consumers
-
BSNL నుంచి అదిరిపోయే ప్లాన్.. 365 రోజులు.. రోజుకు రూ. 3 మాత్రమే
మొబైల్ ఫోను వినియోగదారుల కోసం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చింది. 365 రోజుల పాటు చెల్లుబాటయ్యే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఎంతో చౌకైనది కూడా. ఈ ప్లాన్ తీసుకునే వినియోగదారులకు రోజుకు రూ. 3 మాత్రమే ఖర్చవుతుంది. 4జీ నెట్వర్క్పైపు వేగంగా అడుగులు వేస్తున్న బీఎస్ఎన్ల్ అందిస్తున్న ఈ ప్లాన్ మొబైల్ ఫోను వినియోగదారులకు ఎంతో ఉపశమనం కలిగించనుంది.బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ చౌకైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధర రూ.1,198. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు 365 రోజులు లేదా 12 నెలలు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఈ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ సిమ్‌ను సెకండరీ నంబర్‌గా ఉపయోగించే వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లో వినియోగదారులకు ప్రతి నెలా రూ. 100 వరకూ ఖర్చవుతుంది.ఈ ప్లాన్‌లో దేశవ్యాప్తంగా ఏ నంబర్‌కైనా కాల్ చేయడానికి ప్రతి నెలా 300 ఉచిత నిమిషాలు అందుబాటులో ఉంటాయి. అలాగే వినియోగదారులు ప్రతి నెలా 3GB హై స్పీడ్ 3G/4G డేటా ప్రయోజనాన్ని అందుకుంటారు. ప్రతి నెలా 30 ఉచిత SMSల ప్రయోజనం పొందుతారు. ఉచిత జాతీయ రోమింగ్ కూడా ఈ ప్లాన్‌లో ఉంది. భారతదేశం అంతటా రోమింగ్ చేస్తున్నప్పుడు వినియోగదారులు ఉచిత ఇన్కమింగ్ కాల్స్‌ను అందుకోవచ్చు.కాగా బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ విస్తరణ కోసం ప్రభుత్వం రూ.6,000 కోట్ల ప్రోత్సాహాన్ని అందించింది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్- ఎంటీఎన్ఎల్ల 4జీ సేవలను అప్‌గ్రేడ్ చేయడానికి ఈ అదనపు బడ్జెట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. త్వరలో ఈ రెండు టెలికాం కంపెనీల వినియోగదారులు పూర్తిస్థాయిలో 4జీ సేవలను అందుకోనున్నారు.ఇది కూడా చదవండి: Nepal: 23 మంది భారతీయులు అరెస్ట్.. కారణం ఇదే.. -
వినియోగదారుడా మేలుకో.. ఇన్ఫ్లుయెన్సర్ల మాయాజాలమిదే..
ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలలో ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావం అధికంగా ఉంటోంది. వీరు ఫేస్బుక్ (Facebook), ట్విట్టర్ (Twitter), ఇన్స్టాగ్రామ్ (Instagram) యూట్యూబ్ (YouTube) తదితర డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ లో చేసే పోస్టులకు మంచి రీచ్ వస్తోంది. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్లు వినియోగదారులపై తమ ఉత్పత్తుల ప్రచారంతో విపరీతమైన ప్రభావాన్ని చూపుతున్నారు. అయితే వీరిలోని కొందరు చేసే అడ్వెర్టైజ్మెంట్లు, అన్‌ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టిసెస్ వినియోగదారులను తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని అడ్వర్టైజింగ్ ప్రమాణాల మండలి(ఏఎస్సీఐ) హెచ్చరించింది. ఏఎస్సీఐ గతంలో సోషల్‌మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ఆగడాలను కట్టడి చేసేందుకు పలు మార్గదర్శకాలను రూపొందించిన ప్రకటించింది. అయితే వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఇన్ఫ్లుయెన్సర్లు వ్యవహరిస్తూ, వినియోగదారులను నిలువునా ముంచేస్తున్నారు. ఏఎస్సీఐ ప్రకటించిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.1. పారదర్శకత: ఇన్ఫ్లుయెన్సర్లు తాము ప్రచారం చేస్తున్న బ్రాండ్లకు సంబంధించిన వస్తుపరమైన ప్రయోజనాలను బహిర్గతం చేయాలి. ఆ వస్తువు లేదా సేవలకు సంబంధించిన చెల్లింపులు, బహుమతులు, ఉచిత ఉత్పత్తులు లేదా పరిహారం లాంటివి తప్పనిసరిగా వెల్లడించాలి.2. సరైన వివరణ: ఇన్ఫ్లుయెన్సర్లు ఏదైనా బ్రాండ్ గురించి చెబుతున్నప్పుడు అది వినియోగదారునికి సులభంగా అర్థమయ్యేలా ఉండాలి. హ్యాష్‌ట్యాగ్‌లు లేదా టెక్స్ట్‌లో అంతర్గతంగా దాచివుంచకూడదు. ఆ వివరాలు వినియోగదారునికి తెలిసేలా ఉండాలి3. స్పష్టత: ఎండార్స్మెంట్స్ తప్పనిసరిగా సరళమైన, భాషలో ఉండాలి. అది అడ్వెర్టైజ్మెంట్, స్పాన్సర్డ్, పెయిడ్ ప్రమోషన్ లాంటి పదాలను ఉపయోగిస్తూ స్పష్టతవ్వాలి.4. వివిధ ప్లాట్‌ఫారాలు: ఏఎస్సీఐ వివిధ ప్లాట్‌ఫారాలకు నిర్దిష్ట రూపంలో మార్గదర్శకాలను ప్రకటించింది. ఇన్ఫ్లుయెన్సర్లు వాటిని గమనించి, ఆ నిర్దిష్ట నియమాలను పాటించాలి.5. ప్రస్తావన: ఇన్ఫ్లుయెన్సర్ మొదటి పోస్ట్‌లో మాత్రమే కాకుండా, స్పాన్సర్ చేస్తున్న ఉత్పత్తి లేదా సేవను గురించి ప్రస్తావించిన ప్రతిసారీ పారదర్శకత పాటించాలి.6. చట్టపరమైన సమ్మతి: ఇన్ఫ్లుయెన్సర్లు వారుంటున్న ప్రాంతంలోని మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి. భారతదేశంలో ఈ మార్గదర్శకాలను అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ), సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ)లు రూపొందించి, అమలు చేస్తున్నాయి.7. పరిణామాలు: ఇన్‌ఫ్లుయెన్స ఈ మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైతే వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టే అవకాశముంది. వారికి జరిమానా కూడా విధిస్తారు. ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా మార్థదర్శకాలను ఉల్లంఘించినప్పుడు అని వారి ఖ్యాతిని దెబ్బతీస్తుంది. వినియోగదారులతో సత్సంబంధాలను కోల్పోతారు. ఏఎస్సీఐ రూపొందించిన మార్గదర్శకాలను అనుసరించడం వలన ఇన్ఫ్లుయెన్సర్లు తమ ఫాలోవర్స్‌లో నమ్మకాన్ని పెంచుకోగలుగుతారు.ఇది కూడా చదవండి: 11 ఏళ్లలో 86 విదేశీ పర్యటనలు.. ప్రధాని మోదీ ఎప్పుడు ఎక్కడికి వెళ్లారు? -
సోషల్ మీడియా.. మార్కెట్ మేనియా
విస్తృతమవుతున్న ప్రకటనల మార్కెట్ ⇒ 2024 మార్చి నాటికి సోషల్ మీడియాలో వ్యాపార ప్రకటనల మార్కెట్: రూ. 10 వేల కోట్లు. ⇒ 2027 నాటికి సోషల్ మీడియాలో వ్యాపార ప్రకటనల మార్కెట్ (అంచనా): రూ. 14 వేల కోట్లు. ⇒ ఏదో ఒక బ్రాండు, బ్రాండ్ అంబాసిడర్‌ను అనుసరిస్తున్న సోషల్ మీడియా ఖాతాదారులు: 90 శాతం ⇒ ప్రకటనను చూసిన వెంటనే కొనుగోలు చేస్తున్న వారు: 11 శాతం ⇒ ప్రకటనలు చూసి అవే ఉత్పత్తులను బయట స్టోర్స్‌లో కొనుగోలు చేస్తున్న వారు: 21 శాతం ⇒ దేశంలో సోషల్ మీడియాలో వ్యాపార ప్రకటనలపై ఆధారపడుతున్న పెద్ద, మధ్య తరహా వ్యాపార సంస్థలు: 77 శాతం ⇒ సోషల్ మీడియాలో చూసిన వాటిలో కనీసం ఏదో ఒక ఉత్పత్తిని కొనుగోలు చేస్తున్న ఖాతాదారులు: 76 శాతం ⇒ ప్రకటన చూశాక ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేస్తున్నవారు: 44 శాతం సాక్షి, అమరావతిప్రస్తుత స్మార్ట్ ఫోన్ల యుగంలో ప్రపంచం మొత్తం సోషల్ మీడియా చుట్టూ తిరుగుతోంది. ఇక భారత్‌లో అయితే సోషల్ మీడియా మేనియా అన్ని దేశాలకన్నా ముందుంది. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగంలో భారత్ మొదటిస్థానంలో ఉండగా.. రానున్న రోజుల్లో ఇది మరింత ఉధృతమవుతుందని ఫోర్బ్స్ నివేదిక వెల్లడించింది. భారత్‌లో సెల్ ఫోన్ వినియోగదారులు రోజుకు సగటున రెండున్నర గంటల పాటు సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారని ఈ నివేదిక వెల్లడించింది. ఇక పెద్ద పెద్ద వ్యాపార సంస్థల నుంచి చిన్న స్థాయి సంస్థల వరకూ ప్రకటనల ద్వారా తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి సోషల్ మీడియానే ఆశ్రయిస్తున్నారు. ఇన్ఫ్లుయన్సర్స్ హవా.. ఈ సోషల్ మీడియా యుగంలో ఇన్ఫ్లుయన్సర్స్ హవా కొనసాగుతోంది. కనీసం 10లక్షల మంది ఫాలోయర్లు ఉండే ఇన్‌ఫ్లుయన్సర్స్‌కు డిమాండ్ భారీగా ఉంటోంది. వారికి భారీ పారితోషికాన్ని చెల్లించేందుకు పారిశ్రామిక సంస్థలు, రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉంటున్నాయి. యూ ట్యూబ్‌లో 10 లక్షల వ్యూస్ వచ్చే వీడియోకు రూ. 3 లక్షలు చొప్పున చెల్లిస్తున్నారు. ఫోర్బ్స్ నివేదికలో ప్రధాన అంశాలు ఇవీ.. ⇒ ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 500 కోట్ల మంది సోషల్ మీడియా ఖాతాదారులు ఉన్నారు. 2027 నాటికి ఈ సంఖ్య 585 కోట్లకుచేరుతుందని అంచనా. ⇒ సోషల్ మీడియా ఖాతాదారుల్లో అత్యధికంగా భారత్‌లో 42 కోట్ల మంది ఉన్నారు. దేశ జనాభాలో ఇది 40 శాతం సోషల్ మీడియా ఖాతాదారులు కావడం గమనార్హం. ఇంటర్నెట్ కనెక్షన్లు ఉన్నవారిలో 67 శాతం మంది సగటున కనీసం ఒక సోషల్ మీడియా మాధ్యమాన్ని వాడుతున్నారు. ⇒ భారత్‌లో రోజుకు సగటున 150 నిమిషాల పాటు అంటే రెండున్నర గంటల పాటు సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారు. ఈ ప్రకారం 73 ఏళ్లు జీవించే పౌరుడు తన జీవిత కాలంలో 5.7 ఏళ్ల పాటు సోషల్ మీడియాలో కాలక్షేపం చేసినట్టు అవుతుందని ఫోర్బ్స్ సంస్థ అంచనా వేసింది. ⇒ దేశంలోని ఖాతాదారుల్లో 78 శాతం మంది తమ మొబైల్ ఫోన్ ద్వారానే సోషల్ మీడియాను వీక్షిస్తున్నారు. ⇒ భారత్‌లో సోషల్ మీడియా వేదికల్లో మొదటి స్థానంలో ఫేస్బుక్, రెండో స్థానంలో ఇన్స్టాగ్రామ్ ఉన్నాయి. 18 ఏళ్లు దాటిన సోషల్ మీడియా ఖాతాదారుల్లో 74 శాతం మంది ఫేస్బుక్, 71 శాతం మంది ఇన్స్టాగ్రామ్ మాధ్యమాన్ని అనుసరిస్తున్నారు. కాగా 49 శాతం మంది ఎక్స్‌ను ఫాలో అవుతున్నారు. ఫేస్బుక్ మరికొన్నేళ్లపాటు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందని అంచనా వేశారు. -
కస్టమర్‌కు ప్రాధాన్యం ఇవ్వండి
ముంబై: వినియోగదారు ఆధారిత ప్రాధాన్య విధానాన్ని అనుసరించాలని బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలకు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ జే స్వామినాథన్ సూచించారు. తద్వారా బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని బలోపేతం చేయవచ్చన్నారు. బ్యాంకుల కస్టమర్ సరీ్వస్ ఇన్‌చార్జ్‌లు, ఎండీ, ఈడీ తదితర ఉన్నతాధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. కస్టమర్ల ఫిర్యాదులను కచి్చతంగా పరిష్కరించడం, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని క్రమబదీ్ధకరించడం, కస్టమర్లకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు, మోసాల నివారణ, నష్టాలను తగ్గించుకునేందుకు టెక్నాలజీని వినియోగించుకోవడంపై సమావేశంలో చర్చ జరిగినట్టు ఆర్బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్థిక వ్యవస్థ పట్ల నమ్మకం, విశ్వాసాన్ని పెంచడంతో కస్టమర్ సేవలు కీలక పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా స్వామినాథన్ పేర్కొన్నారు. కస్టమర్ సేవలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఫిర్యాదులకు అసలు మూల కారణాలు, స్వీకరించిన అధికారే నేరుగా పరిష్కరించడం తదితర ఐదు అంశాలపై దృష్టి పెట్టాలని కోరారు. -
బిల్ తీసుకుంటే చాలు..కోటి రూపాయలు మీవే!
Mera Bill Mera Adhikar: అన్ని కొనుగోళ్లకు ఇన్వాయిస్లు, బిల్లులు అడిగే సంస్కృతిని ప్రోత్సహించేలాకేంద్రం కొత్త పథకాన్ని తీసు కొస్తోంది రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రభుత్వం 'మేరా బిల్ మేరా అధికార్' పేరుతో 'ఇన్వాయిస్ప్రోత్సాహక పథకాన్ని' ప్రారంభిస్తోంది. ఇందుకోసం వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రతి త్రైమాసికంలో లక్కీడ్రా నిర్వహించి, రూ.1 కోటి చొప్పున రెండు బంపర్ బహుమతులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వినియోగదారులు తాము జరిపే కొనుగోళ్లన్నింటికీ విక్రయదార్ల నుంచి రశీదును అడగడాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో 'మేరా బిల్ మేరా అధికార్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. సెప్టెంబరు 1 నుంచి 12 నెలల కాలానికి ప్రయోగాత్మక పద్ధతిలో (పైలట్ ప్రాజెక్ట్) ఈ స్కీం షురూ కానుంది. ఆర్థిక శాఖ అందించిన వివరాల ప్రకారం ప్రతీ నెలా లక్కీ డ్రాలో 800 జీఎస్టీ రశీదులను ఎంపిక చేస్తారు. వీరికి రూ.10,000 చొప్పున ప్రైజ్ మనీ ఇవ్వనుంది. లక్కీడ్రాలో ఎంపిక చేసిన మరో 10 రశీదులకు రూ.10 లక్షల చొప్పున బహుమతి అందిస్తుంది. అయితే ప్రతి మూడు నెలలకు ఒకసారి బంపర్ డ్రా ఉంటుంది. ఇందుకోసం గత మూడు నెలల నుంచి బంపర్ డ్రా నెలలో 5వ తేదీ వరకు అప్లోడ్ చేసిన రశీదుల నుంచి విజేతను ఎంపిక చేస్తారు. ఈ పథకం ప్రారంభంలో అసోం గుజరాత్ , హరియాణా, పుదుచ్చేరి, దాద్రా అండ్ నగర్ హవేలీ మరియు డామన్ & డయ్యూ కేంద్రపాలిత ప్రాంతాలలో పైలట్‌గా లాంచ్ కానుంది. డ్రా అర్హతలు, నిబంధనలు ♦ జీఎస్టీ రిజిస్టర్డ్ సప్లయ్దారులనుంచి వినియోగదార్లు తీసుకున్న రశీదులను మాత్రమే డ్రాకు పరిగణనలోకి తీసుకుంటారు. ♦ జీఎస్టీ గుర్తింపు సంఖ్య, రిసీట్ నెం, డేట్, విలువ, ప్రాంతం తదితర వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. ♦ డ్రాలో విజేతగా ఎంపికైన కస్టమర్లు, ఈ సమాచారం అందిన తేదీ నుంచి 30 రోజుల్లోగా యాప్ లేదా వెబ్‌పోర్టల్‌లో పాన్, ఆధార్, బ్యాంకు అకౌంట్ లాంటి వివరాలివ్వాలి. ♦ ఒక నెలలో గరిష్ఠంగా ఒక వ్యక్తి 25 రశీదులను అప్లోడ్ చేయవచ్చు ♦ లక్కీ డ్రాకు అర్హత పొందాలంటే రశీదు విలువ కనీసం రూ.200 ♦ బీ2సీ రశీదులన్నింటినీ నెల 5వ తేదీ(అంతుకుముందు నెలలోని బిల్లులను)లోపు అప్లోడ్ చేస్తేనే నెలవారీ డ్రాకి అర్హత ♦వీటిని 'మేరా బిల్ మేరా అధికార్' మొబైల్ అప్లికేషన్లోను, 'వెబ్ డాట్ మేరాబిల్డాట్జీఎస్టీ డాట్ జీవోవీడాట్ఇన్ అనే వెబ్‌పోర్టల్‌లోనూ అప్లోడ్ చేయాలి. -
రిటైల్ సంస్థలకు షాక్ ఇక ఫోన్ నెంబర్ అవసరం లేదు..!
-
కరెంట్ బిల్లులు చెల్లించకపోతే నెక్స్ట్ జరిగేది ఇదే: విద్యుత్ శాఖ వార్నింగ్!
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందజేస్తామని ప్రకటించింది. అయితే మే 20న ప్రమాణస్వీకారం చేసిన సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలో ‘సూత్రప్రాయంగా అంగీకరించినా’ దీనిపై తుది ప్రకటనతో విధివిధానాలను తెలపాల్సి ఉంది. అయితే ఈ హామీలు బెస్కాంను ఇబ్బందుల్లోకి నెడుతున్నట్లు కనిపిస్తోంది. చర్యలు తప్పవ్ త్వరలో ఉచిత విద్యుత్ పథకం ప్రకటన వస్తుందని ఆశిస్తున్న ప్రజలు వారి విద్యుత్ బిల్లులను చెల్లించడానికి నిరాకరిస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేక మరో వైపు వినియోగదారులు బిల్లులు చెల్లించక మధ్యలో బెస్కామ్ (బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్) నలిగిపోతోంది. దీంతో ఈ విషయంపై బెస్కామ్ సీరియస్‌గా తీసుకుంది. ప్రజలు తమ బిల్లులను వెంటనే చెల్లించాలని లేదా వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇదిలా ఉండగా గత వారంలో, చాలా మంది వినియోగదారులు బెస్కామ్ను సంప్రదించి దీని గురించి ఆరా తీశారు. ఇప్పటికే బిల్లులు చెల్లించిన వారిలో చాలా మంది ఇప్పుడు మొదటి 200 యూనిట్లను క్యాష్‌బ్యాక్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, నిర్ణీత గడువులోగా వినియోగదారులు వారి బిల్లులు తప్పక చెల్లించాలని బెస్కామ్ అధికారులు వినియోగదారులకు సూచించారు. భారం ఎంతంటే.. రాష్ట్రంలో దాదాపు 2.1 కోట్ల మంది గృహ వినియోగదారులు ఉన్నారు, వీరిలో 1.26 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువన (BPL) కుటుంబాలు ఉన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించే పథకం ద్వారా రాష్ట్ర ఖజానాకు నెలకు రూ.3,509 కోట్లు, ఏటా రూ.42,108 కోట్ల భారం పడనుంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సహా ఐదు వాగ్దానాలపై తొలి కేబినెట్ సమావేశం అనంతరం సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ‘అవి అంగీకరించాం.. హామీలపై వెనక్కి వెళ్లబోమని చెప్పారు. చదవండి: కర్నూలులో దారుణం.. ఇంట్లో అట్టపెట్టెలతో భర్త మృతదేహాన్ని తగలబెట్టింది! -
చుక్కలు చూపిస్తున్న ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలు.. పాలసీదారులను పట్టించుకోవడం లేదా
న్యూఢిల్లీ: జీవిత బీమా పాలసీలపై ప్రీమియం పెరగడం వినియోగదారులకు ఆందోళనకు గురి చేస్తున్నట్టు హన్సా రీసెర్చ్ నిర్వహించిన సర్వేలో తెలిసింది. ప్రీమియం అందుబాటు ధరలో ఉండడం కీలకమని పాలసీదారులు భావిస్తున్నారు. జీవిత బీమా పాలసీల కొనుగోలు నిర్ణయాలు, ప్రవర్తనపరమైన పక్షపాతం, ఆర్థిక అవరోధాలు, ప్రీమియం ధరల అందుబాటు, కొనుగోలుపై దాని ప్రభావం తదితర అంశాలను ఈ సర్వేలో భాగంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. దేశవ్యాప్తంగా 3,300 జీవిత బీమా పాలసీదారులు ఇందులో పాల్గొని అభిప్రాయాలు వెల్లడించారు. పాలసీదారులుగా వారి అభిప్రాయాలను సర్వేలో ప్రశ్నల రూపంలో తెలుసుకున్నారు. బీమా కంపెనీని సంప్రదించినప్పుడు స్పందన సరిగ్గా లేకపోవడం వాటిని వీడడానికి ప్రధాన కారణమని 22 శాతం మంది పాలసీదారులు చెపన్పారు. తాము పాలసీ కొనుగోలు చేసిన తర్వాత బ్యాంక్ ఆర్ఎం లేదా ఏజెంట్ తమను కనీసం ఆరు నెలలకు ఒకసారి అయినా కలవాలని ప్రతీ 10 మందిలో 8 మంది పాలసీదారులు కోరుకుంటున్నారు. డిజిటల్ వేదికల ద్వారా సమాచారం తెలుసుకునేందుకు పాలసీదారులు ఆసక్తి చూపిస్తున్నారు. కొనుగోలుకు ముందు వెబ్సైట్లను సందర్శించం చేస్తున్నారు. బ్రాండ్‌కు ఉన్న పేరు, డిజిటల్ సేవలు, కస్టమర్ సేవలు కూడా ఆన్లైన్లో పాలసీలు కొనుగోలు చేసే వారు పరిగణనలోకి తీసుకునే కీలక అంశాలని ఈ సర్వే నివేదిక వెల్లడించింది. -
గూగుల్ విధానాలు .. భారత ఎకానమీకి హానికరం
న్యూఢిల్లీ: దేశీ పోటీదారులను అణగదొక్కేలా టెక్ దిగ్గజం గూగుల్ పాటిస్తున్న పోటీ వ్యతిరేక విధానా లు భారత వినియోగదారులు, ఆర్థిక వ్యవస్థకు హాని చేస్తున్నాయని మ్యాప్‌మైఇండియా సీఈవో, ఈడీ రోహన్ వర్మ వ్యాఖ్యానించారు. ‘గూగుల్ పోటీ వ్యతిరేక విధానాల ద్వారా కొత్త మార్కెట్లలో గుత్తాధిపత్యాన్ని చలాయిస్తుందని, తయారీ సంస్థలు.. యూజర్లలో ప్రత్యామ్నాయ ఆపరేటింగ్ సిస్ట మ్స్, యాప్ స్టోర్స్, యాప్స్ విస్తరణను అసాధ్యం చేస్తుందని పరిశ్రమ, ప్రభుత్వం, నియంత్రణ సంస్థలకు.. ఈ వ్యవహారాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేసిన వారందరికీ తెలుసు. గూగుల్ పోటీ వ్యతిరేక విధానాలనేవి మ్యాప్‌మైఇండియా వంటి స్వదేశీ పోటీ సంస్థలను గొంతు నొక్కడం ద్వారా భారతీ య వినియోగదారులు, ఎకానమీకి చేటు చేస్తాయి‘ అని వర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్‌లకు సంబంధించి గుత్తాధిపత్యం చలాయిస్తోందంటూ సీసీఐ రూ. 1,338 కో ట్ల జరిమానా విధించడాన్ని సవాలు చేస్తూ, ఎన్సీఎల్ఏటీని గూగుల్ ఆశ్రయించిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ), ప్రభుత్వం, పార్లమెంటు తీసుకుంటున్న అద్భుతమైన చర్యలు అమలు కాకుండా నిరోధించేందుకు, తనకు అనుకూలంగా వ్యవహరించేలా అందర్నీ ప్రభావితం చేసేందుకు, ఒత్తిడి తెచ్చేందుకు గూగుల్ ప్రయత్నాలు మొదలుపెట్టిందని వర్మ చెప్పారు. 2020లో కోవిడ్ విజృంభించినప్పుడు మ్యాప్‌మైఇండియా యాప్ కోవిడ్ కంటైన్మెంట్ జోన్లు, టెస్టింగ్.. ట్రీట్మెంట్ సెంటర్లు మొదలైన వివరాలన్నీ అందించేదని, గూగుల్ మ్యాప్స్‌లో ఇవేవీ ఉండేవి కావని వర్మ చెప్పారు. అలాంటి తమ యాప్‌ను గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి తొలగించిందని, అనేకానేక ఉత్తరప్రత్యుత్తరాల తర్వాత గానీ పునరుద్ధరించలేదని వివరించారు. మరోవైపు, సీసీఐ ఆదేశాలతో భారతీయ యూజర్లు, వ్యాపారవర్గాలకు విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతోనే తాము ఎన్సీఎల్ఏటీలో అప్పీలు చేసినట్లు గూగుల్ ప్రతినిధి తెలిపారు. -
తగ్గుతున్న ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల వినియోగం
న్యూఢిల్లీ: ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల వినియోగం మందగిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాల పరిమాణం మరింతగా పడిపోతోంది. డేటా అనలిటిక్స్ సంస్థ నీల్సన్ఐక్యూ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం జూన్ త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబర్ త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల (ప్యాకేజ్డ్ ఆహార, ఆహారయేతర ఉత్పత్తులు మొదలైనవి) విక్రయ పరిమాణం 0.9 శాతం తగ్గింది. ఇలా అమ్మకాల పరిమణం వృద్ధి మందగించడం ఇది వరుసగా నాలుగో త్రైమాసికం. వరుసగా గత ఆరు త్రైమాసికాల్లో రేట్లు రెండంకెల స్థాయిలో పెరగడం దీనికి దారి తీసిందని నివేదిక వివరించింది. గ్రామీణ మార్కెట్లలో అమ్మకాల పరిమాణం జూన్ త్రైమాసికంలో 2.4 శాతం క్షీణించగా, సెప్టెంబర్ త్రైమాసికంలో 3.6 శాతం తగ్గింది. అయితే, ఇదే వ్యవధిలో పట్టణ ప్రాంత మార్కెట్లలో విక్రయాల పరిమాణం 1.2 శాతం పెరిగింది. ఆహార ఉత్పత్తుల అమ్మకాలు 3.2 శాతం పెరిగాయి. రేట్ల పెంపు నేపథ్యంలో విలువపరంగా చూస్తే .. జూన్ త్రైమాసికంతో పోల్చినప్పుడు సెప్టెంబర్ త్రైమాసికంలో దేశీ ఎఫ్ఎంసీజీ పరిశ్రమ ఆదాయం 8.9 శాతం మేర వృద్ధి చెందినట్లు నివేదిక వివరించింది. ఇక పరిమాణం, విలువపరంగా చూసినా అమ్మకాలు కోవిడ్ పూర్వ స్థాయికి (2020 మార్చి త్రైమాసికం) మించి నమోదయ్యాయి. మహమ్మారి ప్రభావం తగ్గాక మార్కెట్లు పూర్తిగా తెరుచుకోవడం ఇందుకు దోహదపడినట్లు నివేదిక పేర్కొంది. నివేదికలోని మరిన్ని అంశాలు .. రేట్ల పెరుగుదల నేపథ్యంలో వినియోగదార్లు ఎక్కువగా చిన్న ప్యాక్‌లవైపు మొగ్గు చూపడం కొనసాగుతోంది. కంపెనీలు చాలా మటుకు ఉత్పత్తులను కొత్తగా చిన్న ప్యాక్‌ల్లో ప్రవేశపెడుతున్నాయి. ముడి వస్తువుల ధరలు ఇంకా అధిక స్థాయిలో కొనసాగుతుండటమే కారణం. హైపర్మార్కెట్లు, సూపర్మార్కెట్లు, మాల్స్ మొదలైనవి .. విలువపరంగా (22 శాతం అధికం), పరిమాణంపరంగా (11 శాతం వృద్ధి) మెరుగ్గా రాణిస్తున్నాయి. చిన్న తయారీ సంస్థలు, టాప్ 400 ఎఫ్ఎంసీజీ సంస్థలు .. వినియోగ చోదకాలుగా ఉంటున్నాయి. గత 2–3 త్రైమాసికాలుగా విలువ, పరిమాణంలో వాటి వాటా పెరుగుతోంది. చదవండి: అమలులోకి కొత్త రూల్.. ఆ సమయంలో ఎస్ఎంఎస్ సేవలు బంద్! -
గూగుల్‌కు సీసీఐ జరిమానా..భారత్‌లో కస్టమర్లు, వ్యాపారాలకు పెద్ద ఎదురుదెబ్బ
మొబైల్ వెబ్ బ్రౌజర్లు, ఆన్లైన్ వీడియో హోస్టింగ్లలో క్రోమ్, యూట్యూబ్ వంటి యాప్‌ల స్థానాన్ని కాపాడుకోవడానికి ఆన్లైన్ సెర్చ్, ఆండ్రాయిడ్ కోసం యాప్ స్టోర్ వంటి మార్కెట్లలో గూగుల్ తన ఆధిపత్య స్థానాన్ని ఉపయోగించుకుందని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) గూగుల్‌కు రూ.1,338 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా అనుచిత వ్యాపార విధానాలు అమలు చేయడాన్ని మానుకోవాలని ఆదేశించింది. నిర్దిష్ట వ్యవధిలోగా తన తీరును మార్చుకోవాలని సూచించింది. అయితే భారత్ నిర్ణయంపై గూగుల్ స్పందించింది. భారత్ నిర్ణయం.. దేశంలోని వినియోగదారులు, వ్యాపారాలకు పెద్ద ఎదురుదెబ్బ అని గూగుల్ తెలిపింది. ఆండ్రాయిడ్ అనేది వినియోగదారులకు ఏం కావాలో.. దాన్ని ఎంపిక చేసేందుకువ వీలుగా సృష్టించింది ఈ ఆండ్రాయిడ్. భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారందరికి మద్దతుగా నిలుస్తుందని గూగుల్ అధికార ప్రతినిధి తెలిపారు. సీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అటు కొనుగోలుదారులకు ఇటు వ్యాపారస్థులకు ఇది పెద్ద ఎదురు దెబ్బ. సెక్యూరిటీ పరంగా ఆండ్రాయిడ్ ఫీచర్‌ను వినియోగిస్తున్న వారందరూ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అదే సమయంలో మొబైల్ ధరలు పెరుగుతాయని వెల్లడించారు. చదవండి👉 గూగుల్‌కు భారీ షాక్! -
కంపెనీలకే దడ పుట్టిస్తున్న ఫేక్ యాక్సెసరీస్.. ఆశపడ్డారో.. అంతే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పోర్టబుల్ ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్‌కు దేశంలో బలమైన డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఇదే ఇప్పుడు బ్రాండెడ్ ఉత్పత్తుల తయారీ కంపెనీలకు ఆందోళన కలిగిస్తోంది. బ్రాండెడ్ ఉత్పత్తులతో సమాంతరంగా నకిలీలు, దొంగిలించిన, చట్ట విరుద్ధంగా దిగుమతి చేసుకున్న ప్రొడక్ట్స్‌తో ఆఫ్‌లైన్, ఆన్లైన్ మార్కెట్ వృద్ధి చెందడం ఇందుకు కారణం. నకిలీలను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోకపోవడం, చైనా నుండి తక్కువ ధరలకు పెద్దమొత్తంలో ఉత్పత్తులు వెల్లువెత్తుతుండడం కంపెనీలకు కునుకు లేకుండా చేస్తోంది. ఒకవైపు తమ ఉత్పత్తుల మార్కెటింగ్‌పై దృష్టిసారిస్తూనే మరోవైపు నకిలీలకు అడ్డుకట్ట వేసేందుకు ఆహోరాత్రులూ శ్రమించాల్సిన పరిస్థితి బ్రాండెడ్ కంపెనీలది. 2019 సెప్టెంబర్‌లో ఫిక్కీ విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్‌తో సహా అయిదు రంగాల్లో నకిలీ ఉత్పత్తులు, అక్రమ రవాణా కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ ఏటా రూ.1.17 లక్షల కోట్లు నష్టపోతోంది. పట్టుపడుతూనే ఉన్నాయి.. ఈ ఏడాది జనవరి-జూన్ కాలంలో ఇయర్‌ఫోన్స్, చార్జర్స్, అడాప్టర్స్, యూఎస్బీ కేబుల్స్ వంటి రూ.73.8 లక్షల విలువైన 9 వేల పైచిలుకు నకిలీ ఉత్పత్తులను సీజ్ చేసినట్టు షావొమీ ప్రకటించింది. 2020లో కంపెనీ రూ.33.3 లక్షల విలువైన సుమారు 3 వేల ఉత్పత్తులను సీజ్ చేసింది. దీనినిబట్టి చూస్తే నకిలీలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. భారత్‌లో కొన్ని ప్రాంతాలు ప్రత్యేకంగా ఈ నకిలీ ఉత్పత్తులను పెద్ద ఎత్తున విక్రయిస్తున్నాయని షావొమీ అంటోంది. కోవిడ్ రాకతో ఈ ఉత్పత్తులను ఏకంగా ఆన్లైన్ వేదిక ద్వారా విక్రయిస్తున్నారని వెల్లడించింది. జేబీఎల్, ఇన్ఫినిటీ బ్రాండ్ నకిలీ ఉత్పత్తులను ఢిల్లీలో ఇటీవలే స్వాధీనం చేసుకున్నట్టు శాంసంగ్ అనుబంధ కంపెనీ హర్మాన్ తెలిపింది. కాగా, ఐడీసీ గణాంకాల ప్రకారం భారత మార్కెట్లో 2022 జనవరి-జూన్ కాలంలో 3.8 కోట్ల యూనిట్ల వేరబుల్స్ అమ్ముడయ్యాయి. నియంత్రణ లేక.. చిన్న గ్యాడ్జెట్స్‌లో నకిలీలను సులువుగా తయారు చేయవచ్చని, వీటిని చైనా నుంచి సులభంగా తీసుకు రావొచ్చని టెక్ఆర్క్ ఫౌండర్ ఫైజల్ కవూసా తెలిపారు. ‘ఆఫ్‌లైన్ మార్కెట్లు ప్రధాన విక్రయ కేంద్రంగా ఉన్నప్పటికీ.. ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్‌లో కఠినమైన తనిఖీలు లేకపోవడం వల్ల నకిలీ ఉత్పత్తుల చెలామణి పెరిగింది. ఆన్లైన్లో ఎవరైనా ఉత్పత్తులను నమోదు (లిస్ట్) చేసి విక్రయించవచ్చు. ఇది నకిలీలను విక్రయించడాన్ని సులభతరం చేసింది’ అని వివరించారు. ఐఎంఈఐ నంబర్‌తో స్మార్ట్ఫోన్లను ట్రాక్ చేయడానికి, గుర్తింపునకు ఆస్కారం ఉంది. యాక్సెసరీస్‌కు ఇటువంటి సౌకర్యం లేదు. యాపిల్‌ఎయిర్‌పాడ్స్‌ను ఫోన్ ద్వారా ట్రాక్ చేయవచ్చు. -
మారుతి సక్సెస్ మంత్ర ఇదే! సీక్రెట్ రివీల్ చేసిన ఛైర్మన్
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ పరిశ్రమలో మారుతి సుజుకీ ఇండియా విజయం మాదిరే.. ఇతర రంగాల్లోనూ భారత్ విజయం సాధించాలని సంస్థ చైర్మన్ ఆర్సీ భార్గవ ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ సంస్థ భారత్‌లో కార్యకలాపాలు మొదలు పెట్టి 40 ఏళ్లు అవుతున్న సందర్భంగా భార్గవ మీడియాతో మాట్లాడారు. భారత ఆటోమోటివ్ పరిశ్రమ అభివృద్ధిలో మారుతి సుజుకీ ఇండియా ఎంతో కీలక పాత్ర పోషించినట్టు చెప్పారు. ఆటో విడిభాగాల సప్లయ్ చైన్, అనుబంధ రంగాల అభివృద్ధికి తోడ్పడిందని, ఇప్పుడు ఇవి ప్రపంచ మార్కెట్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. ‘‘తయారీలో భారత్ పాత్ర చాలా తక్కువ. కానీ, ఆటోమొబైల్ రంగంలో భారత్ నాలుగో అతిపెద్ద కార్ల తయారీ మార్కెట్‌గా ఉంది. అంతే కాదు ఆటో విడిభాగాల పరిశ్రమ సైతం గత ఆర్థిక సంవత్సరంలో 19 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు చేసింది. కనుక వీటిల్లో కొన్నింటిని మా కృషి వైపు నుంచి చూడాలి’’అని భార్గవ వివరించారు. మారుతీ సుజుకీ ప్రపంచంలోనే అత్యంత విజయవంంతమైన జపనీస్ కారు జాయింట్ వెంచర్‌గా పేర్కొన్నారు. (Eicher Motors: సీఎఫ్‌వో గుడ్‌బై, ఐషర్ మోటార్స్ ఢమాల్!) ఇతర రంగాల్లోనూ.. నిపుణుల అంచనాలకు భిన్నంగా ఎంతో విజయవంతమైన కంపెనీగా మారుతి సుజుకీ ఇండియా అవతరించినట్టు భార్గవ చెప్పారు. మారుతి విషయంలో విజయం సాధ్యమైనప్పుడు, ఇతర పరిశ్రమల్లోనూ ఇది ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. ‘‘మారుతి విజయానికి కారణం భారత ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకునే సామర్థ్యం. జపనీస్ యాజమాన్య సామర్థ్యం. వనరుల సమర్థ వినియోగం, భాగస్వాములు, యాజమాన్యం, పనివారు, ఇతర భాగస్వాముల మధ్య విశ్వాసం’’అని భార్గవ వివరించారు. మారుతి సుజుకీ ప్రయాణం అంత సాఫీ ఏమీ కాదని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్టు చెప్పారు. దేశీ కార్ల మార్కెట్లో సుజుకీ 43 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. -
పండుగ సీజన్: డిపాజిటర్లకు బ్యాంకుల బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: పండుగల సీజన్లో రుణ డిమాండ్‌ను ఎదుర్కొనేందుకుగాను నిధుల సమీకరణ బాటలో బ్యాంకింగ్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రిటైల్ డిపాజిటర్లను (రూ.2 కోట్ల లోపు) ఆకర్షించడానికి పలు బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుతున్నాయి. బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), కెనరా బ్యాంక్‌సహా పలు బ్యాంకులు నిర్దిష్ట కాలానికి వర్తించేలా తమ డిపాజిట్ రేట్లను ఆరు శాతం ఆపైకి పెంచుతూ నిర్ణయాలు తీసుకున్నాయి. భారతదేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కొన్ని బ్యాంకులు రేట్ల పెంపునకు సంబంధించి ఇటీవల తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తే... (చదవండి: వడ్డీల భారం, చేతులెత్తేసిన మరో స్టార్టప్) ►ఎస్బీఐ: 1000 రోజుల కాలపరిమతికి సంబంధించి డిపాజిట్ రేటును 6.10 శాతానికి పెంచింది. సీనియర్ సిటిజన్లు 50 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ రేటును పొందుతారు. ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 30 వరకూ ఈ ఆఫర్ అమల్లో ఉంటుందని తెలిపింది. ►కెనరా బ్యాంక్: 666 రోజుల కాలపరిమితికి రేటును 6 శాతానికి పెంచింది. ►బ్యాంక్ ఆఫ్ బరోడా: బరోడా తిరంగా డిపాజిట్ పథకం పేరుతో ప్రత్యేక రిటైల్ టర్మ్ ప్లాన్‌ను ఆఫర్ చేసింది. 2022 డిసెంబర్ 31 వరకూ అందుబాటులో ఉండే విధంగా 444 రోజులు, 555 రోజుల రెండు కాలపరిమితులతో ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. 444 రోజులకు 5.75 శాతం వడ్డీ, 555 రోజులకు 6 శాతం వడ్డీ లభిస్తుంది. రూ.2 కోట్లలోపు రిటైల్ డిపాజిట్లకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ స్కీమ్ కింద సీనియర్ సిటిజన్లు అదనపు వడ్డీ ప్రయోజనాన్ని పొందుతారు. ►పంజాబ్ నేషనల్ బ్యాంక్: 1,111 రోజులు, మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకూ కాలపరిమితికి సంబంధించి 5.75 శాతం రేటుతో డిపాజిట్ పథకాన్ని అమలు చేస్తోంది. ►ఐసీఐసీఐ, హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు: ప్రైవేటు రంగంలోని ఈ దిగ్గజ బ్యాంకులు పదేళ్ల వరకూ కాలపరిమతితో 5.75 శాతం వడ్డీని ఆఫర్ చేస్తూ, డిపాజిట్ పథకాన్ని వెలువరించాయి. ►యాక్సిస్ బ్యాంక్: 18 నెలల వరకూ డిపాజిట్‌పై 6.05 శాతం వడ్డీ ఆఫర్‌తో డిపాజిట్ పథకాన్ని తీసుకువచ్చింది. (ఇదీ చదవండి: Electric Scooters: కేవలం వేలం వెర్రేనా? సర్వేలో షాకింగ్ విషయాలు) ఆర్బీఐ రేటు పెంపు నేపథ్యం... బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను అరశాతం పెంచుతూ (5.40 శాతానికి అప్) ఈ నెల 5వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌సహా పలు రుణసంస్థలు తమ డిపాజిట్ రేట్లను పెంచాయి. డిపాజిట్రేట్లతో పాలు పలు బ్యాంకులు రుణ రేట్ల పెంపును కూడా ప్రారంభించాయి. వడ్డీరేట్లకు సంబంధించి సవాళ్లను నిర్వహించే స్థితిలో ప్రస్తుతం బ్యాంకింగ్ ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకూ జరిగిన పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కీలక వ్యాఖ్యలు చేస్తూ, ‘‘రుణ వృద్ధికిగాను బ్యాంకులు సెంట్రల్ బ్యాంక్ డబ్బుపై శాశ్వతంగా ఆధారపడ జాలవు. రుణ వృద్ధికిగాను బ్యాంకింగ్ తన సొంత వనరులపై ఆధారపడాలి. మరిన్ని డిపాజిట్లను సమీకరించాలి. బ్యాంకులు ఇప్పటికే రెపో రేట్ల పెంపు ప్రయోజనాన్ని తమ డిపాజిటర్లకు అందించడం ప్రారంభించాయి. ఇదే ధోరణి కొనసాగుతుందని భావిస్తున్నాం. తద్వారా వ్యవస్థలో తగిన లిక్విడిటీ కూడా ఉంటుంది’’ అని బ్యాంకింగ్‌కు స్పష్టం చేయడం గమనార్హం. -
ఎలక్ట్రిక్ స్కూటర్లు కేవలం వేలం వెర్రేనా? సర్వేలో ఏం చెప్పారంటే?
ముంబై: ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారు ప్రధానంగా భద్రత, పనితీరుకే ప్రాధాన్య మిస్తున్నారు. ఈ వాహనాలు తరచూ అగ్నిప్రమాదాలకుగురవుతుండటంతో..ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనే విషయంలోవెనక్కి తగ్గుతున్నారు. ఆన్లైన్ ప్లాట్‌ఫాం లోకల్‌సర్కిల్స్ నిర్వహించిన ఒక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఎలక్ట్రిక్ స్కూటరు భద్రత, పనితీరుపై తమకు అంతగా నమ్మకం లేదనే వారి సంఖ్య ఈ ఏడాది ఆగస్టులో 32 శాతానికి పెరిగింది. గతేడాది ఆగస్టులో ఇది కేవలం 2 శాతంగా నమోదైంది. 292 జిల్లాల్లోని 11,000 మంది పైచిలుకు వినియోగదారుల నుంచి వచ్చిన సమాధానాల ఆధారంగా ఈ సర్వే నివేదిక రూపొందించారు. ఇందులో 47 శాతం మంది పెద్ద నగరాలు, 33 శాతం మంది ద్వితీయ శ్రేణి పట్టణాలకు చెందినవారు కాగా.. 20 శాతం మంది తృతీయ శ్రేణి పట్టణాలు.. గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో రెండు డజన్లకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) అగ్నిప్రమాదాలకు గురైన ఉదంతాలు నమోదయ్యాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా లోపాలున్న వాహనాల బ్యాచ్‌లను వెంటనే ఉపసంహరించాలని లేదా భారీ జరిమానా విధించాల్సి వస్తుందని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 21న హెచ్చరించింది. దీంతో 7,000 పైగా వాహనాలను కంపెనీలు వెనక్కి రప్పించాయి. మరోవైపు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దారులు పాటించాల్సిన మార్గదర్శకాలను రూపొందించాలంటూ సెంటర్ ఫర్ ఫైర్, ఎక్స్‌ప్లోజివ్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ (సీఎఫ్ఈఈఎస్), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నిపుణులతో కేంద్రం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇంకా తన సిఫార్సులను సమర్పించాల్సి ఉంది. మరిన్ని వివరాలు.. ♦ విద్యుత్‌యేతర వాహనాలు, కిక్కిరిసిన ప్రజా రవాణా వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఈ-స్కూటర్లపై చాలా మంది ఆసక్తిగానే ఉన్నారు. కాకపోతే పనితీరు, భద్రతపైనే ఆందోళన పెరుగుతోంది. ♦ తమకు గానీ తమ కుటుంబ సభ్యులకు గానీ వచ్చే 6 నెలల్లో ఈ-స్కూటర్‌ను కొనే ఆలోచన లేకపోవడానికి.. ప్రధానంగా ఎలక్ట్రిక్ స్కూటర్లకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేకపోవడమే కారణమని 5 శాతం మంది తెలిపారు. వాటిని కొనేంత నిధులు తమ దగ్గర లేవని 7 శాతం మంది చెప్పారు. తమ దగ్గర ఇప్పటికే చాలా వాహనాలు ఉన్నాయని, మరో టూ-వీలర్ కొనే యోచనేదీ లేదని 9 శాతం మంది పేర్కొన్నారు. ♦ ఈవీలనేవి వేలం వెర్రిలాంటివని, ఈ ధోరణి త్వరలోనే తగ్గిపోతుందని 2 శాతం మంది పేర్కొన్నారు. (వడ్డీల భారం, చేతులెత్తేసిన మరో స్టార్టప్) ♦కేవలం ఒక్క శాతం కుటుంబాలు మాత్రమే వచ్చే ఆరు నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేసే యోచనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొనేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వం అటు పరిశ్రమపై ఉందని నివేదిక పేర్కొంది. ♦ ఈ-స్కూటర్లు, బ్యాటరీల భద్రతా ప్రమాణాలను రూపొందిస్తున్నప్పటికీ .. అనేక వర్గాల ప్రమేయం ఉన్నందున, ఈ ప్రక్రియకు చాలా సమయం పట్టేస్తోంది. (ఇన్ఫోసిస్ వేరియబుల్ పే కోత) ∙ -
భారతీయులు వీటి కోసం ఖర్చుకు వెనకాడలేదు!
న్యూఢిల్లీ: భారతీయ వినియోగదారులలో ఎక్కువ మంది రాబోయే ఒక సంవత్సరంలో తమ ఆర్థిక పరిస్థితి పట్ల ఎంతో ఆశావహంగా ఉన్నారని లండన్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే వృత్తిపరమైన బహుళజాతి సేవల నెట్వర్క్ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) పేర్కొంది. అయితే పెరుగుతున్న వస్తువులు, సేవల ధరలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, ఇది వారి కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేస్తుందని నివేదిక తెలిపింది. దేశంలోని పొదుపుల్లో 80 శాతం పెరుగుతున్న జీవన వ్యయాలను, ఇందుకు సంబంధించి అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని చేస్తున్నవేనని విశ్లేషించింది. దేశానికి సంబంధించి విడుదలైన ఈవై ఫ్యూచర్ కన్సూ్యమర్ ఇండెక్స్ తొమ్మిదవ ఎడిషన్ వివరాలు క్లుప్తంగా... ► సర్వే ప్రకారం దేశంలోని 77 శాతం మంది వచ్చే ఏడాది కాలానికి సంబంధించి ఆర్థిక పరిస్థితిలో సానుకూల మార్పులను ఆశిస్తున్నారు. దీనిపై ఈ అంశంపై సూచీ భారతీయ వినియోగదారు ల ‘సానుకూల దృక్పథాన్ని‘ పునరుద్ఘాటించిం ది. అంతర్జాతీయంగా నమోదయిన 48 శాతం రేటుకన్నా ఇది మెరుగ్గా ఉండడం గమనార్హం. ►దేశంలో వినియోగదారులకు వస్తువులు, సేవల ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. ఇది వస్తువులను కొనుగోలు చేసే వారి సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. వారి కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. ►వినియోగానికి సంబంధించి ‘‘తమ స్థోమత’’ను బట్టే ప్రధానంగా వ్యయాలు ఉంటాయని వర్థమాన దేశాల్లో 62 శాతం మంది పేర్కొంటే, అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ రేటు 45 శాతంగా ఉంది. దేశాల వారీగా చూస్తే, ఈ గణాంకాలు భారత్ దేశంలో 64 శాతం, దక్షిణాఫ్రికాలో 77 శాతం, బ్రెజిల్లో 63 శాతం, చైనాలో 42 శాతం ఉన్నాయి. ఇక అభివృద్ధి చెందిన మార్కెట్లను చూస్తే ఈ రేట్లు అమెరికాలో 50 శాతం, కెనడాలో 52 శాతం, బ్రిటన్‌లో 42 శాతం, ఫ్రాన్స్ 40 శాతాలుగా ఉన్నాయి. ►స్థోమతను బట్టి వ్యయాలు ఉంటాయన్న వారిని భారత్‌లో గ్రూపులుగా విభజిస్తే, తక్కువ ఆదాయ సంపాదకుల విషయంలో ఇది 72 శాతంగా ఉంది. అధిక ఆదాయ సమూహానికి సంబంధించి 60 శాతం, మధ్య ఆదాయ వర్గానికి సంబంధించి 58 శాతంగా ఉంది. ► దేశంలోని పొదుపుల్లో 80 శాతం పెరుగుతున్న జీవన వ్యయాలను, ఇందుకు సంబంధించి అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని చేస్తున్నవే. సర్వేలో పాల్గొన్న వారిలో 50 శాతం మంది ఇప్పటికే ఖర్చు చేయడం కంటే పొదుపు చేయడాన్నే లక్ష్యంగా పెట్టుకున్నారు. ►భారత్ వినియోగదారులో వ్యయాలు ఆరోగ్యం కేంద్ర బిందువుగా కొనసాగుతున్నాయి. ద్రవ్యోల్బణ ఒత్తిడి మధ్య కూడా భారతీయ వినియోగదారులు అధిక నాణ్యత, సేంద్రీయ ఆహారం కోసం అధిక డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. ►భారతదేశంలో సర్వేలో పాల్గొన వారిలో సగానికి పైగా (54 శాతం) వ్యక్తులు వచ్చే 2–3 సంవత్సరాలలో శారీరక ఆరోగ్యం, ఆరోగ్య పరిరక్షణనే లక్ష్యంగా చేసుకున్నారు. 80 శాతం మంది దీర్ఘకాలిక ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారిస్తున్నారు. మానసిక ఆరోగ్యం ఆవసరమని, దీనిపై తాము దృష్టి పెడుతున్నామని చెప్పిన వారి సంఖ్య 78 శాతంగా ఉంది.వినియోగదారుల్లో ఈ తరహా వైఖరి దీర్ఘకాలంలో కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. ►వినియోగదారుల్లో పర్యావరణ స్పృహ కూడా గణనీయంగా పెరుగుతోంది. ► దీనితోపాటు బ్రాండ్ల పట్ల అవగాహనా విస్తృతమవుతోంది. వారికి విక్రయించే బ్రాండ్ల విలువలను తెలుసుకోవడానికి భారత్ వినియోగదారులు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఉత్పత్తి సంస్థలకు సవాళ్లు.. మహమ్మారి తదితర అనిశ్చితి పరిస్థితుల నుంచి చవిచూసిన అనుభవాలు, ద్రవ్యోల్బణం స్పీడ్ వంటి పలు అంశాలు వినియోగదారును ప్రస్తుతం గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. ఆయా అంశాలు వ్యయాల నుంచి వారిని వెనక్కు మళ్లేలా చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉత్పత్తి సంస్థలు సైతం సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రత్యేకించి నిత్యావసరాలకు సంబంధించి ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) కంపెనీలు తమ ఆదాయాన్ని– మార్జిన్లను బేరీజు వేసుకుని కార్యకలాపాలు నిర్వహించాలి. లాభదాయకతను పెంచడానికి వ్యయాలనూ కట్టడి చేయాలి ఉంటుంది. విలువ గొలుసు అంతటా ఖర్చులను తగ్గించాలని పిలుస్తుంది‘ అని ఇది పేర్కొంది. మహమ్మారి తర్వాత వినియోగదారుల ప్రాధాన్యతల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్న విషయాన్ని జాగ్రత్తగా గమనించిన నిర్ణయాలు తీసుకోవాలి. – అంగ్షుమన్ భట్టాచార్య, ఈవై ఇండియా పార్టనర్ అండ్ నేషనల్ లీడర్ (కన్సూ్యమర్ ప్రొడక్ట్, రిటైల్ సెక్టార్) సర్వేకు ప్రాతిపదిక ఇదీ.. 2022 ఫిబ్రవరిలో 1,000 మంది భారతీయ వినియోగదారులపై నిర్వహించిన సర్వే ఈవై ఫ్యూచర్ కన్సూ్యమర్ సూచీకి ప్రాతిపదిక. ఈ ఇండెక్స్ నిర్ధిష్ట కాలపరిధిలో ప్రపంచ మార్కెట్లలో మారుతున్న వినియోగదారు సెంటిమెంట్, వారి కొనుగోలు ప్రవర్తనలను ట్రాక్ చేస్తుంది. అభివృద్ధి చెందుతున్న కొత్త వినియోగదారు అభిరుచులను గుర్తిస్తుంది. భారత్‌సహా అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, చైనా, బ్రెజిల్, సౌదీ అరేబియా, డెన్మార్క్, స్వీడన్, ఫిన్లాండ్, నార్వే, ఇండోనేషియా, ఇటలీ, స్పెయిన్, మెక్సికో, దక్షిణాఫ్రికా, చిలీ (కొత్త), అర్జెంటీనా (కొత్తది), థాయిలాండ్ (కొత్తది)లలో ఈ ఏడాడి జనవరి 28 నుంచి ఫిబ్రవరి 15, 2022 మధ్య 18,000 వినియోగదారులతో జరిపిన అభిప్రాయ సేకరణ ప్రాతిపదికన ఈవై ఫ్యూచర్ కన్సూ్యమర్ ఇండెక్స్ తొమ్మిదో ఎడిషన్ రూపొందింది. -
బల్క్ ఎస్ఎంఎస్లపై మూడు రోజుల గడువు
న్యూఢిల్లీ: వినియోగదార్లకు బల్క్ ఎస్ఎంఎస్లు పంపే కంపెనీలు, ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వ సంస్థలు టెలి మార్కెటింగ్ నిబంధనలకు అనుగుణంగా పేర్లు నమోదు చేసుకోవాల్సిందేనని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) స్పష్టం చేసింది. ఇందుకు మూడు రోజుల గడువు ఇస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. నమోదు చేయని పక్షంలో కస్టమర్లకు వాణిజ్యపర సమాచారం పంపకుండా నిరోధిస్తామని హెచ్చరించింది. అంతేగాక విఫలమైన కంపెనీల పేర్లను తమ వెబ్సైట్లో ఉంచుతామని వెల్లడించింది. గడువు ముగిసిన తర్వాత కూడా నియంత్రణ సంస్థకు అనుగుణంగా నమోదు కానట్టయితే టెలికం వనరులను ఉపయోగించి పెద్దమొత్తంలో సందేశాలను పంపడానికి వారిని అనుమతించరు. బ్యాంకింగ్, లాజిస్టిక్స్, ఈ–కామర్స్ తదితర కంపెనీలన్నిటికీ ఈ నిబంధన వర్తిస్తుంది. మోసపూరిత సందేశాలను కట్టడి చేసేందుకే.. మోసపూరిత సందేశాలను కట్టడి చేసేందుకే కొత్త నిబంధనలను ట్రాయ్ అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం వివిధ సంస్థలు పంపే వాణిజ్యపరమైన ఎస్ఎంఎస్లను వినియోగదారులకు చేరవేయడానికి ముందు.. నిర్దిష్ట నమోదిత సందేశం నమూనాతో టెలికం కంపెనీలు సరిపోల్చి, ధృవీకరించుకోవాలి. ఇందుకోసం టెల్కోలు బ్లాక్ చెయిన్ టెక్నాలజీని వినియోగిస్తున్నాయి. ఇందులో నమోదైన ఐడీల నుంచి వచ్చిన సందేశాలను మాత్రమే అధికారికమైనవిగా భావించి సమ్మతించిన కస్టమర్లకు పంపుతాయి. నమోదు చేసుకోని ఐడీల నుంచి వచ్చే సందేశాలను నిలిపివేస్తాయి. ఈ విధానాన్ని ఎస్ఎంఎస్ స్క్రబింగ్‌గా వ్యవహరిస్తారు. కొత్త విధానంపై పరిశ్రమ వర్గాలకు ఇంకా పూర్తి అవగాహన రాకపోవడంతో సోమవారం నుంచి ఎస్ఎంఎస్లు, ఓటీపీల డెలివరీల్లో సమస్యలు తలెత్తాయి. (చదవండి: భయపడొద్దు.. సెల్ టవర్లు సురక్షితమే) -
కస్టమర్ల ఫిర్యాదుల హోరు : టాప్‌లో ఏ బ్యాంకు?
సాక్షి, ముంబై: బ్యాంకు సేవలపై కస్టమర్ల ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. 2020 జూన్ 30తో ముగిసిన సంవత్సర కాలంలో ఫిర్యాదులు 58 శాతం పెరిగి 3.08 లక్షలకు చేరినట్టు ఆర్బీఐ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జూలై నుంచి జూన్ కాలాన్ని ఆర్బీఐ పాటిస్తుంటుంది. కస్టమర్ల నుంచి వస్తున్న ఫిర్యాదుల్లో 20 శాతం ఏటీఎంలు లేదా డెబిట్ కార్డులకు సంబంధించి ఉంటుండగా, తర్వాత మొబైల్ లేదా ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్‌కు సంబంధించి 13.38శాతం ఉంటున్నట్టు ‘అంబుడ్స్‌మన్ పథకం’పై ఆర్బీఐ విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొంది. క్రెడిట్ కార్డులు, నోటీసుల్లేకుండా లెవీ చార్జీలు విధించడంపై గత సంవత్సరంలో ఫిర్యాదులు పెరిగాయి. బ్యాంకులపై ఫిర్యాదులు అంతకుముందు ఏడాది 195,901 లతో పోలిస్తే ఈ ఏడాది బ్యాంకులపై మొత్తం 308,630 ఫిర్యాదులందాయి. వీటిల్లో 48,333 ఫిర్యాదులతో దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) టాప్‌లో ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్‌పై 15,004, ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్‌పై 11,844, యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్‌పై 10,457, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌పై 9,928 ఫిర్యాదులను అంబుడ్స్‌మన్ పరిష్కరించింది. ఎన్బీఎఫ్సీలపై ఫిర్యాదులు ఎన్బీఎఫ్సీలపై ఖాతాదారుల ఫిర్యాదులు ఏకంగా 387శాతం పెరిగాయి. గతేడాది 3991తో పోలిస్తే మొత్తం 19,432 ఫిర్యాదులొచ్చాయి. వీటిల్లో అత్యధికంగా బజాజ్ ఫైనాన్స్‌పై నమోదయ్యాయి. కంపెనీపై అంబుడ్స్‌మన్‌కు ఏకంగా 4,979 ఫిర్యాదులు వచ్చాయి వాటిలో 1968 నిర్వహించదగినవి. 300 ఫిర్యాదులతో ఇండియాబుల్స్ కన్స్యూమర్ ఫైనాన్స్ రెండో స్థానంలో ఉంది. ఇక ఆ తరువాత హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ (252 నిర్వహించదగిన ఫిర్యాదులు), టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (217 నిర్వహించదగిన ఫిర్యాదులు) ఫుల్లెర్టన్ ఇండియా క్రెడిట్ కంపెనీ (235 నిర్వహించదగిన ఫిర్యాదులు) ఉన్నాయి. -
షాపింగ్‌కు సై!
సాక్షి, హైదరాబాద్: పండుగల సీజన్ షాపింగ్ కళను సంతరించుకోనుంది. కరోనా భయంతో గత ఆరేడు నెలలుగా బయటకు వెళ్లేందుకు జంకుతున్న ప్రజలు రానున్న పండుగల కోసం బయటకు వచ్చేందుకు ఉత్సుకతతో ఉన్నారు. దేశవ్యాప్తంగా అన్లాకింగ్ ప్రక్రియ మొదలై కొన్ని మినహా దాదాపు అన్ని కార్యకలాపాలు మొదలైన నేపథ్యంలో ఆన్‌లైన్‌తో పాటు ప్రత్యక్షంగా షాపింగ్ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. త్వరలోనే మొదలుకానున్న పండుగల సీజన్లో 80 శాతం భారతీయ వినియోగదారులు వివిధ వస్తువుల కొనుగోళ్లకు సిద్ధమవుతున్నట్లు రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (రాయ్), లిట్మస్ వరల్డ్ (లిట్మస్ వరల్డ్ పీపుల్ పల్స్ ఇనిషియేటివ్) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అన్లాకింగ్ ఇండియన్ కన్జూమర్ సెంటిమెంట్ పోస్ట్ లాక్డౌన్’సర్వేలో వెల్లడైంది. సుదీర్ఘ కాలం పాటు ఇళ్లకే పరిమితం కావడంతో స్నేహితులు, బంధువులకు ఇచ్చేందుకు కానుకలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కరోనా నేపథ్యంలో ఇబ్బందులు ఉన్నా పండుగ కోసం వస్తువులు కొనుగోలు చేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు ఈ సర్వేలో తేలింది. సర్వే చేసిన వారిలో ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ తదితర ప్రథమ శ్రేణి (టైర్–1) నగరాల్లోని 80 శాతం మంది, ఆగ్రా, అమృత్సర్, చండీగఢ్ తదితర టైర్–2 సిటీల్లో 12 శాతం మందిని, ఔరంగాబాద్, జోధ్‌పూర్, గ్వాలియర్ తదితర టైర్–3 సిటీల్లో 8 శాతం మంది ఉన్నారు. సర్వేలో ముఖ్యాంశాలు.. ►3 నెలల్లోనే రిటైల్ స్టోర్లలో షాపింగ్ చేసేందుకు 62 శాతం, ఆ తర్వాత కొనుగోలు చేసేందుకు 38 శాతం మొగ్గు ►టైర్–2, టైర్–3 సిటీల్లోని 75 శాతం మంది 3 నెలల్లోనే రిటైల్ స్టోర్లలో షాపింగ్ చేసేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారు. ఏవి కొంటారు? ►53% మంది దుస్తులు, వస్త్రాలు, ఆహారపదార్థాలు, నిత్యావసరాల కొనుగోళ్లు ►31 శాతం మంది కన్జూమర్ డ్యూరబుల్స్/ఎలక్ట్రానిక్స్ కొనుగోలు ►25 శాతం మంది బ్యూటీ, వెల్నెస్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ►24 శాతం మంది పాదరక్షలు, బూట్లు వంటివి కొనుగోలు ►18 శాతం స్పోర్ట్స్ గూడ్స్, ఎంటర్టైన్మెంట్ ఎక్విప్మెంట్, బుక్స్ ►17% ట్రావెల్/లీజర్/లైఫ్ స్టైల్ వస్తువులు ►12 శాతం ఫర్నిచర్, ఫర్నిషింగ్ ►9 శాతం బంగారం, వాచ్‌లు, ఇతర వ్యక్తిగత వస్తువులు కన్జూమర్ డ్యూరబుల్స్/ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లు ►ఆన్లైన్లో కొనేందుకు 70 శాతం మంది మహిళల మొగ్గు ►స్వయంగా రిటైల్ స్టోర్లకు వెళ్లి కొంటా మంటున్న 60 శాతం పురుషులు ఆన్లైన్ ప్రక్రియ మొదలయ్యాక షాపింగ్ ఇలా.. ►45 ఏళ్లకు పైబడిన వారు 67 శాతం మంది ఆఫ్‌లైన్‌లో షాపింగ్ చేసేందుకు సిద్ధం ►64 శాతం పురుషులు ఆఫ్‌లైన్‌లో, 60 శాతం మహిళలు ఆన్లైన్లో కొనుగోళ్లు ►టైర్–2, టైర్–3 నగరాల్లో 75 శాతం మంది ఆఫ్‌లైన్‌లో కొనుగోలు ►టైర్–1 సిటీల్లోని వారు ఆన్లైన్, ఆఫ్లైన్లలో సమానంగా షాపింగ్ చేస్తామని వెల్లడి వివిధ వస్తువుల కొనుగోళ్లు ఇలా... ►జ్యూవెల్లరీ, వాచ్‌లు, ఇతర వస్తువులను రిటైల్ స్టోర్లలోనే కొనుగోలు చేస్తామన్న 70 శాతం మంది ►బ్యూటీ, వెల్నెస్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్‌లను ఆన్లైన్లో కొంటామంటున్న 60 శాతం మహిళలు ►అన్ని నగరాలు, వయసుల వారు రిటైల్ స్టోర్లకే వెళ్లి బూట్లు, పాదరక్షలు కొనుగోలు చేస్తామన్న 70 శాతం ►స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ ఎక్విప్మెంట్ ఆన్లైన్లో కొంటామన్న 67 శాతం మహిళలు, రిటైల్ స్టోర్లకు వెళ్తామన్న 62 శాతం పురుషులు ►ఫర్నిచర్, ఫర్నిషింగ్‌లను ఆన్లైన్లో కొనుగోలుకు 64 శాతం మహిళలు, రిటైల్ స్టోర్లలో కొనుగోలుకు 61 శాతం పురుషులు సుముఖత. -
తప్పుదోవ పట్టిస్తున్న ఈ-కామర్స్ ఉత్పత్తులు
తరచుగా పునరావృతమయ్యే సామెత - పరిశుభ్రతే దైవం. ఇది వ్యక్తిగత పరిశుభ్రత సారాంశం.. ఆవశ్యకతను తెలుపుతుంది. అంతేకాదు, శుభ్రంగా ఉండటమనేది భారతీయ సంస్కృతిలో అంతర్భాగంగా ఉంటుంది. తొలుత, ప్రజలు అందంగా కనబడేందుకు ఈ ఆధునిక వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు లేని వేళ సహజ సిద్ధమైన ఉత్పత్తులు వాడుతుండేవారు. అయితే, శాస్త్రీయ ఆవిష్కరణల కారణంగా విస్తృతశ్రేణిలో అత్యాధునిక వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. తల్లులు, శిశువుల ఉత్పత్తులు ఇప్పుడు మార్కెట్లో తమదైన వాటాను ఆక్రమించుకుంటున్నాయి. వృద్ధి చెందుతున్న ఆదాయం, స్థిరమైన జీవితంతో ప్రజలు ఇప్పుడు ఈ తరహా వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను కోరుకుంటున్నారు. అవి సహజసిద్ధంగా మరియు ఆరోగ్యవంతంగా ఉండాలనుకుంటున్నారు. ఎన్నో సంవత్సరాలుగా పేరొందిన కంపెనీలు అయిన హిమాలయ, డాబర్, ఇమామీ మరియు ఈ విభాగంలో ఇతర ఆయుర్వేద కంపెనీలు ఉన్నప్పటికీ, స్థిరంగా వృద్ధి చెందుతున్న ఈ మార్కెట్అదే తరహా వృద్ధి అవకాశాలను నూతన కంపెనీలకు కూడా అందిస్తుంది. అత్యంత ప్రజాదరణ పొందిన నూతన ఈకామర్స్బ్రాండ్స్, తమ తల్లులు, పిల్లల వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు అత్యంత సహజమైనవని వాదిస్తుండటం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అయితే, తమకు అత్యంత ప్రజాదరణ తీసుకువచ్చిన ఈ వాదనలలోని ఆధీకృత ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ఎందుకంటే చాలా వరకూ ఉత్పత్తులలో లేబులింగ్ మరియు ధృవీకరణలలో పారదర్శకత అనేది లోపించింది. బహుశా, తమ ఉత్పత్తులను మార్కెట్చేయడం, తమ వినియోగదారుల సంఖ్యను వృద్ధి చేసుకోవడం మరియు అమ్మకాలను రెట్టింపు చేసుకోవడానికి నూతన తరపు కంపెనీలు తమ ఉత్పత్తులను సహజసిద్ధమైనవని తప్పుగా పేర్కొంటున్నాయి. తమ ఉత్పత్తులలో రసాయనాలు ఉన్నప్పటికీ అవి శాస్త్రీయంగా హానికారకం కాదని నిరూపితం కాలేదు. వాటినే వారు సహజసిద్ధమని వెల్లడిస్తున్నారు. కానీ రసాయనాలతో కూడిన ఓ ఉత్పత్తి సహజసిద్ధమైనది ఎందుకు అవుతుంది ? దీనికి సరైన నియంత్రణ వ్యవస్థ మరియు ధృవీకరణ ప్రక్రియ లేకపోవడం కూడా కారణమే అని డాక్టర్శర్మ అన్నారు. వినియోగదారు స్నేహ మాట్లాడుతూ.. 'ఇప్పుడు మార్కెట్లో ఎన్నో బేబీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వీటిలోని కొన్ని పదార్థాలు హానికారకమైనవి. కానీ బాధ పడే అంశం ఏమిటంటే, చాలామంది ప్రజలకు ఈ ఉత్పత్తులు చేసే హాని గురించి తెలియకపోవడం మరియు ఆ ప్రకటనలను చూసి చాలామంది వాటిని వినియోగిస్తుంటారు. బేబీ ఉత్పత్తులను వినియోగించడమన్నది వ్యక్తిగత ఎంపిక. నేను మా పిల్లలకు టాల్కమ్ పౌడర్రాయను. ఎందుకంటే చిన్నారుల చర్మానికి టాల్క్ మంచిది కాదు. చిన్నారుల చర్మం మృదువైనది. అందువల్ల ఉత్పత్తుల ఎంపికలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి చర్మంపై ర్యాషెస్వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఈ ఉత్పత్తులు ఖచ్చితంగా అతి తక్కువ రసాయనాలు మాత్రమే కలిగి ఉండాలి. సాధారణంగా ప్రజలు ఆ ఉత్పత్తుల యొక్క ఆధీకృతను పరిశీలించరు. లేబుల్స్చూసి వాటిని కొంటుంటారు. కానీ ఎన్నో సార్లు ఈ తరహా ఉత్పత్తులు మీ పాపాయి చర్మంపై హానికారక ప్రభావం చూపవచ్చు. అందువల్ల, ప్రతి వినియోగదారుడూ ఈ ఉత్పత్తులు సహజసిద్ధమైనవా లేదా అని పరిశీలించడంతో పాటుగా కొనేందుకు ముందు వాటిని పరిశీలించాలి’ అని అన్నారు. మార్కెట్లో ఇప్పుడు ఈ తరహా ఈ- కామర్స్ కంపెనీలు విపరీతంగా ఉన్నాయి. అవన్నీ కూడా తమ ఉత్పత్తులు సహజసిద్ధమైనవని వెల్లడిస్తున్నాయి. ఉత్పత్తి మార్కెట్లో ప్రతి కంపెనీకీ ఎదిగేందుకు హక్కు ఉంది. కానీ తప్పుడు వాదనలు వాంఛనీయం కాదు. ప్రకటనలు, ప్యాకేజింగ్మరియు లేబులింగ్వంటివి వినియోగదారులకు ఉత్పత్తి పట్ల అవగాహన కల్పించేందుకు మరియు ఉత్పత్తి సమాచారం అందించేందుకు ఉద్దేశించబడినవి. అందువల్ల వారు సమాచారయుక్త ప్రాధాన్యతలను అందించాల్సి ఉంది. అయితే, దురుద్దేశ్యంతో చేసే లేబులింగ్‌ను ఖచ్చితంగా నివారించాలి. అంతేకాదు, వినియోగదారులు సమాచారంతో కూడిన కొనుగోలుదారుడు కావాల్సిన అవసరం ఉంది. అందువల్ల, మనమంతా కూడా ఓ ఉత్పత్తిని కొనుగోలు చేసే ముందు పలు కోణాల్లో దానిని పరిశీలించాల్సి ఉంది. ప్రకటనలు, లేబులింగ్‌పై ఆధారపడి వాటిని కొనకూడదు. ఈ ఉత్పత్తులలోని వ్యత్యాసాలు మనకు అంటే వినియోగదారులకు హానికలిగిస్తాయి. -
యాపిల్ నుంచి స్మార్ట్ వాచ్, ఎయిర్‌ఫోన్స్
ముంబై: టెక్ దిగ్గజం యాపిల్(ఐఫోన్) సరికొత్త ఫీచర్లతో మొబైల్ వినియోగదారులను నిరంతరం ఆకట్టుకుంటుంది. త్వరలో యాపిల్ అభిమానులకు మరో శుభవార్త తెలిపింది. త్వరలో యాపిల్ స్మార్ట్ వాచ్‌లను మార్కెట్లోకి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అయితే గత సంవత్సరం ప్రత్యేక స్మార్ట్ వ్యాచ్(యాపిల్ వాచ్ సిరీస్ 5) లను ప్రవేశ పెట్టిన యాపిల్ సంస్థ వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం తక్కువ ధర, అత్యుత్తమ క్వాలిటీతో స్మార్ట్ వాచ్‌లను యాపిల్ సంస్థ ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ఫిట్‌బిట్, గార్మిన్, తదితర సంస్థలు స్మార్ట్ వాచ్‌లను నాణ్యతతో రూపొందిస్తున్నాయి. మరోవైపు యాపిల్ కేవలం స్మార్ట్ వాచ్‌లనే కాకుండా ఎయిర్‌ఫోన్స్, మ్యూజిక్ కేటగిరీలలో కొత్త డివైస్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో హోమ్పోడ్, ఏయిర్పోడ్స్, ప్రొ, ఐపోడ్ టచ్ తదితర కొత్త సేవలను యాపిల్ అందించనుంది. ఈ అంశాలపై యాపిల్ త్వరలో ప్రకటన చేయనుందని సంస్థ వర్గాలు తెలిపాయి. చదవండి: సరికొత్త ఫీచర్లతో యాపిల్ ప్రొడక్టులు -
కొత్త కస్టమర్లకు ఆచితూచి రుణాలు
సాక్షి, హైదరాబాద్ : స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు రుణ సంస్థలు పోటీపడుతుంటాయి. ఇందుకోసం వడ్డీ లేని రుణాలను జీరో డౌన్‌పేమెంట్‌తో ఆఫర్ చేయడం చూశాం. కోవిడ్–19 పుణ్యమాని ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. ఇబ్బడిముబ్బడిగా రుణాలను అందించిన ఈ సంస్థలు పాత బకాయిల వసూళ్లపై ప్రధానంగా దృష్టిసారించాయి. దీంతో నూతన వినియోగదార్లకు రుణం దొరకడం కష్టంగా మారింది. వీరి విషయంలో కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. కస్టమర్ ట్రాక్ రికార్డు ఆధారంగానే తాజాగా రుణాలను జారీ చేస్తున్నాయి. కీలకంగా సిబిల్ స్కోరు.. వినియోగదారులకు రుణం మంజూరు చేసేందుకు బ్యాంకులు, రుణ సంస్థలు సిబిల్ స్కోరునే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. సిబిల్ స్కోరు కనీసం 750 ఉంటే లోన్ మంజూరు చేసేవి. నూతన మార్పుల ప్రకారం లోన్ కోసం వచ్చే కొత్త కస్టమర్‌కు ఇప్పుడీ స్కోరు కనీసం 775 ఉండాల్సిందే. లేదంటే సింపుల్‌గా నో అని చెప్పేస్తున్నాయి. పాత కస్టమర్ల విషయంలో సిబిల్ స్కోరు కనీసం 750 ఉంటేచాలని ఓ ప్రముఖ సంస్థ ప్రతినిధి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. గతంలో వారు తీసుకున్న రుణాల తాలూకు చెల్లింపులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పారు. మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్లలో 35 శాతంగా ఉన్న ఈఎంఐల వాటా ఇప్పుడు 10 శాతానికి వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కస్టమర్లకు సౌకర్యంగా.. బజాజ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు కస్టమర్ల కోసం 18 నెలల వరకు రుణాన్ని చెల్లించే సౌకర్యాన్ని ఆఫర్ చేస్తున్నాయి. గతంలో ఇది 6–10 నెలల వరకే ఉండేదని ఓ సంస్థ ప్రతినిధి వ్యాఖ్యానించా రు. ‘కోవిడ్–19 తర్వాత వినియోగదార్ల కొనుగోలు శక్తి తగ్గింది. ఖర్చు చేసేందుకు వెనుకాడుతున్నారు. అందుకే వారి సౌలభ్యం కోసం వాయిదాల సంఖ్యను పెంచాం’ అని ఆయన అన్నారు. అయితే గతంలో జీరో డౌన్‌పేమెంట్ ఉండేది. ఇప్పుడు కనీసం 30–35 శాతం ముందుగా చెల్లించాల్సిందే. బ్రాండ్, రుణ సంస్థనుబట్టి కస్టమర్ల నుంచి స్వల్ప వడ్డీని కూడా వసూలు చేస్తున్నాయి. కొన్ని రుణ సంస్థలు ప్రాసెసింగ్ ఫీజు చార్జీ చేస్తున్నాయని ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ తెలిపారు. -
షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్ల వైపు నో!
ముంబై: కరోనా వైరస్ సంక్షోభాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. లాక్డౌన్ కారణంగా అనేక రంగాలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. కరోనా ప్రభావం లేనప్పుడు నిత్యావసరాలు కొనుగోలు చేయడానికి ప్రజలు షాపింగ్ మాల్స్, లగ్జరీ సూపర్ మార్కెట్ల వైపు మొగ్గు చూపేవారు. అయితే ప్రస్తుత లాక్డౌన్ సమయంలో ప్రజలు నిత్యావసరాల కొనుగోలుకు కిరాణా షాపులను ఆశ్రయిస్తున్నారని ‘డెలైట్ గ్లోబల్ స్టేట్ కన్సుమర్ ట్రాకర్’ అనే సర్వే నివేదిక వెల్లడించింది. ఈ సర్వేలో 18 సంవత్సరాలు పై బడిన 1,000 మంది ప్రజలు పాల్గొన్నారు. ప్రజలు 52 శాతం డబ్డులను నిత్యావసరాల కొనుగోలుకే వాడుతున్నారని సర్వే తెలిపింది. దేశంలోని 72 శాతం వినియోగదారులు కిరాణా షాపులోనే కొనడానికి ఇష్టపడుతున్నారని సర్వే పేర్కొంది. అత్యధిక ప్రజలు కరోనాను నియంత్రించే క్రమంలో జన సమూహానన్ని తగ్గించడానికి మొగ్గు చూపుతున్నట్లు సర్వే పేర్కొంది. లాక్డౌన్ కొనసాగుతున్న క్రమంలో సర్వే ఫలితాలు ప్రజల మనోభావాలను స్పష్టం చేస్తున్నాయిని డెలైట్ ఇండియా ఉన్నతాధికారి అనిల్ తాల్ రేజా అభిప్రాయపడ్డారు. చదవండి: ఎన్సీఎల్టీలో డెలాయిట్‌కు దక్కని ఊరట -
మరీ దారుణం.. అలా చేస్తోంది వ్యాపారులు కాదు!
కరోనా భయం ప్రపంచాన్ని వణికిస్తోంది. యూఎస్‌లో ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ విధించింది. అయితే హరికేన్ల వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ఆహారపదార్థాలను ఎక్కువ మొత్తంలో కొని ఇళ్లలో స్టాక్ పెట్టుకోవడం అక్కడి వాళ్లకు అలవాటు. ఇప్పుడు కూడా పప్పుధాన్యాలు, వాటర్ క్యాన్లు, ఫ్రోజెన్ ఫుడ్ విపరీతంగా కొంటున్నారు. హ్యూస్టన్‌లోని ఒక వాల్‌మార్ట్‌లో అయితే గడచిన ఆదివారం బియ్యం దొరకలేదు. బంగాళాదుంపలు, పెరుగుకు కొరత వచ్చేసింది. నూడుల్స్ ర్యాక్‌లు ఖాళీగా ఉంటున్నాయి. అమెరికా లైఫ్సై్టల్లో ఆఫీస్ క్యాంటీన్లో, రెస్టారెంట్లో తింటూ ఇంట్లో రోజుకు ఒకసారి మాత్రమే తింటుంటారు. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్, స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో రోజంతా ఇంట్లోనే తినాలి కాబట్టి ఫుడ్ స్టాక్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటోంది. మనుషులు అవసరం అయితే తప్ప బయటకు రావడం లేదు. గత వారం వరకు గలేరియా మాల్లో కూడా చాలా స్టోర్లు మూసేశారు. రెండు రోజుల నుంచి గలేరియా మాల్ని పూర్తిగా క్లోజ్ చేశారు. రెస్టారెంట్లు, బార్లు కూడా మూసేయడంతో... అక్కడి వాళ్లు బీర్, ఆల్కహాల్ వంటి డ్రింకులను కూడా కేసుల కొద్దీ కొని ఇంట్లో పెట్టుకుంటున్నారు. మరీ దారుణం ఏమిటంటే... కొంతమంది టిస్యూలు, శానిటైజర్లు, నీళ్ల క్యాన్లు, ఎగ్స్‌ని పెద్ద మొత్తంలో కొనేసి అవసరమైన వాళ్లకు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. ఈ పని చేస్తున్నది వ్యాపారులు కాదు, మామూలు వాళ్లే. ఆఫీసుల్లో అయితే అడుగడుగునా శానిటైజర్లు కనిపిస్తున్నాయి. రిసెప్షన్, లిఫ్ట్‌తోపాటు ఉద్యోగుల డెస్క్ దగ్గర కూడా ఉంటున్నాయి. కీ బోర్డు, మౌస్‌లను కూడా పని చేసే ముందు శానిటైజర్‌తో తుడుస్తున్నారు. పని చేసేటప్పుడు మధ్యలో మరేదైనా వస్తువును ముట్టుకున్నా సరే... వెంటనే శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకుంటున్నారు. పలకరింపులు కూడా ‘హలో. హాయ్’లే. షేక్ హ్యాండ్స్ లేవు. -
వాటిని వెనక్కి తీసుకుంటున్న ఫ్లిప్‌కార్ట్
సాక్షి, ముంబై: ఆన్‌లైన రీటైల్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పర్యావర్ణ పరిరక్షణ కోసం నడుం బిగించింది. వినియోగదారులనుంచి ప్లాస్టిక్ సంచులను సేకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఒక పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తోంది. వ్యవస్థలో ఉన్న ప్లాస్టిక్ ప్యాకేజింగ్లను రీసైకిల్ చేయడంతో పాటు, తిరిగి ఉపయోగించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టింది. ప్లాస్టిక్ వ్యర్థాలు ముప్పుగా పరిణమించుతున్నతరుణంలో ఫ్లిప్‌కార్ట్ ఈ చర్యకు దిగింది. సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని ఇప్పటికే 33 శాతం తగ్గించిన కంపెనీ మార్చి 2021 నాటికి దాని సప్లయ్ చైన్‌లో 100శాతం రీసైకిల్ ప్లాస్టిక్ వినియోగం వైపు వెళ్ళాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా చెన్నై, ముంబై, బెంగళూరు, డెహ్రాడూన్, ఢిల్లీ, కోల్‌కతా, పూణే, అహ్మదాబాద్‌లోని ఎంపిక కేంద్రాలలో వినియోగదారుల నుండి ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌ను తిరిగి సేకరించేందుకు ఫ్లిప్‌కార్ట్ పైలట్ ప్రాజెక్టును నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం కింద, తమ ప్రొడక్ట్స్ డెలివరీ సమయంలో ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌ను స్వచ్ఛందంగా కంపెనీకి చెందిన ఫ్లిప్‌కార్ట్ విష్-మాస్టర్స్‌కు అప్పగించమని వినియోగదారులకు ఒక సమాచారం పంపుతుంది. అంతేకాదు ఈ ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు, వివిధ కోణాలను వివరించి, వినియోగదారుల్లో అవగాహనపెంచేందుకు, విష్-మాస్టర్స్‌కు సరైన శిక్షణ కూడా ఇచ్చింది. అలాగే సేకరించిన ప్యాకెట్లు రిజిస్టర్డ్ విక్రేతలకు పంపించి, రీసైకిల్ అయ్యేలా చర్యలు తీసుకుంటుంది. -
ఈవేయింగ్ మెషీన్లు ఉన్నా.. లేనట్టే!
సాక్షి, బొబ్బిలి: జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏడు లక్షలకు పైగా ఉన్న తెలుపు రంగు రేషన్ కార్డు లబ్ధిదారులకు పంపిణీ చేసే సరుకులను ఈ వెయింగ్‌లో ఇచ్చి జిల్లాలోని 1428 రేషన్ షాపులకు తరలిస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం జరగడం లేదు. అలాగే వాహనాలకు జీపీఎస్ సిస్టమ్‌ను అమర్చామ ని చెబుతున్నా ఆ విధానం ఎక్కడా అమలు కాలేదు. మొత్తంగా అంతా సాదా సీదాగా పాత పద్ధతిలోనే నడుస్తున్నది. ప్రజాపంపిణీ రవాణాను జీపీఎస్‌లో పెట్టాక ఇక రూట్ ఆఫీసర్లతో పనేముందని వారిని కూడా తొలగించారు. జిల్లా వ్యాప్తంగా టన్నుల కొద్దీ బియ్యం, పంచదార, కందిపప్పుతో పాటు అంగన్వాడీ కేంద్రాలకివ్వాల్సిన సరుకులను కూడా ఇలానే తరలిస్తున్నారు. ఈవెయింగ్ అన్న ఊసే లేదు. రేషన్ దుకాణాల విధానమే రేషన్ దుకాణాలకు ఇచ్చే సరుకులు తూకం తక్కువ వస్తున్నాయని డీలర్లు పలుమార్లు ఫిర్యాదు చేశారు. వారు కూడా ఈ వేయింగ్ విధానాన్ని కేవలం ఒకే సరకును పెట్టి అన్ని కార్డులకూ దానినే సరుకుగా చూపిస్తున్నారు. పదే పదే డీలర్లు గోదాముల్లో ఈ వెయింగ్ కోరుతున్నారని ప్రవేశ పెట్టినా అమలు మాత్రం జరగడం లేదు. దీంతో రేషన్ షాపుల్లో ఏ విధంగా అమలు చేస్తున్నారో గోదాముల్లోనూ ఇదే పద్ధతిని అమలు చేస్తున్నారు. డమ్మీ ఈ వేయింగ్ చేపట్టినా ఆ విధానం కూడా డీలర్లతోనే చేయించడం విశేషం. ఆ రోజుకు లారీల్లో ఎంత మంది డీలర్లకు సరుకులు వెళితే వారే ఈ వేయింగ్ బిల్లు తీసుకుని సరుకులు పట్టుకుపోతున్నారు. కానరాని వివరాలు ఎంఎల్ఎస్ గోదాముల్లో సరుకుల వివరాలను పట్టికల్లో నమోదు చేయడం లేదు. ఎక్కడి బోర్డులక్కడే ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కానీ పట్టించుకునే నాథుడే లేడు. దీనిపై అధికారులు కూడా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీనిపై సాక్షి వారిని ప్రశ్నించగా వారినుంచి మౌనమే సమాధానమవుతోంది. -
కస్టమర్లకు స్నాప్‌డీల్ టోకరా
సాక్షి, న్యూఢిల్లీ : ఆన్లైన్ రిటైల్ పోర్టల్ స్నాప్‌డీల్ వినియోగదారులకు టోకరా ఇస్తోందని తాజా అథ్యయనం వెల్లడించింది. భారీ డిస్కౌంట్లు ఇచ్చేందుకు పలు వస్తువుల ఎంఆర్పీలను స్నాప్‌డీల్ పెంచేస్తోందని, కాస్మెటిక్ ఉత్పత్తులపై గడువు తేదీని చూపడం లేదని అహ్మదాబాద్‌కు చెందిన కన్సూమర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి సెంటర్ (సీఈఆర్సీ) పేర్కొంది. అధిక ధరలతో, అరకొర లేబిలింగ్‌తో ఉన్న ఉత్పత్తులన్నింటినీ స్నాప్‌డీల్ ఉపసంహరించేలాచర్యలు చేపట్టాలని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ)ని సీఈఆర్సీ కోరింది. ఇప్పటికే విక్రయించిన హానికారక ఉత్పత్తులను వెనక్కి తీసుకుని వినియోగదారులకు పరిహారం చెల్లించాలని సీఈఆర్సీ పిలుపు ఇచ్చింది. వెండార్లు, ఉత్పత్తుల ఎంపికలో కంపెనీ పారదర్శక విధానం పాటించాలని, పాలసీ ఉల్లంఘనలకు పాల్పడిన వెండార్లపై కఠిన చర్యలు చేపట్టాలని సూచించింది. స్నాప్‌డీల్‌లో ఉత్పత్తుల వారీగా ఎంత ధరలకు విక్రయిస్తున్నారనే దానిపై సమగ్ర దర్యాప్తు అవసరమని సీఈఆర్సీ సీజీఎం ప్రీతి షా డిమాండ్ చేశారు. -
పెట్రోల్‌లో ఇనుప ముక్కలు
అడ్డాకుల మహబూబ్‌నగర్ : మండల కేంద్రం శివారులోని పెట్రోల్ బంకులో ఆదివారం ఉదయం కల్తీ పెట్రోల్‌పై వి వాదం ఏర్పడింది. అడ్డాకుల, ముత్యాలంపల్లికి చెందిన కొందరు పెట్రోల్ కోసం బంకు వద్దకు వ చ్చారు. అక్కడ కల్తీ పెట్రోల్ పోయడంతో విని యోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. సీసాల్లో పోయించుకున్న పెట్రోల్‌లో చిన్నచిన్న ఇనుప ము క్కలు కూడా రావడంతో బంకు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కొత్తగా ఒక పంపును ఈరోజే మొదలు పెట్టడం మూలంగా ఇనుప ముక్కలు వచ్చి ఉండవచ్చని సిబ్బంది సర్ధి చెప్పే ప్రయత్నం చేసినా వినియోగదారులు వినకుండా బంకు వద్ద ఆందోళనకు దిగారు. బంకులో పెట్రోల్ పోయకుండా అడ్డుకుని పోలీసులకు సమాచారం చేరవేశారు. కానిస్టేబుల్ బాలరాజు అక్కడికి చేరుకుని ఆందోళనను విరమింపజేశారు. అయితే పోలీసులు ఈ విషయాన్ని తహసీల్దార్ కల్యాణి దృష్టికి తీసుకెళ్లారు. ఆమె విజిలెన్స్ అధికారులకు సమాచారం చేరవేసి బంకును తాత్కాలికంగా మూసి వేయించాలని చెప్పడంతో పోలీసులు బంకును మూసివేశారు. కొన్నాళ్ల నుంచి ఇక్కడ పెట్రోల్, డీజిల్ తూకాల్లో తేడాలు వస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
వినియోగదారులకు కొత్త చట్టం
న్యూఢిల్లీ: వినియోగదారుల హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలపై కఠినంగా వ్యవహరించేలా త్వరలోనే కొత్త వినియోగదారుల చట్టం తీసుకొస్తున్నట్లు తెలిపారు. ‘వినియోగదారుల హక్కులను కాపాడటం మాత్రమే కాదు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించటం, వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా పేదలు, మధ్యతరగతి ప్రజలు కొనుగోళ్లపై డబ్బులను ఆదాచేసుకోవటం ముఖ్యమే’ అని గురువారం ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ వినియోగదారుల వ్యవహారాల సదస్సులో మోదీఅన్నారు. ‘వినియోగదారులకు మరింత మేలు చేసేలా కొత్త చట్టాన్ని తీసుకొచ్చే పనిలో ఉన్నాం. వ్యాపార పద్ధతులు, దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ చట్టాన్ని రూపొందిస్తున్నాం. ఇది వినియోగదారుల సాధికారతను మరింత పెంచేలా ఉంటుంది’ అని మోదీ వెల్లడించారు. ఎల్ఈడీ బల్బులు, స్టెంట్లు, మందులు.. తమ ప్రభుత్వ చర్యల వల్ల స్టెంట్ల రేట్లు, మోకాలిచిప్పల ఆపరేషన్లు సామాన్యుడికి అందుబాటులోకి వచ్చాయని గుర్తుచేశారు. ‘ఉజాలా పథకం ద్వారా రూ.350 ఉన్న ఎల్ఈడీ బల్బును రూ.40–45కే ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చాం. దీని ద్వారా రూ.20వేల కోట్ల మేర విద్యుత్ బిల్లులు ఆదా అయ్యాయి’ అని పేర్కొన్నారు. జన ఔషధి పరియోజనలో భాగంగా దాదాపు 500 మందుల ధరలను భారీగా తగ్గించిన విషయాన్ని గుర్తుచేశారు. ‘పలు రాష్ట్ర, కేంద్ర పన్నుల ఒత్తిడిని ప్రజలపై తగ్గించేందుకు జీఎస్టీని తీసుకొచ్చాం. దీని ద్వారా దేశంలో కొత్త వ్యాపార సంస్కృతి అభివృద్ధి అవుతోంది. ఇది దీర్ఘకాలంలో లబ్ధిదారులకు భారీ మేలు చేకూర్చనుంది. జీఎస్టీతో కంపెనీల మధ్య పోటీ పెరిగి వినియోగదారునికి తక్కువ ధరకే వస్తువులు అందుబాటులోకి వస్తాయి. ఇది పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేస్తుంది’ అని మోదీ వెల్లడించారు. పాలనపై అధ్యయనం చేయండి ముస్సోరి(ఉత్తరాఖండ్): ప్రభుత్వ పాలనలో ఎదురవుతున్న సమస్యలపై లోతైన అధ్యయనం చేయాలని, అప్పుడే వాటిని పూర్తిగా అర్థం చేసుకుంటారని ట్రైనీ ఐఏఎస్ అధికారులకు మోదీ సూచించారు. లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ పరిపాలనా అకాడమీలో 360 మంది యువ అధికారులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ పాలన, సాంకేతికత వినియోగం, విధానాల రూపకల్పన తదితర అంశాలు ప్రస్తావనకొచ్చినట్లు పీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది. లీకేజీని అరికట్టాం గత ప్రభుత్వ హయాంలో ద్రవ్యోల్బణం కారణంగా రేట్లు పెరిగిపోయాయని.. దీంతో సామాన్యుడి వంటింటి బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయిందని మోదీ విమర్శించారు. ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతిలో నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోకే డబ్బులు చేరటం ద్వారా ప్రభుత్వానికి రూ.57వేల కోట్ల రూపాయల లీకేజీని ఆపగలిగామన్నారు.రెరా (రియల్ ఎస్టేట్ నియంత్రణ చట్టం) సొంతిల్లు కావాలనుకునే వినియోగదారుడికి ఓ వరమన్నారు. జీఎస్టీ, రియల్ ఎస్టేట్ బిల్లు, బీఐఎస్ చట్టాలు, ఉజాలా, ఉజ్వల, ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా వినియోగదారులు తమ డబ్బులను ఆదా చేసుకునేలా కేంద్రం తన వంతు ప్రయత్నాలు చేస్తోందన్నారు. ప్రపంచమంతా ఒకే మార్కెట్‌గా మారుతున్న నేపథ్యంలో వినియోగదారుని హక్కుల భద్రతకు ప్రాంతీయ సంకీర్ణం ఏర్పాటు అవసరమ న్నారు. ఇందుకోసం ప్రతిదేశంలో బలమైన నియంత్రణ, సమాచార మార్పిడి వ్యవస్థ అవసరమని మోదీ సూచించారు. -
చివరి క్షణం వరకు డిస్కౌంట్ల వర్షం
న్యూఢిల్లీ : ఇంకో 48 గంటల్లో దేశమంతా ఒకే పన్ను విధానం జీఎస్టీ అమల్లోకి వచ్చేస్తోంది. జీఎస్టీ అమలుకు ముందే పాత స్టాక్‌ను విక్రయించుకోవడానికి ఇన్నిరోజులు డిస్కౌంట్ల వర్షం కురిపించిన రిటైలర్లు, ఆన్లైన్ దిగ్గజాలు చివరి క్షణాలను కూడా సద్వినియోగం చేసుకోవాలని తాపత్రయపడుతున్నాయి. ఈ మేరకు జూన్ 30 అర్థరాత్రి వరకు కూడా వినియోగదారులకు డిస్కౌంట్ల వర్షం కురిపించనున్నాయి. ఇక ఫ్యూచర్ గ్రూప్ బిగ్ బజార్ అయితే, ప్రత్యేకంగా జూన్ 30 అర్థరాత్రి కూడా తమ స్టోర్లను షాపర్ల కోసం తెరిచి ఉంచాలని నిర్ణయించింది. ఆ రోజు సేల్‌లో భాగంగా 22 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేయనుంది. ఇక ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా బుధవారం అర్థరాత్రి నుంచి మళ్లీ ప్రీ-జీఎస్టీ సేల్‌ను ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్ ప్రత్యర్థి అమెజాన్ ఇప్పటికే ఈ సేల్‌ను రన్ చేస్తూ ఉంది. అమెజాన్ ఈ సేల్ ఈవెంట్లో ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లియెన్స్‌పై 40-50 శాతం వరకు డిస్కౌంట్లను అందుబాటులో ఉంచింది. అయితే ప్రీ-జీఎస్టీ విక్రయాల గణాంకాలను మాత్రం విడుదల చేయడానికి అమెజాన్ నిరాకరించింది. '' లక్ష రూపాయల టీవీని 60వేలకే కొనుగోలు చేయవచ్చు. మీకు ఈ సమాచారం అవసరం లేకపోతే, మీ స్నేహితులకు చెప్పండి. షాపింగ్‌కు ఇదే మంచి సమయం'' అని ముంబైకు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. జీఎస్టీ తర్వాత పూర్తి ప్రయోజనం చేకూరని ఆరు నెలల కిందటి స్టాక్‌ను అమ్మేయడానికి ఆఫ్‌లైన్ రిటైలర్లు సేల్-ఇన్-మోడల్‌ను చేపడుతున్నాయని ఓ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రితేష్ ఘోషల్ చెప్పారు. అప్పీరెల్, షూస్, యాక్ససరీస్ ఉత్పత్తుల విక్రయాలు పెంచడానికి కూడా పెద్ద రిటైలర్లు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. డిజిటల్ లావాదేవీల్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన మొబైల్ వాలెట్ కూడా ఆన్లైన్ స్టోర్ పేటీఎం మాల్ ద్వారా ప్రీజీఎస్టీ సేల్‌ను నిర్వహించింది. ఈ సేల్‌లో భాగంగా గత నెల కాలంగా ఈ ప్లాట్‌ఫామ్‌పై ట్రాఫిక్ మూడింతలు పెరిగిందని, రిటైలర్లు ఇన్వెంటరీకి క్లియర్ చేసుకోవడానికి ఇది ఎంతో సహకరించిందని పేటీఎం మాల్ సీఓఓ అమిత్ సిన్హా చెప్పారు. జీఎస్టీ అమ్మకాలన్నీ జూన్ 30 అర్థరాత్రితో ముగుస్తాయని, జూలై 1 నుంచి కొత్త అమ్మకాలు ప్రారంభిస్తామని ఫ్యూచర్ గ్రూప్ సీఈవో కిషోర్ బియానీ తెలిపారు. చాలా నిత్యావసర వస్తువుల రేట్లు తగ్గుతున్నాయని, కానీ ఎఫ్ఎంసీజీ కంపెనీలు వెయిట్ అండ్ వాచ్ పాలసీని చేపడుతున్నాయని పేర్కొన్నారు. జూలై 1 నుంచి వారు కూడా ధరలు తగ్గించేలా ప్రయత్నాలు ప్రారంభిస్తామని చెప్పారు. -
మీ హక్కులను గుర్తించండి
కాకినాడ లీగల్: కొనుగోలు చేసిన వుస్తువు, సేవల (ఆస్పత్రి, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల సేవలు) పూర్తి స్థాయి ప్రయోజనం పొందే హక్కు వినియోగదారుల చట్టం-1986 ప్రకారం కొనుగోలుదారుడికి ఉంది. లోపాలున్నా, సమస్యలు ఏర్పడినా సంబంధిత సంస్ధ నష్టపరిహారం చెల్లించాలి. లేకుంటే వినియోగదారులఫోరాన్ని ఆశ్రయించవచ్చు. ఫిర్యాదు చేయడం ఇలా... నష్టపోయినవారు వినియోగదారులఫోరం హెల్ప్‌డెస్క్ సలహా మేరకు కేసు దాఖలు చేయవచ్చు. రసీదు కీలకం. ఆయా ఆధారాలతో కనీస రుసుము చెల్లించి ఫిర్యాదు చేయాలి. –వ్యాపారి లేదా డీలరు ద్వారా సష్టపోతే ఫిర్యాదు చేయవచ్చు. –వస్తువులో లేదా ఉత్పత్తిలో లోపాలు ఉన్నా, సేవల విషయంలో డీలర్లు ఆశ్రద్ధ చేసినా, అధిక ధర వసూలు చేసినా, మరే కారణాలతో నష్టపోయినా ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చు. నోటిసులో ఏం ఉండాలంటే... –ఉత్పత్తి సర్వీస్ ప్రొవైడర్ లేక కంపెనీ చిరునామా రాయాలి. –‘విషయం’లో ఫిర్యాదు ఇచ్చే ముందు నోటీసుగా పేర్కొనాలి. –కొన్న వస్తువు లేదా సర్వీస్ వివరాలు ఇవ్వాలి. (క్యాష్ మెమో నంబరు, తేదీ). –సంస్ధ ఇచ్చిన వారంటీ లేదా గ్యారంటీ వివరాలు తెలపాలి. –వస్తువు లోపాన్ని, దానివల్ల ఎదుర్కొన్న ఇబ్బందులను తెలపాలి. –ఇబ్బందులపై ఎవరికి, ఎన్నిసార్లు ఫిర్యాదు చేశారో తెలపాలి. –స్పందించడానికి సంస్థకు 15–30 రోజుల గడువు ఇవ్వాలి. –కొన్న వస్తువుకు పుల్ అమౌంట్ కోరితే దానికి 18 శాతం వరకూ వడ్డీ కూడా కోరవచ్చు. –చివరిగా వినియోగదారుని పేరు, అడ్రస్ ఇవ్వాలి. నోటీసు పంపే విధానం.. –పంపిన నోటీసు సంస్ధకు చేరినట్టు మీ వద్ద ఆధారం ఉండాలి. –అందుకు నోటీసును అక్నాలెడ్జ్మెంట్ డ్యూ పోస్ట్, కొరియర్, హ్యాండ్ డెలివరీ విత్ ప్రూఫ్ పద్ధతుల్లో పంపవచ్చు. ఎలా పంపినా నోటీసు పంపినట్టు ఆధారం ఉండాలి. దానిని కోర్టులో ఇవ్వాలి. –సదరు సమస్యపై చేసిన ప్రయత్నాలు, ఎవరెవరిని సంప్రదించారనే వివరాలను జిరాక్స్ పత్రాలుగా నోటీసుకు జత చేస్తే మంచిది. ఫోరం పనితీరు... నష్టం రూ.20 లక్షల వరకు అయితే జిల్లా వినియోగదారుల ఫోరంను, రూ.20లక్షల నుంచి రూ.కోటి వరకూ అయితే రాష్ట్ర ఫోరాన్ని ఆపైన అయితే ఢిల్లీలోని జాతీయ ఫోరాన్ని ఆశ్రయించాలి. ఫీజు వివరాలు.. వినియోగదారుల ఫోరంలో కేసుకు రూ.లక్ష (వస్తువు విలువ) వరకు రూ.100, రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు రూ.200, రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు రూ.400, రూ.10 లక్షల నుంచి రూ.20లక్షల వరకు రూ.500 ఫీజు చెల్లించాలి. నేరుగా లేదా న్యాయవాది ద్వారా ఫోరంను ఆశ్రయించవచ్చు. ఫోరం ఎక్కడ.. కాకినాడ, రాజమండ్రి కోర్టుల్లో జిల్లా ఫోరాలు ఉన్నాయి. వినియోగదారుల బాధ్యత –కొనుగోలు చేసే వస్తువుల పూర్తి సమాచారం తెలుసుకోవాలి. –మోసపూరిత ప్రకటనలపై జాగ్రత్త వహించాలి –నాణ్యతలో రాజీ వద్దు ఆఫర్ల విషయంలో పరిశీలన చేయాలి. ప్రతి కొనుగోలుకూ రసీదు, వారంటీపై సంతకం, స్టాంపు ఉండాలి. హెల్ప్ డెస్క్‌ను ఉపయోగించుకోండి: వినియోగదారుల ఫోరంలోని హెల్ప్‌డెస్క్‌ను ఆశ్రయిస్తే ఫిర్యాదు చేసే విధానాన్ని తెలియజేస్తారు. ఫిర్యాదు ఇచ్చి సెల్‌నంబర్ ఇస్తే కేసు వివరాలు ఎప్పటికప్పుడు వస్తుంటాయి. - ఎస్ భాస్కరరావు,వినియోగదారుల ఫోరం మెంబర్ ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తాం.. వినియోగదారులు ఇచ్చిన ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తాం. వినియోగదారుల చట్టం గురించి గ్రామీణ ప్రజల్లో ఇంకా చైతన్యం రాలేదు. ప్రసార మాధ్యమాలు, స్వచ్ఛంద సంఘాలు ద్వారా గ్రామీణ ప్రజల వినియోగదారుల్ని చైతన్య పరిచేందుకు కృషి చేయాలి. - ఎ. రాధాకృష్ణ, వినియోగదారుల ఫోరం, అధ్యక్షుడు -
మనీ టాప్ యాప్ ద్వారా పర్సనల్ లోన్
-
బ్యాంకుకు తాళాలు వేసి ఖాతాదారుల నిరసన
ఈపూరు : పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న ఖాతాదారులు చివరికి నడిరోడ్డుపై ధర్నాకు దిగారు. గుంటూరు జిల్లాలో మండల కేంద్రమైన ఈపూరులో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈపూరు ఆంధ్రాబ్యాంకులో నగదు తీసుకునేందుకు వివిధ గ్రామాల నుంచి ఖాతాదారులు సోమవారం భారీగా తరలి వచ్చారు. అయితే బ్యాంకులో నగదు లేదని అధికారులు చెప్పడంతో ఆగ్రహించిన వారు అధికారులను బయటకు తీసుకొచ్చి బ్యాంకుకు తాళాలు వేసి నిరసన తెలిపారు. అనంతరం వినుకొండ–కారంపూడి నడిరోడ్డుపై బైఠాయించి ఆంధ్రాబ్యాంకు సిబ్బంది పనితీరుకు నిరసనగా ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆందోâýæనకారులు మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు నిర్ణయం వలన సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఎక్కడకు వెళ్లినా నోట్లు మారక నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్యాంకుల్లో చేసే డిపాజిట్లకు సరిపడా కొత్త నోట్లు అందించాలని వారు కోరారు. అనంతరం పోలీసుల జోక్యంతో ధర్నాను విరమింపజేశారు.బ్యాంకుకు తాళాలు వేసి ఖాతాదారుల నిరసన బ్యాంకుకు తాళాలు వేసి ఖాతాదారుల నిరసన బ్యాంకుకు తాళాలు వేసి ఖాతాదారుల నిరసన ఈపూరు : పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న ఖాతాదారులు చివరికి నడిరోడ్డుపై ధర్నాకు దిగారు. గుంటూరు జిల్లాలో మండల కేంద్రమైన ఈపూరులో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈపూరు ఆంధ్రాబ్యాంకులో నగదు తీసుకునేందుకు వివిధ గ్రామాల నుంచి ఖాతాదారులు సోమవారం భారీగా తరలి వచ్చారు. అయితే బ్యాంకులో నగదు లేదని అధికారులు చెప్పడంతో ఆగ్రహించిన వారు అధికారులను బయటకు తీసుకొచ్చి బ్యాంకుకు తాళాలు వేసి నిరసన తెలిపారు. అనంతరం వినుకొండ–కారంపూడి నడిరోడ్డుపై బైఠాయించి ఆంధ్రాబ్యాంకు సిబ్బంది పనితీరుకు నిరసనగా ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆందోâýæనకారులు మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు నిర్ణయం వలన సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఎక్కడకు వెళ్లినా నోట్లు మారక నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్యాంకుల్లో చేసే డిపాజిట్లకు సరిపడా కొత్త నోట్లు అందించాలని వారు కోరారు. అనంతరం పోలీసుల జోక్యంతో ధర్నాను విరమింపజేశారు. -
పెట్రోల్‌లో నీళ్లు కలిపి పోస్తున్నారని..
భువనగిరి(నల్లగొండ): పెట్రోల్ బంక్‌లో కల్తీ పెట్రోల్ పోస్తున్నారని వినియోగదారులు ఆందోళనకు దిగారు. నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణంలోని మంచాల బంక్‌లో పెట్రోల్‌లో నీళ్లు కలిపి పోస్తున్నారని దీని వల్ల తమ వాహనాలు పాడవుతున్నాయని వినియోగదారులు శనివారం ఉదయం పెట్రోల్‌బంక్ వద్ద ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడుతున్నారు. -
నాణ్యమైన సరుకులు ఇవ్వాలి
ఖానాపూర్ : వ్యాపారులు వినియోగదారులకు నాణ్యమైన సరుకులు సరఫరా చేయడంతోపాటు విధిగా బిల్లు ఇవ్వాలని వినియోగదారుల హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి కడపత్రి తిలక్‌రావు అన్నారు. ఆదివారం స్థానిక విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రజలు కొనుగోలు చేసిన ప్రతీ వస్తువుకు తూ.చ. తప్పకుండా బిల్లు తీసుకోవాలన్నారు. అప్పుడే వస్తువు నాణ్యమైందో కాదో తెలుస్తుందన్నారు. బిల్లు ఇవ్వకుంటే తమ దృష్టికి తేవాలన్నారు. వ్యాపారుల వద్ద బిల్లు తీసుకోవడం వినియోగదారుల హక్కన్నారు. వినియోగదారుల హక్కుల చట్టం బిల్లు 1956 లోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టారన్నారు. కొందరు వ్యాపారులు ఈ చట్టాన్ని తుంగలో తొక్కి వినియోదదారులకు నష్టం చేకూరుస్తున్నారన్నారు. వినియోదారులను చైతన్య పరచడమే సంస్థ ముఖ్య ఉద్దేశమన్నారు. ఇందుకు కార్యచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా వ్యాపారులు వినియోగదారులను మోసానికి గురైనట్లు తమ దృష్టికి తీసుకువస్తే న్యాయం జరిగేలా చూస్తామన్నారు. వినియోదారుల సంఘం జిల్లా కోశాధికారి సలీంఖాన్, సభ్యులు, యోగి, పొలంపెల్లి సచిన్ తదితరులు ఉన్నారు. -
కొనుగోళ్లతో కుదుటపడుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ
వాషింగ్టన్: అమెరికా ఆర్థిక వ్యవస్థ మొదటి త్రైమాసిన ఫలితాలతో పోలిస్తే రెండో త్రైమాసికంలో మరింత పుంజుకుంది. వినియోగదారులు ఎగబడి ఉత్పత్తి వస్తువులను కొనుగోలు చేయడమే ఇందుకు ప్రధాన కారణం. వినియోగదారులు సరకులతో తమ సంచులను నింపుకుంటూ అమెరికా ఆర్థిక రంగాన్ని గాడిన పెడుతున్నారని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అమెరికా ఆర్థిక కార్యకాలపాల్లో మూడింట రెండు వంతులు వినియోగదారుల కొనుగోళ్ల నుంచి వచ్చేదే. వినియోగదారుల కొనుగోళ్లు ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో వార్షికంగా వృద్ధి రేటు 1.1 శాతం ఉండగా, రెండో త్రైమాసికంలో అది 2.6 శాతానికి పెరిగింది. ఈ ట్రెండ్ కారణంగా దేశంలో ఆర్థిక పరిస్థితులు చక్కబడుతున్నాయని, మున్ముందు ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకోవచ్చని ‘మూడీస్ అనలిటిక్స్’కు చెంది ఆర్థిక నిపుణులు ర్యాన్ స్వీట్ వ్యాఖ్యానించారు. దేశంలో వినియోగదారుల కొనుగోళ్లు పెరుగుతున్నప్పటికీ ఉత్పాదక వస్తువులకు జూన్ నెలలో ఆర్డర్లు ఎక్కువగా లేకపోవడం, నూతన పెట్టుబడులు పడిపోవడం ఆందోళనకర విషయం. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి వినియోగదారుల కొనుగోళ్లు పెరగడంతోపాటు ఉత్పాదక వస్తువుల (కాపిటల్ గూడ్స్)కు డిమాండ్ పెరగడం, పెట్టుబడులు పెరగడం అంతే ముఖ్యం. ఈ రెండో అంశమే ఆశాజనకంగా లేదు. దానికి రెండు కారణాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిగ్జిట్ ద్వారా బ్రిటన్ తప్పుకోవడం ఒకటైతే. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండడం రెండో కారణం. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్లలో ఎవరు గెలుస్తారో, ఎవరు గెలిస్తే ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందన్న విషయంలో పెట్టుబడిదారుల్లో సందిగ్ఢత నెలకొనడం వల్ల ఆర్థిక వ్యవస్థను అధ్యక్ష ఎన్నికలు ప్రభావితం చేస్తున్నాయి. రెండు ముఖాలున్న అమెరికా ఆర్థిక వ్యవస్థలో వినియోగదారుల కొనుగోళ్లు పెరిగి, పెట్టుబడుల రంగం బలహీనంగా కొనసాగినట్లయితే దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మందగమనంతోనే ముగుస్తుందని న్యూయార్క్‌లోని ‘స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్’ సీనియర్ ఆర్థిక నిపుణులు థామస్ కాస్టర్గ్ హెచ్చరిస్తున్నారు. ద్రవ్యలోటును ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచేందుకు కృషి చేస్తున్న ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కూడా ఇదే అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ద్రవ్యలోటును నియంత్రించడం కోసం ఈసారి కూడా వడ్డీ రేట్లను తగ్గించకపోవడం ప్లస్ పాయింటే. -
పనిచేయని ఏటీఏం
ఇబ్బందుల్లో వినియోగదారులు పట్టించుకోని అధికారులు కాసిపేట : మండలంలోని దేవాపూర్‌లో ఆంధ్రాబ్యాంకు తప్ప మరో బ్యాంకు లేదు. ఈ గ్రామంలో కార్మికులు అధిక సంఖ్యలో ఉంటారు. డబ్బులు డ్రా చేసేందుకు ప్రజలు, వినియోగదారులు, కార్మికులు ఏటీఎంలకు వెళ్తే పనిచేయడం లేదు. ఇక్కడ ఏటీఎం ఉన్న ఏ సమయంలో పనిచేయదని ఓరియంట్ సిమెంట్ కంపెనీ కార్మికులు, వినియోగదారులు. స్థానికులు మండిపడుతున్నారు. గ్రామంలో ఆం్ర«ధాబ్యాంకు మినహా ఎటువంటి బ్యాంకులు లేవు. దీంతో యాజమాన్యం సహకారంతో కంపెనీ ప్రధాన ద్వారం ముందు ఆంధ్రాబ్యాంకు ఏటీఏంను నెలకొల్పింది. ఒక రోజు ఏటీఎం బాగా పనిచేస్తది కాని మరో రోజు పనిచేయకపోవడంతో అధికారులను ప్రశ్నిస్తే ఆన్లైన్ సమస్య, డబ్బులు లేవు పలు కారణాలతో కాలం వెళ్లదీస్తున్నారని వినియోగదారులు పేర్కొంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణ లోపంతో ఏటీఎం ఎప్పుడు పనిచేసిన దాఖలాలు లేవు. గ్రామంలో ఏటీఎం సేవలు అందించడంలో అధికారులు విఫలమయ్యారని పేర్కొంటున్నారు. బ్యాంకు నిర్వహణ సైతం వినియో గదారులకు ఉపయోగకరంగా లేదు. దీనిపై ఓరియంట్ యాజమాన్యం సైతం పట్టించుకున్న దాఖలాలు లేవని, వెంటనే సమస్య పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. -
త్వరలో ఇంటికో జెట్ విమానం!
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది... అనుకునే వారికి శుభవార్త! ప్రతి ఇంటికీ బైక్, కారు మామూలైపోయిన ఈ రోజుల్లో ప్రతి ఇంటికీ జెట్ విమానం అన్న నినాదంతో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఏఎస్) అడుగులు వేస్తోంది. ట్రాఫిక్ సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవినియోగదారులకు కొంత ఉపశమనాన్ని కలిగించేందుకు త్వరలోనే మొట్టమొదటి వ్యక్తిగత జెట్ విమానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇంట్లో కారును వాడినట్లుగానే ఈ కొత్త జెట్ ఫ్లైట్ ను వాడుకునేందుకు వీలుగా దీన్ని వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ పద్ధతిలో రూపొందిస్తోంది. నలుగురు మ్యూనిచ్ సాంకేతిక విశ్వవిద్యాలయ ఇంజనీర్లు, డాక్టోరల్ విద్యార్థులు స్థాపించిన లిల్లుమ్ ఏవియేషన్ సంస్థ, వ్యక్తిగత వాహనాల మాదిరిగానే, వ్యక్తిగత విహంగాలను అభివృద్ధి చేస్తోంది. జర్మనీ ఆధారిత ఇంజనీర్లు ఈ వీటీవోఎల్ జెట్ విమానాన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇంక్యుబేషన్ సెంటర్లో డిజైన్ చేసి అభివృద్ధి చేస్తున్నారు. ఎకో ఫ్రెండ్లీ గా ఉండి, తక్కువ శబ్దంతోనూ, హెలికాప్టర్లకన్నా సులభంగా ఎగిరే కొత్త తరహా జెట్ విమానాలను 2018 నాటికి అందుబాటులోకి తేనున్నారు. ఈ నూతన ఆవిష్కరణలో విమానాలను... హెలికాప్టర్ల మాదిరిగానే భూమినుంచి నిలువుగా టేకాఫ్ అవ్వడంతో పాటు, నిలువుగా ల్యాండింగ్ అయ్యే వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ (వీటివోఎల్) విధానంతో రూపొందిస్తున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే రోడ్లపై ట్రాఫిక్ సమస్యను కొంత అధిగమించే అవకాశం కనిపిస్తోంది. అయితే కార్లు, టూ వీలర్స్ అయితే ఇంట్లోని సెల్లార్, లేదా పార్కింగ్ ప్లేస్ లో పార్క్ చేస్తాం. కానీ ఈ జెట్ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు కేవలం ఓ చిన్నగది సైజు స్థలం ఉంటే సరిపోతుంది. వీటివోఎల్ జెట్ ఎగిరేందుకు దీనిలో ఎలక్ట్రిక్ మోటార్లను వినియోగిస్తున్నారు. దీంతో గంటకు 400 కిలోమీటర్ల వేగంతో 500 కిలోమీటర్ల ఎత్తు వరకు ప్రయాణించవచ్చు. అయితే దీనికి ధర వివరాలను మాత్రం సంస్థ ఇంకా వెల్లడించలేదు. లిల్లుమ్ ఏవియేషన్ ఈ జెట్ విమానాన్ని ప్రజలకు సరసమైన ధరకు అందుబాటులోకి తెస్తే ఇక భవిష్యత్తులో వ్యక్తిగత ప్రయాణ విధానమే మారిపోయే అవకాశం కనిపిస్తోంది. -
కాల్ డ్రాప్ పై టెలికం కంపెనీలకు ఊరట
న్యూఢిల్లీ: కాల్‌డ్రాప్ విషయంలో టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. వినియోగదారుడు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో కట్ అయితే ఆ కాల్స్‌కు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. కాల్ డ్రాప్ పై టెలికం కంపెనీల నుంచి పరిహారం కోరే విధానాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కోర్టు తీర్పుతో టెలికం కంపెనీలకు ఊరట లభించినట్లు అయింది. కాగా వినియోగదారులు కాల్ చేసినప్పుడు, ఏ కారణం చేతనైనా ఆ కాల్ కట్ అయితే మొబైల్ ఆపరేటర్లు పరిహారం చెల్లించాలంటూ ట్రాయ్ గత అక్టోబర్‌లో టెలికం కన్సూమర్స్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్‌కు సవరణ చేసింది. ఒక్కో వినియోగదారుడికి ఒక్కో కాల్‌డ్రాప్‌కు రూ. 1 చొప్పున, రోజుకు రూ.3 మించకుండా పరిహారం చెల్లించాలని నిబంధనలను ట్రాయ్ రూపొందించింది. ట్రాయ్ నిర్ణయాన్ని టెలికం కంపెనీలు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారించిన కోర్టు ట్రాయ్ నిర్ణయాన్ని కొట్టివేసింది. -
ఆహార భద్రతకోసం కొత్త యాప్!
వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మరో కొత్త యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ఆహార భద్రతను నియంత్రించే ఈ మొబైల్ అనువర్తనాన్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కొత్తగా ప్రారంభించింది. ప్యాక్ చేసిన ఆహారం, ఔట్ లెట్లలో తినేందుకు సిద్ధంగా ఉన్న ఆహారాన్ని వినియోగించే ముందు... వాటి నాణ్యతకు, భద్రతకు సంబంధించిన వివరాలను ఈ కొత్త యాప్ ద్వారా తెలుసుకునే సౌకర్యం కల్పించింది. వినియోగదారుల ఆహార భద్రతకు కావలసిన ఫుడ్ సేఫ్టీ చిట్కాలతో పాటు... ఆహార భద్రత చట్టానికి సంబంధించిన వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకునే అవకాశం కల్పించింది. కొత్తగా ప్రారంభించిన ఫుడ్ సేఫ్టీ యాప్ ద్వారా వినియోగ దారులు ఆహార భద్రతను గూర్చి తెలుసుకోవడమే కాక, భద్రతాసంబంధమైన సిఫార్సులు చేసేందుకు, సమస్యలను తెలిపేందుకు కూడ అవకాశం కల్పించింది. ఈ మొబైల్ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులంతా వినియోగించుకునే అవకాశం ఉంది. తినేంఉదకు సిద్ధంగా ఉన్న, ప్యాక్ చేసిన ఆహారం అమ్మకందారుల వివరాలతోపాటు, యాప్ ద్వారా వివరణ అడిగే అధికారం కూడ కల్పించింది. యాండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఈ కొత్త యాప్ ద్వారా ఆయా వ్యాపారస్తుల అడ్రస్ తో పాటు, వారికి సంబంధించిన ఏదైనా సమాచారాన్ని ఫొటోలవంటి సాక్ష్యాలతో సహా సమర్పించేందుకు వీలుగా ఈ కొత్త యాప్ ను రూపొందించారు. అంతేకాక ప్రతి ఆహార పదార్థాన్ని కొనే ముందు వినియోగదారులు దాని భద్రత గురించి తెలుసుకునే మరెన్నో వివరాలు ఈ యాప్ లో పొందుపరిచారు. -
పొద్దున లేస్తే అదే పని
న్యూఢిల్లీ: గతంలో పొద్దున్నే లేవగానే హా... అంటూ కళ్లు తుడుముకునే వారంతా ఇప్పుడు మాత్రం నిద్రనుంచి మేల్కొంటుండగా కళ్లు తెరవకుండానే ముందు వారి చేతులు ముందు స్మార్ట్ ఫోన్‌ను వెతుకుతున్నాయట. అలా తీసుకునేది టైం ఎంతయిందో చూసుకోవడానికి కాదండోయ్.. వెంటనే డేటా ఆన్ చేసి వాట్సాప్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో పడిపోతుంటారట. డెలాయిట్ లోని ఓ ప్రొఫెషనల్ సర్వీస్ సంస్థ ఈ మేరకు అధ్యయనం చేసి దాని వివరాలు తెలిపింది. డెలాయిట్ మొబైల్ వినియోగదారుల సర్వే 2015 ప్రకారం స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న 78 శాతం మంది కూడా నిద్ర నుంచి మేల్కొండగా, మేల్కొన్న తర్వాత కనీసం పదిహేను నిమిషాల్లోనే కచ్చితంగా సోషల్ మీడియాలోకి ప్రవేశిస్తారని తెలిపింది. మరో 52శాతంమంది మాత్రం నిద్రలోకి జారుకునే ముందు ఓ ఐదు నిమిషాలపాటు అందులో విహరిస్తారని తెలిపింది. ఇలా వారు చెక్ చేసే సామాజిక మాధ్యమాల్లో వాట్సాప్, ఫేస్ బుక్, చాట్ బాక్సెస్, మెయిల్స్ వాటిని ఎక్కువగా తనిఖీ చేస్తుంటారని కూడా ఆ అధ్యయనం వెల్లడించింది. -
24 గంటల్లో రిఫండ్!
ఫ్లిప్‌కార్ట్ కొత్త పేమెంట్ విధానం న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వినియోగదారుల కోసం ‘తక్షణ రిఫండ్’ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో కస్టమర్లు ఒక ప్రాడక్ట్‌ను వెనక్కు తిరిగిచ్చేసిన తర్వాత, 24 గంటల్లో ఆ ప్రాడక్ట్ డబ్బుల్ని తిరిగి (రిఫండ్) పొందవచ్చు. గతంలో రిఫండ్ ప్రక్రియకు 3-5 పని దినాల సమయం పట్టేది. ఇమీడియట్ పేమెంట్స్ సిస్టమ్స్ ట్రాన్స్ఫర్స్ విధానం ద్వారా ఈ తక్షణ రిఫండ్ ప్రక్రియ పూర్తవుతుందని కంపెనీ వెల్లడించింది. ఇప్పటికే ఐఎంపీఎస్ చెల్లింపు సౌకర్యం ఉన్న బ్యాంకులకు క్యాష్ ఆన్ డెలివరీ ఐఎంపీఎస్ రిటర్న్ ఫెసిలిటీ అందుబాటులో ఉందని పేర్కొంది. -
స్టాక్స్ వ్యూ
బ్రిటానియా ఇండస్ట్రీస్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: షేర్‌ఖాన్ ప్రస్తుత ధర: రూ.2,974 టార్గెట్ ధర: రూ.3,650 ఎందుకంటే: భారత బిస్కట్ మార్కెట్లో 30 శాతం మార్కెట్ వాటాతో రెండో స్థానంలో ఉంది. గుడ్ డే, మారీ, టైగర్, క్రీమ్ ట్రీట్, 50-50, మిల్క్ బికీస్, న్యూట్రి చాయిస్ బ్రాండ్లతో విక్రయాలు సాగిస్తోంది. అమ్మకాలు, నిర్వహణ పనితీరు బాగా ఉండడం వంటి కారణాల వల్ల వేగంగా వృద్ధి చెందుతున్న ఎఫ్ఎంసీజీ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. రకరకాలైన ఉత్పత్తులను వినియోగదారులకు అందించడం, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను విస్తృతం చేయడం వంటి కారణాల వల్ల అమ్మకాలు రెండంకెల వృద్ధి సాధిస్తున్నాయి. రస్క్‌లు, కేక్‌ల కేటగిరిలోకి ప్రవేశించిన ఈ కంపెనీ డైరీ, ఇతర స్నాక్స్ కేటగిరిల్లోకి కూడా ప్రవేశించే ప్రయత్నాలు చేస్తోంది. బ్రేక్ ఫాస్ట్ సంబంధిత ఉత్పత్తులను మళ్లీ మార్కెట్లోకి తేవాలని యోచిస్తోంది. 2012-15 కాలానికి రాబడులు 50 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించాయి. 2013-15 కాలానికి ఆదాయం 13 శాతం చొప్పున, నికర లాభం 45 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించాయి. కీలక ముడి పదార్ధాల ధరలు గోధుమ పిండి 8 శాతం, పంచదార 10 శాతం, రిఫైన్డ్ పామ్ఆయిల్ 9 శాతం చొప్పున తగ్గాయి. అధిక మార్జిన్లు ఇచ్చే ఉత్పత్తులపై దృష్టిపెట్టడం, సొంత తయారీ కారణంగా నిర్వహణ పనితీరు మెరుగుపడడం, నెట్వర్క్ పటిష్టం చేసుకోవడం వల్ల డిస్ట్రిబ్యూషన్ వ్యయాలు తగ్గడం, కొత్త కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తేనుండడం, వ్యయ నియంత్రణ పద్ధతులను పాటించడం, పటిష్టమైన బ్రాండ్ నేమ్.. ఇవన్నీ కంపెనీకి సానుకూలాంశాలు. ఇండియన్ ఆయిల్ కార్ప్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.405 టార్గెట్ ధర: రూ.570 ఎందుకంటే: ఇంధన రంగంలో గత రెండేళ్లుగా వస్తున్న సంస్కరణల(పెట్రోల్, డీజిల్ ధరలపై నియంత్రణ తొలగించడం, ఎల్పీజీ సిలిండర్ రాయితీలను నేరుగా వినియోగదారులకు అందించడం వంటి) కారణంగా కంపెనీ నష్టాలు 80 శాతం వరకూ తగ్గాయి. రుణ భారం కూడా బాగా తగ్గింది. దీంతో బ్యాలెన్స్డ్ షీట్ పటిష్టంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల బాగా తగ్గుతుండటంతో రుణ భారం, వడ్డీ భారం మరింత తగ్గనున్నాయి. పెట్రో ఇంధనాలపై ధరల నియంత్రణ తొలగడంతో మార్కెటింగ్ మార్జిన్లు పెరుగుతాయి. బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ కంపెనీలతో పోల్చితే ఈ కంపెనీకే ఆదాయ మార్గాలు అధికంగా ఉన్నాయి. కంపెనీ మొత్తం ఆదాయంలో రిఫైనింగ్ వాటా 40%, మార్కెటింగ్ వాటా 30%, పైప్‌లైన్ వాటా 24%, పెట్రోకెమికల్స్ విభాగం 6%గా ఉన్నాయి. భారత్‌లో మొత్తం 22 రిఫైనరీలు ఉండగా, ఈ కంపెనీవే 11 ఉన్నాయి. త్వరలో పారదీప్ రిఫైనరీ ప్రారంభం కానుంది. దీని పూర్తి ప్రయోజనాలు 2016-17 ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగం నుంచి అందుతాయి. 11,000 కిమీతో అతిపెద్ద పైప్‌లైన్ నెట్వర్క్ కంపెనీ సొంతం. కొత్త పైప్లైన్లపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. విభిన్నమైన రంగాల నుంచి వస్తున్న రాబడుల కారణంగా కంపెనీ ఆదాయానికి స్థిరత్వం లభిస్తుందని భావిస్తున్నాం. మార్కెటింగ్ మార్జిన్లు బాగా పెరుగుతాయనే అంచనాలతో ఈ కంపెనీ షేర్ రీ రేటింగ్ అయ్యే అవకాశాలున్నాయి. జైడస్ వెల్నెస్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్ ప్రస్తుత ధర: రూ.888 టార్గెట్ ధర: రూ.990ఎందుకంటే: 1988 నుంచి ఫిట్నెస్, ఆరోగ్య రంగానికి అవసరమైన ఉత్పత్తులు అందజేస్తోంది. అంతకంతకూ వృద్ధి చెందుతున్న ఈ సెగ్మెంట్లలో షుగర్ ఫ్రీ, ఎవర్‌యూత్, నూట్రాలైట్, యాక్టిలైఫ్ వంటి హెల్త్‌కేర్ బ్రాండ్లతో చెప్పుకోదగ్గ మార్కెట్ వాటా సాధించింది. షుగర్ ఫ్రీ, ఎవర్‌యూత్ స్క్రబ్, ఎవర్‌యూత్ పీల్ ఆఫ్, నూట్రాలైట్... ఈ కంపెనీ బ్రాండ్లన్నీ ఆయా సెగ్మెంట్లలో అగ్రస్థానంలో ఉన్నాయి. పంచదార ప్రత్యామ్నాయ మార్కెట్లో షుగర్ ఫ్రీ బ్రాండ్‌దే 93 శాతం మార్కెట్ వాటా. 18 సంవత్సరాలు పైబడిన వారి కోసం యాక్టిలైఫ్ పేరుతో పోషకాలతో కూడిన పాల ఉత్పత్తిని 2011లో మార్కెట్లోకి తెచ్చింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బావున్నాయి. గత క్యూ1లో రూ.17 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో 14 శాతం వృద్ధితో రూ.19.5 కోట్లకు పెరిగింది. నికర అమ్మకాలు రూ.42 కోట్ల నుంచి 1 శాతం వృద్ధితో రూ.43 కోట్లకు పెరిగాయి. ఇబిటా రూ.18 కోట్ల నుంచి 14 శాతం వృద్ధితో రూ.21 కోట్లకు ఎగసింది. స్థూల లాభం 17 శాతం, ఇతర ఆదాయం 81 శాతం చొప్పున పెరిగాయి. ఇదే జోరు మరికొన్ని క్వార్టర్ల పాటు కొనసాగవచ్చు. రెండేళ్లలో నిర్వహణ లాభం 7 శాతం చొప్పున, నికర లాభం కూడా 7 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతాయని అంచనా. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
గడువు తీరితే గండమే..!
- గ్యాస్ సిలిండర్లకూ ఎక్స్పైరీ ఉంటుంది - గుర్తించి వెంటనే మార్చుకోవాలి పటాన్చెరు : మనం వినియోగించే ప్రతి వస్తువుకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. తినే పదార్థాల నుంచి వేసుకునే మందులు ఇలా ప్రతి దానికి కాల పరిమితి ఉంటుంది. మరి నిత్యం వంట గదిలో ఉండే గ్యాస్ సిలిండర్ గురించి మీకు తెలుసా? దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుందని? కాలం తీరిన సిలిండర్ వినియోగిస్తే ప్రమాదకరమని తెలుసా? ఎక్స్పైర్ డేట్ ఎలా గుర్తించాలి? గ్యాస్ సిలిండర్‌పైన ఉన్న రింగ్ కింద నిలువుగా మూడు ఇనుప బద్దెలు ఉంటాయి. వాటిలో ఒకదానిపై లోపలి వైపు గ్యాస్ సిలిండర్ గడువు తేదీ ముంద్రించి ఉంటుంది. సంవత్సరాన్ని నాలుగు భాగాలుగా విభజించి మూడు నెలలకు ఒక ఆంగ్ల అక్షరం చొప్పున ఏ,బీ,సీ,డీగా గుర్తిస్తారు. జనవరి నుంచి మార్చి వరకు ‘ఏ’తో, ఏప్రిల్ నుంచి జూన్ వరకు ‘బీ’తో, జులై నుంచి సెప్టెంబర్ వరకు ‘సీ’తో, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ‘డీ’తో గుర్తిస్తారు. ఉదాహరణకు మీ సిలిండర్‌పై ‘డీ15’ అని ఉంటే డిసెంబర్ 2015 వరకు వినియోగించాలి. ఆ తేదీ దాటితే గడువు తీరినట్లే. గడువులోగా వాడితేనే మంచిది సిలిండర్ తీసుకున్న తర్వాత కొంత మంది వాటిని వినియోగించకుండా నెలల తరబడి నిర్వ ఉంచుతుం టారు. మరికొందరు ప్రత్యేక అవసరాల కోసం సిలిండర్లు బ్లాక్‌లో తీసుకుని వాడుతుంటారు. సందర్భం ఏదైనప్పటికీ వాటిపై ఉండే గడువు తేదీలోగా వాడితే మంచిది. కాలం చెల్లిన సిలిండర్లు వాడితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అలాంటి సిలిండర్లను గుర్తించి సంబంధిత డీలర్‌కు సరెండర్ చేయాలి. సిలిండర్ తీసుకున్న తేదీకి, దానిపై ఉన్న తేదీకి మధ్య కనీసం నాలుగు నెలల సమయం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. దాని మీద ఉన్న తేదీలోగానే సిలిం డర్ వినియోగించాలి ఖాళీ సిలిండర్‌కూ కాల పరిమితి సిలిండర్లోని గ్యాస్ వాడకానికే కాకుం డా ఖాళీ సిలిండర్‌కు కూడా నిర్దిష్ట కాల పరిమితి ఉం టుంది. ఈ విషయం మాత్రం విని యోగదారులకు సంబంధం లేనిది. ఖాళీ సిలిండర్ కాలపరిమితి ఏడేళ్లు. తయారీదారులు తమ వద్ద రికార్డుల్లో లేని బ్యాచ్ నంబర్ల ప్రకారం ఏడేళ్లు తాడిన సిలిండర్లను డీలర్ల నుంచి వెనక్కు తెప్పించి ప్రత్యేక పరికరాలతో పరీక్షిస్తారు. నాణ్యత సరిగ్గా ఉంటే మరో ఐదేళ్ల పాటు విని యోగిస్తారు. లేకుంటే వాటిని నాశనం చేస్తారు. -
మార్కెట్లలో రైతులకు న్యాయం జరగాలి
మంత్రి హరీశ్‌రావు ఆర్కేపురం: రైతులు, వినియోగదారుల శ్రేయస్సు కోసమే మార్కెటింగ్‌శాఖ పనిచేస్తుందని, రైతు లేనిదే మార్కెట్, కమిషన్ ఏజెంట్లు ఉండరని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. ఎల్బీనగర్ కూరగాయల మార్కెట్లో రూ. 2.60 కోట్లతో నిర్మించిన ప్రాంతీయ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ భవనాన్ని మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రైతులకు, ఏజెం ట్లకు, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, వారికి న్యాయం జరిగేలా మార్కెటింగ్ శాఖ పని చేయాలన్నారు. మార్కెట్లో ఫిర్యాదుల బాక్స్, టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు. మార్కెట్లో తెల్లచిట్టీలతో వ్యాపారం చేయవద్దని, తక్పట్టీలతోనే వ్యా పారం కొనసాగించాలని, ఎలక్ట్రానిక్ వే మిషన్స్ వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్టీఆర్నగర్ మార్కెట్లో చిరువ్యాపారులకు షెడ్లు కట్టిస్తామని పేర్కొన్నారు. మార్కెట్లో సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో ఉల్లిగడ్డ ధర ఎంత ఉన్నా ప్రభుత్వం భరిస్తుందని, రూ. 20లకు కేజీ ఉల్లిగడ్డ అందిస్తామని పేర్కొన్నారు. నగరంలో 46 సెంటర్లను ఏర్పాటు చేశామని, అవసరమైతే మరిన్ని సెంటర్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మార్కెట్లోని పలు కార్మిక సంఘాలు ఏఐటీయూసీ ఇతర సంఘాల నాయకులు వినతిపత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ ఎ.శరత్, సూపరింటెండెంట్ నాగేశ్వర్‌రెడ్డి, మార్కెటింగ్ కమిటీ కార్యదర్శి శాస్త్రి, మల్లేషం, రాంమోహన్‌గౌడ్, మనోహర్‌రెడ్డి, తీగల విక్రమ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, ఆర్కేపురం డివిజన్ పార్టీ అధ్యక్షులు మురుకుంట్ల అరవింద్, బీరెళ్లి వెంకట్‌రెడ్డి, కంచర్ల శేఖర్, పగిళ్ల భూపాల్‌రెడ్డి, తుమ్మల శ్రీరాంరెడ్డి, మహ్మద్, రామాచారి, శ్రీనివాస్, మల్లేష్, మార్కెటింగ్ కమిటీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలుక నర్సింహారెడ్డి, ముకారం పాల్గొన్నారు. -
అందరినీ ఆకట్టుకునేలా ఆభరణాలు
తిరుపతి మంగళం: అందరినీ ఆకట్టుకునేలా ఆభరణాలను వినియోగదారులకు అందించడం మలబార్‌గోల్డ్ షోరూం వారి ప్రత్యేకత అని ప్రముఖ సినీనటి నిత్యామీనన్ తెలిపారు. తిరుపతి టౌన్‌క్లబ్ సర్కిల్లో ఉన్న మలబార్‌గోల్డ్ షోరూంలో ఏర్పాటు చేసిన ‘ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యూవెలరీ’ ప్రదర్శనను సినీనటి నిత్యామీనన్, తిరుపతి ఎమ్మెల్యే ఎం. సుగుణమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతిలో అనేక జ్యూవెలరీ షోరూంలు ఉన్నప్పటికీ మలబార్ గోల్డ్ షోరూం ఒక ప్రత్యేకత కలిగి ఉందన్నారు. మహిళల కోరికలకు తగ్గట్టుగా అన్ని రకాల మోడళ్లలో ఆభరణాలు ఆకట్టుకుంటున్నాయన్నా రు. ఆకర్షించే ఆభరణాలతో పాటు వినియోగదారులకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నారని తెలిపారు. అనంతరం మలబార్ గోల్డ్ మార్కెటింగ్ హెడ్ కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ నాణ్యతకు మారుపేరు తమ మలబార్‌గోల్డ్ షోరూం అన్నారు. తమ షోరూం లో వజ్రాభరణాలపై వినియోగదారులకు15 శాతం రాయితీ కల్పిస్తున్నామన్నారు. తమకు వచ్చే ఆదాయంలో 10 శాతం పేదల సంక్షేమానికి వినియోగిస్తున్నామని తెలి పారు. అలాగే పేదల విద్యార్థుల ఉన్నత విద్యకు కూడ తాము సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమంలో నాయకులు మునిశేఖర్, మలబార్ గోల్డ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సబ్సిడీకి ఎసరు!
- గ్యాస్ సబ్సిడీ రూ.200 రద్దుకు ప్రభుత్వ పన్నాగం - వినియోగదారులకు నచ్చజెప్పి దరఖాస్తులు పూర్తిచేయించాలని హుకుం - గ్యాస్ ఏజెన్సీలకు టార్గెట్లు - త్వరలో స్పెషల్ డ్రైవ్‌లు - ఆసక్తి చూపని వినియోగదారులు విజయవాడ : చుక్కలనంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో విలవిల్లాడుతున్న వినియోగదారుడిని మరింత కుంగదీసేందుకు కేంద్ర ప్రభుత్వం పన్నాగం పన్నుతోంది. వంటగ్యాస్ కోసం ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ సొమ్ము రద్దుచేసే ఎత్తుగడ వేసింది. గ్యాస్ సబ్సిడీ సొమ్మును స్వచ్ఛందంగా వదులుకోండంటూ ఇప్పటికే పిలుపునిచ్చిన ప్రభుత్వం నెమ్మదిగా పూర్తిస్థాయిలో రద్దు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే స్వచ్ఛందంగా సబ్సిడీ వదులుకుంటున్నట్లు దరఖాస్తులు సేకరించాలని గ్యాస్ కంపెనీలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో గ్యాస్ కంపెనీల అధికారులు ఏజెన్సీలకు దరఖాస్తులు పంపి సబ్సిడీ కనెక్షన్లను తగ్గించాలని లోపాయికారి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో హెచ్పీసీ, ఐవోసీ, బీపీసీ కంపెనీలకు చెందిన 74 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో 11 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. వీరిలో సంపన్న, ఉద్యోగ, మధ్యతరగతి వర్గాలకు నచ్చజెప్పి సబ్సిడీ వదులుకునేలా చూడాలని గ్యాస్ కంపెనీలు టార్గెట్ విధించినట్టు సమాచారం. ఒక్కో గ్యాస్ ఏజెన్సీ నెలకు 200 నుంచి 500 మంది గ్యాస్ సబ్సిడీని వదులుకునేలా దరఖాస్తులు సేకరించాలని మౌఖిక ఆదేశాలు గ్యాస్ డీలర్లకు అందాయి. టార్గెట్ విధించి సబ్సిడీ దరఖాస్తులు పూర్తి చేయించాలని ఆదేశించడంలో డీలర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వినియోగదారుల అనాసక్తి వినియోగదారులు మాత్రం గాస్ సబ్సిడీ వదులుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు. ప్రధానమంత్రి పేరుతో గ్యాస్ ఏజెన్సీల వద్ద ఏర్పాటుచేస్తున్న దరఖాస్తులను ఎవరూ పట్టించుకోవట్లేదు. ప్రస్తుతం సిలిండర్ ఒక్కింటికీ రూ.700 వసూలు చేస్తుండగా, అందులో రూ.200 సబ్సిడీని వినియోగదారుడి ఖాతాకు జమ చేస్తున్నారు. దీనిద్వారా ప్రభుత్వంపై సబ్సిడీ భారం పడుతోంది. గృహ అవసరాలకు వినియోగించే సబ్సిడీ గ్యాస్ భారం తడిసి మోపెడవటంతో కేంద్రప్రభుత్వం రానున్న కొద్దినెలల్లో స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేసి సబ్సిడీని ఎత్తివేసే కార్యక్రమం అమలు చేయనుంది. ఇదిలా ఉంటే.. ప్రభుత్వం చట్టం చేయకుండా గ్యాస్ సబ్సిడీని రద్దు చేయటానికి పన్నాగం పన్నుతోందని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. -
పుత్తడి దిగివస్తోంది
ఆర్నమెంట్ బంగారం వ్యాపారంలో దగా కర్నూలు(అగ్రికల్చర్): బంగారం ధరలు దిగి వస్తుండటంతో వినియోగదారులు కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం వివాహాలు వంటి శుభకార్యాలు లేకపోయిన ధరలు తగ్గుతుండటంతో బంగారం కొనుగోళ్లు 20 నుంచి 30 శాతం వరకు పెరిగాయి. ధరలు మరింత తగ్గవచ్చుననే ఉద్దేశంతో కొందరు వేచి చూస్తుండగా, మరికొందరు మళ్లీ పెరుగుతుందేమోనన్న భయంతో కొంటున్నట్లు తెలుస్తోంది. ఒక దశలో ఆర్నమెంటు బంగారం ధర రూ.30 వేలకు వెళ్లింది. కొద్ది రోజులు తగ్గుతూ వస్తున్న ధరలు కనిష్ట స్థాయికి తగ్గడం విశేషం. గురువారం 24 క్యారెట్ల(ప్యూర్) బంగారం ధర రూ.26 వేలు ఉండగా, 22 క్యారెట్ల(ఆర్నమెంటు) బంగారం ధర రూ.23,950కి తగ్గింది. ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో బంగారం వ్యాపారానికి కర్నూలు కేంద్ర బిందువు వంటిది. ప్రత్యేకంగా షరాఫ్ బజార్ ఉండటం, కార్పొరేట్ జ్యువెలరీ దుకాణాలు భారీగా వెలియడంతో నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడికే వస్తున్నారు. నగలు, ఆభరణాలను ఆర్నమెంటుగా బంగారంగా వ్యవహరిస్తారు. ఇందులో బంగారం 91.6 ఉంటే దానిని 22 క్యారెట్లుగా పరిగణిస్తారు. హాల్‌మార్క్ ఉంటే అటువంటి నగలను 91.6 ప్యూరిటిగా భావిస్తారు. కార్పొరేట్ దుకాణాల్లో హాల్ మార్కు ఆభరణాలు, నగలు విక్రయిస్తూ 91.6 ప్యూరిటీ పాటిస్తుండగా, ఇతర జ్యువెలరీ దుకాణాల్లో మాత్రం వ్యాపారులు వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్నూలులో కార్పొరేట్ దుకాణాలు మినహా మిగిలిన వాటిల్లో చాలా వరకు 70 నుంచి 75 శాతం బంగారం కలిగిన ఆభరణాలను విక్రయిస్తున్నారు. అంటే బంగారం వ్యాపారంలో 50 శాతం వరకు 14 నుంచి 18 క్యారెట్లు బంగారం ఉన్న వ్యాపారమే జరుగుతోంది. వ్యాపారులు వినియోగదారుల నుంచి 22 క్యారెట్ల ధరను దీనికి అదనంగా 6 నుంచి 16 శాతం తరుగును వసూలు చేస్తుండటం గమనార్హం. వినియోగదారులు 15 క్యారెట్ల బంగారానికి 22 క్యారెట్ల ధరను చెల్లిస్తున్నారంటే ఎంత దారుణంగా మోసపోతున్నారో తెలుస్తోంది. జ్యువెలరీ వ్యాపారులు అమ్మే బంగారంలో 916 ప్యూరిటీ పాటిస్తున్న.. లేదా అనే దానిపై నిఘా లేకపోవడం వల్ల వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్నమెంటు బంగారం ధరకు తరుగు అదనం వ్యాపారులు ఆర్నమెంటు బంగారం ధరకు తరుగు, కూలీ ఖర్చులను కలుపుతారు. ప్రస్తుతం నగలను బట్టి 5 నుంచి 16 శాతం వరకు తరుగు కలుపుతునారు. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం కొంటే నగను బట్టిరూ.1500 నుంచి రూ.3400 వరకు తరుగు పేరుతో కలుపుతారు. వినియోగదారుల్లో చైతన్యం రావాలి కొనే బంగారం తగిన నాణ్యతతో ఉందా లేదా అనే దానిని వినియోగదారులే పరిశీలించుకోవాలి. హాల్‌మార్కు కలిగిన బంగారం ఆభరణాలు 916 ప్యూరిటీ గలవిగా భావించారు. కొన్న వాటికి విధిగా ఆథరైజ్డ్ బిల్లు తీసుకోవాలి. బిల్లులో బంగారంలో ఎంత ప్యూరిటీ ఉన్నది కూడా పేర్కొనాల్సి ఉంది. -
డిజైనర్ కేక్స్... యూరోపియన్ డెసర్ట్స్...
