సాక్షి, కరీంనగర్ : తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి ఆసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీ 11 స్థానాలను గెల్చుకొని జిల్లాపై సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. గత ఎన్నికల్లో కరీంనగర్ జిల్లాలో 12 స్థానాల్లో టిఆర్‌ఎస్ విజయం సాధించగా, జగిత్యాలలో మాత్రమే ఓటమి చెందిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ చేతిలో ఈఎన్నికల్లో అనూహ్యంగా ఘోర పరాజయం పాలయ్యారు. ఈసారి 11 స్థానాలను సొంతం చేసుకుని ఉత్తర తెలంగాణలో తనకు ఎదురులేదని చాటింది. మంథనిలో మాజీ మంత్రి శ్రీధర్ బాబు విజయం సాధించారు. రామగుండంలో అనూహ్యంగా స్వతంత్ర అభ్యర్థి కోరుగంటి చందర్ విజయం సాధించారు.
ఎవరూ ఉహించని విధంగా కేసీఆర్ 9 నెలల ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి ప్రతి పక్షాలను కొలుకొని దెబ్బ తీశారు. అసెంబ్లీ రద్దుతోనే కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించగా ప్రతిపక్షాలు దిక్కులు చుడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు కూటమిగా ఏర్పడి టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినా అవేవీ ఫలించలేదు. టీఆర్‌ఎస్ అమలు చేసీన సంక్షేమ పథకాలు, ప్రజల్లో కేసీఆర్ పట్ల ఉన్న నమ్మకం ముందు కూటమి ఎత్తులు నిలువలేకపోయాయి.
నియోజకవర్గం పేరు | పార్టీ | అభ్యర్థి పేరు |
కరీంనగర్ | టీఆర్‌ఎస్ | గంగుల కమలాకర్ |
ధర్మపురి | టీఆర్‌ఎస్ | కొప్పల ఈశ్వర్ |
జగిత్వాల | టీఆర్‌ఎస్ | డా సంజయ్ కుమార్ |
కోరుట్ల | టీఆర్‌ఎస్ | కల్వకుంట్ట విద్యాసాగర్ రావు |
రామగుండం | ఇతరులు | కే చందర్ |
మంథని | కాంగ్రెస్ | దుద్దిళ్ల శ్రీధర్ బాబు |
పెద్దపల్లి | టీఆర్‌ఎస్ | దాసరి మనోహర్ రెడ్డి |
చొప్పదండి | టీఆర్‌ఎస్ | సుంకే రవిశంకర్ |
వేములవాడ | టీఆర్‌ఎస్ | చేన్నమనేని రమేష్ |
సరిసిల్ల | టీఆర్‌ఎస్ | కే తారకరామారవు |
మానకొండూరు | టీఆర్‌ఎస్ | రసమయి బాలకీషన్ |
హూజురాబాద్ | టీఆర్‌ఎస్ | ఈటల రాజేందర్ |
హుస్నాబాద్ | టీఆర్‌ఎస్ | వడితెల సతీష్‌బాబు |
Comments
Please login to add a commentAdd a comment