దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. జూన్ ఒకటిన జరిగే ఆఖరి విడత పోలింగ్‌తో ఎన్నికలు ముగియనున్నాయి. తాజాగా ఎన్నికల హక్కుల సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) తెలిపిన వివరాల ప్రకారం 2009తో పోలిస్తే 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీల సంఖ్య 104 శాతం పెరిగింది.
ఏడీఆర్ విశ్లేషణ ప్రకారం 2024లో 751 రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలో నిలవగా, 2019లో 766, 2014లో 464, 2009లో 368 పార్టీలు ఎన్నికల బరిలో నిలిచాయి. 2009 నుంచి 2024 మధ్య ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీల సంఖ్య 104 శాతం పెరిగింది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దిగిన 8,337 మంది అభ్యర్థుల అఫిడవిట్లపై ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ సమగ్ర విశ్లేషణ చేశాయి.
2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొత్తం 8,360 మంది అభ్యర్థుల్లో 1,333 మంది జాతీయ పార్టీల నుంచి, 532 మంది రాష్ట్ర స్థాయి పార్టీల నుంచి, 2,580 మంది రిజిస్టర్డ్ కాని పార్టీల నుంచి, 3,915 మంది స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బలిలోకి దిగారు. జాతీయ పార్టీలకు చెందిన 1,333 మంది అభ్యర్థుల్లో 443 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 295 మంది అభ్యర్థులు పలు క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. రాష్ట్ర స్థాయి పార్టీలకు చెందిన 532 మంది అభ్యర్థుల్లో 249 మందిపై క్రిమినల్ కేసులున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment