![CM Mohan Yadav Celebrates Raksha Bandhan At Ujjain](/styles/webp/s3/article_images/2024/08/19/mohan-rakhi.jpg.webp?itok=ncXmo7Jr)
ఉజ్జయిని: ‘నేను ముఖ్యమంత్రిని మాత్రమే కాదు. నా ప్రియతమ సోదరీమణులకు ప్రధాన సేవకుడిని’ అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ అన్నారు. వెంటనే అక్కడున్న ఆడపడుచులంతా ‘మా అందరి అన్నయ్య.. మోహన్ అన్నయ్య’ అంటూ నినాదాలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో నేడు (సోమవారం) రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మోహన్ యాదవ్ మాట్లాడుతూ కుటుంబమంతటి శ్రేయస్సును ఇంటి ఆడపడుచులు కోరుకుంటారని, వారు సంతోషంగా ఉంటే కుటుంబమంతా సంతోషంగా ఉంటుందని అన్నారు. భారతీయ సంస్కృతిలో సోదరీమణులను ఎప్పటి నుంచో దేవతలుగా పూజిస్తున్నారని, ఇందుకు ఉదాహరణగా పలు పండుగలు నిలుస్తున్నాయని అన్నారు. రాఖీ సందర్భంగా సీఎంకు పలువురు మహిళలు రాఖీ కట్టారు. సీఎం రాష్ట్ర ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment