ్రీనివాస్, వంగ దయానంద్ తదితరులు టీఆర్ఎస్కు చెందిన మాజీ కౌన్సిలర్ బొలిశెట్టి కిషన్, మున్నూరుకాపు సంఘం నాయకురాలు శ్రీదేవి తదితరులు ప్రేంసాగర్‌రావుకు మద్దతు పలికారు. గురువారం మంచిర్యాల క్లబ్ సమీపంలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి, మాజీ మంత్రి డీకే.అరుణ తదితరులు హాజరు కానున్నారు. పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కూడా ఆహ్వానించినట్లు చెపుతున్నా, ఆయన వచ్చే విషయంలో స్పష్టత లేదు. టీఆర్ఎస్కు చెందిన పలువురు నాయకులు బహిరంగసభలో కాంగ్రెస్ కండువాలు కప్పుకోనున్నట్లు తెలిసింది. టీఆర్ఎస్లోకి అరవింద్‌రెడ్డి? కాంగ్రెస్ టికెట్టు ప్రేంసాగర్‌రావుకు కేటాయించడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న మాజీ ఎమ్మెల్యే అరవింద్‌రెడ్డి తిరిగి టీఆర్ఎస్లోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి గానీ బీఎస్పీ నుంచి గాని పోటీ చేస్తానని ప్రకటించిన అరవింద్‌రెడ్డి ప్రణాళిక ఏంటనే విషయంలో స్పష్టత రాలేదు. టీఆర్ఎస్లోకి వెళ్లే ఆలోచనతో ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌తో హైదరాబాద్‌లో చర్చలు జరిపినట్లు సమాచారం. 16వ తేదీన మంచిర్యాలలో జరిగే కేటీఆర్ సభలో ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. రెబల్స్‌గా కాంగ్రెస్ ఆశావహులు కాంగ్రెస్ పార్టీ టికెట్టు ఆశించి భంగపడ్డ పలువురు నాయకులు రెబల్స్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. గుర్తు కోసం ఇతర రాష్ట్రాలకు చెందిన ఏదైనా గుర్తింపు పొందిన పార్టీ టికెట్టు మీద గానీ, ఇండిపెండెంట్‌గా గానీ పోటీ చేసే ఆలోచనతో పలువురు పావులు కదుపుతున్నారు. రమేష్ రాథోడ్‌కు ఖానాపూర్ సీటు రావడంతో టికెట్టు కోసం పోటీ పడ్డ హరినాయక్ రెబల్‌గా నామినేషన్ వేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆదిలాబాద్‌లో మాజీ మంత్రి రామచంద్రారెడ్డి తటస్థంగా ఉంటారా? రెబల్‌గా బరిలో నిలుస్తారా? అనే విషయంలో స్పష్టత లేదు. ముథోల్‌లో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ కాంగ్రెస్ రెబల్‌గా ఎన్సీపీ లేదా ఇతర పార్టీల గుర్తుపై పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. బోథ్‌లో ఇంకా టికెట్టు ఎవరికీ ఖరారు కాలేదు. ఇక్కడ పోటీలో ఉన్న సోయం బాపూరావు, అనిల్ జాదవ్‌లలో ఎవరికి టికెట్టు వచ్చినా మరొకరు రెబల్‌గా నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
కాంగ్రెస్‌కు మాజీమంత్రి గుడ్‌బై
సాక్షి, వికారాబాద్: తన అనుచరులు, అభిమా నుల ఆకాంక్షల మేరకే తాను స్వతంత్ర అభ్య ర్థిగా బరిలోకి దిగుతున్న ట్లు మాజీ మంత్రి డాక్టర్ ఎ.చంద్రశేఖర్ వెల్లడించారు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలం గాణ ఉద్యమంలో రంగారెడ్డి జిల్లాలో తానే మొట్టమొదటగా పాల్గొ న్నానని తెలిపారు. రాష్ట్ర సాధన కోసం మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశానన్నారు. తెలంగాణ ఇచ్చిన ఘనత ఏఐసీసీ అధి నేత్రి సోనియాగాంధీనేనని, ఆమెకు ఢిల్లీ వెళ్లి కృతజ్ఞతలు కూడా తెలిపాన న్నారు. వికారాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ రాకపోవడం తో నిరాశ చెంది ఇండిపెండెంట్‌గా పోటీకి దిగుతున్నానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా సమర్పించినట్లు తెలిపారు. -
కల్వకుర్తి స్వతంత్ర అభ్యర్థిగా కసిరెడ్డి?
