దేశంలో లోక్‌సభ ఎన్నికల సందడి నెలకొంది. ఈ నేపధ్యంలో పలుచోట్ల ఆసక్తికర వైనాలు కనిపిస్తున్నాయి. దీనిలో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ఒకటి. ఇక్కడ మే 13న ఓటింగ్ జరగనుంది. ఉజ్జయిని నుంచి మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులు బరిలోకి దిగగా, వారిలో ఇద్దరు అనిల్‌లు, ఇద్దరు మహేష్‌లు ముఖాముఖీ తలపడటం విశేషం.
ఉజ్జయిని నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో దిగినవారిలో బీజేపీ అభ్యర్థి అనిల్ ఫిరోజియా, కాంగ్రెస్ అభ్యర్థి మహేష్ పర్మార్, భీమ్ సేన దళ్‌కు చెందిన డాక్టర్ హేమంత్ పర్మార్, బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన ప్రకాష్ చౌహాన్, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా గంగా మాలవ్య, మహేష్ పర్మార్,అనిల్, ఈశ్వర్‌లాల్, సురేష్, ఈశ్వర్‌లాల్ ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈసారి లోక్‌సభ ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా ఒకే పేరుతో ఇద్దరు అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం విశేషం.
ఉజ్జయిని పార్లమెంటరీ నియోజకవర్గానికి వచ్చిన 11 మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన కలెక్టర్, రిటర్నింగ్ అధికారి నీరజ్ కుమార్ సింగ్ సమక్షంలో జరిగింది. దీనిలో తొమ్మిది మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలు ఆమోదం పొందాయి. ఇద్దరు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి
Comments
Please login to add a commentAdd a comment