తరచుగా పునరావృతమయ్యే సామెత - పరిశుభ్రతే దైవం. ఇది వ్యక్తిగత పరిశుభ్రత సారాంశం.. ఆవశ్యకతను తెలుపుతుంది. అంతేకాదు, శుభ్రంగా ఉండటమనేది భారతీయ సంస్కృతిలో అంతర్భాగంగా ఉంటుంది. తొలుత, ప్రజలు అందంగా కనబడేందుకు ఈ ఆధునిక వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు లేని వేళ సహజ సిద్ధమైన ఉత్పత్తులు వాడుతుండేవారు. అయితే, శాస్త్రీయ ఆవిష్కరణల కారణంగా విస్తృతశ్రేణిలో అత్యాధునిక వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. తల్లులు, శిశువుల ఉత్పత్తులు ఇప్పుడు మార్కెట్‌లో తమదైన వాటాను ఆక్రమించుకుంటున్నాయి.
వృద్ధి చెందుతున్న ఆదాయం, స్థిరమైన జీవితంతో ప్రజలు ఇప్పుడు ఈ తరహా వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను కోరుకుంటున్నారు. అవి సహజసిద్ధంగా మరియు ఆరోగ్యవంతంగా ఉండాలనుకుంటున్నారు. ఎన్నో సంవత్సరాలుగా పేరొందిన కంపెనీలు అయిన హిమాలయ, డాబర్, ఇమామీ మరియు ఈ విభాగంలో ఇతర ఆయుర్వేద కంపెనీలు ఉన్నప్పటికీ, స్థిరంగా వృద్ధి చెందుతున్న ఈ మార్కెట్‌అదే తరహా వృద్ధి అవకాశాలను నూతన కంపెనీలకు కూడా అందిస్తుంది. అత్యంత ప్రజాదరణ పొందిన నూతన ఈకామర్స్‌బ్రాండ్స్, తమ తల్లులు, పిల్లల వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు అత్యంత సహజమైనవని వాదిస్తుండటం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అయితే, తమకు అత్యంత ప్రజాదరణ తీసుకువచ్చిన ఈ వాదనలలోని ఆధీకృత ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ఎందుకంటే చాలా వరకూ ఉత్పత్తులలో లేబులింగ్ మరియు ధృవీకరణలలో పారదర్శకత అనేది లోపించింది.
బహుశా, తమ ఉత్పత్తులను మార్కెట్‌చేయడం, తమ వినియోగదారుల సంఖ్యను వృద్ధి చేసుకోవడం మరియు అమ్మకాలను రెట్టింపు చేసుకోవడానికి నూతన తరపు కంపెనీలు తమ ఉత్పత్తులను సహజసిద్ధమైనవని తప్పుగా పేర్కొంటున్నాయి. తమ ఉత్పత్తులలో రసాయనాలు ఉన్నప్పటికీ అవి శాస్త్రీయంగా హానికారకం కాదని నిరూపితం కాలేదు. వాటినే వారు సహజసిద్ధమని వెల్లడిస్తున్నారు. కానీ రసాయనాలతో కూడిన ఓ ఉత్పత్తి సహజసిద్ధమైనది ఎందుకు అవుతుంది ? దీనికి సరైన నియంత్రణ వ్యవస్థ మరియు ధృవీకరణ ప్రక్రియ లేకపోవడం కూడా కారణమే అని డాక్టర్‌శర్మ అన్నారు.
వినియోగదారు స్నేహ మాట్లాడుతూ.. 'ఇప్పుడు మార్కెట్లో ఎన్నో బేబీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వీటిలోని కొన్ని పదార్థాలు హానికారకమైనవి. కానీ బాధ పడే అంశం ఏమిటంటే, చాలామంది ప్రజలకు ఈ ఉత్పత్తులు చేసే హాని గురించి తెలియకపోవడం మరియు ఆ ప్రకటనలను చూసి చాలామంది వాటిని వినియోగిస్తుంటారు. బేబీ ఉత్పత్తులను వినియోగించడమన్నది వ్యక్తిగత ఎంపిక. నేను మా పిల్లలకు టాల్కమ్ పౌడర్‌రాయను. ఎందుకంటే చిన్నారుల చర్మానికి టాల్క్ మంచిది కాదు. చిన్నారుల చర్మం మృదువైనది. అందువల్ల ఉత్పత్తుల ఎంపికలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి చర్మంపై ర్యాషెస్‌వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఈ ఉత్పత్తులు ఖచ్చితంగా అతి తక్కువ రసాయనాలు మాత్రమే కలిగి ఉండాలి. సాధారణంగా ప్రజలు ఆ ఉత్పత్తుల యొక్క ఆధీకృతను పరిశీలించరు. లేబుల్స్‌చూసి వాటిని కొంటుంటారు. కానీ ఎన్నో సార్లు ఈ తరహా ఉత్పత్తులు మీ పాపాయి చర్మంపై హానికారక ప్రభావం చూపవచ్చు. అందువల్ల, ప్రతి వినియోగదారుడూ ఈ ఉత్పత్తులు సహజసిద్ధమైనవా లేదా అని పరిశీలించడంతో పాటుగా కొనేందుకు ముందు వాటిని పరిశీలించాలి’ అని అన్నారు.
మార్కెట్‌లో ఇప్పుడు ఈ తరహా ఈ- కామర్స్ కంపెనీలు విపరీతంగా ఉన్నాయి. అవన్నీ కూడా తమ ఉత్పత్తులు సహజసిద్ధమైనవని వెల్లడిస్తున్నాయి. ఉత్పత్తి మార్కెట్‌లో ప్రతి కంపెనీకీ ఎదిగేందుకు హక్కు ఉంది. కానీ తప్పుడు వాదనలు వాంఛనీయం కాదు. ప్రకటనలు, ప్యాకేజింగ్‌మరియు లేబులింగ్‌వంటివి వినియోగదారులకు ఉత్పత్తి పట్ల అవగాహన కల్పించేందుకు మరియు ఉత్పత్తి సమాచారం అందించేందుకు ఉద్దేశించబడినవి. అందువల్ల వారు సమాచారయుక్త ప్రాధాన్యతలను అందించాల్సి ఉంది. అయితే, దురుద్దేశ్యంతో చేసే లేబులింగ్‌ను ఖచ్చితంగా నివారించాలి. అంతేకాదు, వినియోగదారులు సమాచారంతో కూడిన కొనుగోలుదారుడు కావాల్సిన అవసరం ఉంది. అందువల్ల, మనమంతా కూడా ఓ ఉత్పత్తిని కొనుగోలు చేసే ముందు పలు కోణాల్లో దానిని పరిశీలించాల్సి ఉంది. ప్రకటనలు, లేబులింగ్‌పై ఆధారపడి వాటిని కొనకూడదు. ఈ ఉత్పత్తులలోని వ్యత్యాసాలు మనకు అంటే వినియోగదారులకు హానికలిగిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment