
చెన్నై : సీనియర్ నటి కుష్బూ ఆదివారం రాత్రి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. రేపు ఉదయం ఆమె బీజేపీలో చేరనున్నారు. కాగా కుష్బూ కాంగ్రెస్ పార్టీలో జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న సమయంలో కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా పాలసీని సమర్థిస్తూ ట్వీట్ చేశారు. కుష్బూ చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది.అప్పటి నుంచి కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్న కుష్బూ బీజేపీలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా కుష్బూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కుష్బూ రేపు మధ్యాహ్నం బీజేపీలో చేరబోతున్నారు. భారత పౌరురాలిగా ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలను ప్రశంసించించే హాక్కు తనకు ఉందని కుష్బూ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment