
ప్రముఖ నటుడు, ‘రామాయణ్’ సీరియల్ ఫేమ్ చంద్ర శేఖర్ (98) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా వయోభారంతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ముంబైలోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ‘నాన్నగారు నిద్రలోనే కన్నుమూశారు. ఆయనికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. వయసు మీద పడటంతోనే చనిపోయారు’’ అని చంద్ర శేఖర్ కుమారుడు, నిర్మాత అశోక్ శేఖర్ ట్వీట్ చేశాడు. జుహులోని పవన్ హాన్స్‌లో ఈ రోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
చంద్రశేఖర్ స్వస్థలం హైదరాబాద్. నటనపై మక్కువతో 1950లో జూనియర్ ఆర్టిస్ట్‌గా మారారు. ఆ తర్వాత ‘సురంగ్’ అనే చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. ‘కవి’, ‘మస్తానా’, ‘బసంత్ బహార్’, ‘కాలీ టోపీ లాల్ రుమాల్’, ‘గేట్ ఆఫ్ ఇండియా’, ‘ఫ్యాషన్’, ‘ధర్మ’, ‘డ్యాన్స్ డ్యాన్స్’, ‘లవ్ లవ్ లవ్’ తదితర సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి మెప్పించారు. రామానంద్ సాగర్ దర్శకత్వంలో రూపొందిన ‘రామాయణ్ సీరియల్‌తో మరింత ఫేమస్ అయ్యారు. ఇందులో ఆర్య సుమంత్ అనే పాత్ర పోషించారు.
रामायण में महामंत्री सुमंत्र का चरित्र निभाने वाले श्री चंद्रशेखर जी का आज देहांत हो गया है। उन्हें शांति और सद्गति मिले, राम जी से यही प्रार्थना है 🙏
— Arun Govil (@arungovil12) June 16, 2021
सर, आपकी बहुत याद आएगी 🙏🙏 pic.twitter.com/1Wj1o6UaBC