ఆమనగల్లు(కల్వకుర్తి) : కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పోటీచేయనున్నారు. ఈ మేరకు ఆయన తన అనుచరులకు సంకేతాలు ఇచ్చారు. మాడ్గుల మండలం కొల్కులపల్లి గ్రామం నుంచి గురువారం కసిరెడ్డి నారాయణరెడ్డి పరోక్షంగా ప్రచారం ప్రారంభించారు. కల్వకుర్తి అసెంబ్లీ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ను పార్టీ ప్రకటించడంతో కసిరెడ్డి నారాయణరెడ్డి మనస్థాపానికి గురయ్యారు. మంత్రి కేటీఆర్ స్వయంగా బుజ్జగించినా ఆయన మెత్తబడలేదు. తన అనుచరుల ఒత్తిడితో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కసిరెడ్డి సిద్ధమయ్యారు. ఎమ్మెల్సీగా విస్తృత పర్యటనలు కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన కసిరెడ్డి నారాయణరెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ఆ వెంటనే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించారు. నియోజకవర్గంలో తనకంటూ ఒక వర్గాన్ని కసిరెడ్డి నారాయణరెడ్డి ఏర్పాటు చేసుకున్నారు. టికెట్ రాకపోవడంతో... ఈ ఎన్నికల్లోనూ కల్వకుర్తి నుంచి పోటీ చేయడానికి కసిరెడ్డి నారాయణరెడ్డి ఆసక్తి చూపించారు. కానీ టీఆర్ఎస్ అధిష్టానం టికెట్‌ను జైపాల్‌యాదవ్‌కు కేటాయించింది. అప్పటి నుంచి కసిరెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా టీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారంలో కూడా పాల్గొనడం లేదు. అయితే, రెండు మూడు రోజులుగా నియోజకవర్గంలో వివిధ మండలాల నుంచి ముఖ్యనాయకులతో కసిరెడ్డి రహస్య సమావేశాలు నిర్వహించి అనుచరుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. -
మోత్కుపల్లి శంఖారావం.. ఇండిపెండెంట్‌గా పోటీ
సాక్షి, యదాద్రి : టీడీపీ బహిష్కిృత నేత మోత్కుపల్లి నరసింహులు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలువనున్నారు. తన సొంత నియోజకవర్గమైన ఆలేరు స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్లు మోత్కుపల్లి ప్రకటించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఆలేరు ప్రజల అభీష్టం మేరకు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఆలేరు నియోజకవర్గానికి గోదావరి జలాలను తీసుకురావడమే తన లక్ష్యమని ఆయన ప్రకటించారు. తన జీవితానికి ఇవే చివరి ఎన్నికలని ఆయన తేల్చిచెప్పారు. ఈ మేరకు రేపు యాదగిరిగుట్టలో ‘‘మోత్కుపల్లి శంఖరావం’’ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభ ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. సభ ఏర్పాట్లను తన మద్దతుదారులతో కలిసి బుధవారం పరిశీలించారు. కాగా టీడీపీలో సీనియర్‌నేతగా, మంత్రిగా వ్యవహిరించిన మోత్కుపల్లి చంద్రబాబు వ్యవహారంతో విభేదించి ఆయనపై ఇటీవల తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. టీడీపీకి రాజీనామా అనంతరం వివిధ పార్టీల్లో ఆయన చేరుతారని వార్తలు వచ్చినప్పటికీ ఆయన వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ మధ్య జనసేనాలో చేరుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని మధిర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన మోత్కుపల్లి కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్క చేతిలో ఓటమి పాలైయ్యారు. టీడీపీ కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్న సమయంలో కేంద్రంలో చంద్రబాబు సహాకారంతో ఏదోఒక పదవి వస్తుందని ఆశించిన మోత్కుపల్లి... చివరికి చంద్రబాబు హ్యాండ్ ఇవ్వడంతో తీవ్ర మనస్థాపం చెందారు. -
చాయ్‌వాలా టు మిలీనియర్‌గా మారిన ఇండిపెండెంట్ అభ్యర్థి
-
కిరణ్....పవన్....బీజేపీ... ఇండిపెండెట్?
కందుకూరు : 'ఏ పార్టీలోకి వెళ్దాం..? కిరణ్ పార్టీ, పవన్ పార్టీ, బీజేపీల్లో ఏదో ఒకటి చెప్పండి. లేదూ ఇండిపెండెంట్‌గా పోటీ చేయమంటారా...?' ఇవీ మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి తన నిజయోకవర్గ కార్యకర్తల ముందు ఉంచిన ఆప్షన్లు. కాంగ్రెస్ ఖాళీ అయిన నేపథ్యంలో ఆ పార్టీ నుంచి బయటకొచ్చే యోచనలో ఉన్న మహీధర్ రెడ్డి నిన్న మాచవరంలోని తన నివాసంలో గుడ్లూరు, ఉలవపాడు మండలాలకు చెందిన పలువురు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. 'కిరణ్ కుమార్ రెడ్డి పెట్టే పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ, బీజేపీలున్నాయి. వీటిలో ఏదో ఒక పార్టీలోకి వెళ్దామా? లేదంటూ ఇండిపెంటెండ్గా పోటీకి దిగమంటారా' అని మహీధర్ రెడ్డి కార్యకర్తలను ప్రశ్నించారు. కార్యకర్తల మనసులో వైఎస్ఆర్ సీపీనే ఉండడంతో మహీధర్ రెడ్డి ఇచ్చిన ఆప్షన్లకు ఎవరూ సమాధానం చెప్పలేదు. వైఎస్సార్ సీపీలోకి వెళ్దామని కొందరు అనడంతో ... ఆపార్టీలోకి వెళ్లేవారు ఇక్కడకు ఎందుకు వచ్చారంటూ ఆయన ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. కార్యకర్తలకు ఏ పార్టీలోకి వెళ్దామని ఆప్షన్లు ఇచ్చినప్పటికీ ఆయన మాటలను బట్టి చేస్తే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేలా కనిపిస్తున్నారని ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ఆర్ సీపీ టికెట్ దక్కదనే ఉద్దేశంతోనే కిరణ్, పవన్, బీజేపీ అని ఆయన ఆప్షన్లు ఇచ్చారని చెబుతున్నారు. పైగా ఆప్షన్లలో పేర్కొన్న పార్టీల గురించలి పెద్దగా చర్చించలేదని కార్యకర్తలు తెలిపారు.