వినియోగదారులకు అవసరమైన సందర్భం, సెలబ్రేషన్లను ఆధారం చేసుకుని కేక్స్ అందించడం ప్రత్యేకతగా కేక్ బొటిక్‌లు రూపుదిద్దుకుంటున్నాయి. కేక్స్‌ను ఒక పేషన్‌తో, ఆసక్తికరంగా డిజైన్ చేయడం అనే ట్రెండ్‌కు ఇది మరింత ఊపునిస్తోంది. మ్యాకరాన్స్, చౌక్స్ పేస్ట్రీస్ తదితర యూరోనియన్ డసర్ట్స్ కేక్ లవర్స్‌కు క్రేజీగా మారాయి. అలాగే పారిస్ బ్రెస్ట్, శాండ్ విచ్ కేక్స్‌కు సిటీలో రోజు రోజుకూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. డిజైనర్ కేక్స్‌కు థీమ్స్‌ను జోడించడం ఓ రీసెంట్ ట్రెండ్. తమ వెరైటీ టేస్ట్‌లకు తగ్గట్టుగా కేక్ లవర్స్ థీమ్‌ను ఎంచుకుంటున్నారు. ఉదాహరణకు ఓ బొటిక్‌లో తయారైన త్రీటైర్డ్ అక్వేరియమ్ థీమ్ కేక్. ఇందులో ఫిష్ బౌల్స్, లైట్స్, నిజమైన ఫిష్, జ్యుయెలరీ చెస్ట్... వీటిలో అలాగే గార్డెన్ థీమ్ కేక్ కూడా. ఫ్లవర్ బాస్కెట్స్ తరహాలో రూపొందే ఈ కేక్‌లో షాంపేన్ ఫిల్డ్ ఫ్లూట్స్... ఇంకా ఎన్నో మిళితమై ఉంటాయి. వెడ్డింగ్స్, బర్త్‌డే వంటి సందర్భాలకు మాకరాన్ గిఫ్ట్ బాక్స్‌లు చాలా ఫేమస్ బేకరీ ఉత్పత్తుల సంస్థగా ఇంగ్లండ్‌లో ఊపిరి పోసుకున్న కొంకు... తర్వాత ఒక కాన్సెప్ట్‌గా విస్తరించింది. జూబ్లీహిల్స్‌లో సాహిల్ తనేజా, స్వాతి ఉపాధ్యాయ దంపతులు దీన్ని ప్రారంభించారు. ఆరేళ్ల క్రితం బయోటెక్ డిజైనర్ సాహిల్ తనేజా... ఇంగ్లండ్‌కు వెళ్లిన అనంతర కాలంలో చెఫ్‌గా మారారు. అక్కడ బేకింగ్‌కు సంబంధించిన ఆర్ట్‌ను నేర్చుకున్నారు. పంచదార, బట్టర్, ఎగ్స్, ఫ్లేవర్ల వంటి ముడిసరుకులను ఉపయోగించి కళాత్మక కేక్స్‌ను రూపొందించడం తెలుసుకున్నారు. ‘హామర్స్మిత్ ఈలింగ్ అండ్ వెస్ట్ లండన్ కాలేజ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పొందారు. ‘‘ మా దగ్గర మాకరాన్స్, ఎక్లయిర్స్, తిరామిసు, కప్‌కేక్స్, వూపీ పైస్... బాగా పాప్యులర్. మాది డిజైసర్ కేక్స్‌కు సంబంధించి ఒక ఎక్స్‌క్లూజివ్ బొటిక్’’ అంటున్నారీ కొంకు నిర్వాహకులు. టేస్ట్ స్పెషలిస్ట్ సంకల్ప్ -
తడవాల్సిందే..!
అధ్వానంగా రైతుబజారులు వర్షం వస్తే నీటిలోనే వ్యాపారాలు అల్లాడుతున్న రైతులు, వినియోగదారులు విజయవాడ : జిల్లాలోని అన్ని రైతుబజార్లలో మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. నిధులు మంజూరైనా అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో అధ్వానంగా మారాయి. రెవెన్యూ, మార్కెటింగ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు, వినియోగదారులు నానా అవస్థలు పడుతున్నారు. నిన్నమొన్నటి వరకు ఎండకు అల్లాడిన రైతులు ఇప్పుడు వర్షాలకు నానుతున్నారు. చిన్నపాటి వర్షాలకే జిల్లాలోని పలు రైతుబజార్లు తటాకాలను తలపిస్తున్నాయి. జిల్లాలో 17 రైతుబజార్లు.. జిల్లాలో 17 రైతుబజార్లు ఉన్నాయి. విజయవాడలోనే ఐదు ఉన్నాయి. స్వరాజ్యమైదానం రైతుబజారులో స్టాల్స్ సరిపోవడం లేదు. రైతులు ప్లాట్‌ఫారాలపై వ్యాపారాలు చేసుకుంటున్నారు. అస్తవ్యస్తంగా మారిన డ్రెయినేజీ వ్యవస్థ వల్ల వర్షం కురిసినప్పుడు రైతులు, ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. పటమటలోని రైతుబజారులోనూ సరిపడా స్టాల్స్ లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మచిలీపట్నంలోని రైతుబజారులో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. స్టాల్స్ కూడా సరిపోవడం లేదు. గుడివాడ, ఉయ్యూరు, జగ్గయ్యపేట రైతుబజార్లలో వర్షం వ స్తే ప్రజలకు ఇబ్బందులు తప్పవు. కలగా మారిన కొత్త రైతుబజార్లు విజయవాడలోని రాణిగారితోట, సత్యనారాయణపురంతోపాటు గన్నవరం, కైకలూరు, పెడన, తిరువూరు, అవనిగడ్డలలో రైతు బజార్లు ఏర్పాటు చేయాలని ఐదేళ్ల నుంచి భావిస్తున్నారు. స్థల సమస్య వల్ల కార్యరూపం దాల్చడంలేదు. తిరువూరుకు ఐదేళ్ల క్రితమే రైతుబజారు మంజూరైంది. రూ.10 లక్షల నిధులు కూడా కేటాయించగా ఖర్చు చేయకపోవడంతో మురిగిపోయాయి. తిరువూరులో మూడుచోట్ల స్థలాలను పరిశీలించినా ఫలితం లేకపోయింది. కంకిపాడులోనూ రూ.8లక్షలు మంజూరైనా ఇప్పటి వరకు స్టాల్స్ నిర్మించలేదు. స్థల సమస్యవల్లే కైకలూరు, గన్నవరం, పెడన, అవనిగడ్డలలో రైతుబజారుల ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. రెవెన్యూ, మార్కెటింగ్, మున్సిపల్ అధికారుల మధ్య సమన్వయలోపం వల్లే రైతుబజారులకు స్థలాలు లభించడం లేదని ఆయా ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. వర్షాకాలం నేపథ్యంలో కలెక్టర్ దృష్టిసారించి జిల్లాలోని రైతుబజారుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, కొత్త రైతుబజారుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
వానాకాలం వచ్చినా కోతలే..
అధికారికంగా గ్రామాల్లో 6 గంటలు మండల కేంద్రాల్లో 2 గంటలు సబ్‌స్టేషన్ పరిధిలోనూ 2 గంటలు అనధికారిక కోతలూ అమలు హన్మకొండ : వానా కాలం మొదట్లోనే కరెంట్ కష్టాలు ప్రారంభమయ్యూయి. విద్యుత్ కోతలు మళ్లీ మొదలయ్యాయి. విద్యుత్ ఉత్పత్తి తగ్గిందంటూ ప్రభుత్వం కోతలు విధించేందుకు అనుమతి ఇచ్చింది. వరంగల్ సర్కిల్లో శుక్రవారం నుంచి కోతలు అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం వ్యవసాయానికి విద్యుత్ అవసరం కొంత మేరకే ఉంది. అయినప్పటికీ... విద్యుత్ కోతలు అమలు చేయూలని ట్రాన్స్‌కో నుంచి ఆదేశాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. గ్రామాలు, మండల కేంద్రాలు, సబ్‌స్టేషన్ పరిధిలోని ప్రాంతాల వారీగా విద్యుత్ సరఫరాలో కోత విధిస్తున్నారు. వరంగల్ నగరంలో మాత్రం విద్యుత్ కోతలు విధించలేదు. వేసవి నుంచి విద్యుత్ సరఫరా కొంత మెరుగ్గానే ఉంది. రబీ తర్వాత వ్యవసాయ మోటార్లు నడవడం లేదని, జిల్లాకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి అవుతుందంటూ నిరంతర సరఫరా చేశారు. గ్రామాల్లో మాత్రం అనధికారికంగా గంటో, రెండు గంటలో కోత పెట్టినా... కొద్ది రోజులకే పరిమితం చేశారు. తాజాగా విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని అధికారిక కోతలు అమలు చేస్తూనే... ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ (ఈఎల్ఆర్) పేరిట అనధికార కోతలూ అమలు చేస్తున్నారు. గ్రామాల్లో అనధికార కోతలు కూడా.. ఈ సారి గ్రామాలకు విద్యుత్ సరఫరా పరిస్థితి అధ్వానంగా మారింది. జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో ఆరు గంటలపాటు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. పలు సందర్భాల్లో రాత్రి కూడా సరఫరా నిలిపివేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యుత్ కోతలు అమలు చేస్తున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. పలు కారణాలు, సరఫరాలో సాంకేతిక లోపం అంటూ రోజూ రాత్రి పూట గంటపాటు కోత విధిస్తున్నారు. అంతేకాకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు పలుమార్లు ఎల్ఆర్ తీసుకుంటున్నారు. దీంతో గ్రామాల్లో అధికారిక కోత 6 గంటలే అయినా... 8 గంటలపాటు కరెంట్ ఉండడం లేదు. మండలాల్లో 2 గంటలు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు గంటలపాటు కోత విధిస్తున్నారు. రెండు రోజుల నుంచే కోతలు అమలు చేస్తున్నా... శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. విద్యుత్ కోతలు అమలు చేయూలని అన్ని మండలాలు, డివిజన్లకు ఉన్నతాధికారులు ఫోన్ల ద్వారా సమాచారమిచ్చారు. మండల కేంద్రాల్లో అధికారికంగా 2 గంటలు కోత పెడుతున్నా... మరో గంటపాటు అనధికారికంగా అడపాదడపా తీసేస్తున్నారు. సబ్‌స్టేషన్ పరిధిలో 2 గంటలు జిల్లాలోని 226 సబ్‌స్టేషన్ కేంద్రాల్లో అధికారిక కోత 2 గంటలు కాగా... ఇక్కడ కూడా అదనంగా 30 నుంచి 50 నిమిషాల పాటు అనధికారికంగా సరఫరా నిలిపివేస్తున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. -
''ఏడాదికి ఆరు సిలెండర్లు చాలు''
-
ఏ మున్నది గర్వకారణం?
నిరాశే మిగిల్చిన 2013.. ఏది కొనబోయినా కొరివే... ధరల దరువే కాడి పారేసిన పాలకులు.. కుదేలైన సామాన్యుడు ఇంట్లో ఏ స్విచ్ ముట్టుకున్నా ఎడాపెడా తగిలే కరెంటు చార్జీల షాకు. వంటింట్లో పొయ్యి ముట్టిద్దామంటే కళ్లముందు మెదలాడే గ్యాస్ బండ భారం. కాయగూరలు మొదలుకుని పచారీ సామాన్ల దాకా అన్నింటి ధరలూ చుక్కల్లోనే. ఇంటిల్లిపాదితో సరదాగా బయటికెళ్దామన్న ఆలోచన కూడా చేయలేని పరిస్థితి. పక్కనుంచి పదేపదే పెట్రో ధరల మోత. చివరికి ఎర్ర బస్సెక్కాలన్నా జేబు బరువును ఒకటికి రెండుసార్లు తడిమి చూసుకోవాల్సిన పరిస్థితి. బుడిబుడి నడకల బుజ్జారుుల్ని బళ్లో వేయూలన్నా అప్పులు చేయక తప్పని దుస్థితి. సగటు జీవికి 2013 ఎంత భారంగా గడిచిందో చెప్పేందుకు మాటల కోసం వెదుక్కోవాల్సిందే. బియ్యం వంటి నిత్యావసరాలతో పాటు చివరికి ఉల్లిగడ్డ కూడా కంటతడి పెట్టించింది. పండ్ల ధరలూ కొండెక్కాయి. ఆసుపత్రుల్లో కన్సల్టెన్సీ రుసుము 25 శాతం, స్కూలు ఫీజులు 20 శాతం, ఇంటి అద్దెలు 15 శాతం చొప్పున పెరిగాయి. ఇలా ఏడాది పొడవునా సామాన్యుని నడ్డి విరుగుతున్నా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుండిపోయాయి. రైతులైతే వరుస తుపాన్లతో పూర్తిగా కుదేలయ్యారు. సామాన్యుడికి నానా రకాలుగా చుక్కలు చూపి, కాలగర్భంలోకి కనుమరుగవుతున్న 2013పై సింహావలోకనం... స్మార్ట్ చాయిస్ మిగతా విషయూలన్నీ ఎలా ఉన్నా స్మార్ట్ ఫోన్లు మాత్రం మెల్లిగా మధ్యతరగతి జీవులకు చేరువవుతున్నాయి. కనీసం రూ.12 వేలు పెడితే తప్ప అందని స్మార్ట్ ఫోన్లు ఇప్పుడు రూ.6 వేలకే అందుబాటులోకి వచ్చాయి. విస్తృతమైన మోడళ్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. మొబైల్లో ఇంటర్నెట్ వాడకం కూడా బాగా పెరిగింది. ఒకరకంగా స్మార్ట్ ఫోన్ రోజువారీ జీవితంలో భాగమైపోయింది. బ్యాంకింగ్ మొదలుకుని రైలు, సినిమా టికెట్ల బుకింగ్ దాకా చాలా పనులు మొబైల్లో చేతుల మీదే పూర్తయిపోతున్నాయి. ఈ ఏడాదిలో ఇది గణనీయమైన మార్పు. షేర్ మార్కెట్ పర్లేదు 2009లో నేలచూపులు చూసిన సెన్సెక్స్ 2013లో పడుతూ లేస్తూ, లేస్తూ పడుతూ సాగింది. ఒక దశలో ఆల్‌టైమ్ రికార్డుతో 21 వేల మార్కును దాటింది. గత డిసెంబర్‌తో పోలిస్తే ఈ డిసెంబర్‌కు దాదాపు 2 వేల పాయింట్లు పెరిగింది. ‘క్రమానుగత పెట్టుబడి (సిప్) నాలుగేళ్లుగా నెలకు రూ.3 వేల చొప్పున పన్ను పథకాల్లో ఇప్పటిదాకా రూ.1.5 లక్షలు పెట్టుబడి పెడితే ఈ ఏడాదే కాస్త లాభం కన్పించింది. పెట్టుబడి 1.81 లక్షలైంది’ అని విక్రమ్ అనే మీడియా ఉద్యోగి తెలిపారు. దీర్ఘకాలం వేచి ఉన్న వారికి మార్కెట్ కాస్త కలిసొచ్చిందనే చెప్పొచ్చు. దిగొచ్చిన పుత్తడి గతేడాది దాకా ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ధరలు ఈ ఏడాది బాగానే తగ్గారుు. కేంద్రం దిగుమతి సుంకాన్ని విధించడంతో మన దేశంలో రేట్లు అంతగా దిగిరాలేదు. పెట్టుబడిగా బంగారం కొన్నవారికి మాత్రం ఈ ఏడాది కలిసి రాలేదు. ‘2012 నవంబర్ నెలాఖరులో గ్రాము రూ.3,125 చొప్పున రూ.75 వేలతో 24 గ్రాములు కొన్నా. ఇప్పుడది రూ.68,220కి తగ్గింది’ అంటూ ఖైరతాబాద్‌కు చెందిన నవీన్ యాదవ్ వాపోయారు. హైదరాబాద్‌లో 24 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర 2012 డిసెంబర్ 28న రూ.30,570 ఉండగా ఈ డిసెంబర్ 28న రూ.29,340 ఉంది. 10 పెట్రో వాతలు.. 12 డీజిల్మోతలు చమురు కంపెనీలు పెట్రోలు ధరలను 2013లో పదిసార్లు పెంచేశాయి! డీజిల్‌పై అరుుతే ఏకంగా 14 సార్లు పెంచారుు. ఇది రికార్డేనని చెప్పాలి. పెట్రో ధరల నియంత్రణ ప్రభుత్వం చేతుల్లో నుంచి కంపెనీల చేతుల్లోకి వెళ్లడంతో అవి ఆడింది ఆటగా సాగుతోంది. అంతర్జాతీయ చమురు ధరలను బూచిగా చూపుతూ అప్పుడప్పుడు మూరెడు తగ్గించినట్టే తగ్గిస్తూ, పదేపదే బారెడేసి చొప్పున ధరలు పెంచుతూ సగటు జీవిని ఎడాపెడా బాదేస్తున్నారుు. 2013 జనవరిలో హైదరాబాద్‌లో రూ.73.73 ఉన్న లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.78.1కి చేరింది. డీజిల్ కూడా రూ.51.35 నుంచి రూ.58.6కు పెరిగింది. ఫీజుల మోత చదువు‘కొనడం’ ఈ ఏడాది మరీ ఖరీదైన వ్యవహారంగా మారిపోరుుంది. హైదరాబాద్ సహా రాష్ట్రమంతటా గతేడాదితో పోలిస్తే అన్ని ఫీజులూ కనీసం 20 శాతం పెరిగాయి. ‘అబిడ్స్‌లోని ఓ మామూలు ప్రైవేటు స్కూల్లో మా అమ్మాయి 6వ తరగతి చదువుతోంది. గతేడాది నెలకు రూ.2,500 ఉన్న ఫీజు ఇప్పుడు రూ.3,000 అరుుంది. ఫీజులను ఏటా 20 శాతం పెంచుతున్నారు. నా జీతం మాత్రం 10 శాతం కూడా పెరగడం లేదు’ అంటూ రఘురాం అనే మధ్యతరగతి ఉద్యోగి వాపోయారు. సగటు జీవులందరిదీ అటూ ఇటుగా ఇదే పరిస్థితి. ‘బండ’ పడింది మన ప్రభుత్వాలు 2013లో సామాన్యుడికి చివరికి వంటింట్లోనూ సంక్షోభం రేపారుు. సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ల సంఖ్యకు కేంద్రం పరిమితి విధించడమే గాక రూ.25 సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేయడంతో గ్యాస్ బండ తలకు మించిన భారమైంది. 2013 మొదట్లో రూ.412 ఉన్న వంటగ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.1,112కు పెరిగింది. ఇందులో ఏడాదికి తొమ్మిది సిలిండర్లకు మాత్రం నగదు బదిలీ రూపంలో ప్రభుత్వం సబ్సిడీ చెల్లిస్తుండగా మిగతా వాటిని మార్కెట్ ధరకు కొనాల్సిన పరిస్థితి ఎదురైంది. సబ్సిడీ సిలిండర్ల ధర కూడా రూ.600కు చేరుకోవటంతో ఒక్కో సిలిండర్‌పై రూ.188 చొప్పున భారం పడినట్టయింది. కొండెక్కిన సన్న బియ్యం సన్న బియ్యం ఈ ఏడాది చుక్కలు చూపింది. ఒకరకంగా విలాస వస్తువుగా కూడా మారిందన్నా అతిశయోక్తి లేదేమో!. 2012లో కిలో రూ.35 ఉన్నది కాస్తా 2013లో రూ.50 మార్కును దాటేసింది. నలుగురు సభ్యుల కుటుంబం నెలకు రూ.3 వేలకు పైగా బియ్యానికే ఖర్చు చేయాల్సి వచ్చింది. గతేడాది కంటే ఇది దాదాపు వెరుు్య రూపాయలు ఎక్కువ. దాంతో చాలామంది రూ.40-45కు ఓ మోస్తరు బియ్యంతో సరిపెట్టుకున్నారు. దిగుబడి పుష్కలంగా ఉండి కూడా బియ్యం ధరలు ఇలా ఆకాశాన్నంటడం ప్రభుత్వం వైఫల్యాన్ని పట్టించింది. నల్లబజారును నియంత్రించడంలో పాలకులు దారుణంగా విఫలమయ్యూరు. ఇక పప్పుల ధరలు కూడా ఈసారి 25 శాతం మేర పెరిగాయి. కిలో కందిపప్పు రూ.65 నుంచి రూ.85 దాటింది. నూనెలు కూడా కిలోపై రూ.25 దాకా పెరిగాయి. ఎర్రబస్సు కన్నెర్ర... వైఎస్ రాజశేఖరరెడ్డి హయూంలో ఏనాడూ బస్సు చార్జీలను పెంచకుండా, ప్రజలపై భారం మోపకుండా జాగ్రత్త పడగా, అనంతరంవచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రం జనానికి ఏటా చిల్లు పెడుతూ వచ్చారుు. 2013లో బస్సు భారం మరింత పెరిగింది. అప్పటిదాకా ఏటా రూ.600 కోట్ల మేరకు బస్సు చార్జీలు పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఈసారి ఏకంగా 9.5 శాతం మేర చార్జీలు పెంచి ప్రయూణికులతో పెడబొబ్బలు పెట్టించింది. ఇది గతేడాది భారం కంటే రెట్టింపు. కనీసం పేదలకు ఆధారమైన పల్లె వెలుగు బస్సులను కూడా ఈ ఏడాది వదిలిపెట్టలేదు. దాంతో బస్సెక్కాలంటేనే జనం భయపడే పరిస్థితి దాపురించింది. నిరుద్యోగులకు నిరాశే 2012 డిసెంబర్ నుంచి ఈ ఏడాది కాలంలో భర్తీ అరుున ప్రభుత్వోద్యోగాలు అతి స్వల్పం. 64 అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు, 12 ఫిజికల్ డెరైక్టర్, 21 లైబ్రేరియన్, 362 అసిస్టెంట్ ఇంజనీర్లు, 107 చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్, 6 అసిస్టెంట్ రీసెర్చి ఆఫీసర్, 18 రీసెర్చి అసిస్టెంట్, 11 అబ్జర్వర్, 12 మెడికల్ ఆఫీసర్ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. వీటిలోనూ కొన్నింటి భర్తీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ప్రైవేట్ రంగంలోనూ భారీ సంఖ్యలో కొలువులు కట్టబెట్టిన రంగం ఏదీ లేదు. ఐటీ రంగంలో రాష్ట్రానికి కొత్తగా ఒక్క సంస్థా రాలేదు. రాష్ట్ర విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా దక్కిన ఐటీ కొలువులూ తక్కువే. ఆశా నిరాశల రియల్ ఎస్టేట్ కొందరికి చేదు రుచి చూపిన రియల్ ఎస్టేట్ రంగం మరికొందరికి కొత్త ఆశలు రేకెత్తింపజేసింది. స్థిరాస్తులు కొనుక్కున్న వారు వాటి విలువ తగ్గుతోందంటూ వాపోతుండగా, ఇన్నాళ్లూ అందనంత ఎత్తులో ఉన్న స్థలాల విలువ ఎంతో కొంత దిగి వస్తోందని మరికొందరు సంబరపడుతున్నారు. ‘గత డిసెంబర్లో హైదరాబాద్ శివారులోని మల్లంపేట్‌లో గజం రూ.6,500 చొప్పున ప్లాట్ కొన్నాను. ఇప్పుడది రూ.4 వేలకు పడిపోయింది’ అని పోపూరి శ్రీనివాస్ అనే ఉద్యోగి వాపోయూరు. 2008 దాకా ఓ వెలుగు వె లిగిన రియల్టీ రంగాన్ని 2009 కల్లా స్తబ్దత ఆవరించింది. 2009 డిసెంబర్లో తెలంగాణ ప్రకటనతో రియల్టీ కుదుపునకు లోనైంది. గత ఆగస్టు నుంచి ప్రధాన ప్రాంతాల్లో మినహా ధరలు దాదాపు 10 శాతం తగ్గాయి. కృష్ణా, గుంటూరు, ఒంగోలు, విశాఖ వంటి సీమాంధ్ర ప్రాంతాల్లో మాత్రం స్థలాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొన్ని చోట్ల రేట్లు 100 శాతం దాకా పెరిగాయి. రాజధాని ఏర్పాటుకు, కొత్తగా మౌలిక వసతుల స్థాపనకు అవకాశముందని భావిస్తున్న ప్రతి ప్రాంతంలోనూ రేట్లు పెరిగిపోయాయి. కరెంటు షాక్.. సగటు జీవులే గాక చివరికి రైతులకు కూడా వెన్ను విరిగే స్థారుులో కరెంటు బిల్లులను పెంచి రాష్ట్ర ప్రభుత్వం తన ప్రతాపం చాటింది. రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో ఏకంగా రూ.5 వేల కోట్లకు పైగా భారం మోపుతూ 2013 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త కరెంటు చార్జీలు జనం నడ్డి విరిచాయి. చార్జీలు ఏకంగా 60 శాతం పెరిగాయి. ఇది చాలదన్నట్టు సర్దుబాటు చార్జీల పేరిట 2010-11, 2012-13 తాలూకు భారాన్ని కూడా జనం మీదే మోపుతూ వాళ్ల జేబులకు చిల్లి పెట్టింది సర్కారు. వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్‌పై కూడా ఆంక్షలు విధించి రైతన్ననూ దెబ్బ కొట్టింది. రెండున్నర ఎకరాలకు మించిన మాగాణి ఉన్న రైతుల నుంచి చార్జీలు వసూలు చేయాల్సిందేనంటూ పథకానికే తూట్లు పొడిచింది. అలా రెండున్నర లక్షల కనెక్షన్లకు ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తేసింది. ఇక నిరంతర కరెంటు కోతలు సరేసరి. కనీసం రెండు మూడు గంటలు కూడా కరెంటివ్వకపోవడంతో పొలాలెండి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారంలో ఏకంగా మూడు రోజుల పాటు పవర్ హాలిడే ప్రకటించడంతో పరిశ్రమలు ఎన్నడూ లేనంతగా దెబ్బతిన్నాయి. వందలాది పరిశ్రమలు మూతపడ్డాయని స్వయానా రిజర్వు బ్యాంకే తన నివేదికలో స్పష్టం చేసింది. 40 శాతం పరిశ్రమల్లో ఉత్పత్తి ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఎలా చూసినా ఈ సంవత్సరం కరెంటు రూపంలో ప్రజలకు చేదు జ్ఞాపకాలే మిగిలాయి. వరుస తుపాన్లు ఈ సంవత్సరం వానలు బాగా ఉంటాయని పంచాంగం విని మురిసిన రైతన్న, ఆ వానలే కొంప ముంచుతాయని ఊహించలేకపోయాడు. ఎన్నడూ లేనట్టుగా ఏకంగా మూడు తుపాన్లు వారిని కోలుకోలేని దెబ్బ తీశాయి. ఖరీఫ్ పంట కళకళలాడుతున్న తరుణంలో తొలుత ఫైలీన్ తుపాను వచ్చి పడింది. దాని దెబ్బకు శ్రీకాకుళం జిల్లాలో పంటలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి.ఆ వెంటనే హెలెన్ పంజా విసిరింది. ఏకంగా 16 జిల్లాల్లోను అతలాకుతలం చేసింది. కోస్తాతో పాటు తెలంగాణ జిల్లాల్లో కూడా పంటలు సర్వనాశనమయ్యాయి. ఆ దెబ్బ నుంచి తేరుకోకముందే లెహర్ విరుచుకుపడింది. కేవలం రెండు నెలల వ్యవధిలో ఇలా మూడు తుపాన్లు, అతి భారీ వర్షాలు దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన పంటలను దెబ్బ తీశాయి. అసలే కరువు కాలంలో కరెంటు కోత బారిన పడి తీవ్రంగా నష్టపోయిన రైతులు ఈ ఖరీఫ్ అతివృష్టితో సర్వం కోల్పోయి మరింతగా అప్పుల ఊబిలో కూరుకుపోయూరు. కంటనీరు పెట్టించిన ఉల్లి {పభుత్వాలను కూడా కూల్చిన చరిత్ర ఉన్న ఉల్లి చాలాకాలం తర్వాత 2013లో మళ్లీ ఆ స్థారుులో చెలరేగింది. ఒక దశలో కిలో రూ.60 కూడా దాటేయడంతో జనం హాహాకారాలు చేశారు. ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోకపోవడంతో దాదాపు నెల పాటు ఉల్లి పేరు చెబితేనే కంట నీరొచ్చే పరిస్థితి కొనసాగింది. కూరగాయలు కూడా తామూ తక్కువ తినలేదన్నట్టుగా భగ్గుమన్నాయి. గతేడాదితో పోలిస్తే ధరలు ఏకంగా 40 శాతం మేరకు పెరిగాయి. బీన్స్ అయితే ఒక దశలో కిలో ఏకంగా రూ.100 మార్కు దాటేసింది. చిక్కుడు, క్యారెట్‌తో పాటు టమోటా కూడా కిలో రూ.50కి చేరుకోవడంతో సాధారణ జనం చాలాకాలం వాటి జోలికి వెళ్లడమే మానుకున్నారు. గతేడాది రూ.600-800 ఉన్న నలుగురు సభ్యుల సాధారణ కుటుంబ నెలసరి కూరగాయల బడ్జెట్ ధరాఘాతానికి ఈసారి రూ.1,100 నుంచి 1,500 దాకా పెరిగింది. -
