
న్యూఢిల్లీ: బీఎస్‌ఎన్‌ఎల్ ఐదు రాష్ట్రాల పరిధిలో తనకున్న ఖరీదైన 13 ప్రాపర్టీలను ఎంఎస్‌టీసీ సహకారంతో డిసెంబర్ 5న వేలం వేయనుంది. ఈ ఆస్తులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో ఉన్నట్టు బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించింది.
నష్టాల్లో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ మొత్తం 14 ప్రాపర్టీలను వేలానికి గుర్తించగా, వీటి విలువ రూ.20,160 కోట్లుగా ఉండడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిగూడెం, కొండపల్లి, తెలంగాణలోని పటాన్‌చెరులో ఉన్న ఆస్తులు కూడా వేలానికి రానున్నాయి.
చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా!