పార్లమెంటులో ప్రభుత్వ ప్రకటన
2022–23లో నష్టాలు రూ.8,161 కోట్లు
2023–24లో రూ.5,371 కోట్లు
రూ.39 శాతం పురోగతితో రూ.2,164 కోట్లకు ఆదాయం అప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) వడ్డీ, పన్ను, తరుగుదల, రుణ బకాయిల ముందు ఆదాయాలు లేదా ఎబిటా (స్థూల ఆదాయం) 2023–24 ఆర్థిక సంవత్సరానికి 38.8 శాతం పురోగతితో రూ. 2,164 కోట్లకు చేరిందని కమ్యూనికేషన్స్ శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ బుధవారం పార్లమెంటుకు తెలియజేశారు. నష్టాలు రూ. 5,371 కోట్లకు తగ్గాయని వివరించారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో నష్టం రూ.8,161 కోట్లు కావడం గమనార్హం. ఆయా అంశాలపై పెమ్మసాని లిఖిత పూర్వకంగా ఇచి్చన సమాధానంలో కొన్ని ముఖ్యాంశాలు..
డేటా ఉల్లంఘనలు జరగలేదు...
బీఎస్‌ఎన్‌ఎల్ డేటా ఉల్లంఘన విషయానికి వస్తే, బీఎస్‌ఎన్‌లో చొరబాటు డేటా ఉల్లంఘన జరగవచ్చని ఈ ఏడాది మే 20న ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్‌టీ–ఇన్) నివేదించింది. దీనిని విశ్లేíÙంచడం జరిగింది. ఒక ఫైల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ (ఎఫ్‌టీపీ) సర్వర్‌లో సీఈఆర్‌టీ–ఇన్ షేర్ చేసిన నమూనా డేటాకు సమానమైన డేటా ఉందని కనగొనడం జరిగింది.
టెలికం నెట్‌వర్క్ హోమ్ లొకేషన్ రిజిస్టర్ (హెచ్‌ఎల్‌ఆర్)లో ఎటువంటి ఉల్లంఘన జరగలేదని స్పష్టమైంది. బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌లో సేవలో అంతరాయం కలుగలేదు. అయినప్పటికీ, ఎటువంటి డేటా ఉల్లంఘనలూ జరక్కుడా బీఎస్‌ఎన్‌ఎల్ చర్యలు నిరంతరం తీసుకుంటోంది. అన్ని ఎఫ్‌టీపీ సర్వర్‌లకు యాక్సెస్ పాస్‌వర్డ్‌ల మార్పులు జరిగాయి. టెలికం నెట్‌వర్క్‌ల ఆడిట్ నిర్వహించడానికి అలాగే టెలికం నెట్‌వర్క్‌లలో డేటా ఉల్లంఘనల నివారణకు పరిష్కార చర్యలను సూచించడానికి ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ (ఐఎంసీ)ని ఏర్పాటు చేయడం జరిగింది.
→ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలు, చర్యల ఫలితంగా 2020–21 ఆర్థిక సంవత్సరం నుండి బీఎస్‌ఎన్‌ఎల్ అలాగే ఎంటీఎన్‌ఎల్ నిర్వహణ లాభాలను ఆర్జించడం ప్రారంభించాయి.
→ ఆత్మనిర్భర్ భారత్ చొరవకు అనుగుణంగా బీఎస్‌ఎన్‌ఎల్ దేశీయ 4జీ సాంకేతికత విస్తరణ కోసం లక్ష 4జీ సైట్‌ల కోసం కొనుగోలు ఆర్డర్ చేయడం జరిగింది. ఈ పరికరాలను 5జీకి అప్‌గ్రేడ్ కూడా చేయవచ్చు.
→ బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ పునరుద్ధరణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. 2019లో దాదాపు రూ. 69,000 కోట్ల మొదటి పునరుద్ధరణ ప్యాకేజీ... బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ నిర్వహణ ఖర్చులను తగ్గించింది.
→ 2022లో దాదాపు రూ. 1.64 లక్షల కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీ మంజూరు జరిగింది. తాజా మూలధనాన్ని చొప్పించడం, రుణాన్ని పునరి్నరి్మంచడం, గ్రామీణ టెలి ఫోనీకి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ దీని ఈ ప్యాకేజీ లక్ష్యం.
→ 2023లో మొత్తం రూ.89,000 కోట్లతో బీఎస్‌ఎన్‌ఎల్‌కు 4జీ అలాగే 5జీ స్పెక్ట్రమ్ కేటాయింపును ప్రభుత్వం ఆమోదించింది.
Comments
Please login to add a commentAdd a comment