ఇక నచ్చిన చోట ‘గ్యాస్’
5 నుంచి ‘గ్యాస్’ కనెక్షన్ పోర్టబిలిటీ దేశవ్యాప్తంగా 30 నగరాల్లో అమలు సాక్షి, న్యూఢిల్లీ: వంట గ్యాస్ వినియోగదారులకు ఓ శుభవార్త! గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ సేవలు నచ్చకున్నా.. గతిలేక అక్కడే కనెక్షన్ కొనసాగించుకుంటున్న వారు.. ఇకమీదట అలా ఉండాల్సిన పనిలేదు. ఇకపై వెంటనే అదే కంపెనీలోని మరో డిస్ట్రిబ్యూటర్‌కు లేదా వేరే కంపెనీకి కనెక్షన్ మార్చేసుకోవచ్చు. ‘‘మొబైల్ నంబర్ పోర్టబిలిటీ పథకం’’ తరహాలోనే ‘‘ఇంటర్ కంపెనీ వంటగ్యాస్ కనెక్షన్ పోర్టబిలిటీ’’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ నెల 5న కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ కర్ణాటక రాజధాని బెంగళూరులో దీన్ని ఆరంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్/సికింద్రాబాద్ జంటనగరాలు, విశాఖపట్నం సహా దేశవ్యాప్తంగా మొత్తం 30 ముఖ్య నగరాల్లో ఈ పథకాన్ని తొలివిడతగా ప్రవేశపెడుతున్నారు. ఈ నగరాల జాబితాలో దేశంలోని ఐదు ప్రధాన మహానగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా ఉన్నాయి. ఈ పథకంతోపాటు 5 కిలోల వంటగ్యాస్ సిలిం డర్ల విక్రయాలకు కూడా ఆయన అదేరోజు బెంగళూరులో శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పుడు ఉన్న విధానం ఇదీ...: ప్రస్తుత విధానంలో ఒక కంపెనీలో కనెక్షన్ తీసుకున్న వినియోగదారు... ఆ కంపెనీ సేవలు నచ్చినా నచ్చకున్నా అదే గ్యాస్ వాడక తప్పడం లేదు. ఉదాహరణకు హెచ్‌పీ గ్యాస్ వాడే వినియోగదారులు ఇండేన్ గ్యాస్ లేదా భారత్ గ్యాస్‌కు మళ్లడానికి వీలు లేదు. అలాగే, హెచ్‌పీ గ్యాస్ పంపిణీదారు నుంచి గ్యాస్‌బండ అందుకుంటున్నవారు హెచ్‌పీకి చెందిన మరో పంపిణీదారు నుంచి గ్యాస్‌బండ పొందే అవకాశం కూడా లేదు. తమకు దగ్గరగా ఏజెన్సీ ఉన్నా దూరంగా ఉన్న ఏజెన్సీ నుంచి దగ్గరి ఏజెన్సీకి గ్యాస్ సేవలను మార్చుకునే వీలూ లేదు. ఇకమీదట ఈ పరిస్థితి మొత్తం మారనుంది. కొత్త విధానంలో ఇలా... పోర్టబిలిటీ పథకం కింద ఓ కంపెనీ సేవలు లేదా ఆ కంపెనీ పంపిణీదారు సేవలు నచ్చకుంటే వెంటనే ఆ కంపెనీ వెబ్సైట్లో తమ అయిష్టతను ప్రకటించి వేరే కంపెనీ లేదా పంపిణీదారును ఎంచుకోవచ్చు. తాము నివాసమున్న ప్రాంతానికి చేరువలోని పంపిణీదారుల్లో ఇష్టమైన పంపిణీదారుణ్ని వినియోగదారులు ఎంపికచేసుకోవచ్చు. కంపెనీ సేవలే నచ్చనిపక్షంలో వేరే కంపెనీ సేవలకు మారవచ్చు. అలా కాకుండా ఓ కంపెనీకి చెందిన ఒక నిర్దిష్ట పంపిణీదారు సేవలే ఇష్టం లేకుంటే అదే కంపెనీకి చెందిన పంపిణీదారుల జాబితానుంచి తమకు నచ్చిన పంపిణీదారు నుంచి సేవలు స్వీకరించవచ్చు. {పతి చమురు మార్కెటింగ్ కంపెనీ వెబ్సైట్లో ప్రతి ప్రాంతంలోని గ్యాస్ పంపిణీదారుల సేవలకు ఇచ్చిన రేటింగ్స్‌ని వినియోగదారులు చూడవచ్చు. సేవలస్థాయి ఆధారంగా తమకు నచ్చిన పంపిణీదారుణ్ని ఎంచుకోవచ్చు. కంపెనీ వెబ్సైట్లో వినియోగదారు పోర్టబిలిటీ కోసం పేరును నమోదుచేసుకున్న వెంటనే దాన్ని పరిశీలించి తగిన చర్యలు చేపడతారు. సేవల్లో మెరుగుదల తథ్యం...: గ్యాస్ పోర్టబిలిటీ పథకం అమలుతో వంటగ్యాస్ కంపెనీలు, పంపిణీదారులు వినియోగదారులకు అందిస్తున్న సేవల్లో గణనీయంగా మార్పు వస్తుందని, సేవలు మెరుగుపడటం తథ్యమని పెట్రోలియం మంత్రిత్వశాఖ అధికారులు చెబుతున్నారు. కంపెనీల మధ్య, పంపిణీదారుల మధ్య పోటీతత్వాన్ని ఈ పథకం పెంచనున్నందున ప్రతి కంపెనీ లేదా పంపిణీదారు తమ సేవలను ఇతరులకు దీటుగా మార్చుకోక తప్పదని వారంటున్నారు. మార్కెట్లోకి ఇక 5 కిలోల సిలిండర్లు.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో 5 కిలోల ఎల్పీజీ సిలిండర్లు మార్కెట్ ధరకు అందుబాటులోకి రానున్నాయి. మొదటగా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చెన్నైల్లోని ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో 5 కిలోల గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తారు. తర్వాత క్రమేపీ ఇతర నగరాలకు, ప్రాంతాలకు ఈ విక్రయాలను విస్తరిస్తారు. విద్యార్థులు, ఐటీ నిపుణులు, బీపీఓ ఉద్యోగులు, సాధారణానికి భిన్నంగా ఇతర సమయాల్లో పనిచేసేవారికి ఈ 5 కిలోల సిలిండర్లు ఉపకరిస్తాయన్నది కేంద్రం ఉద్దేశం. తమకిష్టమైన సమయంలో ఖాళీ సిలిండర్‌ను ఇచ్చి కొత్త సిలిండర్‌ను పొందే వెసులుబాటు ఉంటుంది కనుక వారి కష్టాలు తీరతాయని కేంద్రం భావిస్తోంది. పెట్రోల్ బంకుల్లో సిలిండర్ల విక్రయం రోజూ ఎక్కువ గంటలపాటు సాగుతుందని పెట్రోలియం మంత్రిత్వశాఖ తెలిపింది. -
నా కుటుంబానిది సమాజ సేవ: చంద్రబాబు నాయుడు
సాక్షి, హైదరాబాద్: వ్యాపారాలు చేయడం ద్వారా తన కుటుంబసభ్యులు సమాజానికి సేవ చేస్తున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. వారు ఎవరి దయాదాక్షిణ్యాలపైనా ఆధారపడకుండా వృత్తి నైపుణ్యంతో వాటిని నిర్వహిస్తున్నారన్నారు. హెరిటేజ్ కంపెనీ ఆరు రాష్ట్రాల్లోని 11 లక్షల మంది వినియోగదారులకు తన ఉత్పత్తులను అందిస్తోందన్నారు. తనతో పాటు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకే శ్, కోడలు బ్రహ్మణిల ఆస్తుల వివరాలంటూ సోమవారం తన నివాసంలో విలేకరులకు బాబు పలు పత్రాలు విడుదల చేశారు. 1992లో రిజిస్టరయిన హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ 1993లో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించి ఇప్పటికి 21 ఏళ్లు పూర్తి చేసుకుందన్నారు. సంస్థ టర్నోవర్ ప్రస్తుతం రూ.1,600 కోట్లు కాగా నికర లాభం రూ.49.96 కోట్లని చెప్పారు. కంపెనీ బాధ్యతలను తన భార్య చూసుకుంటున్నారని, ప్రస్తుతం కోడలు కూడా అందులో భాగస్వామి అయ్యారని చెప్పారు. తాను కంపెనీ నుంచి వైదొలగినప్పటి నుంచీ భార్య కష్టపడి దాన్ని ఈ స్థితికి తెచ్చారన్నారు. నెలలో 10 రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆమె పర్యటించి పర్యవేక్షిస్తుండటం వల్లే చిల్లింగ్ సెంటర్ స్థాయి నుంచి సంస్థ ఈ స్థితికి చేరుకుందన్నారు. ప్రస్తుతం తన ఆస్తి రూ.42 లక్షలు మాత్రమేనని ఈ సందర్భంగా బాబు చెప్పారు. అందులో తనకు వేతనంగా లభించే మొత్తంతో పాటు ప్రస్తుతం నివాసముంటున్న భవనం, పాత కారు ఉన్నాయన్నారు. భువనేశ్వరికి రూ.33 కోట్లు (అప్పులు మినహాయించి), లోకేశ్‌కు రూ.4.9 కోట్లు (అప్పులు మినహాయించి), బ్రహ్మణికి రూ.3.3 కోట్ల ఆస్తి మాత్రమే ఉందన్నారు. తన కుటుంబీకులు నిర్వహించే నిర్వాణ హోల్డింగ్స్‌కు రూ.25.41 కోట్ల ఆస్తులు, రూ.28.28 కోట్ల అప్పులున్నాయని చెప్పారు. లోకేశ్ బెంగళూరులోని తన ఆస్తిని ఇటీవలే విక్రయించారన్నారు. తనకు డబ్బులపై వ్యామోహం లేదన్నారు. రాజకీయ నాయకుల ఆస్తులను ప్రకటించడానికి చట్టం తేవాలన్నారు. ప్రస్తుతం దేశం సంక్షోభంలో ఉందని, దాన్ని సరిదిద్దేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు. ‘సాక్షి’ని స్వాధీనం చేసుకోరేం?! విలేకరుల సమావేశంలో యథావిధిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు సాక్షి దినపత్రిక, టీవీ చానళ్లపై బాబు అక్కసు వెళ్లగక్కారు. సాక్షి పత్రిక, చానల్, భారతి సిమెంట్లను ఎందుకు స్వాధీనం చేసుకోరని ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ అధికారులను ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం, జగన్‌పై ఉన్న సీబీఐ కేసును నీరుగార్చేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలా చేస్తున్నారని ఆరోపించారు. వారి మధ్య అవగాహన కుదిరిందని, అందుకే ‘మా నేతకు బెయిల్ వస్తుంద’ని వైఎస్సార్సీపీ నేతలు చెప్పుకుంటున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎక్కడ గెలిచేసి జాతీయ స్థాయిలో క్రియాశీలక పాత్ర పోషిస్తుందోనన్న భయంతోనే రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందన్నారు. తెలంగాణ ఇవ్వటం ద్వారా వచ్చే సానుకూల ఓటు కోసం టీఆర్ ఎస్తో సఖ్యతగా ఉంటూ, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక ఓటును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితిని రాష్ట్రపతి, ప్రధాని పలు పార్టీల నేతలకు వివరించేందుకు సెప్టెంబర్ 20, 21 తేదీల్లో ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిపారు. ప్రధాని చేతిలో అధికారం లేదని మొత్తం సోనియానే నడిపిస్తున్నారని అన్నారు. 1984లో ఎన్టీఆర్‌ను కాంగ్రెస్ కుట్రపూరితంగా పదవీచ్యుతుణ్ణి చేశాక ఆయనతిరిగి సీఎం అయిన సెప్టెంబర్ 16న తాను ఆస్తులు వెల్లడిస్తున్నానన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉత్తర కుమారుడు, లీకు వీరుడని ఎద్దేవా చేశ్నారు. డీజీపీ వి.దినేశ్‌రెడ్డి ఆస్తుల వ్యవహారంలో సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయనను పదవిలో కొనసాగించటం సరికాదన్నారు. మీడియా ప్రతినిధులపై కేసులు పెట్టి అరెస్టు చేయటం తప్పన్నారు. -
ఆధార్ అనుసంధానం గడువు పొడిగించండి: కిరణ్‌కుమార్‌రెడ్డి
కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్న సీఎం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అయిదు జిల్లాల్లో వంట గ్యాస్ వినియోగదారులు బ్యాంకు ఖాతాలతో ఆధార్‌ను అనుసంధానించడానికి మరికొంత గడువు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి లేఖ రాయనున్నారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. ఈ సందర్భంగా ఆధార్ అనుసంధానంపై చర్చ జరిగింది. ఈ పథకం అమలవుతున్న హైదరాబాద్, రంగారెడ్డి, తూర్పు గోదావరి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో 48 శాతం మాత్రమే అనుసంధాన ప్రక్రియ పూర్తయింది. మిగిలిన 52 శాతం మందికి వంట గ్యాస్ సబ్సిడీని కొనసాగిస్తూనే, బ్యాంకు ఖాతాలతో ఆధార్ అనుసంధానానికి మరికొంత సమయం ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని సీఎం నిర్ణయించారు. -
కొత్తగా 15 లక్షల మంది జీఎస్ఎం యూజర్లు
న్యూఢిల్లీ: ఈ ఏడాది జూలైలో 14.9 లక్షల మంది కొత్త జీఎస్ఎం మొబైల్ వినియోగదారులయ్యారని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) మంగళవారం తెలిపింది. దీంతో దేశంలో మొత్తం జీఎస్ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య 67.26 కోట్లకు పెరిగిందంటున్న ఈ సంస్థ వెల్లడించిన ఇతర వివరాలు.., జూలైలో ఎయిర్‌సెల్‌కు అధికంగా కొత్త వినియోగదారులు లభించారు. కొత్తగా లభించిన 7.55 లక్షల మందితో ఈ కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 6.17 కోట్లకు పెరిగింది. మార్కెట్ లీడర్ భారతీ ఎయిర్‌టెల్‌కు 4.76 లక్షల మంది కొత్త వినియోగదారులు లభించారు. ఈ కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 19.13 కోట్లకు చేరింది. కంపెనీ మార్కెట్ వాటా 28.45 శాతానికి పెరిగింది. 3 లక్షల మంది కొత్త వినియోగదారులతో ఐడియా మొత్తం వినియోగదారుల సంఖ్య 12.52 కోట్లకు చేరింది. ఈ కంపెనీ మార్కెట్ వాటా 18.62 శాతంగా ఉంది. మొబైల్ వ్యాస్ మార్కెట్ ః రూ.29,900 కోట్లు ఈ ఏడాది చివరికి మొబైల్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ మార్కెట్ 15% వృద్ధితో రూ.29,900 కోట్లకు చేరుతుందని ఐఏఎంఏఐ-ఐఎంఆర్బీ రూపొందించిన నివేదిక వెల్లడించింది. మొబైల్ ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగిపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలిపింది. 2012లో ఎంవ్యాస్ మార్కెట్ రూ.26,000 కోట్లుగా ఉంది. ఈ ఏడాది కన్సూమర్ సెగ్మెంట్ మార్కెట్ రూ.29,300 కోట్లకు, ఎంటర్ప్రైజ్ సెగ్మెంట్ మార్కెట్ రూ.600 కోట్లకు పెరుగుతుంది. -
గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉల్లి లొల్లి
గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉల్లి ధర బెదరగొడుతోంది. విని యోగదారులకు కన్నీళ్లు పెట్టిస్తోంది. దీనికంతటికీ కారణంతగ్గిన దిగుబడులు కొంతయితే.. దళారులు సృష్టిస్తున్న కృత్రిమ కొరత తోడయింది. రెండు నెలల క్రితం పరిగి మార్కెట్లో క్వింటాల్ ఉల్లి రూ.800 నుంచి రూ.1000 పలికితే ప్రస్తుతం ఈ ధర రూ.ఐదు వేలకు చేరిందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఒక్కో రైతు క్వింటాలుకు రూ.నాలుగు వేల వరకు నష్టపోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో రైతు నుంచి కొనుగోలు చేసి రెండు నెలలు నిల్వచేసిన దళారులు క్వింటాలుకు రూ.నాలుగు వేలు లాభపడుతున్నారు. ఆరు నెలలు కష్టపడి పండించిన రైతుకు ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.35 వేలు రాగా అదే రెండు నెలలు నిల్వచేసిన దళారులు 25 నుంచి 30 క్వింటాళ్లకు రూ.లక్ష వరకు లాభపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. తగ్గిన సాగు విస్తీర్ణం.. దళారులు సృష్టిస్తున్న కృత్రిమ కొరత.. ఏటా తగ్గుతున్న ఉల్లిసాగు విస్తీర్ణం.. పెరుగుతున్న వినియోగం కూడా ఉల్లి ధరలు ఆకాశాన్నంటడానికి కారణాలుగా చెప్పవచ్చు. పరిగి మండల పరిధిలో ఐదారేళ్లుగా ఉల్లి సాగు విస్తీర్ణం తగ్గుతోంది. ఇదే సమయంలో సీజన్లో రైతుల నుంచి ఉల్లిగడ్డలు కొనుగోలు చేస్తున్న దళారులు అక్రమంగా నిల్వచేస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. దీంతో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. జిల్లాలో 312 హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం 241 హెక్టార్లలో పంట సాగవుతుందని అధికారుల నివేదికలు చెబుతున్నాయి. వినియోగం పెరుగుతున్న క్రమంలో సాగును ప్రోత్సహించాల్సిన అధికారులు ఆ విషయం పట్టించుకోవటమే మరిచారు. జిల్లాలో యేటా మర్పల్లి మండలం పంచలింగాల, పట్లూర్, సిరిపురం, వీర్లపల్లి, ఘనాపూర్, మర్పల్లి, కొత్లాపూర్, నర్సాపూర్ గ్రామాల్లో రబీలో 500 ఎకరాల్లో రైతులు ఉల్లి పంట సాగు చేసేవారు. రెండేళ్లుగా ఉల్లికి సరైన ధర పలకపోవటం.. కరెంటు కోతలు, వాతావరణం అనుకూలించక పంట దిగుబడు లు తగ్గి రైతులు పెద్ద మొత్తంలో నష్టాలు చవిచూశారు. ఈ సీజ న్లో రోజుకూ 800 క్వింటాళ్ల ఉల్లిగడ్డ శంకర్పల్లి మార్కెట్ వస్తుండగా... ఇప్పుడు మాత్రం కేవలం 10 క్వింటాళ్లు మాత్రమే బీట్ అవుతున్నాయి. 2011-12లో ఉల్లి పంట సాగుచేసి నష్టపోయిన రైతులకు ఇంత వరకూ పరిహారం డబ్బులు అందకపోవటంతో పత్తి, మొక్కజొన్న, కంది పంటల సాగుపై దృష్టి సారించారు. దీంతో ఉల్లి సాగు గణనీయంగా పడిపోయింది. నిలిచిపోయిన దిగుమతులు.. హైదరాబాద్ నగరానికి చుట్టు ప్రక్కల జిల్లా ఉండటంతో ఉల్లిగడ్డలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. నిత్యం సుమారు 400 నుంచి 500 మెట్రిక్ టన్నుల మేర ఉల్లిగడ్డలు అవసరం ఉంటుందని ఉద్యాన శాఖ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఈ మేరకు జిల్లాలో దిగుబడులు లేకపోవటంతో ఉల్లికి ధరలు పెరగడం మరో కారణంగా చెప్పవచ్చు. వర్షాకాలంలో ప్రతి యేటా అహ్మదాబాద్, పుణేలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి ఉల్లి పెద్ద మొత్తంలో దిగుబడులు దిగుమతి జరిగేవి. కానీ అక్కడ కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతినటం, దిగుబడులు అంతంత మాత్రంగా ఉండటంతో ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయి. వారం రోజులుగా కర్నూలు నుంచి దిగుమతి చేసుకొనే ఉల్లిగడ్డకు సమైక్యాంధ్ర ఉద్యమంతో రవాణా స్తంభించింది. దీంతో దిగుమతులు నిలిచిపోయాయి. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.60 నుంచి రూ.80 పలుకుతోంది. ధరల అదుపులో విఫలమైన ప్రభుత్వం పేదలకు రూ.185కే తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను అందిస్తున్నామంటూ ప్రచార ఆర్భాటం చేస్తున్న ప్రభుత్వం ఉల్లి ధరలకు కళ్లెం వేయలేకపోతోంది. దీంతోపాటు ఇతర కూరగాయల ధరలను అదుపు చేయడంలోనూ విఫలమవుతోంది. -
జిల్లాలో మరిన్ని సెల్‌టవర్లు
నిజామాబాద్‌సిటీ, న్యూస్‌లైన్: జిల్లాలో మరిన్ని సెల్‌టవర్లు ఏర్పాటు చేసి వినియోగదారులకు నాణ్యమైన సేవలందించేందుకు కృషిచేస్తున్నామని బీఎస్ఎన్ఎల్ జిల్లా టెలికాం జనరల్ మేనేజర్ ఎంఏ సిద్ధిఖీ తెలిపారు. సోమవారం‘న్యూస్‌లైన్’ తో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 2జీ సెల్‌టవర్లు 201 ఉన్నాయని, అదనంగా 2జీ సెల్‌టవర్లు 66 మంజూరైన ట్లు చెప్పారు. డిమాండు, సిగ్నల్ సక్రమంగా లేని ప్రాంతాలు, కనెక్షన్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. పట్టణ ప్రాంతాలకు 3జీ సేవలు ... ఇప్పటి వరకు జిల్లా కేంద్రానికే పరిమితమైన 3జీ సేవలు, ఇకపై కామారెడ్డి, బోధన్, బాన్స్వాడ, ఆర్మూర్ పట్టణ ప్రాంతాలకు విస్తరిస్తున్నామని చెప్పారు. జిల్లా కేంద్రంలో 3జీ సెల్‌టవర్లు 18 ఉన్నాయని తెలిపారు. కొత్తగా 3జీ సెల్‌టవర్లు 36 మంజురైనట్లు ఆయన తెలిపారు. రీ కనెక్షన్ మేళాకు అపూర్వ స్పందన ... జిల్లావ్యాప్తంగా గత నెల 18 నుంచి నిర్వహిస్తున్న బీఎస్ఎన్ఎల్ రీ కనె క్షన్ మేళాకు అపూర్వ స్పందన వచ్చిందని జీఎం తెలిపారు. కార్యక్రమంలో 62 బ్రాడ్‌బాండ్ కనెక్షన్లు, 743 ల్యాండ్‌లైన్ కనెక్షన్లు, 1200 మెబైల్ కనె క్షన్లు ఇవ్వటం జరిగిందన్నారు. సంస్థకు బకాయి పడ్డ వినియోగదారుల నుంచి రూ.6 లక్షలు వసూలు చేయటం జరిగిందన్నారు. రీ కనెక్షన్ మేళాలు ప్రస్తుతం కస్టమర్ కేర్ సెంటర్లలో మరో 15 రోజుల పాటు పొడిగించటం జరిగిందని, వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జీఎం కోరారు.