భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) 150 రోజుల వ్యాలిడిటీతో రూ.397 ప్లాన్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు రోజుకు 2జీబీ డేటా పొందవచ్చు. ఈ ప్లాన్ కొత్తది కాదు, కానీ ప్రయోజనాలలో కొన్ని మార్పులు జరిగినట్లు తెలుస్తోంది.
రూ.397లతో రీఛార్జ్ చేస్తే.. ఐదు నెలల (150 రోజులు) వరకు రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. గతంలో ఈ ప్లాన్ 180 రోజుల వరకు చెల్లుబాటు అయ్యేది. రోజుకి 2జీబీ డేటా.. 60 రోజులపాటు అపరిమిత ఫోన్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు లభించేవి. అయితే ఇవన్నీ ఇప్పుడు 30 రోజులకు పరిమితం చేశారు. కానీ వినియోగదారుడు 150 రోజుల పాటు ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్ సౌకర్యాన్ని పొందవచ్చు.
ఇన్‌కమింగ్ కాల్స్ కోసం చూసేవారికి ఇది ఉత్తమ ఆప్షన్. అయితే 30 రోజుల తరువాత డేటా, ఎస్ఎమ్ఎస్ ఆప్షన్స్ వంటివి లభించవు. కేవలం ఇన్‌కమింగ్ కాల్స్ మాత్రమే. సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునేవారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.
జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు తమ రీఛార్జ్ ధరలను భారీగా పెంచిన తరువాత.. బీఎస్ఎన్ఎల్ పుంజుకుంటోంది. ఈ తరుణంలో బీఎస్ఎన్ఎల్ తన నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించే పనిలో నిమగ్నమై ఉంది. కంపెనీ 4జీ సర్వీసును కూడా 2025 మార్చి నాటికి దేశ్య వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమైంది.
Comments
Please login to add a commentAdd a comment