![BSNL 365 Days Cheapest Recharge Plan with Unlimited Calling and Data](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/bsnl-main.jpg.webp?itok=uTUVyuS2)
మొబైల్ ఫోను వినియోగదారుల కోసం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చింది. 365 రోజుల పాటు చెల్లుబాటయ్యే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఎంతో చౌకైనది కూడా. ఈ ప్లాన్ తీసుకునే వినియోగదారులకు రోజుకు రూ. 3 మాత్రమే ఖర్చవుతుంది. 4జీ నెట్‌వర్క్‌పైపు వేగంగా అడుగులు వేస్తున్న బీఎస్‌ఎన్‌ల్ అందిస్తున్న ఈ ప్లాన్ మొబైల్ ఫోను వినియోగదారులకు ఎంతో ఉపశమనం కలిగించనుంది.
బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న ఈ చౌకైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధర రూ.1,198. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు 365 రోజులు లేదా 12 నెలలు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఈ ప్లాన్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్‌ను సెకండరీ నంబర్‌గా ఉపయోగించే వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లో వినియోగదారులకు ప్రతి నెలా రూ. 100 వరకూ ఖర్చవుతుంది.
ఈ ప్లాన్‌లో దేశవ్యాప్తంగా ఏ నంబర్‌కైనా కాల్ చేయడానికి ప్రతి నెలా 300 ఉచిత నిమిషాలు అందుబాటులో ఉంటాయి. అలాగే వినియోగదారులు ప్రతి నెలా 3GB హై స్పీడ్ 3G/4G డేటా ప్రయోజనాన్ని అందుకుంటారు. ప్రతి నెలా 30 ఉచిత SMSల ప్రయోజనం పొందుతారు. ఉచిత జాతీయ రోమింగ్ కూడా ఈ ప్లాన్‌లో ఉంది. భారతదేశం అంతటా రోమింగ్ చేస్తున్నప్పుడు వినియోగదారులు ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్‌ను అందుకోవచ్చు.
కాగా బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ విస్తరణ కోసం ప్రభుత్వం రూ.6,000 కోట్ల ప్రోత్సాహాన్ని అందించింది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్- ఎంటీఎన్‌ఎల్‌ల 4జీ సేవలను అప్‌గ్రేడ్ చేయడానికి ఈ అదనపు బడ్జెట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. త్వరలో ఈ రెండు టెలికాం కంపెనీల వినియోగదారులు పూర్తిస్థాయిలో 4జీ సేవలను అందుకోనున్నారు.
ఇది కూడా చదవండి: Nepal: 23 మంది భారతీయులు అరెస్ట్.. కారణం ఇదే..
Comments
Please login to add a commentAdd a comment